ప్రధాన వార్తలు

సరికొత్త ఆయుధంతో అరవ రాజకీయాల్లో యుద్ధం!
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. అరవ రాజకీయాలు ఇప్పటి నుంచే వేడెక్కుతున్నాయి. ద్రవిడ ఉద్యమ పితామహుడిగా పేరున్న పెరియార్ జయంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఓ ఏఐ వీడియోను రిలీజ్ చేయడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇది డీఎంకేకు ప్రచారంగానే కాకుండా.. అటు ప్రత్యర్థి విజయ్ టీవీకే పార్టీకి కౌంటర్‌గానూ ఉందన్న చర్చ నడుస్తోందక్కడ. తమిళనాడు రాజకీయాలు కొత్త పుంతలు తొక్కాయి. ట్రెండ్‌కు తగ్గట్లే రాజకీయ పార్టీలు టెక్నాలజీని పుణికిపుచ్చుకున్నాయి. పార్టీల ఐటీ విభాగాల క్రియేటివిటీతో ‘పొలిటికల్ డిజిటల్ వార్’ ఇప్పుడక్కడ హాట్ టాపిక్‌గా మారింది. మైకుల్లో మాటలు, సోషల్ మీడియాలో పోస్టులకు అదనంగా అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనే ఆయుధాన్ని ప్రయోగిస్తున్నారు. పైగా ప్రత్యర్థులను నేరుగా విమర్శించాల్సిన అవసరం లేకుండానే ఆ సెల్ఫ్ ప్రమోషన్ వీడియోలు భలేగా ఉపయోగపడుతున్నాయి పార్టీలకు. తాజాగా.. విజయ్ తమిళగ వెట్రి కళగం (TVK) ఓ ఏఐ జనరేటెడ్ వీడియోను రిలీజ్ చేసింది. 32 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో డీఎంకే వ్యవస్థాపకుడు, తమిళనాడు తొలి ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై విజయ్‌పై ప్రశంసలు గుప్పించినట్లు ఉంది. అదే సమయంలో తన సొంత పార్టీ డీఎంకే విధానాలను విమర్శించినట్లుగా ఉంది. ఈ వీడియో తమిళనాట నిన్నంతా ట్రెండింగ్‌లో కొనసాగింది. அண்ணாவின் வழியில்... தம்பி விஜய் ஆட்சி! என்று எல்லோரும் சொல்லட்டும்."தமிழக வெற்றிக்கழகம் வெல்லட்டும்" pic.twitter.com/jyh4SoxTrz— TVK IT Wing Official (@TVKHQITWingOffl) September 15, 2025ఈ పరిణామంపై డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. డీప్‌ఫేక్ వీడియోలతో విజయ్ టీవీకే పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోందని ఆ పార్టీ ప్రతినిధి శరవణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి కోసం ఉపయోగించాల్సిన సాంకేతికతను ఇలా.. ప్రజాస్వామ్య విలువలను దిగజారుస్తూ ఉపయోగించడం బాధాకరమని అన్నారాయన. ఈ క్రమంలో బీజేపీతో డీఎంకే రహస్య బంధంలో ఉందంటూ విజయ్ చేస్తున్న ఆరోపణలనూ శరవణన్ తోసిపుచ్చారు. ఇదిలా ఉండగానే.. విజయ్ టీవీకే పార్టీ పెరియార్ సిద్ధాంతాలను పూర్తిగా స్వీకరించలేదు. కానీ ఆయన భావజాలం నుంచి సామాజిక న్యాయం, మహిళా సాధికారత, హేతువాదం వంటి అంశాలను మాత్రం తీసుకుంటానని విజయ్ బహిరంగంగానే చెప్పాడు. ఈ క్రమంలో పెరియార్ ఫొటో దీంతో తాజా ఏఐ జనరేటెడ్ వీడియోతోతద్వారా స్టాలిన్ రాజకీయ నేరేటివ్‌ను తిరిగి తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. పోనుపోను ఈ డిజిటల్ క్యాంపెయిన్ వ్యక్తిగతంగానూ లక్ష్యంగా చేసుకునే అవకాశం లేకపోలేదు!.தந்தை பெரியார் - இனப்பகையைச் சுட்டெரிக்கும் பெருநெருப்பு! தமிழினத்தின் எழுச்சிக்கான பகுத்தறிவுப் பேரொளி!தந்தை பெரியார் என்றும் - எங்கும் நிலைத்திருப்பார்!#PeriyarForever #Periyar #SocialJusticeDay pic.twitter.com/B4RvgXCgzH— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) September 17, 2025

మోదీ వీడియో.. కాంగ్రెస్‌కు ఝలక్
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి పాట్నా హైకోర్టు ఝలక్ ఇచ్చింది. ఇటీవల ప్రధాని మోదీ, ఆయన తల్లి హీరాబెన్‌పై కాంగ్రెస్ రూపొందించిన ఏఐ వీడియోపై పాట్నా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వెంటనే ఏఐ వీడియోను తొలగించాలని కాంగ్రెస్‌ను ఆదేశించింది.వివరాల ప్రకారం.. ప్రధాని మోదీ, ఆయన తల్లి హీరాబెన్‌పై కాంగ్రెస్ రూపొందించిన ఏఐ వీడియో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ బీహార్ యూనిట్ సోషల్ మీడియాలో ఈ వీడియోను ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో దీనిపై బీజేపీ, ఎన్డీయే మిత్రపక్షాలు తీవ్రంగా ఖండించాయి. దీంతో, బీజేపీ నేతలు పలుచోట్ల కాంగ్రెస్ పార్టీపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే దీనిపై విచారణ జరిపిన పాట్నా హైకోర్టు వాటిని వెంటనే తొలగించాలని కాంగ్రెస్‌ను ఆదేశించింది. ఈ సందర్బంగా చీఫ్ జస్టిస్ పీబీ బజంత్రి.. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుండి తొలగించాలని ఆదేశించారు.Bihar Congress posted this AI Generated Video about Narendra Modi and his mother.These people were screaming only a couple of weeks ago that they had nothing to do with abuse hurled at the Prime Minister's mother.Now they do this.Shocking behaviour. pic.twitter.com/rTsrZtpRFA— Sensei Kraken Zero (@YearOfTheKraken) September 11, 2025బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వ్యక్తిగత విమర్శలకు దిగడం తీవ్ర కలకలం సృష్టించింది. బీహార్ కాంగ్రెస్ విభాగం నేరుగా సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ ఏఐ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. సాహబ్ కలలో అమ్మ .. ఆ తర్వాత ఏం జరిగిందో చూసేయమంటూ.. ఆ వీడియో ఉంది. అందులో ప్రధాని మోదీని పోలిన క్యారెక్టర్.. ‘‘ఈరోజు ఓట్ల దొంగతనం(Vote Chori) అయిపోయింది.. ఇప్పుడు హాయిగా నిద్రపోవచ్చు అని కళ్లు మూసుకుంటుంది. ఆ వెంటనే హీరాబెన్‌ను పోలి ఉన్న పాత్ర కలలో ప్రత్యక్షమై.. "ఓట్ల కోసం నా పేరును ఉపయోగించడంలో ఎంత దూరం వెళ్తావు? రాజకీయాల్లో నీతిని మరచిపోయావా? అని అంటుంది. ఈ మాటలతో నిద్రపోతున్న వ్యక్తి ఆశ్చర్యంతో మెలకువకు వస్తాడు.ఈ వీడియోపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేస్తోంది. బీజేపీ ఎంపీ రాధా మోహన్ దాస్ అగర్వాల్ కాంగ్రెస్ విడుదల చేసిన AI వీడియోపై తీవ్రంగా స్పందించారు.. ఈ వీడియో రాజకీయాల్లో దిగజారిన స్థాయికి నిదర్శనమని అన్నారాయన. రాహుల్ గాంధీ సూచన మేరకే బీహార్ కాంగ్రెస్ యూనిట్ ఈ వీడియోను రూపొందించిందని ఆరోపించారాయన. ప్రధాని మోదీ ఎప్పుడూ కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచారని, కానీ ఇప్పుడు ఆయన తల్లి హీరాబెన్‌ను రాజకీయాల్లోకి లాగి మరీ కాంగ్రెస్ దాడి చేయడం బాధాకరం అని పేర్కొన్నారు. టెక్నాలజీని ఉపయోగించి దేశాన్ని తప్పుదోవ పట్టించడమే కాకుండా.. మోదీ సహా దేశంలోని ప్రజలందరి తల్లుల గౌరవాన్ని అవమానించడమే ఈ వీడియో ఉద్దేశమని విమర్శించారు. ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అయితే.. క్షమాపణలకు కాంగ్రెస్ నిరాకరిస్తోంది. ఇదేం వ్యక్తిగత దూషణ కాదని.. రాజకీయ విమర్శ మాత్రమే అని చెబుతోంది. వీడియోలో వ్యక్తీకరించిన సందేశం ప్రధానిగా మోదీ తన తల్లి పేరును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారనే విమర్శ మాత్రమే అని అంటోంది.

వెంకయ్యా.. వెన్నుపోటు బాబును వెనుకేసుకు రావొద్దు: లక్ష్మీపార్వతి
సాక్షి, తాడేపల్లి: ఎన్టీఆర్ చివరి రోజుల్లో అద్వానీ, వాజ్‌పేయి లాంటి వాళ్లు ఆయన గురించి ఆరా తీశారని.. కానీ, ఎన్టీఆర్ వల్ల లబ్ది పొందిన వెంకయ్యనాయుడు మాత్రం కనీసం పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి అన్నారు. తాజాగా సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జరిగిన పరిణామాలపై ఆమె బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయం నుంచి మాట్లాడారు. ‘‘ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి.. తిరిగి పొగడటం చంద్రబాబుకే చెల్లింది. చంద్రబాబుకు వెయ్యి నాలుకలు ఉన్నాయి. ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఇప్పుడు ఆయనపై గొప్పగా పుస్తకాలు రాస్తున్నారు. చంద్రబాబు మీద ప్రజాస్వామ్యం విధ్వంసం అని పుస్తకం రాస్తే బాగుండేది. ఎన్టీఆర్ ని పార్టీ అధ్యక్షుడుగా చంద్రబాబు తొలగించిన విషయాన్ని కూడా ఆ పుస్తకంలో రాయాలి. చివరి రోజుల్లో జరిగిన పరిణామాలు, ఆస్తులు లాక్కోవటం, వైశ్రాయ్ హోటల్ పరిణామాలు కూడా రాయాలి. ఇవన్నీ అప్పట్లో ఎన్టీఆరే చెప్పారు కదా. జగన్ పాలన గురించి వెంకయ్యనాయుడు విమర్శలు చేయటం దారుణం. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తితో వెంకయ్య నాయుడు తిరుగుతున్నారు. పేద ప్రజలకు మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణ చేస్తున్న చంద్రబాబుతో ఎలా స్నేహం చేస్తున్నారు?. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆయన గురించి అద్వానీ, వాజ్ పేయి లాంటి వారు ఆరా తీశారు. కానీ ఎన్టీఆర్ వలన లబ్ది పొందిన వెంకయ్య నాయుడు చివర్ల కనీసం పట్టించుకోలేదు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, వెంకయ్య నాయుడుకు లేదు. తెలుగు భాషకు పట్టం కట్టిన జగన్‌ను విధ్వంసకారుడు అని అనటానికి నోరెలా వచ్చింది?. రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితులు ఉంటే చంద్రబాబు పాలన బాగుందని వెంకయ్య ఎలా అంటారు?. రైతులు రోడ్డు మీద పడితే పట్టించుకోని చంద్రబాబు విధ్వంసకారుడు కాదా?. అబద్దాలు చెప్తూ వెన్నుపోటు పొడిచే చంద్రబాబును భుజాల మీద మోయవద్దు. ఎన్టీఆర్‌కు భారతరత్న సాధిస్తామంటున్న టీడీపీ నేతలు సిగ్గుపడాలి. గతంలో వాజ్ పేయి, గుజ్రాల్, దేవగౌడలాంటి వారు భారతరత్న ఇస్తానంటే అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ భారతరత్న పేరు ఎత్తుతున్నారు? అని ఆమె మండిపడ్డారామె.

అణు బెదిరింపులకు భయపడం: ప్రధాని మోదీ
ధార్: ‘ఇది నవ్య భారతదేశం.. ఎవరి అణు బెదిరింపులకు భయపడదు.. తిరిగి ఎదురు దాడి చేస్తుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశిస్తూ హెచ్చరించారు.తన 75వ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ మధ్యప్రదేశ్‌కు ‘రిటర్న్ గిఫ్ట్’ను అందజేశారు. ధార్‌లోని మెగా టెక్స్టైల్ పార్క్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ పార్క్ మూడు లక్షల మందికి ఉపాధి అందించనుంది. అలిగే లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చనుంది. ప్రధాని నరేంద్ర మోదీ తన 75వ పుట్టినరోజు సందర్భంగా ధార్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ధార్ చేరుకున్న ప్రధాని మోదీని ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్‌తోపాటు పలువురు సీనియర్ నాయకులు స్వాగతించారు. కేంద్ర సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ ప్రధాని మోదీని సాంప్రదాయ తలపాగా, శాలువా లతో సత్కరించారు. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఆయనకు జ్ఞాపికను అందజేశారు. प्रधानमंत्री श्री @narendramodi मध्य प्रदेश के धार में 'स्वस्थ नारी सशक्त परिवार' और 'आठवें राष्ट्रीय पोषण माह' अभियान का शुभारंभ कर रहे हैं। #SevaParv https://t.co/CFjDWloZLB— BJP (@BJP4India) September 17, 2025ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఇటీవలి పహల్గామ్ ఉగ్రవాద దాడిని ప్రస్తావించారు. అమరవీరులైన సైనికులకు నివాళులర్పించారు. భారత సైనికుల ధైర్యం, పరాక్రమాలను ప్రశంసించారు. ఇది నవ్య భారతదేశం.. ఎవరి అణు బెదిరింపులకు భయపడదు.. తిరిగి ఎదురు దాడి చేస్తుందని పాక్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ హెచ్చరించారు. మధ్యప్రదేశ్ ప్రజల శక్తి, కృషి సహకారాన్ని కూడా ప్రధాని మోదీ ప్రశంసించారు. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ మాట్లాడుతూ మోదీ నాయకత్వం భారతదేశాన్ని మార్చివేసిందని, పీఎం మిత్రా పార్క్ ద్వారా నిమార్ మాల్వా ప్రాంతంలో ఒక ప్రధాన మార్కెట్ ఏర్పడబోతున్నదని దీనికి ఈరోజు పునాది రాయి పడిందని అన్నారు.

మా స్థాయి ఇది కాదు!.. అందుకే బంగ్లా చేతిలో ఓటమి: రషీద్ ఖాన్
బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపై అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan) స్పందించాడు. తాము స్థాయికి తగ్గట్లు ఆడలేదని.. అందుకే ఓడిపోయామని విచారం వ్యక్తం చేశాడు. ఆసియా కప్-2025 టోర్నమెంట్లో అఫ్గనిస్తాన్.. శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్‌లతో కలిసి గ్రూప్-బిలో ఉంది.ఈ క్రమంలో తొలుత హాంకాంగ్‌తో తలపడిన అఫ్గన్ జట్టు.. 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే, తాజాగా తమ రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఢీకొట్టిన రషీద్ ఖాన్ బృందం ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. అబుదాబిలో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా.. తొలుత బ్యాటింగ్ చేసింది.తప్పక గెలిస్తేనే.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. అయితే, ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో అఫ్గనిస్తాన్ విఫలమైంది. 20 ఓవర్లలో 146 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా బంగ్లా చేతిలో ఎనిమిది పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో అఫ్గన్ సూపర్-4 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. లీగ్ దశలో చివరిగా శ్రీలంకతో ఆడబోయే మ్యాచ్‌లో తప్పక గెలిస్తేనే.. రషీద్ బృందానికి సూపర్-4 ఆశలు సజీవంగా ఉంటాయి.మా స్థాయి ఇది కాదుఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం రషీద్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘ఆఖరి వరకు పోరాడినా అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయాము. 18 బంతుల్లో 30 పరుగుల సమీకరణం పెద్ద కష్టమేమీ కాదు. దూకుడైన క్రికెట్ ఆడే జట్టుగా మాకు పేరుంది. కానీ ఈసారి స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాము.చెత్త బ్యాటింగ్ వల్లే ఓటమిఅనవసరంగా ఒత్తిడికి లోనయ్యాము. ఆరంభంలో తడబడ్డా ప్రత్యర్థిని 160 పరుగులలోపే కట్టడి చేశాము. కానీ బ్యాటింగ్ పరంగా విఫలమయ్యాము. కొన్ని చెత్త, బాధ్యతారహిత షాట్లు ఆడి మూల్యం చెల్లించుకున్నాము.టీ20 ఫార్మాట్లో కొన్నిసార్లు ప్రత్యర్థి తొలి ఆరు ఓవర్లలోనే మ్యాచ్‌ను తమవైపునకు తిప్పేసుకున్నా.. తిరిగి పుంజుకోవడం కష్టం. ఈ మ్యాచ్ ద్వారా మేము చాలా పాఠాలు నేర్చుకున్నాం. ఆసియా కప్ టోర్నీలో ప్రతీ మ్యాచ్ ముఖ్యమైనదే.శ్రీలంకతో మ్యాచ్‌కు అన్ని విధాలుగా సన్నద్ధం కావాల్సి ఉంది. ప్రస్తుతం మా ముందున్న అతిపెద్ద సవాలు ఇదే’’ అని పేర్కొన్నాడు. కాగా అఫ్గన్ జట్టు గురువారం (సెప్టెంబరు 18) శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇరుజట్ల మధ్య జరిగే ఈ నాకౌట్ పోరుకు అబుదాబి వేదిక.బంగ్లాదేశ్ వర్సెస్ అఫ్గనిస్తాన్ స్కోర్లుబంగ్లాదేశ్: 154/5 (20)అఫ్గనిస్తాన్: 146 (20)చదవండి: చావో- రేవో!.. పాకిస్తాన్ సూపర్-4కు అర్హత సాధించాలంటే..Bangladesh win, keeping playoff hopes alive 🤞 Group B battles are going down the wire. Watch #DPWorldAsiaCup2025 from Sept 9-28, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #BANvAFG pic.twitter.com/9mHoLUcTGw— Sony Sports Network (@SonySportsNetwk) September 16, 2025

'మిరాయ్' హిట్.. తేజ సజ్జాకి లగ్జరీ కారు గిఫ్ట్
గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చిన 'మిరాయ్' సినిమా ప్రేక్షకులకు నచ్చింది. ఈ క్రమంలోనే రూ.100 కోట్ల కలెక్షన్ కూడా సాధించింది. ఈ మేరకు నిర్మాతలు పోస్టర్ రిలీజ్ చేశారు. అలానే మూవీ సక్సెస్‌ని మంగళవారం రాత్రి విజయవాడలో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి 'మిరాయ్' టీమ్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో మాట్లాడిన నిర్మాత.. హీరో, దర్శకుడికి కార్లు గిఫ్ట్ ఇస్తున్నట్లు అనౌన్స్ చేశారు.(ఇదీ చదవండి: మోదీ జీవితంపై మరో సినిమా.. హీరో ఎవరంటే?)సాధారణంగా సినిమాలు హిట్ అయి, మంచి కలెక్షన్స్ సాధిస్తే నిర్మాతలు.. దర్శకుడికో హీరోలకో ఖరీదైన లగ్జరీ కార్లని బహుమతిగా ఇస్తుంటారు. ఇప్పుడు కూడా 'మిరాయ్' హిట్ కావడంతో నిర్మాత విశ్వప్రసాద్ ఆనందపడుతున్నారు. ఈ క్రమంలోనే హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తిక్ ఘట్టమనేనికి.. వాళ్లకు నచ్చిన కార్లని గిఫ్ట్‌గా ఇస్తానని స్టేజీపైనే ప్రకటించారు.'మిరాయ్' విషయానికొస్తే.. 'హనుమాన్' తర్వాత తేజ చేసిన మరో సూపర్ హీరో సినిమా ఇది. తేజ హీరో కాగా మంచు మనోజ్ విలన్‌గా ఆకట్టుకున్నాడు. స్వతహాగా సినిమాటోగ్రఫర్ అయిన కార్తిక్ ఘట్టమనేని.. ఈ చిత్రంతో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోయిన్ రితికా నాయక్, ప్రత్యేక పాత్ర చేసిన శ్రియ కూడా ఈ మూవీతో గుర్తింపు సాధించారు. మరీ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో గౌర హరి ఆకట్టుకోవడం విశేషం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ సినిమా)

నడ్డా.. ఆత్మవంచనకు పరాకాష్ట!
ఎంతటి అవినీతి చేసినప్పటికీ బీజేపీలో చేరితే అన్నీ వాషింగ్ మెషీన్లో వేసినట్టు అన్నీ మాయమైపోతున్నాయన్నది ఈ మధ్యకాలంలో దేశం మొత్తమ్మీద వినిపిస్తున్న మాట. ఆ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా(JP Nadda) విశాఖపట్నంలో చేసిన ఒక ప్రసంగం ఈ మాటలు నిజమే అన్నట్టుగా ఉన్నాయి!. బీజేపీ ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నిర్వహించిన ‘సారథ్య యాత్ర’ ముగింపు సభలో నడ్డా మాట్లాడుతూ వైసీపీ హయాంలో అవినీతి జరిగిందని, అసమర్థ, అరాచక పాలన సాగిందని ఆరోపించారు. రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని, అభివృద్ధి అడుగంటిందని కూడా వ్యాఖ్యానించారు. సహజంగానే ఈ మాటలు ఎల్లో మీడియా చెవికి ఇంపుగా తోచాయి. సంబరంగా కథనాలు రాసుకున్నాయి. కానీ.. వీరందరూ గతం మరచిపోయినట్టు ఉన్నారు. 2019కి మొదలు ఇదే జేపీ నడ్డాసహా బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, అమిత్ షాలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని ఘోరంగా విమర్శించిన విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్ ఏటీఎం మాదిరిగా తమ అక్రమాలకు వాడుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) బహిరంగంగానే విమర్శించిన విషయం గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు అయితే మోదీని టెర్రరిస్టులతో పోల్చడం సంచలనం. మోదీ ప్రభుత్వ అవినీతి వల్ల దేశం పరువు పోతోందని, ముస్లింలను బతకనివ్వడం లేదని...ఇలా అనేక ఆరోపణలు గుప్పించారు. అప్పట్లో ఏపీ బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు నీరు-చెట్టు కింద ఏపీలో రూ.13 వేల కోట్ల అవినీతి జరిగిందని, స్వచ్ఛ భారత్ లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులు కూడా దుర్వినియోగం అయ్యాయని చంద్రబాబు సర్కార్ పై ధ్వజమెత్తేవారు. అవసరార్థం.. బహుకృత వేషం అన్నట్టు 2024 ఎన్నికల్లో ఎలాగోలా చేతులు కలిపిన టీడీపీ, బీజేపీలు ఇప్పుడు పరస్పర ప్రశంసలతో మురిసిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రాన్ని గాడిలో పెడుతోందని నడ్డా వ్యాఖ్యానించారు. కానీ.. అందుకు తగిన కారణాలు, వాస్తవాలను మాత్రం దాచేశారు. జగన్ ముఖ్యమంత్రిగా(YS Jagan As CM) ఉన్న ఐదేళ్లలో ఏనాడూ ఏ రకమైన ఆరోపణలూ చేయని బీజేపీ ఇప్పుడు ఇలా మాట్లాడటం ఆత్మవంచనకు పరాకాష్ట అని చెప్పాలి. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో మొదటి ర్యాంకు ఇచ్చిన విషయం నడ్డాకు గుర్తు రాలేదనుకోవాలి. చంద్రబాబుతో మళ్లీ జతకట్టాక బీజేపీ కొత్త పాటను ఎత్తుకుంటున్నట్లు ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం పలు రంగాల్లో విఫలమైంది. యూరియా కోసం అల్లాడుతున్న రైతులు ఇందుకు ఒక తార్కాణం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ కనిపించని చెప్పుల క్యూలు, యూరియా కోసం రైతుల గొడవలు కూటమి పాలనలోనే కనిపిస్తున్నాయి. మామిడి, పొగాకు, టమోటా, ఉల్లి రైతులు ధరలు గిట్టుబాటు కాక ఆందోళనల బాట పట్టడం, నిరాశ, నిస్పృహల్లో తమ ఉత్పత్తిని రోడ్ల పాలు చేయడమూ చూశాం. ఏ సందర్భంలోనూ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు సకాలంలో చర్య తీసుకున్న పాపాన పోలేదు.జగన్ టైమ్‌లో సజావుగా నడుస్తున్న విద్యా, వైద్య రంగాలలో ఇప్పుడు అస్తవ్యస్థ పరిస్థితి నెలకొంది. జగన్ ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయ సంకల్పిస్తే వాటిని ప్రైవేటు పరం చేస్తున్నారు. దీనిపై ప్రజలలో తీవ్ర నిరసన వస్తోంది. పాలనను గాడిలో పెట్టడం అంటే ఇదేనా?.. మద్యం విచ్చలవిడిగా అమ్మడం, వైన్ షాపులు, పక్కన పర్మిట్ రూమ్‌లు, తదుపరి గ్రామాలలో బెల్ట్ షాపులు నడపడమే ప్రభుత్వ విజయమా?.. శాంతి భద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. మహిళల మీద పెద్ద సంఖ్యలో అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. రాజకీయ కక్షతో రెడ్ బుక్ పాలన చేయడమేనా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమంటే?. జర్నలిస్టులను, వాస్తవాలు రాసే మీడియాను, సోషల్ మీడియాను అణచి వేయడమేనా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం అంటే?. కార్పొరేట్ సంస్థలకు 99 పైసలకే ఎకరా భూమి కట్టబెట్టడమే మంచి పాలన అవుతుందా? సూపర్ సిక్స్ హామీలు అని, భారీ ఎన్నికల ప్రణాళిక అని ఎన్నికలకు ముందు ఊదరగొట్టి, ఇప్పుడు అరకొర చేసి మిగిలిన వాటికి దాదాపు చేతులు ఎత్తివేయడమే సమర్థతా? తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని అసత్యాన్ని ప్రచారం చేసి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను గాయపరచడం గొప్ప సంగతా?? హిందూ మతానికి పేటెంట్ అని చెప్పుకునే బీజేపీ కూడా ఈ విషయంలో నోరు మెదపలేదు. ఇక్కడే తెలుస్తోంది వీరి ద్వంద్వ ప్రమాణాలు. ఎట్టి పరిస్థితిలోను విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానివ్వమని ప్రచారం చేసి, ఇప్పుడు విభాగాల వారీగా ప్రైవేటువారికి ధారాదత్తం చేయడం మంచి పనిగా ప్రచారం చేసుకుంటారా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. జగన్ ప్రభుత్వం పలు వ్యవస్థలను తెచ్చి పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడితే వాటిని ధ్వంసం చేయడం పాలనను గాడిన పెట్టినట్లు అవుతుందా? లేక నాశనం చేసినట్లు అవుతుందా? తన మొత్తం స్పీచ్‌లో ఎక్కువ భాగం ప్రధాని మోడీ పాలన, కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రచారం చేయడానికే కేటాయించినా, ఏపీకి సంబంధించిన కొన్ని విషయాలను ప్రస్తావించారు. ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని పొగిడిన విషయాలకే ఎల్లో మీడియా ప్రాధాన్యత ఇచ్చింది. టీడీపీతో కూటమిలో ఉండబట్టి మొహమాటానికి పొగిడారా? లేక చిత్తశుద్దితోనే మాట్లాడారా అన్న డౌట్లు కూడా లేకపోలేదు. 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఓడిపోయింది. కేంద్రంలో మాత్రం బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. తదుపరి చంద్రబాబు పీఎస్ ఇంట్లో ఆదాయపన్ను శాఖ జరిపిన సోదాలలో రూ.2,000 మేరకు అక్రమాలు కనుగొన్నట్లు సీబీటీడీ ప్రకటించింది. ఆదాయపన్ను శాఖ చంద్రబాబుకు ఒక నోటీసు కూడా ఇచ్చింది. ఆ తర్వాత అవన్ని ఏమయ్యాయో తెలియదు కాని, చంద్రబాబు బీజేపీని ప్రసన్నం చేసుకునే వ్యూహాంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ప్రయోగించారు. తన పార్టీ ఎంపీలు నలుగురిని బీజేపీలోకి పంపించారు. చివరికి 2024 నాటికి బీజేపీని బతిమలాడి పొత్తు పెట్టుకోగలిగారు. మరి అంతకుముందు బీజేపీ, టీడీపీలు చేసుకున్న విమర్శల మాటేమిటి? అనే ప్రశ్న సామాన్యులకు రావొచ్చు. కానీ..రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి టీడీపీ బీజేపీ నేతలు మాత్రం ఏమీ ఫీల్ కాలేదు. ఇంత అవకాశవాదపు పొత్తులు కూడా ఉంటాయా? అని అంతా నివ్వెరపోయారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంటులో టీఎంసీ సభ్యుడు ఒకరు ప్రసంగిస్తూ చంద్రబాబుపై గతంలో కేంద్రం చేసిన అవినీతి ఆరోపణలు ఆయన తిరిగి బీజేపీతో కలవగానే ఏమైపోయాయని ప్రశ్నించారు. వాషింగ్ పౌడర్‌తో క్లీన్ చేసేశారా? అని ఎద్దేవ చేశారు. ఈ సంగతులేవీ అటు బీజేపీ, ఇటు టీడీపీ కాని ప్రస్తావించవు. పొత్తు తర్వాత మోదీని ఆకాశానికి ఎత్తుతూ ప్రపంచంలోనే గొప్ప నేతగా చంద్రబాబు అభివర్ణిస్తే, చంద్రబాబు అనుభవజ్ఞుడని, తాను సీఎం గా ఉన్నప్పుడు చంద్రబాబు పాలన ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నానని పొగిడారు. ఎలాగైతేనేం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ, జనసేనలు కలిసి ప్రకటించిన ఎన్నికల ప్రణాళికతో తమకు సంబంధం లేదన్నట్లుగా బీజేపీ అప్పట్లో వ్యవహరించింది. అయినా ప్రభుత్వంలో మాత్రం భాగస్వామి అయింది. ఇప్పుడు ఆ హామీలను అరకొరగా అమలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. పైగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఫలానా అభివృద్ది జరిగిందని గట్టిగా చెప్పుకునే పరిస్థితి ఉంటే ఆ విషయాన్ని నడ్డా చెప్పి ఉండాలి కదా! అవేమీ లేకుండా జనరల్ గా మాట్లాడితే ఏమి ప్రయోజనం? చిత్రం ఏమిటంటే నడ్డా ఈ సభలో కూడా అవినీతి, వారసత్వ రాజకీయాల గురించి ప్రస్తావించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంపై బీజేపీ చేసిన అవినీతి ఆరోపణలు నిజమా? కాదా?అన్నదాని గురించి మాత్రం చెప్పలేదు. అలాగే వారసత్య రాజకీయాలకు వ్యతిరేకం అని ఊదరగొట్టే బిజెపి నేతలు ఎపిలో ఇప్పుడు టిడిపిలో ఉన్నది వారసత్వ రాజకీయమా? కాదా? అప్పట్లో మరి లోకేశ్ రాజకీయ వారసత్వాన్ని మోడీ ఎద్దేవ చేయగా, ఇప్పుడు ఆయనే పిలిచి మరీ ఎందుకు విందులు ఇస్తున్నారో ప్రజలకు వివరణ ఇస్తారా? ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ లు గత పదిహేనేళ్లలో జరిపిన అవకాశవాద రాజకీయాలు నడ్డాకు గుర్తు లేకపోవచ్చు కాని, ఏపీ ప్రజలు మర్చిపోతారా?..:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

పోలీసుల అరాచకం.. జోగి రమేష్ అరెస్ట్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ప్రశ్నిస్తే అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్న కూటమి ప్రభుత్వం మరో చర్యకు దిగింది. బూడిద మాఫియాకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ని అరెస్ట్ చేయించింది. దీంతో ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. బూడిద రాజకీయాలు ఎన్టీఆర్ జిల్లా రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి. టీడీపీ నేతల అక్రమ బూడిద రవాణాను(Ash Mafia) అడ్డుకునేందుకు జోగి రమేష్ పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో.. బుధవారం మూలపాడులో బూడిద డంప్‌ను పరిశీలించేందుకు ఆయన సిద్ధమయ్యారు. అయితే ఆయన పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు దిగింది. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నంలో భారీగా పోలీసులు మోహరింపజేసింది. మరోవైపు.. మూలపాడుకు వెళ్లకుండా జోగి రమేష్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 144 సెక్షన్ అమల్లోకి తెచ్చిన పోలీసులు.. అటువైపుగా గుంపులుగా వెళ్లేందుకు ఎవరినీ అనుమతించడం లేదు. దీంతో అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు.. తమను అనుమతించాలంటూ పోలీసుల కాళ్లు మొక్కుతూ నిరసనలు తెలియజేశారు. ఈ పరిణామాలతో జోగి రమేష్ నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. ఆందోళనకు సిద్ధమైన జోగి రమేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.బూడిద రవాణా ద్వారా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అక్రమార్జన చేశారన్నది జోగి రమేష్ చెబుతోంది. అంతేకాదు అక్రమ బూడిద నిల్వలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారాయన. అయితే.. జోగి రమేష్ వ్యాఖ్యలపై వసంత కృష్ణ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. జోగి రమేష్ ఇల్లు నేలమట్టం చేస్తా అంటూ అనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో అక్కడ రాజకీయ అలజడి రేగింది.

కాంగ్రెస్ అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేకపోయింది: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న స్థాయిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయిందన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరుద్యోగులు పోషించిన పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. ప్రభుత్వానికి, నిరుద్యోగులకు మధ్య వారధిగా తాను పనిచేస్తానని రాజగోపాల్‌రెడ్డి చెప్పుకొచ్చారు.నిరుద్యోగుల ఆహ్వానం మేరకు హైదరాబాదులోని గన్ పార్క్‌లో నిరుద్యోగులతో కలిసి అమరవీరుల స్థూపానికి మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం, గన్‌పార్క్ దగ్గర రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘నిరుద్యోగులు అధైర్య పడకండి నిరసనలు ధర్నాలు మానుకోండి మీ సమస్యలు వినడానికి అవసరమైతే అశోక్ నగర్ చౌరస్తా, సెంట్రల్ లైబ్రరీకి, దిల్సుఖ్నగర్కి నేనే వస్తాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరుద్యోగులు పోషించిన పాత్ర వెలకట్టలేనిది. పదేళ్లలో నిరుద్యోగుల కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక గ్రూప్ వన్ కూడా వేయలేకపోయారు. బీఆర్ఎస్ పాలన కుటుంబ పాలనగా కొనసాగి అవినీతిమయంగా మారి దోచుకుని అప్పుల పాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు తెలంగాణ యువత కేసీఆర్ ఫామ్ హౌస్‌కు పంపించడానికి పోషించిన పాత్ర అమోఘమైనది. ప్రజా ప్రభుత్వం వచ్చాక 50వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. అనుకున్న స్థాయితో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయాం. నిరుద్యోగులకు అండగా ఉంటా అధైర్య పడకండి. చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. పేదల ప్రభుత్వం ఇది. ప్రజల ప్రభుత్వం సెప్టెంబర్ 17ను కూడా ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సోనియాగాంధీ కలలు కన్న తెలంగాణ రాష్ట్రం పదేళ్ల కాలంలో సాకారం కాలేదు. రాబోయే రోజుల్లో మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయిప్రతీ ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం అనేది సాధ్యమయ్యే పని కాదు. అయినా ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు చదువుకున్న యువత తమ కాళ్ల మీద నిలబడేలా ఉపాధి మార్గాలు చూపిస్తాం. మీకు న్యాయం జరిగే వరకూ మీ సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ప్రభుత్వానికి నిరుద్యోగులకు మధ్య వారధిగా పని చేస్తాను. నిరుద్యోగులకు ధైర్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చా.. నిరుద్యోగులు అధైర్య పడకండి. నిరసనలు, నిర్బంధాలు ధర్నాలు అవసరం లేదు’ అని చెప్పుకొచ్చారు.

కస్టమర్ సర్వీస్ కోసం ప్రీమియం చెల్లించాల్సిందే!?
బెంగళూరుకు చెందిన మార్కెటింగ్ ప్రొఫెషనల్ నిషా ఇటీవల ఓ ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్లో ఓ ప్రొడక్ట్‌ను ఆర్డర్ చేశారు. అందులో సమస్యల కారణంగా ఆమె కంపెనీ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడాలని ప్రయత్నించారు. సంస్థ కస్టమర్ సపోర్ట్ కోసం ఏఐ చాట్బాట్లను ఏర్పాటు చేసినా తన సమస్య పరిష్కారం కాలేదు. నేరుగా కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ ఆమెకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఎగ్జిక్యూటివ్‌తో నేరుగా మాట్లాడాలంటే కంపెనీ ప్రిమియం తీసుకోవాలని సూచిస్తూ.. డబ్బు చెల్లిస్తేనే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌కు కాల్ కనెక్ట్ అవుతుందనేలా పాప్అప్ వచ్చింది.ఏఐ వినియోగం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో చాలా క్విక్ కామర్స్ కంపెనీలు తమ కస్టమర్ సపోర్ట్ కోసం చాట్బాట్లను వినియోగిస్తున్నాయి. ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా ఇప్పటివరకు కాల్ సెంటర్లో పనిచేసే ఉద్యోగులకు లేఆఫ్స్ ఇస్తున్నాయి. ఒకవేళ వినియోగదారుడు నేరుగా ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడాలనుకుంటే మాత్రం అదో లగ్జరీ సర్వీస్‌లాగా మారుస్తున్నాయి. దాంతో కొన్ని కంపెనీలు రియల్‌టైమ్‌లో ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడాలంటే రిజర్వ్ చేసిన టైర్డ్ మెంబర్‌షిప్‌లను తీసుకోవాలని సూచిస్తున్నాయి.కంపెనీలు ఈ అంతర్లీన సాంకేతిక మార్పు ద్వారా ఖర్చు తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. దాంతో ఇతర విభాగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వీలవుతుందని నమ్ముతున్నాయి. ఏఐ చాట్బాట్లు వస్తువుల రిటర్న్‌లు, డెలివరీ సమస్యలు, లాగిన్ పరిష్కారాలు.. వంటివాటిని నిర్వహిస్తున్నాయి. కానీ, కస్టమర్లకు భావోద్వేగ భరోసా ఇచ్చేందుకు మాత్రం ఎగ్జిక్యూటివ్‌లు కావాల్సిందేనని కొందరు భావిస్తున్నారు.ఇదీ చదవండి: నేపాల్‌లో ఉద్యమానికి ‘డిస్కార్డ్’ సహకరించిందా?
కాంగ్రెస్ అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేకపోయింది: కోమటిరెడ్డి
'మిరాయ్' హిట్.. తేజ సజ్జాకి లగ్జరీ కారు గిఫ్ట్
సరికొత్త ఆయుధంతో అరవ రాజకీయాల్లో యుద్ధం!
అణు బెదిరింపులకు భయపడం: ప్రధాని మోదీ
‘100 ఏళ్ల స్వాతంత్ర్య భారతానికి మోదీ సేవ చేస్తూనే ఉండాలి’
మా స్థాయి ఇది కాదు!.. అందుకే బంగ్లా చేతిలో ఓటమి: రషీద్ ఖాన్
8 లక్షల రేషన్ కార్డుల రద్దు!
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
కస్టమర్ సర్వీస్ కోసం ప్రీమియం చెల్లించాల్సిందే!?
ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ సినిమా
తగ్గిన ధరలు.. పసిడి కొనుగోలుకు మంచి తరుణం!
'మాకు చదువు రాదు.. రామును అలా చూస్తుంటే బాధగా ఉంది'
విదేశీ ఉద్యోగులకు ట్రంప్ ఆహ్వానం
Telangana: మందుబాబులకు ఇక పండుగే !
బతుకమ్మ చీరెలొస్తున్నాయ్..
140 కోట్ల జనాభా ఉన్న దేశం మొక్క జొన్న కంకి కొనలేదా?
ఈ గొడవంతా ఎందుకు సార్! ఉగ్రవాదులే మాకు ఆశ్రయమిచ్చారని చెప్పేస్తే సరి!
ఒక్క కంకి కొను ప్లీజ్.. త్రీడేస్ నో ఫుడ్!!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వృత్తి, వ్యాపారాలలో పురోగతి
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. పనులలో పురోగతి
బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..
చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్.. ప్రపంచ రికార్డు బద్దలు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
'రాను బొంబాయికి రాను'.. ఈ పాట వెనక ఇంత కథ ఉందా?
సాగర తీరాన అక్కినేని కోడలు శోభిత ధూలిపాల (ఫొటోలు)
నలుగురితో ప్రేమాయణం.. ముగ్గురితో పెళ్లి..ఇప్పుడు సింగిల్‌గానే స్టార్ హీరోయిన్!
అప్పుల్లో మంచు లక్ష్మీ .. ఆ ఇల్లు నా సొంతం కాదంటూ క్లారిటీ
‘మీడియా ముందుకు రావొద్దన్నారు మావాళ్లు!
యాంకర్ సుమ ఇంట్లో ఓనం సెలబ్రేషన్స్ (ఫొటోలు)
'ది బిగ్ బిలియన్ డేస్ 2025' తేదీలు ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్
కాంగ్రెస్ అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేకపోయింది: కోమటిరెడ్డి
'మిరాయ్' హిట్.. తేజ సజ్జాకి లగ్జరీ కారు గిఫ్ట్
సరికొత్త ఆయుధంతో అరవ రాజకీయాల్లో యుద్ధం!
అణు బెదిరింపులకు భయపడం: ప్రధాని మోదీ
‘100 ఏళ్ల స్వాతంత్ర్య భారతానికి మోదీ సేవ చేస్తూనే ఉండాలి’
మా స్థాయి ఇది కాదు!.. అందుకే బంగ్లా చేతిలో ఓటమి: రషీద్ ఖాన్
8 లక్షల రేషన్ కార్డుల రద్దు!
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
కస్టమర్ సర్వీస్ కోసం ప్రీమియం చెల్లించాల్సిందే!?
ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ సినిమా
తగ్గిన ధరలు.. పసిడి కొనుగోలుకు మంచి తరుణం!
'మాకు చదువు రాదు.. రామును అలా చూస్తుంటే బాధగా ఉంది'
విదేశీ ఉద్యోగులకు ట్రంప్ ఆహ్వానం
Telangana: మందుబాబులకు ఇక పండుగే !
బతుకమ్మ చీరెలొస్తున్నాయ్..
140 కోట్ల జనాభా ఉన్న దేశం మొక్క జొన్న కంకి కొనలేదా?
ఈ గొడవంతా ఎందుకు సార్! ఉగ్రవాదులే మాకు ఆశ్రయమిచ్చారని చెప్పేస్తే సరి!
ఒక్క కంకి కొను ప్లీజ్.. త్రీడేస్ నో ఫుడ్!!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వృత్తి, వ్యాపారాలలో పురోగతి
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. పనులలో పురోగతి
బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..
చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్.. ప్రపంచ రికార్డు బద్దలు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
'రాను బొంబాయికి రాను'.. ఈ పాట వెనక ఇంత కథ ఉందా?
నలుగురితో ప్రేమాయణం.. ముగ్గురితో పెళ్లి..ఇప్పుడు సింగిల్‌గానే స్టార్ హీరోయిన్!
అప్పుల్లో మంచు లక్ష్మీ .. ఆ ఇల్లు నా సొంతం కాదంటూ క్లారిటీ
‘మీడియా ముందుకు రావొద్దన్నారు మావాళ్లు!
'ది బిగ్ బిలియన్ డేస్ 2025' తేదీలు ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్
అందరి టార్గెట్ ఒక్కడే.. 2వ వారం నామినేషన్స్‌లో ఎవరెవరంటే?
అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన సౌరవ్ గంగూలీ
సినిమా

మోదీ జీవితంపై మరో సినిమా.. హీరో ఎవరంటే?
మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఆయన శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు ఆయన బయోపిక్‌ని ప్రకటించారు. 'మా వందే' పేరుతో ఈ చిత్రాన్ని తీస్తున్నట్లు చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. దక్షిణాదికి చెందిన టాప్ టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే)మలయాళ హీరో ఉన్ని ముకుందన్.. ఈ సినిమాలో మోదీగా పాత్రలో కనిపించనున్నాడు. అలానే తెలుగు దర్శకుడు సీహెచ్.క్రాంతి కుమార్ తెరకెక్కిస్తున్నారు. 'కేజీఎఫ్' మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతమందిస్తున్నారు. రాజమౌళి సినిమాలకు పనిచేసిన సెంథిల్ కుమార్.. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ చేయనున్నారు.ప్రస్తుతానికైతే ప్రీ లుక్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇందులో 'ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్ప బలం గొప్పది' అని రాసుకొచ్చారు. అంటే మదర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ బయోపిక్ తీయబోతున్నారా అనిపిస్తుంది. పాన్ ఇండియా లెవల్లో తీస్తున్న ఈ చిత్రాన్ని బహుశా వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ చేస్తారేమో? అయితే 2019లోనే 'పీఎం నరేంద్ర మోదీ' పేరుతో ఓ బయోపిక్ వచ్చింది. ఇప్పుడు ఇది రెండో బయోపిక్ అనమాట.(ఇదీ చదవండి: పిల్లల మీద ఒట్టు.. డబ్బులు ఎగ్గొట్టారు.. బ్యాంక్ బ్యాలెన్స్ లేదు: మంచు లక్ష్మీ)

మళ్లీ జతకట్టిన 'కోర్ట్' జంట.. శ్రీదేవి నోట బూతులు
'కోర్ట్' సినిమాతో కోట్లు కొల్లగొట్టిన రోషన్ (Harsh Roshan)-శ్రీదేవి (Sridevi) జంట మరోసారి జత కట్టింది. వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కొత్త మూవీ బ్యాండ్‌మేళం (Band Melam Movie). సతీశ్ జవ్వాజి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు విజయ్ బుల్గనిన్ సంగీతం అందిస్తున్నాడు. కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో రోషన్.. రాజమ్మా.. గీడున్నవా.. నీకోసం ఇల్లంత దేవులాడిన, నీ కొరకో కొత్త ట్యూన్ పెట్టిన.. ఇంటవా.. ఈ యాదగిరి వాయిస్తే బోనగిరి దాక ఇనబడ్తది, సూడు అంటూ తను కట్టిన ట్యూన్ వినిపించాడు. మాస్ డైలాగ్స్అటు శ్రీదేవి కూడా.. రాజమ్మ ఎవతిరా? గునపం వేసి గుద్దుతా ** అని బూతు డైలాగ్స్ చెప్పింది. అలా తెలంగాణ యాసలోనే ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. టైటిల్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా రోషన్‌కు చిన్నతనం నుంచే డ్యాన్స్ అంటే ఇష్టం. వివిధ టీవీ ఛానళ్లలో డ్యాన్స్ పోటీల్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే దర్శకుడు తరుణ్ భాస్కర్ అతడి ప్రతిభను గుర్తించి ఈ నగరానికి ఏమైంది సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చాడు. సినిమాఅరవింద సమేత, వెంకీ మామ, సలార్, విరూపాక్ష, బచ్చలమల్లి, స్వాగ్, సరిపోదా శనివారం, మిషన్ ఇంపాజిబుల్.. ఇలా అనేక సినిమాలు చేశాడు. కోర్ట్ సినిమాతో హీరోగా మారాడు. శ్రీదేవి విషయానికి వస్తే ఈమె కాకినాడ అమ్మాచి. సోషల్ మీడియాలో ఆమె రీల్స్ చూసి తనను కోర్ట్ మూవీకి సెలక్ట్ చేశారు. ప్రస్తుతం తమిళంలో ఓ మూవీ చేస్తోంది. ఇప్పుడు తెలుగులో మరోసారి రోషన్‌తో జత కడుతోంది. ఈసారి తెలంగాణ అమ్మాయిగా అలరించనుంది. చదవండి: 4 రోజులుగా మాస్క్ మ్యాన్ నిరాహార దీక్ష! నామినేషన్స్‌లో ఏడుగురు

పిల్లల మీద ఒట్టు.. డబ్బులు ఎగ్గొట్టారు.. బ్యాంక్ బ్యాలెన్స్ లేదు!
సినిమా ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు ప్రాధాన్యం లేదని, ఇక్కడివారికి పెద్దగా అవకాశాలివ్వరనేది ఎప్పటినుంచో ఉన్న వాదన! అయితే అదే నిజమంటోంది ప్రముఖ నటుడు మోహన్‌బాబు కూతురు, నటి మంచు లక్ష్మి ప్రసన్న (Manchu Lakshmi Prasanna). ఆమె నటించిన దక్ష మూవీ సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను నటిస్తానంటే తెలుగులో బోలెడుమంది దర్శకనిర్మాతలు నాకు ఛాన్సిచ్చేందుకు రెడీగా ఉన్నారని అందరూ అనుకుంటారు. తెలుగువారిని తీసుకోరెందుకో?కానీ, అది నిజం కాదు. చాలామంది కన్నడ, తమిళ, మలయాళ భాషల నుంచి నటీమణుల్ని సెలక్ట్ చేసుకుని సినిమాలు చేస్తున్నారు. కొన్నిసార్లు ఆ సినిమాలు చూసినప్పుడు ఆ క్యారెక్టర్లో నేనైతే బాగుండేదాన్నేమో అనిపించేది. వెంటనే దర్శకనిర్మాతలకు ఫోన్ చేసి నన్నెందుకు పెట్టుకోలేదు? అని తిట్టేదాన్ని. తెలుగువాళ్లతో పని చేయించుకోవడం తెలుగువాళ్లకే ఇష్టం లేదు. ఇక్కడివారిని సెలక్ట్ చేసుకోవడానికి తెగ బాధపడుతుంటారు. అదెందుకో నాకూ అర్థం కావడం లేదు. నేను సమయానికి సెట్‌కి వచ్చి బుద్ధిగా పని చేస్తాను. ఎవరినీ, ఏమీ ఇబ్బంది పెట్టను.చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిపైగా ఇప్పటివరకు ప్రతి నిర్మాత నాకు డబ్బులెగ్గొట్టాడే తప్ప నేనెవరికీ డబ్బులెగ్గొట్టలేదు. నా చివరి సినిమా డబ్బులు కూడా ఇంతవరకు ఇవ్వనేలేదు. అడిగితే సినిమా కష్టాలు చెప్తారు. సరేలే, పాపం.. సినిమా ముందుకెళ్లాలి కదా అని షూటింగ్ పూర్తి చేస్తాం. తీరా చూస్తే పిల్లలపై ఒట్లు వేస్తారు, కానీ, డబ్బు మాత్రం ఇవ్వరు. ఇవన్నీ చూసి నిరాశచెందాను. మరో విషయం నాకు ఆర్థిక క్రమశిక్షణ లేదు. ఈ విషయం చెప్పడానికి సిగ్గుగా ఉంది. ఎప్పుడూ దీని గురించి అంతగా ఆలోచించలేదు. నేను సంపాదించిందంతా టీచ్ ఫర్ చేంజ్ వంటి సామాజిక సేవకే ఉపయోగించాను.చెప్పుడుమాటలు విని బతికాకానీ, నాకంటూ కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని ఆలోచించలేదు. ఇప్పుడిప్పుడే డబ్బు ఆదా చేయడం మొదలుపెట్టాను. మనల్ని మనమే చూసుకోవాలి.. ఎవరూ వచ్చి ఏదీ చేయరు. నా జీవితమంతా చెప్పుడుమాటలు విని బతికేశాను. ఇందులో ఎవర్నీ తప్పుపెట్టడం లేదు. సినిమాల్లేనప్పుడు నేనూ ఇంకో దారి చూసుకోవాలి. అందుకే చీరల బిజినెస్ ప్రారంభించాను. దక్షిణాది స్పెషల్ చీరలను నార్త్‌కు పరిచయం చేస్తున్నాను అని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది.చదవండి: రూ.2వేల కంటే ఎక్కువ ఖర్చుపెట్టను: మృణాల్ ఠాకూర్

4 రోజులుగా మాస్క్ మ్యాన్ నిరాహార దీక్ష! నామినేషన్స్‌లో ఏడుగురు
హీరో, విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్‌ను చంపేసినట్లుంది కథ! హౌస్‌లో గుడ్డు దొంగతనం చేసింది సంజనా.. ఆ గుడ్డును కాపాడుకోవాల్సింది ఓనర్లు. సంజనా ఐదు నెలల బాలింత కావడంతో ఆ దొంగతనాన్ని చూసీచూడనట్లు వదిలేశాడు భరణి. అంతే, దొరికిందే ఛాన్స్ అన్నట్లు ఇప్పటికీ అదే పాయింట్ లాగుతూ ఓనర్లందరూ కలిసి భరణిని నామినేట్ చేశారు. మరి ఈ రెండోవారం నామినేషన్స్‌లో ఎవరున్నారో చూసేద్దాం..తలతిక్క సమాధానాలునాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మాస్క్ మ్యాన్ హరీశ్‌ను రీతూ చౌదరి (Rithu Chowdary) నామినేట్ చేసింది. నేను తినను, వెళ్లిపోతాను అని గివప్ ఇవ్వడం నచ్చలేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, మరి అదే అన్నం మీ ఎదురుగా మీకోసం గంటన్నర వెయిట్ చేసింది. ఫ్యామిలీ గురించి ఆలోచించైనా తినొచ్చుగా.. అంది. దీనికి హరీశ్ తలతిక్క సమాధానం చెప్పాడు. నా జీవితం.. నాకు నచ్చినట్లు బతుకుతా, మీకు నచ్చినట్లు కాదు. బలమైన కారణం వల్లే ఫుడ్ తినడం లేదు. నేను బయట కొంతమందిని కాపాడుకోవాలి. నాపై ముద్ర వేశారునేను చరిత్రహీనుడని ముద్రవేశారు కదా.. దాన్నుంచి బయట మనుషుల్ని కాపాడుకోవడానికి క్విట్ అవుతా అన్నాడు. మీ మీద ముద్ర వేస్తే అది నిజం కాదని ప్రూవ్ చేయాలని రీతూ అంది. అప్పటికీ తగ్గని హరీశ్ (Mask Man Harish) టాపిక్‌ను డైవర్ట్ చేస్తూ ఏదేదో మాట్లాడాడు. నీకు ఫుడ్ పెట్టడం వల్లే గొడవలనడంతో రీతూ ఏడ్చేసింది. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడాన్ని సింపతీ కార్డ్ అన్నాడు హరీశ్. అలాగైతే అన్నం తినకపోవడం కూడా సింపతీ కార్డే అని రీతూ ఇచ్చిపడేసింది.దమ్ముంటే బిగ్‌బాస్‌ను అడగండితర్వాత శ్రీజ కూడా హరీశ్‌ను నామినేట్ చేసింది. మీరు ఇమ్మాన్యుయేల్‌ను రెడ్ ఫ్లవర్ అనడం వీడియోలో క్లియర్‌గా కనిపించిందని శ్రీజ చెప్తుంటే ఇమ్మాన్యుయేలే బాడీ షేమింగ్ చేశాడంటూ హరీశ్ మళ్లీ ఫైరయ్యాడు. మా మధ్య ఉండటం ఇష్టం లేకపోతే వెళ్లిపో అనేసింది శ్రీజ. దమ్ముంటే బిగ్‌బాస్‌ను అడగండి, పంపిస్తే వెళ్లిపోతా అన్నాడు. ఇలా గొడవలతోనే నామినేషన్ ప్రక్రియ జరిగింది. చివర్లో బిగ్‌బాస్ కెప్టెన్ సంజనాకు ఓ పవర్ ఇచ్చాడు. ఒకర్ని నేరుగా నామినేట్ చేయొచ్చన్నాడు.సుమన్‌ను బలి చేసిన కెప్టెన్ సంజనాదీంతో ఆమె.. ఆరోజు నేను ఏడుస్తున్నప్పుడు మేము 9 మంది కాదు 8మందిమే అని నన్ను పక్కనపెట్టేశారు. తర్వాత ఒక్కసారి కూడా సారీ చెప్పలేదు అంటూ సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. అందుకతడు.. ఆ తొమ్మిదో వ్యక్తి మీరే అని ఎందుకు ఫిక్స్ అవుతున్నారు? నేను అయ్యుండొచ్చుగా అని కౌంటరిచ్చాడు. ఇక ఫైనల్‌గా భరణి, హరీశ్, మనీష్, ప్రియ, డిమాన్ పవన్, ఫ్లోరా, సుమన్ శెట్టి ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. మరోవైపు లైవ్‌లో తనూజ ఎంతో బతిమాలడంతో అప్పుడు అన్నం ముద్ద తిన్నాడంట హరీశ్!చదవండి: 'రాను బొంబాయికి రాను'.. ఈ పాట వెనక అసలు నిజం చెప్పిన పేరేంట్స్!
న్యూస్ పాడ్‌కాస్ట్

సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో మెరిట్‌ను ఎలా విస్మరిస్తారు?

ఏపీ ప్రజారోగ్య రంగంలో 2023 సెప్టెంబర్ 15 ఒక గొప్ప రోజు. సీఎంగా నాకు అత్యంత సంతృప్తిని ఇచ్చిన రోజు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్య

పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పేరిట అస్మదీయులకు సంపద సృష్టి... ఏపీలో ప్రైవేట్ పరమయ్యే కాలేజీల్లో ఎన్ఆర్ఐ కోటా ఎంబీబీఎస్ సీటు ఏడాదికి 57 లక్షల రూపాయల పైమాటే

‘ఎమ్మార్’ పేరిట ప్రజలను ఏమార్చే కుట్ర... ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విష ప్రచారం

కర్నూలులో 2 వేల 700 కోట్ల రూపాయల విలువైన స్థలంపై గురి...

ఆంధ్రప్రదేశ్‌లో వెయ్యి ఎకరాల దేవుడి భూముల స్వాహాపర్వం... అధికార తెలుగుదేశం పార్టీ నేతల కబ్జాకాండ

చంద్రబాబు సర్కార్ సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది, చంద్రబాబు ముఠా ఆదాయం పెరుగుతోంది... వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం

నూతన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్... ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డిపై ఘన విజయం

ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం...రోడ్డున పడ్డ రైతాంగం

ఆంధ్రప్రదేశ్‌లో విచ్చలవిడిగా భూదోపిడీ... ఏపీఐఐసీకి చెందిన విలువైన వేలాది ఎకరాలు ప్రభుత్వ పెద్దల సన్నిహితులకు పందేరం
క్రీడలు

IND vs WI: వెస్టిండీస్ జట్టు ప్రకటన.. వికెట్ల వీరుడికి చోటు
టీమిండియాతో టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్ (West Indies tour of India- 2025) క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. భారత పర్యటనలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టుకు రోస్టన్ ఛేజ్ (Roston Chase) కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది. వారిపై వేటుఇక ఈ టూర్లో భాగంగా మాజీ సారథి క్రెయిగ్ బ్రాత్వెట్పై వేటు వేసిన విండీస్ బోర్డు.. చివరిగా ఆస్ట్రేలియాతో ఆడిన కేసీ కార్టీ, జొహాన్ లేన్, మికైల్ లూయీస్లను కూడా జట్టు నుంచి తప్పించింది.వికెట్ల వీరుడికి చోటుఅదే విధంగా.. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఖారీ పియరికి తొలిసారిగా టెస్టు జట్టులో చోటు ఇచ్చింది. వైస్ కెప్టెన్ జోమెల్ వారికన్తో కలిసి పియరి స్పెషలిస్టు స్పిన్నర్‌గా బరిలో దిగనున్నాడు. ఇటీవల జరిగిన వెస్టిండీస్ చాంపియన్‌షిప్‌లో 41 వికెట్లతో సత్తా చాటినందుకు గానూ పియరీకి ఈ అవకాశం దక్కింది. ఇక అలిక్ అథనాజ్, తగెనరైన్ చందర్‌పాల్‌కు వెస్టిండీస్ సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు.చందర్‌పాల్ రాకతో టాపార్డర్‌లో తమ జట్టు మరింత పటిష్టం అవుతుందని.. అదే విధంగా అథనాజ్ కూడా స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలడని తెలిపారు. కాగా అథనాజ్ చివరిసారిగా జనవరిలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆడాడు. సీమర్ల కోటాలో వీరేఅయితే.. పేసర్ గుడకేశ్ మోటికి మాత్రం విశ్రాంతినిచ్చినట్లు విండీస్ బోర్డు తెలిపింది. పరిమిత ఓవర్ల సిరీస్‌ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఉపఖండ పిచ్‌లపై మ్యాచ్ నేపథ్యంలో స్పిన్ విభాగానికి వారికన్ నాయకత్వం వహించనుండగా.. ఖారీ పియర్రి, రోస్టన్ ఛేజ్ అతడికి సహాయకులుగా ఉండనున్నారు.ఇక సీమర్ల కోటాలో అల్జారీ జోసెఫ్, షమార్ జోసెఫ్, ఆండర్సన్ ఫిలిప్, జేడన్ సీల్స్ స్థానం దక్కించుకున్నారు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా వెస్టిండీస్ టీమిండియాతో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. అక్టోబరు 2- 14 వరకు ఇరుజట్ల మధ్య అహ్మదాబాద్, ఢిల్లీ వేదికలుగా ఈ రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి.టీమిండియాతో టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్ జట్టురోస్టన్ ఛేజ్ (కెప్టెన్), జోమెల్ వారికన్ (వైస్-కెప్టెన్), కెవ్లాన్ ఆండర్సన్, అలిక్ అథనాజ్, జాన్ కాంప్‌బెల్, తగెనరైన్ చందర్‌పాల్, జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్, అల్జారీ జోసెఫ్, షమార్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఆండర్సన్ ఫిలిప్, ఖారీ పియర్రి, జేడన్ సీల్స్.చదవండి: మ్యాక్స్‌వెల్ కీలక నిర్ణయం

Handshake Row: ఐసీసీ యూటర్న్.. పాకిస్తాన్‌కు ఊరట?!
ఆసియా కప్-2025 టోర్నీలో టీమిండియాతో మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) రచ్చకెక్కింది. తమ ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్లు కరచాలనం చేయకపోవడాన్ని పీసీబీ జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలో భారత్, పాక్ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్ (Andy Pycroft)ను తక్షణం ఆసియా కప్ నుంచి తప్పించాలని పీసీబీ డిమాండ్ చేసింది.ఆయనే బాధ్యుడంటూ..ఈ మేరకు ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లకు ఫిర్యాదు కూడా చేసింది. మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ షేక్‌హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్ సల్మాన్ ఆఘాకు చెప్పాడని, ఈ వివాదానికి ఆయనే బాధ్యుడని ఫిర్యాదులో ప్రముఖంగా పేర్కొంది.ఈ విషయంపై మంగళవారం స్పందించిన ఐసీసీ పాక్ బోర్డు ఫిర్యాదును తోసిపుచ్చింది. ‘సోమవారం రాత్రే ఐసీసీ తమ నిర్ణయాన్ని వెలువరించింది. రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్‌ను తప్పించలేమని పాక్ బోర్డు ఫిర్యాదును తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశాం’ అని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. కాగా జింబాబ్వేకు చెందిన పైక్రాఫ్ట్‌కు అంతర్జాతీయ క్రికెట్లో విశేషానుభవం వుంది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో సీనియర్ రిఫరీ అయిన ఆయన మూడు ఫార్మాట్లలో కలిసి 695 మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించారు. పురుషులు, మహిళల మ్యాచ్‌లు కలిపి ఉన్నాయి.ఐసీసీ యూటర్న్.. పాక్‌కు ఊరట?!ఈ నేపథ్యంలో కనీసం తమ మ్యాచ్‌ల వరకైనా ఆండీ క్రాఫ్ట్‌ను దూరం పెట్టి రిచీ రిచర్డ్సన్కు రిఫరీ బాధ్యతలు ఇవ్వాలని పీసీబీ కోరింది. కాగా ఆసియా కప్ టోర్నీలో బుధవారం పాకిస్తాన్- యూఏఈ మధ్య జరిగే మ్యాచ్‌కూ పైక్రాఫ్ట్ రిఫరీగా ఉన్నారు. అయితే, పీసీబీ విజ్ఞప్తిని మన్నించిన ఐసీసీ.. ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆడబోయే అన్ని మ్యాచ్‌ల నుంచి పైక్రాఫ్ట్‌ను రిఫరీగా తప్పించినట్లు ఎన్డీటీవీ తన తాజా కథనంలో పేర్కొంది.కాగా పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ సారథి సల్మాన్ ఆఘాకు షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా భారత ఆటగాళ్లు పాక్ జట్టుతో కరచాలనం చేయలేదు. కచ్చితమైన నిబంధనలేమీ లేవుఈ నేపథ్యంలో పీసీబీ రిఫరీతో పాటు టీమిండియా తీరును తప్పుబట్టగా.. ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వాలన్న కచ్చితమైన నిబంధనలేమీ లేవని బీసీసీఐ కౌంటర్ ఇచ్చింది.ఇక దుబాయ్ వేదికగా ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కొన్ని అంశాలు క్రీడాస్ఫూర్తికి మించినవి ఉంటాయంటూ పాక్ విమర్శలను తిప్పికొట్టాడు. పాక్‌పై ఈ గెలుపును ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత సైన్యానికి అంకితం చేస్తున్నట్లు తెలిపాడు. అలాగే పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని సూర్య స్పష్టం చేశాడు.చదవండి: సూర్యకుమార్‌పై పాక్ మాజీ కెప్టెన్ దిగజారుడు వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన కోచ్

తల్లి కళ్లల్లో ఆనందం.. ఈ విజయం ఎంతో ప్రత్యేకం!
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): క్లిష్టంగా గడుస్తున్న ఈ సంవత్సరంలో తాజా ఫిడే గ్రాండ్ స్విస్ టైటిల్ కొత్త ఉత్సాహాన్నిచ్చిందని భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేశ్‌బాబు తెలిపింది. తాను మరింత మెరుగయ్యేందుకు, రాణించేందుకు ఇది ఔషధంలా పనిచేస్తుందని చెప్పింది. మహిళల ఎలైట్ ఈవెంట్లో వరుసగా రెండుసార్లు విజేతగా నిలిచిన తొలి భారత క్రీడాకారిణిగా ఆమె ఘనత వహించింది. 24 ఏళ్ల ఈ చెన్నై గ్రాండ్‌మాస్టర్ వచ్చే ఏడాది క్యాండిడేట్స్ టోర్నీకి సైతం అర్హత సాధించిన సంగతి తెలిసిందే. నాకెన్నో గుణపాఠాలు నేర్పాయి‘గత విజయంతో పోల్చుకుంటే ఇది ముమ్మాటికి కఠినమైంది. 2023లో నేను ఫామ్‌లో ఉన్నాను. నిలకడగా విజయాలు సాధిస్తున్న సమయంలో గ్రాండ్ స్విస్ టైటిల్ గెలవడం ఏమంత కష్టం కాలేదు. కానీ ఇప్పుడు అంతా సులువుగా రాలేదు. నేను ఎప్పట్లాగే కష్టపడుతున్నప్పటికీ ఈ ఏడాది ఫలితాలు మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో లభించిన టైటిల్ నన్ను మార్చింది. చాలా టోర్నీలలో ఆడటం ద్వారా గత రెండేళ్లుగా ఎంతో అనుభవాన్ని గడించా. అయితే గతేడాది క్యాండిడేట్స్ టోర్నీలో వరుసగా నాలుగు గేమ్‌లు ఓడిపోవడం, ఆ తర్వాత మింగుడుపడని ఫలితాలు నాకెన్నో గుణపాఠాలు నేర్పాయి. నేనొక ప్లేయర్‌గా మరింత బాగా ఆడేందుకు, ఓ వ్యక్తిగా దృఢంగా తయారయ్యేందుకు దోహదం చేశాయి’ అని వైశాలి పేర్కొంది. ఈ ఏడాది సొంతగడ్డపై జరిగిన చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ టోర్నమెంట్లో తొమ్మిది రౌండ్ల పాటు వరుస వైఫల్యాలతో కేవలం 1.5 పాయింట్లే సాధించడం, మహిళల ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్లో తన్ జొంగ్జీ (చైనా) చేతిలో ఓడిపోవడం వైశాలిని కుంగుదీసింది. తల్లి కళ్లల్లో ఆనందం‘చెన్నై టోర్నీలో ఏకంగా ఏడు గేముల్లో ఓడాను. ఇంకా చెప్పాలంటే ఓ వారమంతా ఓటములతోనే గడిచిపోయింది. అప్పుడు ఏదోలా అనిపించింది. మంచో చెడో కూడా అర్థమయ్యేది కాదు. కానీ గెలిస్తే నన్ను ఎవరు ఆపలేరనే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. అదే ఇప్పుడు జరిగింది’ అని వైశాలి వివరించింది. ఇక ఫిడే గ్రాండ్ స్విస్ టైటిల్ గెలిచిన తర్వాత తల్లి నాగలక్ష్మి, తమ్ముడు ప్రజ్ఞానందతో కలిసి వైశాలి సంబరాన్ని పంచుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Pride, love, and a mother’s touch ❤️🇮🇳 Vaishali Rameshbabu, her mother Nagalakshmi, and her brother Praggnanandhaa R.#FIDEGrandSwiss @chessvaishali pic.twitter.com/NIYX5I3fs8— International Chess Federation (@FIDE_chess) September 16, 2025

వారియర్స్ విక్టరీ
జైపూర్: వైఫల్యాలతో సతమతమవుతున్న మాజీ చాంపియన్ బెంగాల్ వారియర్స్... ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్లో ఎట్టకేలకు గెలుపుబాట పట్టింది. మంగళవారం జరిగిన పోరులో 41–37తో యూపీ యోధాస్‌పై గెలుపొందింది. 2019 సీజన్ చాంపియన్ వారియర్స్ నాలుగు వరుస పరాజయాల తర్వాత మళ్లీ విజయం సాధించింది. ఆరు మ్యాచ్‌లాడిన బెంగాల్‌కు ఇది రెండో విజయం మాత్రమే! ఈ మ్యాచ్‌లో వారియర్స్ కెపె్టన్ దేవాంక్ (17 పాయింట్లు) తనదైన శైలిలో రాణించాడు. మిగతా వారిలో ఆశిష్ (6), మన్‌ప్రీత్ (5), పార్థిక్ (3) మెరుగ్గా ఆడారు. యూపీ తరఫున రెయిడర్లు గగన్ గౌడ (7), గుమన్ సింగ్ (5), డిఫెండర్లు అçశు సింగ్, హితేశ్ చెరో 4 పాయింట్లు స్కోరు చేశారు. రెండో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 35–29తో బెంగళూరు బుల్స్‌పై నెగ్గింది. తమిళ్ తరఫున అర్జున్ (13), నరేందర్ (5), రోనక్ (4) బాగా ఆడారు. నేడు జరిగే పోటీల్లో తెలుగు టైటాన్స్‌తో దబంగ్ ఢిల్లీ, హరియాణా స్టీలర్స్‌తో పట్నా పైరేట్స్ తలపడతాయి.
బిజినెస్

ప్రపంచంలోనే టాప్ 5 బిజినెస్ ఇన్‌స్టిట్యూట్‌ల్లో ఐఎస్బీకి చోటు
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) లింక్డ్ఇన్ 2025 టాప్ ఎంబీఏ ఇన్స్టిట్యూట్ల జాబితాలో ప్రపంచవ్యాప్తంగా ఐదో స్థానాన్ని దక్కించుకుంది. ఇది గత సంవత్సరం ఆరో స్థానం నుంచి పుంజుకుంది. టాప్ 100 గ్లోబల్ ఎంబీఏ ప్రోగ్రామ్‌ల జాబితాలో ప్రతిష్టాత్మకంగా టాప్ 20లో మూడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లు చోటు సంపాదించాయి. అందులో ఐఐఎం-కలకత్తా (16వ స్థానం), ఐఐఎం-అహ్మదాబాద్ (17), ఐఐఎం-బెంగళూరు (20) ఉన్నాయి.ఈ సందర్భంగా లింక్డ్ఇన్ ఇండియా, సీనియర్ మేనేజింగ్ ఎడిటర్, కెరీర్ నిపుణులు నిరాజితా బెనర్జీ మాట్లాడుతూ..‘విద్యార్థులు ఎంబీఏను ఎంచుకోవడం తమ కెరియర్లో కీలకంగా ఉంటుంది. ఎంబీఏ ద్వారా వచ్చే విశ్వాసం, అవకాశాలు దశాబ్దాలపాటు తమ కెరియర్ వృద్ధికి ఎంతో తోడ్పడుతాయి’ అన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్, ప్రొఫెసర్ మదన్ పిలుట్ల మాట్లాడుతూ..‘ఐఎస్బీలో పీజీపీ నైపుణ్యాలను అందించడమే కాకుండా, మారుతున్న ప్రపంచంలో వృద్ధి చెందడానికి అవసరమైన మెలకువలు నేర్పుతున్నాం’ అన్నారు.ఇదీ చదవండి: ‘రాత్రిళ్లు పనిచేసి రూ.1 కోటి సంపాదించాను’లింక్డ్ఇన్ టాప్ ఎంబీఏ 2025 ర్యాంకింగ్స్ జాబితా కింది విధంగా ఉంది.స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంహార్వర్డ్ విశ్వవిద్యాలయంఇన్ సీడ్పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయంమసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)డార్ట్ మౌత్ కాలేజ్కొలంబియా విశ్వవిద్యాలయంలండన్ విశ్వవిద్యాలయంచికాగో విశ్వవిద్యాలయంఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయండ్యూక్ విశ్వవిద్యాలయంయేల్ విశ్వవిద్యాలయంకాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్కిలీఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ - కలకత్తాఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ - అహ్మదాబాద్వర్జీనియా విశ్వవిద్యాలయంకార్నెల్ విశ్వవిద్యాలయంఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ - బెంగళూరు

25,300 పాయింట్ల వద్ద నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:27 సమయానికి నిఫ్టీ(Nifty) 71 పాయింట్లు పెరిగి 25,307కు చేరింది. సెన్సెక్స్(Sensex) 212 పాయింట్లు పుంజుకొని 82,589 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

‘రాత్రిళ్లు పనిచేసి రూ.1 కోటి సంపాదించాను’
జీవితంలో ఎదగాలనే తపన, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని కొందరు నిరూపిస్తున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న ఈ కాలంలో కాలేజీ రోజుల్లో నుంచే కోడింగ్‌పై ఆసక్తి పెంచుకొని, ఓవైపు పగటిపూట ఉద్యోగం చేస్తూనే మరోవైపు రాత్రిళ్లు డిజిటల్ యాప్స్ తయారు చేశాడు ఓ యువకుడు. ఆ యాప్స్‌కు నెటిజన్లు నుంచి ఆదరణ లభించడంతో రెండేళ్లలోనే ఏకంగా రూ.1 కోటి సంపాదించాడు. ఈమేరకు ఆ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.రెడ్డిట్‌లో ఇండియన్ ఫ్లెక్స్ హ్యాండిల్లో చేసిన పోస్ట్‌లోని వివరాల ప్రకారం..‘నేను 2015లో కాలేజీలో చేరాను. మొదటి నుంచే నాకు కోడింగ్‌పై ఆసక్తి పెరిగింది. అందులోని మెలకువలు నేర్చుకున్నాను. కాలేజీ చదువు పూర్తయ్యాక ఓ రిటైల్ కంపెనీలో పగలు ఉద్యోగం చేసేవాడిని. కోడింగ్ నైపుణ్యాలతో రాత్రిళ్లు పనిచేస్తూ కొన్ని యాప్స్ డెవలప్ చేశాను. మొత్తంగా 5 డిజిటల్స్ యాప్స్ ఆవిష్కరించాను. వీటి అభివృద్ధికి ఎవరి సాయం తీసుకోలేదు. నేనే కోడింగ్, డిజైనింగ్, మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్.. వంటివి చేసుకున్నాను. దాంతో రెండేళ్లలో రూ.1 కోటి సంపాదించాను’ అని రాసుకొచ్చారు.మనం చేసే పనిలో ఆసక్తి, పట్టుదల, నైపుణ్యాలు పెంచుకుంటే ఏదైనా సాధించవచ్చు. దాంతో క్రమంగా ఆర్థిక భరోసా ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్ చిప్‌లపై పరిశోధన

ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్ చిప్‌లపై పరిశోధన
దేశీయంగా సురక్షితమైన చిప్‌లను డిజైన్ చేసే దిశగా ఎల్అండ్టీ సెమీకండక్టర్ టెక్నాలజీస్ (ఎల్టీఎస్సీటీ), సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ–డాక్), ఐఐటీ గాందీనగర్ జట్టు కట్టాయి. ప్రాథమికంగా ఎలక్ట్రానిక్ పాస్‌పోర్టుల కోసం చిప్‌లపై (ఐసీ) పరిశోధనలు జరపడం, వాటిని అభివృద్ధి, తయారు చేయడంపై ఈ మూడూ కలిసి పని చేస్తాయి.ఇందుకోసం ప్రత్యేకంగా పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు ప్రోడక్ట్ డెవలప్మెంట్, వినియోగాన్ని వేగవంతం చేసేందుకు నిర్దిష్టంగా ఇన్వెస్ట్ చేయనున్నాయి. సున్నితమైన విభాగాల్లో విదేశీ టెక్నాలజీ ప్రొవైడర్లపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడనుంది. కొత్త తరం క్రిప్టో ప్రోడక్టులకు కూడా సెక్యూర్ ఐసీ సొల్యూషన్ పునాదులు వేస్తుందని ఎల్టీఎస్సీటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సందీప్ కుమార్ తెలిపారు.ఇదీ చదవండి: ఓలా ఎలక్ట్రిక్.. 10 లక్షల మైలురాయి
ఫ్యామిలీ

అలరిస్తున్న ఫ్యాషన్ చేనేత కళాఖండాలు..!
విభిన్న సంస్కృతులు, సంప్రదాయాల సమ్మేళనం హైదరాబాద్. అలాంటి నగర వేదికగా కొనసాగుతున్న చేనేత, హస్తకళల ఉత్సవం ‘ఛాప్’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మాదాపూర్ శిల్పారామంలో సాంస్కృతిక కళలకు ఆధునిక హంగులు జోడిస్తూ జరుగుతున్న ఈ అతిపెద్ద కళాత్మక కార్యక్రమం ఈ తరం ఫ్యాషన్, ఇంటీరియర్ ఔత్సాహికులను విశేషంగా అలరిస్తోంది. ఫ్యాషన్–టెక్నాలజీ వంటి అంశాలతో కేంద్ర టెక్స్టైల్ మినిస్ట్రీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్), తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ శాఖ భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ ‘ఛాప్’ సరికొత్త కళను తీసుకొచ్చింది. ఈ నెల 17 వరకూ కొనసాగనున్న ఈ చేనేత, హస్తకళల సందడి.. సిటీ లైఫ్ స్టైల్లో మునిగిపోయని నగరవాసులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది. ఛాప్ 2025లో భాగంగా భారతదేశపు చేనేత, హస్తకళల వారసత్వాన్ని ప్రదర్శించడంతో పాటు సమకాలీన డిజైన్ల ఆవిష్కరణ, వ్యవస్థాపకత ప్రాధాన్యతను తెలియజేసేలా ఏర్పాటు చేసిన విభిన్న కార్యక్రమాలు సందర్శకులను ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్‌లోని శిల్పారామం వేదికగా ఏర్పాటు చేసిన 100 స్టాల్స్‌లో తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన హస్తకళాకారులు, నిఫ్ట్ పూర్వ విద్యార్థులు, వ్యవస్థాపకులు, డిజైనర్లు, పరిశ్రమల ప్రముఖులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. ఇందులోని లెదర్బ్యాగ్స్, వుడ్ కారి్వంగ్, పెయింటింగ్స్ వంటి చేతి ఉత్పత్తులను నగరవాసులు కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ టూరిజం ప్రాధాన్యతను ప్రదర్శించేలా వినూత్న కార్యక్రమాలు, సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికేలా నిర్వహిస్తున్న మాస్టర్ క్లాసులు, ఫ్యాషన్ షోలు, విద్యార్థుల పరిశోధనాత్మక డాక్యుమెంటేషన్, అరుదైన కళలు తోలుబొమ్మలాట వంటివి.. ‘ఛాప్’లో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. రేపటితో ముగియనున్న ఈ ‘ఛాప్’ ప్రదర్శనను సందర్శించకుంటే ఒక తరం కళాత్మక వైభవాన్ని చూసే అవకాశం కోల్పోయినట్లే.నీడిల్ క్రాఫ్ట్.. వెరీ స్పెషల్.. హిమాచల్ ప్రదేశ్, కాంగ్ర అనే ప్రాంతంలో ప్రత్యేకంగా పిన్ నీడిల్ క్రాఫ్టŠస్ను మహిళలు ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. వీటిని నగరవాసులు విరివిగా కొనుగోలు చేస్తున్నారు. వీటి ధర రూ.100 నుంచి 20వేల వరకూ అందుబాటులో ఉండటం విశేషం. పర్యావరణహిత ఉత్పత్తులు, స్టోరేజ్ బాక్సులు, పండ్ల బుట్టలు, టిష్యూ బాక్స్, చపాతీ బాక్స్, టేబుల్ మ్యాట్ వంటి అందమైన ఉత్పత్తులు వీరి ప్రత్యేకతను చాటుతున్నాయి.ప్యూర్ లెదర్.. ఫరెవర్.. అస్సోంకు చెందిన నిఫ్ట్ డిజైనర్ రూపొందించిన ప్యూర్ లెదర్ ఉత్పత్తులకు ఈ స్టాల్స్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. అస్సోంకు చెందిన డిజైనర్ తమ ఉత్తులకు మరింత మార్కెటింగ్ చేయనున్నట్లు తెలిపారు. వీటి ధర రూ.1000 నుంచి 10వేల వరకూ అందుబాటులో ఉన్నాయి. టిఫిన్ బ్యాగ్స్, కాలేజ్, ఆఫీస్ బ్యాగ్స్, మహిళల హ్యాండీ బ్యాగ్స్ అదుర్స్ అంటున్నారు సందర్శకులు.మనసు దోచే.. తుస్సార్ సిల్క్.. ఈ వేదికలో ఒడిస్సాకు చెందిన తుస్సార్ సిల్క్ చీరలు, చున్నీలు, టవల్స్, దోతీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ఉత్పత్తుల ధర 8వేల నుంచి 26వేల వరకూ అందుబాటులో ఉన్నాయి. రాజస్థాన్ ఫేమ్.. ఫ్రేమ్స్.. రాజస్థాన్‌కి చెందిన బికనీర్ కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులు ఈ తరం ఇంటీరియర్ వండర్‌గా నిలుస్తున్నాయి. చేతితో తయారు చేసిన ఫ్రేమ్స్, కళాత్మక ఉత్పత్తులు ట్రెండీ థింగ్స్‌ను మైమరిపిస్తున్నాయి. ఇందులోని 24 క్యారెట్ గోల్డ్, రాజస్థాన్ పెయింటింగ్‌తో తయారు చేసిన లెదర్ల్యాంప్ వావ్ అనిపిస్తోంది. దీని ధర రూ.35,000 చెబుతున్నారు! పంజాబ్ కళాకారులు తయారు చేసిన వుడ్ కారి్వంగ్ ఉత్పత్తలు కళ్లు చెదిరే కళతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. వీటి ధరలు రూ.100 నుంచి 50వేల వరకు అందుబాటులో ఉన్నాయి. హోమ్‌డెకార్ ఉత్పత్తులు, క్యాండిల్ స్టాండ్, టేబుల్స్, డిజైనింగ్ పిల్లర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైన్ నేర్చుకున్నా. సొంత బ్రాండ్‌తో ఉత్పత్తులు తయారు చేసి అమ్మకాలు జరుపుతున్నా. నగరవాసుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. మరిన్ని ప్రత్యేక డిజైన్లతో వినూత్న ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చి అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నా. – నిషిగంధ బారువా, నిఫ్ట్ లెదర్ ఫ్యాషన్ డిజైనర్, అస్సోం. గృహాలంకరణ ప్రత్యేకం.. వెస్ట్‌బెంగాల్ కళాకారులు స్పాంజ్ వుడ్‌వర్క్ ఉత్పత్తులను ప్రత్యేకంగా తయారు చేస్తారు. వీటిని నగరవాసులు విరివిగా కొనుగోలు చేస్తున్నారు. గృహాలంకరణకు ఇవి అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంటి ముందు లాన్, పార్కులో కావాల్సిన ప్రత్యేక డిజైన్స్ తయారు చేసి ఇస్తాము. మా స్టాల్స్‌లో ఉత్పత్తులు రూ.2వేల నుంచి 8వేల వరకు అందుబాటులో ఉన్నాయి. – సమీర్ కుమార్ షా, కళాకారుడు, వెస్ట్‌బెంగాల్. ఒక్కో డిజైనింగ్‌కు నెలల సమయం.. పనిలో నైపుణ్యం కలిగివున్నప్పుడే వుడ్ కార్వింగ్ చేయగలం. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు అద్భుతమైన డిజైన్లను అందిచాల్సి ఉంటుంది. ఒక్కో కార్వింగ్ ఫ్రేమ్, ఒక్కో డిజైన్ బట్టి కొన్ని నెలల సమయం పడుతుంది. అందంగా కార్వింగ్ చేసినప్పుడే అమ్మకాలు జోరందుకుంటాయి. ఆయా ఉత్పత్తులకు డిమాండ్ కూడా ఉంటుంది. – కమల్జిత్ మాతరో, పంజాబ్ కళాకారుడు

ఇంటిని నడిపే ఆమెకు నడుము నొప్పి..!
ఈ రోజుల్లో నడుమునొప్పి సాధారణంగా కనిపించే సమస్య.అయితే మహిళల్లో రోజువారీ పనుల వల్ల నడుమునొప్పివచ్చే అవకాశాలు మరింత ఎక్కువ.ఉదాహరణకు వాళ్లు రోజంతా నిలబడి వంట చేయడం లేదా బట్టలు ఉతకడం లేదా రొట్టెల కర్ర (బేలన్)తో రోటీలు తయారు చేయడం నడుమును చాలాసేపు అదేపనిగా ముందుకు వంచి ఆ పనులు చేయాల్సి రావడం వంటి కారణాలతో వారిలో నడుమునొప్పి ముప్పు మరింత ఎక్కువ. దీనికితోడు మహిళల్లో ప్రతి నెలా రుతుస్రావం నొప్పి వారి నడుము నొప్పిని మరింతప్రభావితం చేస్తుంది. ఇలాంటి అనేక కారణాలతో పురుషులతో పోలిస్తే మహిళల్లో కాస్త ఎక్కువగానే కనిపించే నడుము నొప్పులు, వాటికి కారణాలూ, వాటి పరిష్కారాలేమిటో తెలుసుకుందాం...పురుషులతో పోలిస్తే మహిళల్లో స్రవించే హార్మోన్లు కాస్త ప్రత్యేకంగానూ, సంక్లిష్టంగానూ ఉంటాయి. ఈ హార్మోన్లు సైతం వాళ్లలో నొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంటాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. పురుషుల్లో కంటే మహిళల్లో ఇన్ఫ్లమేషన్ (నొప్పి, వాపు, మంట)కు స్పందించడం కాస్తంత తీవ్రంగా ఉంటుందనే అంశం కూడా ఇందుకు మరో కారణం. ఈ కారణం వల్లనే... పురుషుల్లో మహిళల్లో ఒకేలాంటి నొప్పి వస్తున్నప్పటికీ... మహిళల్లో ఆ నొప్పి తాలూకు తీవ్రత కాస్తంత ఎక్కువగానే ఉంటుందని ఇటీవలి కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇలా మహిళల్లో హార్మోన్లు, వారికే ప్రత్యేకమైన కొన్ని జన్యువులు, వారి మనస్తత్వం, నొప్పిని తెలిపే వ్యవస్థ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు మహిళల్లో నడుమునొప్పి తీవ్రత పురుషుల్లో కంటే ఎక్కువే.వైద్యపరమైన కారణాలతో నడుము నొప్పుల్లో కొన్ని...టెయిల్‌బోన్ పెయిన్ : మనం కుదురుగా కూర్చున్నప్పుడు సరిగ్గా మన నడుము కింద... పిరుదుల మధ్యగా కాస్తంత పైభాగంలో నొప్పి వస్తుంటే దాన్ని ‘టెయిల్‌బోన్ పెయిన్’గా చెప్పవచ్చు. అంటే ఇది సరిగ్గా వెన్నుపూసల్లోని చివరి ఎముక దగ్గర వచ్చే నొప్పి. వైద్యపరిభాషలో దీన్ని ‘కాక్సిడైనియా’ అంటారు. పురుషులతో ΄ోలిస్తే ఇది మహిళల్లో ఐదు రెట్లు ఎక్కువగా కనిపిస్తుంటుంది. దాంతో΄ాటు మహిళల్లో గర్భధారణ అంశం కాక్సిడైనియా ముప్పును మరింత పెంచుతుంది. అందుకే పురుషల కంటే మహిళల్లో ఇది ఎక్కువ.ఆస్టియోఆర్థరైటిస్ : ఇది కీళ్ల అరుగుదలతో వచ్చే నొప్పి. రెండు ఎముకలు కలిసే జాయింట్లలోని ఎముక అరిగినప్పుడు వచ్చే నొప్పి ఇది. నడుముభాగంలోని ఎముకల అరుగుదల కారణంగా ఈ తరహా నడుమునొప్పి వస్తుంది. ఇదే తరహాలో మోకాలు, తుంటి భాగంలో కీళ్లు (జాయింట్లు) అరిగినప్పుడు వచ్చే నొప్పిలాగే నడుము ప్రాంతంలోని ఈ నొప్పి వస్తుంటుంది.శాక్రో ఇలియాక్ జాయింట్ సమస్యలు : శాక్రమ్, ఇలియాక్ అనే ఎముకలు వెన్నెముక చివరి భాగంలో ఉంటాయి. శాక్రమ్ అనే వెన్నెముక చిట్టచివరి ఎముక (టెయిల్‌బోన్)ను తుంటితో కలుపుతూ... ఈ ఎముకలు పిరుదులకు ఇరువైపులా కొద్దిగా విస్తరించినట్లుగా ఉంటాయి. ఈ భాగంలో ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు నడుము కింద భాగంతో పాటు కాళ్లలోకి సైతం పాకుతున్నట్లుగా నొప్పి వస్తుంటుంది. మహిళల్లో గర్భధారణ అంశం ఈ నొప్పిని మరింత ప్రభావితం చేస్తుంది. దాంతో ఈ తరహా నొప్పి మహిళల్లో మరింత ఎక్కువగా కనిపిస్తుంటుంది.కంప్రెషర్ ఫ్రాక్చర్ : ఇది వెన్నెముకల్లోని వెన్నుపూసల్లో ఏదైనా ఎముక విరిగినప్పుడు వచ్చే నొప్పి. అనేక వెన్నుపూసలు (అంటే వెన్నులోని చిన్న చిన్న ఎముకలు) కలుస్తూ చక్కగా అమరి΄ోతూ... ‘ఎస్’ ఆకృతిలో ఒకే ఎముకలా కనిపించే వెన్నెముక ఏర్పడుతుందన్న విషయం తెలిసిందే. ఆస్టియో΄ోరోసిస్గా లేదా ఇతరత్రా ఏదైనా కారణం వల్ల ఈ వెన్నపూసల్లోని ఏదైనా ఎముక విరిగినప్పుడు తీవ్రమైన నడుమునొప్పి వస్తుంది. ఇలా జరగడాన్ని కంప్రెషర్ ఫ్రాక్చర్ అంటారు. ఈ కంప్రెషన్ ఫ్రాక్చర్స్‌కు స్త్రీ, పురుషులిరువురిలోనూ అవకాశమున్నప్పటికీ... పురుషుల్లో కంటే మహిళల్లో ఇవి రెండు రెట్లు ఎక్కువ.ఫైబ్రోమయాల్జియా : కండరాల్లో నొప్పుల కారణంగా వచ్చే ఈ తరహా నొప్పి వెన్ను కింది భాగంతో ΄ాటు పైభాగంలో కూడా కనిపించవచ్చు లేదా నడుము భాగంలో ఎక్కడైనా రావచ్చు. ఇది కూడా మహిళ్లోనే ఎక్కువ. పురుషులతో ΄ోలిస్తే మహిళల్లో కనిపించే యాంగై్జటీ ఈ నొప్పులకు కారణమవుతుంటుంది.నివారణ / చికిత్స...నడుమునొప్పితో బాధపడుతున్న మహిళలు ముందుగా అది ఏ కారణంగా వస్తున్నదో తెలుసుకోవాలి. ఆ నిర్దిష్టమైన కారణాన్ని బట్టి, దానికి అవసరమైన నిర్దిష్టమైన చికిత్స అందించడం లేదా తొలిదశల్లో నివారణ మార్గాలను అనుసరించడం ద్వారా నడుమునొప్పి నుంచి దూరం కావచ్చు. అవి... ఫిజియోథెరపిస్ట్ సహాయంతో అవసరమైన వ్యాయామాలు చేయడం తొలిదశల్లో (ఇంటర్‌ఫెరెన్షియల్ థెరపీ) ఐఎఫ్‌టీ వంటి ప్రక్రియలతో చేసే చికిత్సలూ ఉపశమనాన్ని కలిగిస్తాయి. టెన్స్ అనే చికిత్స కూడా ఇలాంటిదే. ట్రాన్స్క్యుటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్ అనే మాటలకు సంక్షిప్త రూపమే ఈ ‘టెన్స్’. ఈ చికిత్స ప్రక్రియలో ఎలక్ట్రోడ్ల సహాయంతో చిన్న చిన్న విద్యుత్ ప్రకంపనలను చర్మం కిందికి పంపుతారు. దాంతో తగిన ఉపశమనం కలుగుతుంది. (అయితే గర్భవతులు, మూర్ఛతో బాధపడే రోగులు, గుండెజబ్బులు ఉన్నవారు లేదా గుండె సమస్యను చక్కదిద్దడానికి పేస్‌మేకర్ అమర్చిన వాళ్లకు టెన్స్ చికిత్స ఎంతమాత్రమూ సరికాదు. అందుకే ఇలాంటి చికిత్సలు పూర్తిగా వైద్యనిపుణుల పర్యవేక్షణలోనే సాగాలి). తక్షణ నొప్పి నివారణ కోసం : నొప్పిని తాత్కాలికంగా తగ్గించడం కోసం నొప్పి నివారణ మందులు (పెయిన్ కిల్లర్స్) అందుబాటులో ఉన్నా... ఇవి కేవలం తక్షణ నొప్పి నివారణ కోసమే పనికి వస్తాయి. నడుమునొప్పి లేదా వెన్ను నొప్పి లేదా మెడనొప్పి లాంటి సమస్య ఏదైనా ఉన్నప్పుడు దాని శాశ్వత నివారణ కోసం నొప్పి నివారణ మందులను వాడటాన్ని పూర్తిస్థాయి చికిత్సగా పరిగణించకూడదు. పైగా నొప్పి నివారణ మందులను దీర్ఘకాలం వాడటం వల్ల జీర్ణవ్యవస్థపై దుష్ప్రభావం చూపవచ్చు. అందునా మరీ ముఖ్యంగా కాలేయంతో పాటు మూత్రపిండాల వంటి కీలకమైన అవయవాలు దెబ్బతినవచ్చు. అందుకే నడుమునొప్పి లాంటివి వస్తున్నప్పుడు రెండు వారాలకు మించి నొప్పి నివారణ మందులు తీసుకోవడం సరికాదు. దీనికి బదులు ఉపశమనం కోసం పైపూత మందులు (టాపికల్ మెడిసిన్స్) వాడటం మేలు. అయితే ఇందుకోసం కొన్ని ఆయిల్స్‌తో మసాజ్ చేస్తుంటారు. తొలుత నొప్పిని ఉపశమింపజేసే నూనెలతో మసాజ్‌లు చేయడం మంచిదే. మసాజ్‌లో భాగంగా నిపుణులు రుద్దడం, నొక్కడం, కొన్ని నిర్దిష్టమైన చోట్ల ఒత్తిడి కల్పించడం... అంటే రోలింగ్, నీడింగ్, అప్లయింగ్ ప్రెషర్ వంటివి చేస్తుంటారు. అలా నొప్పి ఉన్న భాగాల్లో రక్తప్రసరణ బాగా అయ్యేలా చేస్తారు. ఫలితంగా అక్కడి కండరాల్లో ఒత్తిడి తగ్గడం లేదా పట్టివేసిన కండరం వదులు కావడం వల్ల నొప్పి ఉపశమిస్తుంది. అయితే... ఇలా ఆరు వారాల కంటే ఎక్కువగా చేసినప్పటికీ నొప్పి కొనసాగుతూ ఉంటే మాత్రం ఒకసారి డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. అలాగే 20 ఏళ్ల లోపు వాళ్లలో నడుము నొప్పి కనిపిస్తే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి.పై మార్గాలతో అంతగా గుణం కనిపించనప్పుడు ఎముకల వైద్య నిపుణులు లేదా న్యూరోసర్జన్లు లేదా స్పైన్ సర్జన్ల సహాయంతో అవసరమైన శస్త్రచికిత్స చేసి సమస్యను పరిష్కరించే అవకాశముంది.పోష్చర్ పరంగా... పక్కలకు అకస్మాత్తుగా ఒంగడం లేదా ఒక పక్క బరువును అపసవ్యంగా మోయడం వల్ల : మహిళలు తమ రోజువారీ పనుల్లో భాగంగా బిందెల వంటి బరువులు ఎత్తే సమయంలో, లేదా పిల్లలను అలాగే బిందెలను కూడా ఒకవైపున చంకలో మోసే సమయంలో నడుముఒంపు మీద బరువు ఆనించి చాలాసేపు అదేపనిగా నడవడం, బరువు మోస్తుండటం వంటి పనులు చేస్తుంటారు. ఇలా చాలాసేపు అవసవ్య భంగిమలో, అందునా బరువు మోస్తూ ఉండటం వంటి అంశాలు కూడా నడుమునొప్పికి కారణమవుతాయి. అలాగే ఇల్లు తుడిచే సమయంలో కొందరు కింద కూర్చొని తడిగుడ్డతో ఫ్లోర్ తుడుస్తుంటారు. దీనివల్ల తరచూ కూర్చోవడం, లేవడం వంటి పనులతోనూ అలాగే కొన్నిసార్లు అదేపనిగా నడుము ఒంచి ఒకేభంగిమలో చాలాసేపు ఉండటం వంటివి చేస్తుంటారు. ఫలితంగా నడుము నొప్పి రావచ్చు. ఇలాంటి సమయాల్లో లాంగ్ హ్యాండిల్ మాప్లు వాడుతూ నిటారుగా నిలబడే వాటిని వాడుతూ ఫ్లోర్లు తుడవటం లాంటి జాగ్రత్తలతో నడుమునొప్పిని నివారించుకోవచ్చు. ఇక వారు అనేక పనుల్లో భాగంగా అకస్మాత్తుగా ముందుకు వంగాల్సిరావడం లేదా పక్కలకు తిరగాల్సిరావడం, ఏవైనా బరువులు ఎత్తేందుకు గబుక్కున ముందుకు ఒంగడం లాంటివి చేస్తుంటారు. ఈ అంశాలు కూడా నడుము నొప్పికి కారణం కావచ్చు. వారు ఏదైనా బరువును (అంటే... బిందె, కుండ లేదా బస్తాల వంటి బరువులు) ఎత్తే సమయంలో ముందుకు ఒంగి కాకుండా...మెల్లగా కూర్చొని నెమ్మదిగా ఎత్తుకోవడం మేలు. ఇక ఆఫీసుల్లో పనిచేసే చోట్ల మహిళల్లో ముందుకు వంగి కంప్యూటర్లోకి చూస్తుండటం వల్ల కూడా నడుము నొప్పి రావచ్చు. అందుకే కంప్యూటర్ వంటివి చూస్తున్నప్పుడు నడుమును వీలైనంత నిటారుగా ఉంచడం మంచిది.చాలాసేపు నిలబడి ఉండే వాళ్లలో నడుము నొప్పి... కొన్ని వృత్తుల్లో ఉండేవారు ఉదాహరణకు ట్రాఫిక్ విభాగంలో పనిచేసే మహిళా పోలీసులు, బస్ కండక్టర్లు, షాపుల్లో పనిచేసే సేల్స్ గర్ల్స్ అదేపనిగా చాలాసేపు నిలబడే ఉంటారు. ఒక్కోసారి దాదాపు ఐదారు గంటల పాటు కూడా వారు నిలబడే ఉండాల్సి రావచ్చు. ఇలాంటి వాళ్లలో నడుమునొప్పి రావడంతోపాటు కాళ్లలోని ఎముకలు, కండరాలు దెబ్బతిని ‘మస్క్యులో స్కెలెటల్ డిజార్డర్స్’ వంటివి వచ్చే అవకాశాలెక్కువ. అలాగే చాలాసేపు నిలబడి ఉండటం వల్ల వచ్చే స్వల్పకాలిక సమస్యలైన కాళ్లలో తిమ్మిర్లు (క్రాంప్స్) వంటివీ రావచ్చు. ఒక్కోసారి నడుమునొప్పితోపాటు ఈ క్రాంప్స్ వంటివి వచ్చినప్పుడు వాళ్ల పరిస్థితి మరింత దుర్భరమవుతుంది. అందుకే చాలాసేపు నిలబడే ఉండే వృత్తుల్లో ఉండేవారు తరచూ కాస్తంత సేపు బ్రేక్ తీసుకోవడం వంటివి చేస్తూ ఉండాలి. కొంతసేపు కూర్చొని వచ్చి మళ్లీ నిలబడి తమ వృత్తిని / పనులను కొనసాగించాలి. నిలబడి ఉన్నప్పుడు కూడా అదేపనిగా చాలాసేపు నిటారుగా ఉండకుండా తరచూ పోష్చర్‌లో తరచూ కాస్తంత మార్పులు చేస్తూ ఉండాలి. ఒక వంట వండుతూ ఉండే సమయాల్లో కూడా మహిళలు వంట ప్లాట్‌ఫారమ్ దగ్గర చాలాసేపు నిలబడే ఉండాల్సి వస్తుంటుంది. ఇలాంటి సమయాల్లో వారు తమ ఎత్తునకు అనుగుణంగా ప్లాట్‌ఫారమ్ అమర్చుకోవడం, అప్పుడప్పుడూ కూర్చోడానికి ఎత్తైన లాంగ్ స్టూల్‌ను వేసుకోవడం మంచిది. దాని కాళ్ల దగ్గర ఫుట్‌రెస్ట్ చేసుకోవడానికి అనుగుణంగా అడ్డుపట్టీలు ఉండేలా చూసుకుంటూ, కూర్చున్నప్పుడు మీ కాళ్లు ఆ అడ్డుపట్టీలపైన ఉండేలా చూసుకుంటే నడుముపై భారం తగ్గి నడుమునొప్పి నివారించడానికి ఆ అంశాలు తోడ్పడుతుంటాయి. నడుమునొప్పిని నివారించే ఆహారం... చాలామందికి తెలియని విషయం, ఆశ్చర్యం కలిగించే సంగతేమిటంటే... వెన్ను ఆరోగ్యానికి తగినంత వ్యాయామంతోపాటు పోషకాహారం కూడా అవసరమే. ఆ ఆహారం ఎన్నో గాయాలను త్వరగా మాన్పి... వెన్నునొప్పులను నివారిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎముక సాంద్రత తగ్గకుండా చేయడం ద్వారా నడుమునొప్పి రాకుండా చేస్తుంది. ఇందుకు మీ ఆహారంలో ఉండాల్సిన పోషకాలు ఏమిటంటే... కాల్షియమ్: కాల్షియమ్ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం బాగుంటుంది. పాలు, పాల ఉత్పాదనలైన పెరుగు, వెన్నతోపాటు ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, చేపలలో క్యాల్షియమ్ ఎక్కువ. విటమిన్ డి3 : మన ఒంట్లోకి వచ్చే క్యాల్షియమ్ ఎముకల్లోకి ఇంకేలా చేసి, వాటి ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో విటమిన్–డి బాగా సహాయపడుతుంది. స్వాభావికమైన ఎండ (నేచురల్ సన్‌లైట్)తోపాటు సాల్మన్ వంటి చేపలు, కాలేయం, గుడ్డు వంటి ఆహారాల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.విటమిన్–సి : చిగురు ఎముకలో ఉండే కొలాజెన్ వంటివి ఏర్పరచడంలోనూ, ఎముకలు, కండరాలు, చర్మం, టెండన్ల ఆరోగ్యాన్ని కా΄ాడటంలో విటమిన్–సి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అన్ని రకాల నిమ్మజాతి పండ్లతోపాటు టొమాటో, కాప్పికమ్ వంటి కూరల్లో ఇది ఎక్కువ. అలాగే గాయాలను మాన్పడం, ఏవైనా గాయాలైనప్పుడు దెబ్బతినే భాగాలను సత్వరం రిపేర్ చేయడానికి ప్రోటీన్లు చాలా అవసరం. మాంసాహారం, పప్పులలో ప్రోటీన్లు ఎక్కువ. విటమిన్–బి12 : మన శరీరంలోని ఎముకలను నిర్మించే కణాల రూపకల్పనకు విటమిన్ బి12 చాలా అవసరం. అన్ని రకాల చేపలు, మాంసంతోపాటు తాజా పండ్లు, ఆకుకూరలు, పౌల్ట్రీ ఉత్పాదనల్లో బిటమిన్–బి 12 ΄ాళ్లు ఎక్కువ.డ్రైవింగ్ – నడుమునొప్పి...వాహనాలు నడపడానికీ, నడుమునొప్పికీ చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. వాహనాన్ని నడిపే చాలామందిలో కొంతకాలం తర్వాత నడుము నొప్పి రావడం చాలా సాధారణంగా కనిపించే అంశం. చాలాకాలం పాటు వాహనం నడిపేవారిలో వెన్నెముక కారు సీటుకు అనుగుణంగా అలా నిర్దిష్టమై ఒంపులా ఒంగి ఉండటంతో వెన్నెముకలోని వెన్నుపూసలు ప్రభావితమవుతాయి. అదీగాక వాహనం నడిపే సమయంలో కలిగే కుదుపుల వల్ల ఈ వెన్నుపూసలు ప్రభావితమవుతాయి. దాంతో చాలాకాలంపాటు వాహనాలు నడిపేవారిలో నడుమునొప్పి వచ్చే అవకాశాలెక్కువ. కార్స్ లేదా ఇతరత్రా ఫోర్‌వీలర్స్ విషయంలో నడుమునొప్పికి కారణమయ్యే కొన్ని అంశాలను చూద్దాం. ఇటీవల కొన్ని కార్లలోని పైకప్పు (రూఫ్) చాలా కిందికి ఉంటోంది. అలాగే డ్రైవింగ్ సీట్లో కూర్చునేవారి సౌకర్యం కోసం సీట్‌ను వెనకవైపునకు బాగా కిందికి దిగి ఉంచేలా చేస్తారు. డ్రైవింగ్ చేసేవారు తమ కాళ్లను తగినంతగా చాపి ఉంచేలా చూసుకోవడం కోసం సీట్‌ను వెనక్కి వాలేలా చూస్తారు. దాంతో డ్రైవింగ్ సీటులో నిటారుగా కూర్చోవడమన్నది దాదాపుగా జరగదు. ఫలితంగా వెన్ను మీద ప్రత్యేకంగా నడుము మీద ఒత్తిడి చాలా ఎక్కువ. ఇలా సీట్‌ను వెనక్కు వంచినప్పుడు మళ్లీ కారు ముందరిభాగంలో స్పష్టంగా చూడటం కోసం మెడను ముందుకు వంచడంతో మెడ 20 డిగ్రీలు ముందుకు వస్తుంది. దాంతో నడుము అంతా ఒక భంగిమలోనూ, మెడ మరో భంగిమలో ఒంగుతాయి. ఈ అపసవ్యతల కారణంగా డ్రైవింగ్ చేసేవారిలో చాలా తరచుగా వెన్ను నొప్పి / నడుమునొప్పి వస్తుంటాయి. కార్ డ్రైవింగ్‌తో వచ్చే నడుము నొప్పి నివారణకు సూచనలు:మీ తొడలకు సీట్ సపోర్ట్ వీలైనంత ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అంటే తొడల నిడివిలో అవి ఎక్కువ భాగం సీట్‌పైనే ఉండేలా చూసుకోవాలి బ్రేక్, క్లచ్ వంటివి మీ కాళ్లు ఆనే చోటికి మరీ దూరంగా ఉండేలా కూర్చోవడం సరికాదు. అవి సరిగ్గా కాళ్ల చివరలో అందుబాటులో ఉండాలి మీ కాళ్ల పోడవుకు అనుగుణంగా సీట్‌ను మీకు సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి మీ ఎత్తుకు అనుగుణంగా సీట్ ఎత్తును అడ్జెస్ట్ చేసుకోవాలి ∙మీ సీట్‌ను వీలైనంత మేరకు నిటారుగా ఉంచేలా చూసుకోవాలి లేదా అది మీకు మరీ ఇబ్బందిగా ఉంటే కేవలం కొద్దిగా మాత్రమే వెనక్కు వాలేలా సీట్ వంచాలి. ఆ సీట్ ఒంపు ఎంత అవసరం అంటే... ఆ ఒంపు మీ నడుము మీదగానీ మీ మోకాళ్ల మీద గానీ ఒత్తిడి పడనివ్వని విధంగా సౌకర్యంగా ఉండాలి మీ నడుము దగ్గర ఉండే ఒంపు (లంబార్) భాగంలో ఒక కుషన్ ఉంచుకోవాలి. ఆ లంబార్ సపోర్ట్ వల్ల నడుమునొప్పి చాలావరకు తగ్గుతుంది ∙మెడ మీద ఒత్తిడి పడని విధంగా మీ హెడ్రెస్ట్ ఉండాలి.సీట్లో చాలాసేపు ఒకే భంగిమలో కూర్చొని ఉండకూడదు. అప్పుడప్పుడూ మీ పొజిషన్ కాస్త మారుస్తూ ఉండాలి ∙అదేపనిగా డ్రైవ్ చేయకుండా మధ్య మధ్య కాస్త బ్రేక్ తీసుకుంటూ ఉండాలి ∙ఇక డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడమన్నది అన్ని విధాలా మేలు చేస్తుందని గుర్తుంచుకోవాలి. మోటార్ సైకిల్ విషయంలో... ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు బైక్‌లు నడిపే అమ్మాయిల సంఖ్య చాలా ఎక్కువ. సాధారణంగా బైక్‌ల తయారీదారులు హ్యాండిల్‌బార్స్, ఫుట్‌రెస్ట్ వంటి అంశాల్లో కొన్ని ప్రమాణాలను పాటిస్తుంటారు. మీ బైక్ ఆ ప్రమాణాలకు అనుగుణంగా తయారైనదైతే మంచిదే. వాటిని అనుసరించడం వల్ల కొన్ని అవయవ సమస్యలుగానీ నొప్పులుగానీ రావు. ఒకవేళ మీ బైక్‌లోని వివిధ అంశాలు సరైన ప్రమాణాలు లేక΄ోతే వాటివల్లనే మీకు నడుము నొప్పి వస్తోందని భావించాలి. మీరు మీ బైక్ విషయంలో ఈ కింద పేర్కొన్న అంశాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. బైక్‌ల హ్యాండిల్స్ సాధారణంగా తగినంత విశాలంగా, రెండు చేతులతో సౌకర్యంగా పట్టుకోవడానికి వీలైనంత నిడివితో ఉండాలి. పొట్టిగా ఉండే షార్ట్‌హ్యాండిల్స్ వల్ల ఒంటిపై భారం పడి శరీరభాగాల్లో ముఖ్యంగా నడుమునొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ మనం కాళ్లు పెట్టుకునే ఫుట్‌రెస్ట్ మన శరీరానికి మరీ దూరంగా ఉండకూడదు. దీనివల్ల కాళ్లు సాగినట్లుగా అయి΄ోయి నడుముపై భారం ఎక్కువగా పడుతుంది. దాంతో నడుమునొప్పి రావచ్చు బైక్‌పై కూర్చొనే సమయంలో వీపు భాగమంతా నిటారుగా ఉండి, మన వెన్ను ఒంగకుండా ఉండాలి. సాధారణ బైక్‌ల నిర్మాణం ఇలాగే ఉంటుంది. కానీ కొన్ని స్పోర్ట్స్ బైక్‌లలో సీట్లు ఏటవాలుగా ఉండి, మనం కూర్చొనే భంగిమ ముందుకు వాలినట్టుగా ఉండేలా అమరి ఉంటాయి. దాంతో బాగా ముందుకు వాలిపోతునట్లుగా కూర్చోవాల్సి వస్తుంది. ఇలా రూపొందించిన ఫ్యాషన్ బైక్స్ వల్ల మన వెన్ను నిటారుగా నిలపలేకపోవడంతో వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ బైక్‌లపై వెళ్లేవారు వీపుపై ఉండే బ్యాగ్స్ (బ్యాక్‌ప్యాక్స్ / ల్యాప్‌టప్ బ్యాగ్స్) పెట్టుకొని వెళ్తుండటం సాధారణం. ఈ భారం నడుంపైనా భారం పడటం వల్ల కూడా నొప్పి రావచ్చు. అందువల్ల ఆ బ్యాగ్ భారం వీపుపై కాకుండా సీట్‌పై పడేలా చూసుకోవాలి. మీ బైక్‌లో పైన పేర్కొన్న భాగాల అమరిక, మీరు కూర్చొనే భంగిమ ఎలా ఉందో పరీక్షించుకొని, లోపాలు ఉన్నట్లయితే సరిచేసుకోవాలి. దాంతో నొప్పి దూరం కావచ్చు. అప్పటికీ నడుం నొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ సుధీర్ రెడ్డి, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ (చదవండి: Shubhanshu Shukla: స్పేస్‌లో వ్యోమగాములు ఫిట్నెస్ను ఎలా నిర్వహిస్తారంటే..! )

sagubadi: గడ్డి సాగుతోనే అధికాదాయం!
రైతు కుటుంబాలకు పంటలపై వచ్చే ఆదాయంతో పోల్చితే, పశుపోషణ ద్వారా సమకూరే నిరంతర ఆదాయం చాలా ఎక్కువ. చిన్న, సన్నకారు రైతులు తమ పశువులకు గడ్డిని, దాణాను సరిపడా అందించలేకపోతు న్నారు. అందువల్లే మన దేశంలో పశువుల ఉత్పాదకత బాగా తక్కువగా ఉంది. పశువుల్ని పెంచే ప్రతి రైతూ కొన్ని సెంట్లు/ కొన్ని కుంటల్లో అయినా గడ్డిని కూడా పెంచుకోవాలి. సైలేజి గడ్డి, దాణాలను తానే తయారు చేసుకొని పశువులను మేపుకుంటే పశుపోషకులకు అధికాదాయంతో పాటు, ప్రతిరోజూ ఆదాయం వస్తుందని గుర్తించాలని సూచిస్తున్నారు పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (పీవీఎన్ఆర్టీవీయూ) వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ మంథా జ్ఞాన ప్రకాశ్. వాతావరణ మార్పుల నుంచి జన్యుపరమైన అభివృద్ధి వరకు అనేక కీలకాంశాలపై ఆయన ఇటీవల ‘సాక్షి సాగుబడి’తో ముచ్చటించారు. ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు..క్లైమేట్ ఛేంజ్ ప్రతికూల పరిస్థితులు పశుపోషణపై ఎటువంటి ప్రభావం చూపుతున్నాయి? ప్రొ. జ్ఞాన ప్రకాశ్: క్లైమేట్ ఛేంజ్ సెగ ఇప్పుడు మనకు విపరీతంగా అనుభవంలోకి వస్తోంది. సాధారణ ప్రజలకు కూడా ఈ సమస్య ఇప్పుడు అర్థమవుతోంది. ఇక్కడ కుండపోత వర్షాలు, టెక్సాస్‌లో కరువు, మరోచోట అధిక ఉష్ణంతో మంచు కరిగిపోవటం ఇవన్నీ క్లైమేట్ ఛేంజ్ వల్ల జరుగుతున్నవే. పశువుకు గానీ.. మనిషికి గానీ.. ప్రతి ప్రాణికీ అనువైన ఉష్ణోగ్రత రేంజ్ ఒకటి ఉంటుంది. ఆ కంఫర్ట్ జోన్లోనే అది సరిగ్గా పనిచేయగలదు. పాలు, మాంసం వంట ఉత్పత్తుల్ని సరిగ్గా ఇవ్వగలదు. కానీ, ఉష్ణోగ్రత అంతకన్నా పెరిగినప్పుడు దాని జీవక్రియలన్నీ ఇబ్బంది పడతాయి. రావలసినటు వంటి ఉత్పత్తి రాదు. ఇంకొకటేమిటంటే.. పశుగ్రాసం కూడా పొలాల్లో సరిగ్గా పెరగదు. రోగకారక క్రిముల తీవ్రత పెరుగుతుంది. ఎప్పుడో పోయిన క్రిములు కూడా మళ్లీ సమస్య అయ్యే అవకాశం ఉంటుంది. క్లైమేట్ ఛేంజ్ నుంచి మన జీవరాశిని, గడ్డి జాతులను పరిరక్షించుకోవాల్సి ఉంటుంది. భూతాపోన్నతి ప్రతికూలతల నుంచి పశు సంపదను ఎలా రక్షించుకోగలం?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవటానికి ఉపయోగపడే కొన్ని రకాల జన్యువులు ప్రతి ప్రాణిలో ఉంటాయి. ఆ జన్యువులపై పరిశోధనలు చేసి గుర్తించి, జన్యుపరంగా అభివృద్ధి చేయటం ద్వారా పెరిగిన ఉష్ణోగ్రతల్లోనూ అవి మంచి ఉత్పాదకతను ఇచ్చేలా మార్చుకోవచ్చు. 37 డిగ్రీల సెల్సియస్ దగ్గర కంఫర్టబుల్‌గా ఉండే జంతువును 39 డిగ్రీల దగ్గర కూడా కంఫర్టబుల్‌గా ఉండేలా జన్యుపరంగా అభివృద్ధితో చేసుకోవచ్చు. అసాధారణ ఉష్ణోగ్రతలతో ఏయే పశుజాతులకు ఎక్కువ ఇబ్బంది?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగ్గానే ముందు గేదెలకు ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. పునరుత్పత్తి సమస్యలు పెరుగుతాయి. దేశవాళీ ఆవుల కన్నా చల్లటి విదేశాల నుంచి తెచ్చిన జాతుల ఆవులకు పెరిగిన ఉష్ణోగ్రతల్లో మరీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి, పెరుగుతున్న ఉష్ణోగ్రత ల్లోనూ సజావుగా బతకగలిగేలా మన గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెల్లో జన్యుపరమైన సామర్థ్యం పెంపొందించుకోవాలి. భూతాపోన్నతికి పశువులు కూడా కారణం అవుతున్నాయా?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: క్లైమేట్ ఛేంజ్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందుకు పశువులు కూడా కారణం అవుతున్నాయి. ఆవులు, గేదెలు, గొర్రెలు.. వీటి కడుపులో సూక్ష్మజీవుల ద్వారా జరిగే జీర్ణప్రక్రియ (మైక్రోబియల్ ఫర్మంటేషన్) వల్ల మీథేన్ వాయువు వెలువడుతుంది. ఇది వాతావర ణాన్ని అధికంగా వేడెక్కించే వాయువు. ఈ సమస్య ను తగ్గించాలంటే.. పశువులకు పెట్టే దాణాను, గడ్డిని తక్కువ మీథేన్‌కు కారణమయ్యేలా మార్చాలి. దాణాలో, పశువు కడుపులోని సూక్ష్మ జీవరాశిని కూడా తక్కువ మీథేన్ ఉత్పత్తి చేసేలా మార్పు చేసుకోవాలి. తద్వారా భూతాపం పెరుగుదలను కొంత మేరకు తగ్గించుకోవచ్చు. పేడ నుంచి కూడా ఉద్గారాలు..?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: పశువుల పేడ వల్ల కూడా వాతావరణంలో మీథేన్ పెరుగుతోంది. దీన్ని కూడా అరికట్టాలి. 2–3 పశువులను పెంచుకునే చిన్న, సన్నకారు రైతులు కూడా మీథేన్‌ను తమ స్థాయిలో నియంత్రించగల పద్ధతులు ఉన్నాయి. పచ్చి పేడను ఆరుబయట వదిలేస్తేనే సమస్య. ఒక చిన్న గుంత తవ్వి అందులో రోజూ వేసి, గుంత నిండిన తర్వాత పైన కొన్ని ఎండు ఆకులు వేసి కప్పిపెట్టాలి. 60 రోజుల్లో మంచి కంపోస్టు ఎరువు తయారవుతుంది. వర్మీకంపోస్టు కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా చేస్తే మీథేన్ చాలా వరకు తగ్గుతుంది. ఈ దిశగా పరిశోధనలు జరుగుతున్నాయా..?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: వాతావరణ మార్పులకు అనుకూలంగా వ్యవసాయం చేయడానికి సంబంధించి ‘నిక్ర’ పేరుతో ఐసీఏఆర్ పరిశోధనా ప్రాజెక్టుల్ని చేపట్టింది. వ్యవసాయం, అనుబంధ రంగాలన్నిటికి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక సంస్థల్లో చేపట్టిన పరిశోధన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. మన పశువుల ఉత్పాదకత తక్కువ ఎందుకని?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: మన దేశంలో పాడి పశువు సగటు పాల దిగుబడి ఒక ఈతలో 1,500–1,700 లీటర్లయితే, ప్రపంచ సగటు 2,700 లీటర్లు. నెదర్లాండ్స్, యూకే, యూఎస్‌లలో ఇంకా చాలా ఎక్కువ. ముఖ్యంగా మన దగ్గర రైతులు చాలా మంది చిన్న, సన్నకారు రైతులు. వీళ్లు తెలిసీ తెలియక, పశువులను సరిగ్గా మేపలేకపోతున్నారు. వాటికి పోషణ సరిగ్గా అందటం లేదు. ఆ దేశాల్లో తక్కువ ఉష్ణోగ్రతలే కారణమా?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం ఒక్కటే కారణం కాదు. అంతకన్నా ముఖ్యమైనది జెనెటిక్ ఇంప్రూవ్మెంట్. అక్కడి పశువులను వాళ్లు జన్యుపరంగా బాగా అభివృద్ధి చేసుకోగలిగారు. మనం చేసుకోలేకపోయాం. జన్యుమార్పిడి(జీఎం) కూడా అవసరమా?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ చాలు. మామూలుగా మన పశువుల్లో ఉన్న మంచి గుణాలున్న జన్యువులనే పెంపొందిస్తాం ఆ జీవిలో. జెనెటిక్ మాడిఫికేషన్ అంటే జంతువుల్లోని జన్యువు లను మార్చేస్తారు. ఒక జన్యువును తీయటం, వేరే దాన్ని పెట్టడం అనేది జెనెటిక్ మాడిఫికేషన్ అంటారు. అది రిస్క్‌తో కూడిన పని. అవసరం లేదు. జీన్ ఎడిటింగ్‌ను ఇప్పుడిప్పుడే వాడుతు న్నారు. ఇవి చాలా వివాదాస్పద అంశాలు.ప్రత్యేక బ్రీడ్ల అభివృద్ధికి కృషి జరుగుతోందా?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవటంలో దేశీ పశువులు మెరుగ్గా ఉంటాయి. అధిక ఉత్పాదకత కోసం సంకరజాతి పశువులను రూపొందించుకున్నాం. హీట్ టాలరెంట్ జన్యువు లను ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. జెనెటిక్ ఇంప్రూవ్‌మెంట్‌పై పరిశోధనలు కొనసాగుతు న్నాయి. పంటల్లో కొత్త వంగడాలు తయారు చేసినంత సులభంగా పశువుల్లో జన్యు అభివృద్ధి జరగదు. పంట కాలం ఆర్నెల్లయితే పశువు ఒక తరం 7–8 ఏళ్లు పడుతుంది. సేంద్రియ పశుపోషణకు ప్రత్యేక బ్రీడ్స్ అవసరమా?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: పశువుల్లో ఆర్గానిక్ బ్రీడ్స్ అంటూ ఏమీ ఉండవు. కొత్త బ్రీడ్ సహజంగా ఎవాల్వ్ కావటానికి కనీసం వందేళ్లు (10–12 తరాలు) పడుతుంది. ఒంగోలు తదితర పశుజాతులన్నీ అనాదిగా ఆర్గానిక్‌గా ఎవాల్వ్ అయినవే. అయితే, పశువుల పెంపకమే ఈ కాలంలో సూక్ష్మ కుటుంబాలకు భారంగా మారింది. గ్రామాల్లో సేంద్రియ ఎరువుల లభ్యత కూడా అంత తేలిక కాదు. ప్రత్యేకంగా గడ్డి పెంపక క్షేత్రాలు నెలకొల్పినప్పుడే గడ్డి కొరత తీరి, పశుపోషణ సజావుగా కొనసాగుతుంది. అప్పుడే పెరిగే జనాభా అవసరాలకు తగిన పాలు, మాంసం లభిస్తాయి. ఆర్గానిక్ పశు ఉత్పత్తులకు విదేశాల్లో గిరాకీ ఉంటుందా?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: అభివృద్ధి చెందిన దేశాల్లో నిబంధనలు కఠినంగా ఉంటాయి. యాంటీబయాటిక్ రెసిడ్యూస్, థెరప్యూటిక్ రెసిడ్యూస్ లేని ఆర్గానిక్ ఉత్పత్తుల ఎగుమతికి కొన్ని పద్ధతులున్నాయి. కొన్ని యాంటీబయాటిక్స్‌ను 2 నెలల ముందే ఆపెయ్యాలి. కొన్నిటిని ఒక రోజు ముందు వరకు ఇవ్వవచ్చు. ఒక్కో మందుకు ఒక్కొక్క టైమ్ ఉంటుంది. పశువులు పెంచే రైతులకున్న ముఖ్యమైన సమస్య ఏమిటి? ప్రొ. జ్ఞాన ప్రకాశ్: గడ్డి భూములు, అడవులు తగ్గిపోవటమే పెద్ద సమస్య. అందువల్ల పశువులను రోజంతా కట్టేసి పెంచాల్సి వస్తోంది. అందువల్ల దాణా, పచ్చి మేత మన పశువులకు సరిపోను అందటం లేదు. పశువుకు ఇచ్చే ఆహారంలో మూడింట రెండొంతులు పచ్చి గడ్డి, ఒక వంతు దాణా కలిపి ఇస్తే ఆరోగ్యం. అయితే, చిన్న, సన్నకారు రైతులు, భూమి లేని రైతులు దాణా, పచ్చిమేత చాలినంత పెట్టలేకపోతున్నారు. పశువుల ఉత్పాదకత తగ్గిపోతోంది. పరిష్కారం ఏమిటి?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: రైతులు కొన్ని సెంట్లు/గుంటల్లో అయినా గడ్డి పెంచుకోవాలి. పాడిపై రైతులకు ఏడాది పొడవునా ఆదాయం వస్తుంది. ఉన్న కొద్దిపాటి పొలంలో ఈ పశువుల కోసం పచ్చి మేతను పండించుకుంటే వచ్చే ఆదాయం కన్నా.. ఆ పొలంలో ఇతర పంటలు వేస్తే వచ్చే ఆదాయం చాలా తక్కువని అధ్యయనాల్లో తేలింది. సైలేజీ గడ్డి, పంట వ్యర్థాలతో దాణాలను సొంతంగా తయారు చేసుకొని వాడుకోవాలి.ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబుఫొటో: ఎస్.ఎస్. ఠాకూర్

మ్యాథ్స్ విత్ ఏఐ పఢాయి... హాయి
‘సైంటిస్ట్ కావాలి’ ‘ఐపీఎస్ ఆఫీసర్ కావాలి’... ఇలా ఆ పిల్లలకు ఎన్నో కలలు ఉన్నాయి. అయితే ఆ కలలకు అడ్డుగోడ గణితంపై వారికి ఉండే భయం. ‘పఢాయి విత్ ఏఐ’ అనే ఏఐ సాంకేతిక కార్యక్రమంతో పిల్లల్లో గణితంపై ఉండే భయాన్ని పోగొట్టింది ఐఏఎస్ అధికారి సౌమ్య ఝా. ‘పఢాయి విత్ ఏఐ’ పుణ్యమా అని పిల్లలకు ఏఐ అంటే భయం పోయింది. నైపుణ్యం సొంతం అయింది.రాజస్థాన్‌లోని టోంక్‌కు చెందిన అమన్ గుజర్ అనే విద్యార్థికి గణితం అంటే వణుకు. చాలా కష్టంగా, ఒత్తిడిగా అనిపించేది. గణితంలో ఎప్పుడూ బొటాబొటీ మార్కులు వచ్చేవి. అయితే అతడి భయానికి ‘పఢాయి విత్ ఏఐ’ ఫుల్స్టాప్ పెట్టింది. గణితం అంటే భయాన్ని పోగొట్టి, ఉత్సాహాన్ని పెంచింది.‘పఢాయి విత్ ఏఐ’ అంటే?అమన్ చదివే స్కూల్లో ‘పఢాయి విత్ ఏఐ’ పేరుతో ఏఐ ఆధారిత విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత క్లిష్టమైన గణిత సమస్యలనైనా సులభంగా అర్థమయ్యేలా విద్యార్థులకు వివరిస్తుంది. ‘గణితం అంటే ఒకప్పుడు ఉండే భయం ఏమాత్రం లేదు. ఇప్పుడు నాకు గణితం అనేది ఒక సబ్జెక్ట్ కాదు. ఆట. గణితంలోనూ మంచి మార్కులు సాధించడం నాకు ఎంతో గర్వంగా ఉంది. నూటికి నూరు మార్కులు తెచ్చుకోవాలనే ఆత్మవిశ్వాసం వచ్చింది’ అంటున్నాడు అమన్.ఐఏఎస్ అధికారి సౌమ్య ఝా ఆలోచన నుంచి పుట్టిందే... పఢాయి విత్ ఏఐ. ఆమె టోంక్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలను సందర్శించినప్పుడు చాలామంది విద్యార్థులు గణితం, సైన్స్ సబ్జెక్ట్‌లలో వెనకబడి ఉన్నారనే విషయాన్ని అర్థం చేసుకుంది. చాలామంది విద్యార్థులు గణితంలో ఎందుకు వెనకబడిపోయారు? అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించింది సౌమ్య. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఎన్నికల డ్యూటీ, రకరకాల ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఉపాధ్యాయులు ఎక్కువ రోజులు బడికి దూరంగా ఉంటున్నారు.స్కూలు విద్యార్థులలో చాలామంది వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు. వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు సహాయం అందించడానికి తరచు బడికి గైర్హాజరు అవుతుంటారు. గ్యాప్ రావడం వల్ల వారికి పాఠాలు అర్థం కావు. ఇలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకొని సాంకేతికతకు మానవ ప్రయత్నాన్ని జోడిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ‘పఢాయి విత్ ఏఐ’ కార్యక్రమానికి రూపకల్పన చేసింది సౌమ్య.ఐఏఎస్ తొలిరోజులలో కొన్ని సబ్జెక్లకు సంబంధించి తాను ఏఐ (ఆర్టిషిఫియల్ ఇంటెలిజెన్స్) సహాయం తీసుకునేది. ఆ విషయం గుర్తు తెచ్చుకొని, ఏ సబ్జెక్ట్ గురించి అయితే విద్యార్థులు భయపడుతున్నారో, ఆ భయాన్ని పోగొట్టడానికి ‘ఏఐ’ని అస్త్రంలా వాడాలని నిర్ణయించుకుంది.గత సంవత్సరం పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమైన ‘పఢాయి విత్ ఏఐ’ని సరికొత్త మార్పులు చేర్పులతో ఈ సంవత్సరం ‘వెర్షన్–2’గా లాంచ్ చేశారు. ఈ అప్‌గ్రేడెడ్ వెర్షన్లో టీచింగ్ క్యాలెండర్, విద్యార్థుల ప్రతిభను మెరుగుపరిచే అత్యాధునిక సాంకేతిక పరికరాలు, ప్రతి వారం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. ‘పఢాయి విత్ ఏఐ’ని టోంక్ జిల్లాలోని 350కి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. విద్యార్థులలో వచ్చిన మార్పు గురించి చాలా సంతోషంగా ఉన్న సౌమ్య ఝా – ‘ఇదేమీ మాయాజాలం కాదు. మానవ ప్రయత్నానికి తోడైన సాంకేతిక అద్భుతం’ అంటుంది.
ఫొటోలు


‘మిరాయ్’ మూవీ సక్సెస్ మీట్లో మెరిసిన శ్రియా శరణ్ (ఫొటోలు)


నవరాత్రులకు సిద్దమైన అమ్మవారి విగ్రహాలు రండి చూసేద్దాం (ఫొటోలు)


విజయవాడలో ‘మిరాయ్’ మూవీ విజయోత్సవం (ఫొటోలు)


నేడు ప్రధాని మోదీ పుట్టినరోజు.. ఈ ఫొటోలు చూశారా..


‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ టీజర్ విడుదల (ఫొటోలు)


హీరో ధనుష్ 'ఇడ్లీ కొట్టు' ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్‌గా బ్రిగిడ సాగా (ఫొటోలు)


సీలేరు అందాలు చూసొద్దాం రండీ..! (ఫొటోలు)


సాగర తీరాన అక్కినేని కోడలు శోభిత ధూలిపాల (ఫొటోలు)


11వ శతాబ్దపు చారిత్రక కట్టడం.. టాలీవుడ్ హీరోయిన్ ఫిదా (ఫొటోలు)


అనసూయ ‘పవర్ డ్రెస్సింగ్’..చీర ఇలా కూడా కడతారా? (ఫోటోలు)
అంతర్జాతీయం

భారీ గ్రహశకలం పలకరించే వేళ..
వాషింగ్టన్: మరో ఖగోళ అద్భుతానికి అంతరిక్షం వేదికకానుంది. ఈ నెలలోనే త్వరలో ఒక గ్రహశకలం సమీపంగా వచ్చి మన పుడమిని పలకరించి వెళ్లనుంది. 2025 ఎఫ్ఏ22 పేరున్న ఈ గ్రహశకలం పథాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ‘నియర్ ఎర్త్ అబ్జెక్ట్ స్టడీస్’ కేంద్రం నుంచి పరిశీలిస్తోంది. దీంతో పాటు అమెరికాలోని క్రిసెంటీ వ్యాలీలోని జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ నుంచీ సైతం దీని గమనాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు నిశితంగా గమనిస్తున్నారు. సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం 8.33 గంటలకు భూమికి అత్యంత చేరువగా ఇది పయనించనుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఆ సమయంలో ఇది కేవలం 8,41,988 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకు పోనుంది. భూమికి ఇంత దగ్గరగా వెళ్తుండటంతో ఖగోళ శాస్త్ర వేత్తలు, అంతరిక్ష ఔత్సాహికుల్లో ఆసక్తి రెట్టింపైంది. అత్యంత శక్తివంతమైన రాడార్లు, ఆప్టికల్ టెలిస్కోప్‌ల సాయంతో దీనిని వీక్షించేందుకు ఉబలాటపడు తున్నారు. ఈ గ్రహ శకలం చుట్టుకొలత 163.88 మీటర్లు. పొడవు 280 మీటర్లు. అంటే ఇది ఢిల్లీలోని ప్రఖ్యాత కుతుబ్ మినార్ కంటే పెద్దది. ఇది 1.85 సంవత్సరాల్లో మన సూర్యుడిని ఒక చుట్టు చుట్టేస్తోంది. భూమికి అత్యంత సమీపంగా దూసుకుపోతున్నప్పటికీ గురు త్వాక ర్షణ ప్రభావ పరిధిలో ఇది లేదు. ఈ గ్రహశకలాన్ని ఈ ఏడాది తొలి నాళ్లలో తొలిసారిగా గుర్తించింది. హవాయీలోని పనోరమిక్ సర్వే టెలిస్కోప్, ర్యాపిడ్ రెస్పాన్స్ సిస్టమ్(పాన్–స్టార్2) ఈ గ్రహశ కలాన్ని మార్చి 29వ తేదీన గుర్తించింది. 2173 సెప్టెంబర్ 21వ తేదీన ఇది భూమికి అత్యంత చేరువగా వచ్చే ప్రమాదముంది.

నేడు భారత్, అమెరికా వాణిజ్యచర్చలు
వాషింగ్టన్: భారత్‌పై అమెరికా 50 శాతం టారిఫ్‌ల భారం మోపడంతో వాటిని తగ్గించుకునేందుకు భారత్ ప్రయత్నాలు ముమ్మరంచేసింది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో అమెరికా అత్యున్నతస్థాయి ప్రతినిధి బృందంతో వాణిజ్య చర్చలు జరపనుంది. ఈ వివరాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వాణిజ్య సలహాదారు పీటర్ నవరో సోమవారం వెల్లడించారు. భారతీయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను భారీగా పెంచడంతో అమెరికాకు భారతీయ సరకుల ఎగుమతులు ఆగస్ట్‌లో తొమ్మిది నెలల కనిష్టానికి పడిపోయిన తరుణంలో ఈ కీలక వాణిజ్య చర్చలు మొదలుకానుండటం గమనార్హం. భారత్, అమెరికా వాణిజ్యచర్చల అంశాన్ని సీఎన్‌బీసీ ఇంటర్వ్యూలో నవరో వెల్లడించారు. భేటీ కచి్చతంగా జరగనుందని భారత్ తరఫున చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న దేశ వాణిజ్యమంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ సైతం చెప్పారు. అమెరికా మధ్య, దక్షిణాసియా వ్యవహారాల వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ సైతం ఈ చర్చల్లో పాల్గొననున్నారు. ‘‘ భారత్ ఎప్పటికైనా అమెరికాతో వాణిజ్య చర్చలపై తుది నిర్ణయం తీసుకోక తప్పదు. లేదంటే వాణిజ్యం అనేది సవ్యంగా సాగదు. టారిఫ్‌ల విషయంలో భారత్ మహారాజు వంటిదే. మా సరకులపై అత్యధిక సుంకాలు మోపుతుంది. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందు వరకు రష్యా నుంచి భారత్ కొనుగోలుచేసిన ముడి చమురు పరిమాణం చాలా అత్యల్పం. కొన్ని చుక్కల ఆయిల్ మాత్రమే కొన్నదేమో. ఇప్పుడేమో భారీఎత్తున కొనగోలుచేస్తూ భారత్ లాభాలను కొల్లగొడుతోంది. రష్యా ఆయిల్ రిఫైనరీ సంస్థలు సైతం భారత్‌కు చమురు అమ్మేసి లాభాల పంట పండిస్తున్నారు. ఈ లాభాలతో ఉక్రెయిన్ యుద్ధాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. ఉక్రెయిన్‌కు సాయపడేందుకు అమెరికా పెద్ద ఎత్తున సొంత ఖజానా కరెన్సీని ఖర్చుచేస్తోంది. అలా అమెరికన్లు పన్నుల రూపంలో అమెరికా ప్రభుత్వానికి చెల్లించిన మొత్తాలన్నీ ఉక్రెయిన్ యుద్ధం కోసం వృథా అవుతున్నాయి’’ అని భారత్‌ను పరోక్షంగా నవరో విమర్శించారు.

‘ఆ పప్పులు ఉడకవు.. శభాష్ భారత్’
రష్యా చమురు, ఆయుధ కొనుగోళ్ల విషయంలో భారత్‌పై ట్రంప్ కోపం ఇంకా చల్లారినట్లు కనిపించడం లేదు. ఈ క్రమంలో ఈయూ, జీ7, నాటో సహా పలు దేశాలపైనా ఆయన ఒత్తిడి చేస్తుండడం చూస్తున్నాం. అమెరికాలాగే ఆ దేశాలకు భారతీయ వస్తువులపై సుంకాల మోత మోగించాలంటూ సూచిస్తున్నారాయన. అయితే ఈ విషయంలో ఆయనకు చేదు అనుభవమే ఎదురవుతోంది!. తాజాగా ఈ పరిణామంపై రష్యా స్పందించింది. భారత్‌తో తమ సంబంధాలు స్థిరంగా కొనసాగుతున్నాయని.. ఇరు దేశాల సంబంధాలను దెబ్బ తీయాలనే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో ఫలించబోవని స్పష్టం చేసింది. ఈ క్రమంలో అమెరికాకు మెత్తగా మొట్టికాయలు వేసింది. ‘‘ఇండియా-రష్యా సంబంధాలు స్థిరంగా, ధైర్యంగా ముందుకు సాగుతున్నాయి. ఈ బంధాన్ని భంగం చేయాలనే ప్రయత్నాలు విఫలం కాక తప్పదు. అమెరికా, నాటో దేశాల ఒత్తిడిని ఎదుర్కొంటూ రష్యా చమురు కొనుగోలు కొనసాగిస్తున్నందుకు ఇండియాను అభినందించాల్సిందే. బాహ్య బెదిరింపులు, విమర్శలు ఉన్నా, ఇండియా తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తుండటం గమనార్హం అని రష్యా విదేశాంగ శాఖ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రకటనలో పేర్కొంది. ఇండియా వైఖరి.. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇండియా-రష్యా స్నేహబంధం స్ఫూర్తి, సంప్రదాయాలపై ఆధారపడి ఉంది. ఇది అంతర్జాతీయ వ్యవహారాల్లో వ్యూహాత్మక స్వయం ఇండియా నిర్ణయాన్ని ప్రతిబింబిస్తోంది. ఇరు దేశాలు మిలిటరీ ఉత్పత్తులు, అంతరిక్ష మిషన్లు, అణు శక్తి, రష్యన్ చమురు పరిశోధనలో భారత పెట్టుబడులు వంటి రంగాల్లో పనిచేస్తున్నాయి. నూతన చెల్లింపు వ్యవస్థలు, జాతీయ కరెన్సీల వినియోగం, పరస్పర రవాణా మార్గాల అభివృద్ధి వంటి అంశాల్లో కూడా సహకారం కొనసాగుతోంది అని పేర్కొంది. ఇదిలా ఉంటే.. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం భారత ఉత్పత్తులపై తొలుత 25% ప్రతీకార సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. అటుపై రష్యా చమురు, రక్షణ సామాగ్రి కొనుగోళ్ల నేపథ్యంతో పెనాల్టీ కింద మరో 25% శాతం విధించారు. ఈ టారిఫ్‌లను భారత్ అన్యాయంగా పేర్కొంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం జాతీయ ప్రయోజనాల, మార్కెట్ అవసరాల ఆధారంగా జరుగుతోందని భారత్ స్పష్టం చేసింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో.. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. రష్యా భారత్ ఆర్థిక వ్యవస్థలు డెడ్.. వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదంటూ సంచలన కామెంట్ చేశారు. అయినప్పటికీ.. అమెరికా ఒత్తిడికి తలవంచే ప్రసక్తే లేదని, స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే హక్కు తమ దేశానికి ఉందని భారత్ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగానే ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగా అలస్కాలో పుతిన్‌తో భేటీ తర్వాత ట్రంప్ స్వరం కాస్త తగ్గింది. ఉక్రెయిన్ డీల్ కుదిరితే భారత సుంకాల విషయంలో ఆలోచన చేయొచ్చని అన్నారాయన. అయితే.. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదరాలంటే.. వ్యవసాయం, పాడి పరిశ్రమలపై రాయితీలు ఇవ్వలేమని కుండబద్దలు కొట్టేసింది. ఈ క్రమంలో.. ఈ రంగాలను రెడ్ లైన్స్‌గా red linesగా అభివర్ణించింది. మరోవైపు.. ఎగుమతిదారులపై ప్రభావం తగ్గించేందుకు భారత ప్రభుత్వం ఆర్థిక మద్దతు ప్యాకేజీలు ప్రకటించే అవకాశముందనే విశ్లేషణ నడిచింది. ఈలోపు ట్రంప్-మోదీల పరస్పర సోషల్ మీడియా సంభాషణతో ఈ చర్చలు ముందుకు సాగవచ్చనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

భారతీయుడి హత్యపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
టెక్సాస్‌లోని డల్లాస్‌లో చోటుచేసుకున్న భారతీయుడి దారుణ హత్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తన పర్యవేక్షణలో వలస నేరస్తుల విషయంలో తమ యంత్రాంగం మృదువుగా వ్యవహరించదని తెగేసి చెప్పారు. అమెరికాను సురక్షిత ప్రాంతంగా మారుస్తామని పేర్కొన్నారు.టెక్సాస్‌లోని డల్లాస్ చంద్ర నాగమల్లయ్య హత్యకు సంబంధించిన భయంకరమైన రిపోర్టులను చూశానని, ఆయనను అతని భార్య, కుమారుని ముందు, క్యూబాకు చెందిన ఒక అక్రమ వలసదారుడు దారుణంగా తల నరికి చంపాడని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.నిందితుడు కోబో మార్టినెజ్‌పై పిల్లలపై లైంగిక వేధింపులు, గ్రాండ్ తెఫ్ట్ ఆటో, తప్పుడు జైలు శిక్ష తదితర నేరాలకు గతంలో అరెస్టు చేశారన్నారు. అలాంటి నేరస్తుడిని క్యూబా తమ దేశంలో ఉండాలని కోరుకోలేదన్నారు. అయితే గత అసమర్థ జో బైడెన్ పాలనలో నేరస్తుడు కోబో మార్టినెజ్ అమెరికాలో తలదాచుకున్నాడన్నారు.ఇలాంటి అక్రమ వలస నేరస్తుల విషయంలో మృదువుగా ఉండాల్సిన సమయం ఇక ముగిసిందని, హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్, అటార్నీ జనరల్ పామ్ బోండి, బోర్డర్ జార్ టామ్ హోమన్ తదితర అధికారులు అమెరికాను మళ్లీ సురక్షితంగా తీర్చిదిద్దేందుకు అద్భుతమైన కృషి చేస్తున్నారన్నారు. అమెరికా అదుపులో ఉన్న నేరస్తుడ్ని చట్ట అమలు సంస్థలు పూర్తి స్థాయిలో విచారిస్తాయని ట్రంప్ పేర్కొన్నారు.కర్ణాటకకు చెందిన నాగమల్లయ్య(50) ఓ మోటల్లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. అదే చోట మార్టినెజ్(37) సిబ్బందిగా పని చేస్తున్నాడు. సెప్టెంబర్ 10వ తేదీ ఉదయం పాడైన క్లీనింగ్ మెషిన్ విషయంలో నాగమల్లయ్య, మార్టినెజ్ మధ్య చిన్నగొడవ జరిగింది. అయితే ఆ మందలింపును భరించలేక తన బ్యాగులో ఉన్న కత్తితో వెంటాడి మరీ మల్లయ్యను మార్టినెజ్ దారుణంగా హతమార్చాడు. ఈ క్రమంలో నాగమల్లయ్య కొడుకు(18), భార్య అడ్డుకోవాలని ప్రయత్నించినా.. వారిద్దరినీ నెట్టేసి మరీ కిరాతకంగా హతమార్చాడు. ఆపై తల నరికి కాలితో తన్ని మరీ దానిని అక్కడి చెత్త బుట్టలో పడేశారు. అనంతరం పోలీసులు హత్యా నేరం కింద అతన్ని అరెస్ట్ చేశారు. అయితే అతనిది నేరస్వభావమని, గతంలోనూ పలు నేరాలు చేశాడని, క్యూబా అతన్ని స్వీకరించేందుకు నిరాకరించడంతో ఇక్కడే అమెరికాలోనే ఉండిపోయాడని, ఈ ఏడాది జనవరిలో నిబంధనల ప్రకారం విడుదల చేయాల్సి వచ్చిందని అక్కడి అధికారులు తెలిపార. ఈ ఘటనపై భారత కాన్సులేట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందజేస్తామని ప్రకటించింది. మరోవైపు భారతీయ కమ్యూనిటీ ఫండ్ రైజింగ్ ద్వారా విరాళాలు సేకరించి నాగమల్లయ్య కుటుంబానికి అందజేసింది. సెప్టెంబర్ 13వ తేదీ నాగమల్లయ్యకు అక్కడే అంత్యక్రియలు జరిగాయి.
జాతీయం

చర్చలు సానుకూలం
న్యూఢిల్లీ: అత్యంత కీలకమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం(బీటీఏ)పై భారత్, అమెరికా ప్రతినిధుల మధ్య మంగళవారం ఢిల్లీలో చర్చలు జరిగాయి. సాధ్యమైనంత త్వరగా ఒప్పందాన్ని అమల్లోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని ఇరుపక్షాలు నిర్ణయించుకున్నాయి. పరస్పరం ప్రయోజనం చేకూరేలా ఈ ఒప్పందం ఉండాలని తీర్మానించుకున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు పూర్తి సానుకూలంగా జరిగాయని భారత వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. చర్చలను త్వరగా ముగించడానికి ప్రయత్నాలు వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది.భారత్‌తో వాణిజ్య చర్చల కోసం అమెరికా నుంచి వచి్చన బృందానికి బ్రెండాన్ లించ్ నేతృత్వం వహించారు. ఆయన దక్షిణ, మధ్య ఆసియాకు అమెరికా సహాయ వాణిజ్య ప్రతినిధిగా పని చేస్తున్నారు. చర్చల కోసం తన బృందంతో కలిసి సోమవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం రోజంతా చర్చలు జరిగాయి. భారత్ తరఫున వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. భారతదేశ ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం 50 శాతం టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఊపందుకోవడం విశేషం. 50 శాతం టారిఫ్‌లు విధించిన తర్వాత అమెరికా నుంచి ఉన్నతస్థాయి ప్రతినిధ

హిమాచల్, ఉత్తరాఖండ్‌లలో మళ్లీ క్లౌడ్ బరస్ట్
డెహ్రాడూన్/సిమ్లా: హిమాలయాల్లోని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో మళ్లీ మేఘ విస్ఫోటం సంభవించింది. సోమవారం రాత్రి నుంచి వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఆకస్మిక వరదలు సంభవించి కొండచరియలు విరిగిపడ్డాయి. ఇందుకు సంబంధించిన ఘటనల్లో ఉత్తరాఖండ్‌లో 15 మంది, హిమాచల్ ప్రదేశ్‌లో ముగ్గురు చనిపోయారు. వీరిలో యూపీలోని మొరాదాబాద్ జిల్లాకు చెందిన ఆరుగురు ట్రాక్టర్ ట్రాలీలో డెహ్రాడూన్‌లో టాన్స్ నదిని దాడుతుండగా వచ్చిన వరదలో కొట్టుకు పోయినవారున్నారు. ఉత్తరాఖండ్‌లో గల్లంతైన 16 మంది కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతోపాటు ఫైర్ సిబ్బంది రంగంలోకి అన్వేషణ చేపట్టారు.వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన సుమారు 900 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జఝ్రా ప్రాంతంలో చిక్కుకుపోయిన మరో ఎనిమిది మందిని కాపాడేందుకు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కొండప్రాంతాల నుంచి వచ్చి పడుతున్న వరదల్లో కార్లు కొట్టుకుపోగా, ఇళ్లు, వ్యాపార సంస్థలు దెబ్బతిన్నాయి. డెహ్రాడూన్‌లో పలు వంతెనలు కొట్టుకుపోయాయి. గంగ, యమున నదులు ప్రమాద స్థాయికి దగ్గర్లో ప్రవహిస్తున్నాయి. వివిధ ఘటనల్లో ముగ్గురు చనిపోయారు. టామ్సా నది ప్రమాద స్థాయికి చేరుకుంది.దీంతో–ముస్సోరి రోడ్డుపై పలు ప్రాంతాల్లో వరద చేరడంతో పర్యాటకులు, సందర్శకులు ఎక్కడి వారక్కడే ఉండిపోవాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోనూ పరిస్థితి దాదాపు ఇంతే తీవ్రంగా ఉంది. సిమ్లాలో 12 గంటల వ్యవధిలో 14.2 సెంటీమీటర్ల వాన కురిసింది. అతిభారీ వర్షం కురియడంతో మండి జిల్లాలోని ధరంపూర్లో ప్రధాన బస్‌స్టాండ్ వరదలో మునిగిపోయింది. ఒక వర్క్‌షాప్, పంప్ హౌస్‌తోపాటు దుకాణాలు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన 20 బస్సులు నీట మునిగిపోయాయి. ఒక వ్యక్తి గల్లంతైనట్లు చెబుతున్నారు. పలు వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి.మండి జిల్లా బ్రాగ్టా గ్రామంలో ఇల్లు కూలి ఇద్దరు మహిళలు, చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రిలో చేర్పించారు. గల్లంతైన మరో నలుగురి కోసం సహాయక సిబ్బంది తీవ్రంగా గాలింపు చేపట్టారు. సిమ్లాలోని హిమ్‌ల్యాండ్ సమీపంలో మట్టి చరియలు విరిగి ప్రధాన రహదారి మూసుకుపోయింది. పలు వాహనాలను మట్టి, బురద కప్పేశాయి. ధరంపూర్లో వరద కారణంగా ఆర్టీసీ బస్సులకు రూ.6 కోట్ల మేర నష్టం వాటిల్లిందని డిప్యూటీ సీఎం ముకేశ్ అగ్ని హోత్రి తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో కొనసాగు తున్న ప్రకృతి బీభత్సం వె

నేటి నుంచి వైష్ణోదేవి యాత్ర పునఃప్రారంభం
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లా త్రికూట పర్వతాల్లో కొలువైన మాతా వైష్ణోదేవి ఆలయ తీర్థయాత్ర ఈ నెల17వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానుంది. అయితే, వాతావరణం అనుకూలంగా ఉంటేనే యాత్ర మొదలవుతుందని ఆలయ బోర్డు మంగళవారం తెలిపింది. ఆగస్ట్ 26వ తేదీన ఆలయ మార్గంలో కొండచరియలు విరిగి పడి 34 మంది యాత్రికులు చనిపోవడం తెల్సిందే.ఘటన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా యాత్రను నిలిపివేశారు. ఈ నెల 14వ తేదీన యాత్ర పునఃప్రారంభం అవు తుందని ఆలయ బోర్డు ప్రకటించింది. అయితే, ఎడతెరిపి లేని వానలతో వాయిదా వేస్తున్నట్లు తెలి పింది. అయితే, రెండు రోజుల క్రితం కొందరు యాత్రికులు కాట్రా బేస్ క్యాంప్ వద్ద ఆందోళనకు దిగడంతో యాత్రను తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించింది.

ఒకటి కాదు.. మల్టిపుల్ రిటైర్మెంట్స్ కావాలి
ఉద్యోగ విరమణ అనేది సాధారణంగా రిటైర్మెంట్ వయసు వచ్చినపుడు చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే, రిటైర్మెంట్ అనేది ఉద్యోగ, వృత్తిగత జీవితానికి ముగింపు కాదని ఓ విరామం మాత్రమేనని నవ యువతరం బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు వివిధ రకాల ఉద్యోగాల్లో, పని ప్రదేశాల్లో, ఇతరత్రా పరిస్థితులు వేగంగా మారిపోతున్న నేపథ్యంలో భారతీయులు మల్టీ రిటైర్మెంట్లకు మొగ్గుచూపుతున్న ధోరణి క్రమంగా పెరుగుతోంది. – సాక్షి, హైదరాబాద్బహుళ–పదవీ విరమణలు తీసుకోవాలనే ధోరణి వివిధ తరాలకు చెందిన వారిలో పెరుగుతుండగా.. యువ, మధ్య వయసు్కల్లో అధికంగా ఉంటోంది. హెచ్ఎస్బీసీ సంస్థ తాజాగా నిర్వహించిన ‘క్వాలిటీ ఆఫ్ లైఫ్–అఫ్లూయెన్స్ ఇన్వెస్టర్ స్నాప్‌షాట్–2025’అధ్యయనంలో ఇలాంటి ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. భారత్ సహా 12 దేశాల్లో 10 వేల మందికి పైగా సంపన్న వయోజనుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నివేదికను రూపొందించారు. ఇందులో జెన్‌జెడ్–మిల్లీనియల్స్ తరానికి చెందిన వారు రిటైర్మెంట్ను ఉద్యోగ అంతం లేదా విరమణగా చూడకుండా... విరామాలతో మళ్లీ కొనసాగించే పనిగా సూత్రీకరిస్తుండటం గమనార్హం. ఇలా తీసుకునే రిటైర్మెంట్లు మూడునెలల నుంచి ఏడాది దాకా ఉంటున్నాయి. ముందు వరుసలో భారతీయులుప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఈ ధోరణిలో భారతీయులు ముందువరుసలో ఉండటం విశేషం. అయితే సంపన్న వర్గాల వారే మల్టీ–రిటైర్మెంట్స్ను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఏదైనా ఉద్యోగం, వ్యాపారం లేదా పని చేసేవారు 55–60 ఏళ్ల వయసు వచ్చే దాకా ఆగకుండా నలభైల్లోనే ఈ రిటైర్మెంట్లు తీసుకుంటున్నారు. వర్క్–రిటైర్మెంట్–వర్క్ కల్చర్‌కే జెన్–జెడ్ (1997–2012 మధ్య జన్మించిన వారు), మిల్లీనియల్స్ (1981–96 మధ్య పుట్టిన వారు) ఓటు వేస్తున్నారు. డిజిటల్ మాధ్యమాల ప్రభావాల మధ్య పుట్టి పెరిగిన వారు కాబట్టి జెన్–జెడ్‌ను డిజిటల్ నేటివ్స్గానూ పరిగణిస్తున్నారు. జీవనశైలి, అభిరుచులు, అలవాట్లకు తగ్గట్టుగా మూడు నెలల నుంచి ఏడాది దాకా మినీ రిటైర్మెంట్ తీసుకుంటున్న వారే అధికంగా ఉంటున్నారు. ఇలా కెరీర్లో బ్రేక్ తీసుకోవడం ద్వారా తమ జీవనశైలిని మెరుగుపరుచుకునేలా రీచార్జ్ కావడంతోపాటు తమ అభిరుచులను మరింత గాఢంగా ఆస్వాదించేందుకు అవకాశం దొరుకుతుందని వీరు భావిస్తున్నారు. ఇలాంటి బ్రేక్‌ల వల్ల తమ వృత్తిగత జీవితం, కెరీర్, లైఫ్‌స్టైల్ మరింత మెరుగవుతుందనే భావనలో వారున్నారు. వర్క్–రిటైర్మెంట్–వర్క్ అంటే... మొదట కొన్నేళ్లపాటు ఉద్యోగం, వ్యాపారం ఇతర వ్యాపకాలు చేసి 40–45 ఏళ్ల మధ్యవయసులో రిటైర్మెంట్ తీసుకుంటారు. విరామం అనేది అది కొన్ని నెలల నుంచి సంవత్సరం దాకా ఉండొచ్చు. తర్వాత మళ్లీ తిరిగి మరేదైనా ఉద్యోగం, వ్యాపారం వంటి దాన్ని ఎంచుకుంటారు. కొత్త బాటలో.. బహుళ పదవీ విరమణలను జీవనశైలి మెరుగు కోసం తీసుకుంటున్న వాటిగానే భావించాలి తప్ప సంప్రదాయ కెరీర్ విరామంగా కాదు. బహుళ–పదవీ విరమణలతో కొంతమంది తమ సంపదను కూడబెట్టుకునేందుకు సమయాన్ని వెచ్చిస్తున్నారు. తమ కుటుంబాల అవసరాలకు అనుగుణంగా కొత్త దిశలను ఎంచుకుంటున్నారు. –హెచ్ఎస్బీసీ అధ్యయనకర్తలు సర్వేలోని ముఖ్యాంశాలు..» సగటున 44 ఏళ్ల వయసులో తొలి మినీ రిటైర్మెంట్ తీసుకోవాలనే భావనలో భారతీయులు ఉంటే.. ప్రపంచస్థాయి సగటు 47 ఏళ్లుగా ఉంది. » తమ జీవిత కాలంలో ఇలాంటి రిటైర్మెంట్ కనీసం ఒకటి తీసుకోవాలని భావిస్తున్న సంపన్న భారతీయులు 48శాతం. » ఇలాంటి విరామాలు 2, 3 తీసుకోవాలనే ఆలోచనతో ఉన్న భారతీయులు 44 శాతం. వీరిలో కొందరు ఆరేళ్లకోసారి బ్రేక్ తీసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. » మొత్తంగా 85 శాతం మంది మల్టీ రిటైర్మెంట్లకు సై అంటున్నారు. మల్టీ రిటైర్మెంట్తో తమ జీవనశైలిలో మంచి మార్పును గమనించినట్టు చెబుతున్నారు.» కనీసం ఒక చిన్న పదవీ విరమణ తీసుకున్న వారిలో 87% మంది తమ జీవితాన్ని సానుకూలంగా ప్రభావితం చేసిందన్నారు. » పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులతో కూడిన కుటుంబసభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి 34 శాతం ఈ పద్ధతిని ఎంచుకుంటున్నారు. » బహుళ రిటైర్మెంట్లతో శారీరక, మానసిక, భావోద్వేగ పరమైన అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నవారు 31 శాతం. నిర్దేశిత సెలవుల పరిమితులు లేకుండా ప్రయాణించడం, కొత్త ప్రదేశాలు, సంస్కృతులను అన్వేíÙంచేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటామన్న వారు 30 శాతం. » ఇది తమ దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు, వ్యక్తిగత అభివృద్ధికి దోహదం చేస్తుందన్న వారు 28 శాతం. » కెరీర్ లక్ష్యాలను తిరిగి అంచనా వేయడానికి పని నుంచి విరామం తీసుకోవడం కొత్త అవకాశాలకు దారితీస్తుందని అంచనా వేస్తున్న వారు 25 శాతం.
ఎన్ఆర్ఐ

తానా “తెలుగుభాషా యువభేరి” విజయవంతం
తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వహించిన “తెలుగుభాషా యువభేరి” భారీ విజయం. డాలస్, టెక్సస్‌లో తానా సాహిత్యవిభాగం-‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట గత ఐదున్నర సంవత్సరాలగా ప్రతి నెలా ఆఖరి ఆదివారం సాహిత్యసదస్సులు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఆదివారం నిర్వహించిన 83వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం శ్రీ గిడుగు వెంకట రామమూర్తి (ఆగస్ట్ 29) 162వ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా జరిగిన “తెలుగుభాషా యువభేరి” ఆద్యంతం చాలా ఆసక్తికరంగా సాగింది.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర తెలుగు వ్యావహారిక భాషోద్యమ మూలపురుషుడు, బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది, ఉపాధ్యాయుడు,అచ్చ తెలుగు చిచ్చర పిడుగు గిడుగు తెలుగును గ్రాంధిక భాషనుంచి వ్యావహారిక భాషగా మార్చే ప్రయత్నంలో గిడుగు చేసిన కృషిని సోదాహరణంగా వివరించి ఘన నివాళులర్పించారు.“ఈ నాటి ఈ కార్యక్రమంలో 9వ తరగతి చదువుకుంటున్న విద్యార్ధినీ విద్యార్దుల నుంచి ఎం.బి.బి.ఎస్ చదువుతున్న విద్యార్ధుల వరకు కేవలం తెలుగుభాషలో ప్రావీణ్యమే గాక, అవధానాలు చేసే స్థాయికి ఎదగిన యువతీయువకులు చూపిన సాహితీ ప్రతిభ, వెదజల్లిన సాహితీ పరిమళాలు ఇతరులకు ఎంతో స్ఫూర్తిదాయకమైనవి అన్నారు. ఈ ప్రయాణంలో పసితనం నుంచే వీరిలో తెలుగుభాషపై ఆసక్తి, అనురక్తి కలిగించడంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల శిక్షణ, ముఖ్యంగా అవధాన విద్యా వికాస పరిషత్ పోషించిన గురుతరమైన పాత్ర ఎంతైనా కొనియాడదగ్గవి అన్నారు” డా. తోటకూర ప్రసాద్ముఖ్యఅతిధిగా హాజరైన ప్రముఖ సినీగీత రచయిత తిపిర్నేని కళ్యాణచక్రవర్తి మాట్లాడుతూ “నేను పట్టాలు పొందింది తెలుగులో కాదు, చదువుకున్నది ఎం టెక్, ఎం.బి.ఏ. ఐనప్పటికీ తన తాత, తల్లిదండ్రుల ప్రోత్సాహం, పాఠశాలలో గురువుల శిక్షణ తనకు తెలుగు భాషామాధుర్యాన్ని చవిచూసే అవకాశం కల్పించి, నేడు తెలుగు సినిమా రంగంలో దాదాపు వంద పాటలు వ్రాసే స్థాయికి తీసకు వెళ్ళాయన్నారు. కనుక చిన్నతనంనుండే పిల్లలకు తెలుగు నేర్పే బాధ్యత తల్లిదండ్రులదే అన్నారు” విశిష్టఅతిథులు పాల్గొన్న అద్దంకి వనీజ, 9వ తరగతి విద్యార్ధిని, విజయవాడ - “ఘనమైన గద్యం”; అష్టావధాని వింజమూరి సంకీర్త్, 9వ తరగతి విద్యార్ధి, హైదరాబాద్ (వింజమూరు, నల్గొండ జిల్లా) - “శతక సాహిత్యం”; బులుసు రమ్యశ్రీ, 10వ తరగతి విద్యార్ధిని (భీమడోలు, ఏలూరు జిల్లా) - “ఆధునిక సాహిత్యం”; శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మ, బి.ఏ విద్యార్ధి, తిరుపతి - “ఉదాహరణకావ్యవైభవం”; అష్టావధాని యెర్రంశెట్టి ఉమామహేశ్వరరావు, పి.హెచ్.డి విద్యార్ధి, తిరుపతి (బల్లిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా) - “అవధానంలో సామాజిక దృక్పధం”; అష్టావధాని డా. బోరెల్లి హర్ష, బి.డి.ఎస్, దంతవైద్యులు, కర్నూలు - “వర్ణన”; అష్టావధాని నల్లాన్ చక్రవర్తుల సాహిత్, ఎం.టెక్ విద్యార్ధి, ఐఐటి, ఖరగ్‌పూర్ (హైదరాబాద్) - “నిషిద్ధాక్షరి”; అష్టావధాని గట్టెడి విశ్వంత్, పి.హెచ్.డి విద్యార్ధి, కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ (మెట్పల్లి, జగిత్యాల జిల్లా) - “తెలుగుభాష పుట్టుపూర్వోత్తరాలు”; అష్టావధాని బాణావత్ నితిన్ నాయక్, బి.టెక్, ఐఐఐటి, బాసర (నిజామాబాద్) - “అవధాన విద్య-ఒక సమీక్ష” అష్టావధాని సుసర్ల సుధన్వ, ఎం.బి.బి.ఎస్ విద్యార్ధి, చెన్నై (హైదరాబాద్) – “సమస్యాపూరణం” అనే అంశాల మీద అద్భుత ప్రసంగాలుచేసి అందరినీ ఆశ్చ్యర్య పరచారు. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు చిగురుమళ్ళ శ్రీనివాస్ తన వందన సమర్పణలో ఈ కార్యక్రమంలో ఈ యువతీ యువకులు చూపిన భాషా పాండిత్య ప్రతిభ చూస్తుంటే తెలుగు భాష భవిష్యత్తుకు ఏ ప్రమాదం లేదనే ఆశ కలుగుతోందన్నారు. పాల్గొన్న అతిథులకు, సహకరించిన ప్రసార మాధ్యమాలకు, తానా కార్యవర్గ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లింకులో వీక్షించవచ్చు https://www.youtube.com/live/DqCQES2BcwM?si=eRcIZ3B-NFxtUcMX(చదవండి: ఖతర్‌లో ఘనంగా తెలుగుభాషా దినోత్సవం)

బాపట్లలో విషాదం.. అమెరికాలో లోకేశ్ మృతి
సాక్షి, బాపట్ల: బాపట్ల జిల్లాలో విషాదం నెలకొంది. అమెరికాలో బాపట్లకు చెందిన లోకేష్(21) మృతిచెందారు. స్విమ్మింగ్ పూల్‌లో మునిగిపోయి పాటిబండ్ల లోకేష్ చనిపోయాడు. బాపట్ల జిల్లా మార్టూరుకు చెందిన గ్రానైట్ వ్యాపారి కుమారుడిగా లోకేష్‌ను గుర్తించారు. కాగా, ఉన్నత చదువుల కోసం లోకేశ్.. అమెరికా వెళ్లాడు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఖతర్‌లో ఘనంగా తెలుగుభాషా దినోత్సవం
ఖతర్‌లో తెలుగు వారంతా తెలుగు భాషా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. దోహాలోని భారత రాయబారి కార్యాలయం ఆధ్వర్యంలోని ఇండియన్ కల్చరల్ సెంటర్ తెలుగు లిటరేచర్ క్లబ్ అనుబంధ సంస్థలైన తెలుగు కళా సమితి, తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ జాగృతి, ఆంధ్ర కళా వేదిక ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాయి. ఎంతో అద్భుతమైన ఈ కార్యక్రమం తెలుగు సంఘాల ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది.ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన, గొప్ప భాషలలో ఒకటైన "తెలుగు" భాషను గౌరవిస్తూ, గొప్ప తెలుగు కవి, వ్యవహారిక భాష శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి పుట్టినరోజునాడు నాలుగు తెలుగు సంస్థలు - హరీష్ రెడ్డి (అధ్యక్షులు - TKS), శ్రీనివాస్ గద్దె (అధ్యక్షులు - TPS), నాగ లక్ష్మి (ఉపాధ్యక్షులు - TJQ), విక్రమ్ సుఖవాసి (ఆపద్ధర్మ అధ్యక్షులు - AKV) నాయకత్వంలో ఈ వేడుకను దిగ్విజయముగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలుగు సంస్థల కార్యవర్గ సభ్యులతో పాటు, ఐసీసీ కార్యవర్గ సభ్యులు, తెలుగు భాషాభిమానులు, వర్ధమాన కవులు, తెలుగు పండితులు ఎంతో ఉత్సాహంగా హాజరయ్యారు. శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో, వివిధ కూరగాయలు, పండ్ల పేర్లను ఉపయోగించి అందమైన తెలుగు కథా కథనాలతో, వేమన పద్యాలు, తెలుగు పొడుపు కథలు/మెదడును చురుకుగా ఉంచే ఆటలతో, ఆశక్తికరమైన సంభాషణలతో తెలుగు భాషలో వారి సృజనాత్మకతను ప్రదర్శించారు. అంతేగాక, ప్రపంచ వేదికపై వివిధ రంగాలలో తెలుగు ప్రజల విజయాలు,వారి కృషిని గురించి కొనియాడారు. తెలుగు భాష పై నిర్వహించిన క్విజ్ అందరినీ అలరించింది.గిడుగు వెంకట రామమూర్తి గారి కవిత్వాన్ని, ఇంకా వారి గ్రామంలో కొనసాగుతున్న సంస్కృతిని వివరిస్తూ.. తాము ఆ గ్రామానికి చెందినవారమని ఒక ప్రేక్షకురాలు గర్వంగా చెప్పినప్పుడు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఆనందించారు. ఈ కార్యక్రమం తెలుగు భాష గొప్పదనాన్ని చాటి చెప్పిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా పేర్కొనవచ్చు. ఈ కార్యక్రమంలో అత్యధిక యువత భాగస్వామ్యం కావడం విశేషం. దీన్ని బట్టి చూస్తే మన సంస్కృతి ప్రస్తుత తరానికి వారసత్వంగా అందుతోందని ఆశించటం అతిశయోక్తి కాదనిపించింది. ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యం మాతృదేశానికి దూరంగా ఉంటున్న యువత తమ మూలాలను గుర్తించి గౌరవించడం అని తెలియ చేశారు.ఈ కార్యక్రమం ఐసిసి తెలుగు లిటరేచర్ క్లబ్, హెచ్ఆర్, అడ్మిన్ అండ్ కాన్సులర్ హెడ్ రాకేష్ వాఘ్ హృదయపూర్వక స్వాగత ప్రసంగంతో ప్రారంభమైంది. ఖతర్‌లో తెలుగు సమాజం తమ సంస్కృతిని నిరంతరం సజీవంగా ఉంచడంలో చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ఐసిసి జనరల్ సెక్రటరీ అబ్రహం కె జోసెఫ్ తన అధ్యక్ష ప్రసంగంలో వివిధ వర్గాలు ఐక్యతను పెంపొందించడంలో భాష ప్రముఖమైన పాత్ర వహిస్తుందని నొక్కి చెప్పారు. ప్రపంచ స్థాయి కవులు, తత్వవేత్తలు, కళాకారులను తయారుచేసే తెలుగు వారసత్వాన్ని ఆయన ప్రశంసించారు. అలాగే వారి రచనలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయన్నారు.ఐసిసి అనుబంధ విభాగాధిపతి రవీంద్ర ప్రసాద్, ఐసిసి అంతర్గత కార్యకలాపాల విభాగాధిపతి వెంకప్ప భాగవతుల ప్రత్యేక అభినందన ప్రసంగాలు చేశారు. సాహిత్యంలో మాట్లాడే మాండలికాన్ని ఉపయోగించడం కోసం ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించిన ప్రముఖ తెలుగు రచయిత, సామాజిక సంస్కర్త గిడుగు వెంకట రామమూర్తి జన్మదినాన్ని స్మరించుకునే తెలుగు భాషా దినోత్సవం శాశ్వత వారసత్వాన్ని, తెలుగు సాహిత్య సాంస్కృతిక సంపదను ప్రవాసులలోని పిల్లలు, యువతకు అందించాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని చక్కగా ముందుకు నడిపించిన సౌమ్య, శిరీష, హారిక, నాగలక్ష్మి గార్లకు ఐ సి సి నాలుగు తెలుగు సంస్థల తరపున అభినందనలు తెలియజేశారు.(చదవండి: వర్జీనియాలో అంగరంగ వైభవంగా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభ)

షార్జా, సౌదీలో వైఎస్సార్‌కు ఘన నివాళి
సింహాద్రిపురం/కడప కార్పొరేషన్: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా యూఏఈలోని షార్జాలో మహమ్మద్ జిలాన్ బాషా ఆధ్వర్యంలో ప్రసన్న సోమిరెడ్డి, కోటేశ్వరరెడ్డి నేతృత్వంలో తెలుగు ప్రజలు మంగళవారం వైఎస్సార్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు.అనంతరం వైఎస్సార్ అభిమాని జిలాన్ బాషా మాట్లాడుతూ వైఎస్సార్ (YSR) ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు. ఆయన చూపిన దారి ఎప్పటికీ తమకు ప్రేరణ అని పేర్కొన్నారు. అనంతరం అభిమానులు వైఎస్సార్ స్మృతులను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు శ్రీనివాస్ చౌదరి, అక్రమ్ బాషా, బ్రహ్మానంద రెడ్డి, నాగ ప్రతాప్ రెడ్డి, కర్ణ, పవన్, గంగిరెడ్డి, క్రాంతికుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శివలింగా రెడ్డి, హనుమంత్ రెడ్డి, తాజుద్దీన్, సత్య, అంజాద్, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.సౌదీ అరేబియాలో...డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 16వ వర్ధంతిని సౌదీ అరేబియాలో ఘనంగా నిర్వహించారు. జుబైల్ ప్రాంతంలో అనుయాకినో కంపెనీ క్యాంపులో కడప పట్టణానికి చెందిన షేక్ ఇలాహి ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రుల వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అనుయాకినో కంపెనీలో పని చేసే సుమారు 50 మంది కార్మికులకు అన్నదానం చేశారు.చదవండి: విదేశాల్లో వైఎస్సార్‌కు ఘన నివాళులు ఈ కార్యక్రమంలో మైనార్టీ నేతలు తాజుద్దీన్, అబ్రార్, ఖ్వాజా, బాషా, సలాం బాషా, మతివ్, అఫ్జల్, ఆతిఫ్, ముహమ్మద్, జాఫర్, ఫర్ ఖాన్, ఫైరోజ్, అసిమ్, ఫైసల్ తదితరులతో పాటు కిషోర్, సంతోష్, శ్రీను పాల్గొన్నారు.
క్రైమ్

మిస్టరీ వీడేదెన్నడు?
శ్రీ సత్యసాయి జిల్లా: రెండు వేర్వేరు కీలక హత్య కేసుల్లో మిస్టరీని ఛేదించడంలో పోలీసులు చతికిల పడ్డారు. ఆ రెండు కేసులను లోతుగా దర్యాప్తు చేస్తే ఒకరిద్దరు పోలీసు అధికారులు సైతం జైలుకెళ్లాల్సి వస్తుందనే ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ హత్యలు జరిగి మూడు, నాలుగేళ్లు కావస్తున్నా నేటికీ దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. రెండు రోజుల క్రితం జిల్లా ఎస్పీగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్.సతీష్ కుమార్ ఈ రెండు కేసుల దర్యాప్తు సవాల్‌గా నిలిచాయి. ప్రత్యేక చొరవ చూపి, నిందితులకు శిక్ష పడేలా చూడాలని బాధిత కుటుంబసభ్యులు కోరుతున్నారు.గదిలోనే కిరణ్ దారుణ హత్యమహారాష్ట్రకు చెందిన కిరణ్(23) కొన్నేళ్లుగా కదిరి పట్టణంలోని ఎంజీ రోడ్డులో మేడపై ఓ గదిని అద్దెకు తీసుకొని బంగారు నగలు తయారీతో జీవనం సాగించేవాడు. సకాలంలో నగలు సిద్దం చేసి ఇస్తుండడంతో నగల వ్యాపారులందరూ అతనికే పని ఇచ్చేవారు. దీంతో రోజంతా బిజీగా ఉంటూ పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాడు. అతని వద్ద కిలోకు పైగా బంగారం, 10 కిలోలకు పైగా వెండి ఉండేదని కొందరు నగల వ్యాపారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో 2021 సెప్టెంబర్ 12న రాత్రి తన గదిలో నిద్రిస్తుండగా కిరణ్‌ను కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మొదట్లో ఈ కేసు విషయంలో పోలీసులు కొంత హడావుడి చేసినా ఆ తర్వాత ఉన్నఫళంగా దర్యాప్తు ఆగిపోయింది. ఈ కేసు విచారణలో భాగంగా అప్పటి ఓ పోలీసు అధికారి తన చేతి వాటం ప్రదర్శించి పెద్ద మొత్తంలో నగదు, బంగారు నగలు సొమ్ము చేసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపైనే సదరు పోలీసు అధికారిని వీఆర్‌కు అప్పట్లో ఉన్నతాధికారులు పంపినట్లుగా సమాచారం.ప్రమీల శరీరంపై 26 కత్తిపోట్లుకదిరిలోని కాలేజీ రోడ్డులో కిరాణా కొట్టు నిర్వహించే రంగారెడ్డి అనే వ్యక్తి ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. ఆ తర్వాత అతని భార్య ప్రమీల(24) ఇంట్లోనే ఉంటూ కిరాణా దుకాణం నిర్వహించేది. 2022, మార్చి 21న అర్రధరాత్రి తన కిరాణా కొట్టులోనే ఆమె దారుణ హత్యకు గురయ్యారు. ఆమె శరీరంపై 26 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసింది. తన సమీప బంధువులతో ఆస్తి తగాదా విషయంలో అప్పట్లో తరచూ పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళుతున్న ఆమె అమాయకత్వాన్ని అప్పటి ఒక పోలీసు అధికారి ‘క్యాష్’ చేసుకోవడంతో పాటు వివాహేతర సంబంధం కూడా కొనసాగించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రమీల సెల్‌ఫోన్‌కు అందిన కాల్స్ ఆధారంగా సదరు పోలీసు అధికారి తరచూ ఆమెతో మాట్లాడినట్లు అప్పట్లో పోలీసుల విచారణలో వెలుగు చూసింది. దీంతో సదరు పోలీసు అధికారిని అప్పట్లో విధుల నుంచి తప్పించినట్లుగా పోలీసు వర్గాల సమాచారం. కాగా, సదరు పోలీసు అధికారి అప్పట్లో స్థానిక సబ్‌జైలు ఎదురుగా ఉన్న పోలీస్ గెస్ట్‌హౌస్‌లోనే ఉండేవారు. ఆయనకు ప్రమీల తన ఇంటి నుంచి క్యారియర్ తీసుకెళ్లి ఇస్తుండడం తాము కళ్లారా చూశామని కొందరు పోలీసులు సైతం అంగీకరిస్తున్నారు. అలాంటి మహిళ రాత్రికి రాత్రి హత్యకు గురి కావడం నమ్మలేక పోతున్నామని వారంటున్నారు. ఆమె సమీప బంధువులు సైతం ఇదే అంశాన్ని బలపరుస్తున్నారు. ఈ హత్య జరిగి మూడేళ్లకు పైగా కావస్తున్నా నిందితులను ఇప్పటి వరకూ ఎందుకు అరెస్ట్ చేయలేదని బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఈ రెండు కేసుల్లోనూ కొందరు ఖాకీల పాత్ర ఉన్నందునే విచారణ పక్కదారి పట్టినట్లుగా బలమైన విమర్శలున్నాయి.

Hyderabad: బ్రిడ్జి కింద నగ్నంగా మహిళ మృతదేహం..!
రాజేంద్రనగర్: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతదేహం లభ్యమైన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం..కిస్మత్పూర్ బ్రిడ్జి పక్కనే ఉన్న కల్లు కంపౌండ్ సమీపంలోని పొదల్లో ఓ మహిళ మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకుండా పడి ఉంది. సంఘటన జరిగి రెండు, మూడు రోజులు కావస్తుండటంతో పాటు రెండు రోజులుగా వర్షాలు పడటంతో మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. క్లూస్ టీమ్, డాగ్స్ టీమ్‌ను రప్పించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. మృతదేహనికి కొద్ది దూరంలో నల్లటి స్క్రాప్, నల్లటి పైజామా కనిపించింది. మృతురాలు వయస్సు 25–30 సంవత్సరాలు ఉంటుందని ఇన్స్పెక్టర్ తెలిపారు. మహిళను ఇక్కడికి తీసుకొచ్చి లైంగికదాడికి పాల్పడి చంపారా..లేదా ఇతర ప్రాంతంలో హత్య చేసి ఇక్కడ పడేశారా అన్నది దర్యాప్తులో తేలనుందని ఇన్స్పెక్టర్ తెలిపారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించామన్నారు. మృతురాలికి సంబంధించిన ఫోటోలను అన్ని పోలీస్స్టేషన్లకు పంపించామన్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మృతురాలి ఆచూకీ తెలిస్తే రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
మేడ్చల్‌రూరల్: రోడ్డు ప్రమాదంలో ఎంబీబీఎస్ విద్యార్థినితో పాటు మరో యువకుడు మృతి చెందిన ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మేడ్చల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హన్మకొండ జిల్లాకు చెందిన ఇస్లావత్ అనూష (20) ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధి ఘనాపూర్‌లోని మెడిసిటీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటుంది. కాగా మంగళవారం మధ్యాహ్నం తన స్నేహితుడు మహేశ్వర్‌రెడ్డితో కలిసి మేడ్చల్ నుండి నగరం వైపు ద్విచక్ర వాహనంపై 44వ జాతీయ రహదారిపై వెళ్తుండగా మార్గమధ్యలో ఆక్సిజన్ పార్క్ సమీపంలో వెనుక నుండి వేగంగా వచ్చిన లారీ వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు కిందపడిపోగా అనూష శరీరంపై నుండి లారీ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన మహేశ్వర్‌రెడ్డిని మేడ్చల్‌లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం 5 గంటల సమయంలో మరణించాడు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు. ఈ మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అస్సాం సివిల్ సర్వీసు అధికారిణి నూపుర్ బోరా అరెస్టు
గౌహతి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అస్సాం సివిల్ సర్వీసు(ఏసీఎస్) అధికారిణి నూపుర్ బోరాను ప్రత్యేక నిఘా విభాగం అధికారులు అరెస్టు చేశారు. భూకుంభకోణంలో ఆమె పాత్రపై ఆరోపణలు రావడంతో అదుపులోకి తీసుకున్నారు. రాజధాని గౌహతిలోని ఇమె ఇంటితోపాటు మరో మూడు ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో దాదాపు రూ.2 కోట్ల నగదు, బంగారు ఆభరణాలు లభించినట్లు తెలిసింది. ప్రభుత్వ భూమిని అక్రమ వలసదార్ల పేరిట రిజి్రస్టేషన్‌కు చేయడానికి సహకరించి, లంచాలు తీసుకున్నట్లు నూపుర్ బోరాపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమెపై దర్యాప్తు కొనసాగుతోందని అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ చెప్పారు.ఎవరీ అధికారిణి?: నూపుర్ బోరా 1989 మార్చి 31న అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో జన్మించారు. తొలుత డీఐఈటీ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశారు. 2019లో ఏసీఎస్ అధికారిణిగా విధుల్లో చేరారు. 2019 నుంచి 2023 దాకా అసిస్టెంట్ కమిషనర్‌గా, తర్వాత సర్కిల్ ఆఫీసర్‌గా వ్యవహరించారు. ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు సోమవారం అరె స్టు చేశారు. సోదాల్లో రూ.90 లక్షల నగదు, రూ.కోటికిపైగా విలువైన ఆభరణాలు స్వా ధీనం చేసుకున్నట్లు సమాచారం. వివాదాస్పద భూముల రిజిస్ర్టేషన్ వ్యవహారంలో ఆమెపై గత ఆరు నెలలుగా తనకు ఫిర్యాదులు వచ్చాయని సీఎం హి మంత బిశ్వ శర్మ చెప్పారు. ఆమెపై నిఘా పెట్టినట్లు వెల్లడించారు. బార్పేట జిల్లాలో సర్కిల్ ఆఫీసర్‌గా పనిచేసిన సమయంలో ప్రభుత్వ భూములను ప్రభుత్వ, సాత్ర భూములను ఆక్రమ వలసదార్ల పరం చేసేందుకు సహకరించారని పేర్కొన్నా రు.ప్రతి పనికీ రేటుకార్డు!: ఎమ్మెల్యే అఖిల్ గొగోయ్ నేతృత్వంలోని కృషాక్ ముక్తి సంగ్రామ్ సమితి(కేఎంఎస్ఎస్) అనే సంస్థ నూపుర్ బోరాపై ఫిర్యాదు చేసింది. భూముల లావాదేవీలకు సంబంధించిన ప్రతి పనికీ లంచాలు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. భూముల మ్యాప్‌నకు రూ.1,500, ల్యాండ్ రికార్డుల్లో పేరు చేర్చడానికి లేదా తొలగించడానికి రూ. 2 లక్షలు తీసుకున్నారని స్పష్టంచేసింది. నూపుర్ బోరా సహాయకుడు, బార్పేట రెవెన్యూ సర్కిల్ ఆఫీసర్ సురాజిత్ డేకా ఇంట్లోనూ సోదాలు జరిగా యి. నూపర్ బోరా అండతో అతడు పలు భూము లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు.
వీడియోలు


విజయవాడ భవానిపురం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత


Lakshmi Parvathi: వెన్నుపోటు చంద్రబాబును వెంకయ్య నాయుడు వెనకేసుకొస్తున్నారు


తిరుపతిలో కుండపోత వర్షం


Jogi Ramesh: TDP నేతల అక్రమ బూడిద - తరలింపునకు వ్యతిరేకంగా ధర్నా


తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అధికారుల సోదాలు


తెలుసు కదా.. రూటు మార్చిన టిల్లు


Sai Pallavi: బాలీవుడ్లో బుజ్జి తల్లి బిజీ టాలీవుడ్ లో మాత్రం..


Israel Attack: తగలబడుతున్న గాజా


జోగి రమేష్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు


ప్రధాని మోదీకి వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు