Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

September 15 2023 remains one of the most satisfying days YS Jagan1
అదొక గొప్పరోజు.. నాకు అత్యంత సంతృప్తినిచ్చిన రోజు: వైఎస్‌ జగన్‌

తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో తొలి విడత మెడికల్‌ కాలేజీలను ప్రారంభించి నేటికి రెండేళ్లు పూర్తి అయ్యింది 2023లో సరిగ్గా ఇదేరోజు (అక్టోబర్‌15న) విజయనగరంలో మెడికల్‌ కాలేజీని వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. ఆ క్రమంలోనే అక్కడ నుంచే వర్చువల్‌గా రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్‌ కాలేజీలను సైతం వైఎస్‌ జగన్‌ ఆరంభించారు.ఆనాటి మెడికల్‌ కాలేజీ ప్రారంభోత్సవ రోజును మరోసారి గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు వైఎస్‌ జగన్‌. ‘ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య రంగంలో 15 సెప్టెంబ‌ర్, 2023 ఒక గొప్ప రోజు. ఒక ముఖ్యమంత్రిగా ప‌రిపాల‌నా కాలంలో నాకు అత్యంత సంతృప్తిని మిగిల్చిన రోజు. నేను ఒక మంచి ప‌ని చేయ‌గ‌లిగాన‌న్న తృప్తి నాకు ల‌భించింది. 1923 నుంచి 2019 వ‌ర‌కు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ రంగంలో కేవ‌లం 12 మెడిక‌ల్ కాలేజీలు ఉంటే, ఒక్క మా హ‌యాంలోనే ఒకేసారి 17 మెడిక‌ల్ కాలేజీల‌ను సంక‌ల్పించాం. ఇందులో భాగంగా 2023 సెప్టెంబ‌ర్ 15న విజ‌య‌న‌గ‌రం, రాజ‌మండ్రి, ఏలూరు, మ‌చిలీప‌ట్నం, నంద్యాల మెడిక‌ల్ కాలేజీల‌ను ఒకేసారి ప్రారంభించి ప్రజ‌ల ఆరోగ్య ప‌రిర‌క్షణ‌లో గొప్ప అడుగు ముందుకేశాం. ఈ ఐదు కాలేజీల ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తేవ‌డం నాకు సంతోషాన్ని క‌లిగించింది. వీటితో పాటు పాడేరు, పులివెందుల కాలేజీల‌ను అడ్మిష‌న్లకు కూడా సిద్ధం చేశాం. మిగిలిన ప‌నుల‌ను పూర్తి చేయాల్సిన ఈ ప్రభుత్వం ఆ 10 కాలేజీల‌ను ప్రైవేటుకు కట్టబెట్టేలా నిర్ణయం తీసుకోవడం అత్యంత దారుణం. ప్రజలంతా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తక్షణం ఈ ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’ అని వైఎస్‌ జగన్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య రంగంలో 15 సెప్టెంబ‌ర్, 2023 ఒక గొప్ప రోజు. ఒక ముఖ్యమంత్రిగా ప‌రిపాల‌నా కాలంలో నాకు అత్యంత సంతృప్తిని మిగిల్చిన రోజు. నేను ఒక మంచి ప‌ని చేయ‌గ‌లిగాన‌న్న తృప్తి నాకు ల‌భించింది. 1923 నుంచి 2019 వ‌ర‌కు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ రంగంలో కేవ‌లం 12 మెడిక‌ల్… pic.twitter.com/zd5RJwE9cd— YS Jagan Mohan Reddy (@ysjagan) September 15, 2025

Ramesh Babu says We are calling off the private colleges strike2
ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల సమ్మె విరమణ

ప్రైవేట్ కాలేజీల సమ్మె గుర్చించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ పేద విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తెచ్చింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని విచ్చిన్నం చేసింది.ఫీజు రీయింబర్స్‌మెంట్ భారాన్ని మాపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెట్టివెళ్ళింది. గత ప్రభుత్వం మాపై నెట్టిన భారాన్ని నెమ్మదిగా పరిష్కరిస్తున్నాం.ఫీజు రీయింబర్స్‌మెంట్ టోకెన్ల పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.భవిషత్ లో మిగతా పెండింగ్ బిల్లులను దశల వారీగా క్లియర్ చేస్తాం. ప్రభుత్వ నిర్ణయానికి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు సహకరిస్తున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ పై కమిటీ వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని అన్నారు.కాలేజీలు, అధికారుల ఆధ్వర్యంలో కమిటీ రెండు మూడు రోజుల్లో వేయనునాంరమేష్ బాబు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చైర్మెన్సమ్మెను విరమించుకుంటున్నాం. మా డిమాండ్ల పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించుకున్నందుకు ధన్యవాదాలు.

KTR files Rs 100 crore defamation suit against Bandi Sanjay3
బండి సంజయ్‌పై కేటీఆర్‌ పరువు నష్టం దావా

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ అంశానికి తనపై ఆరోపణల చేసిన బండి సంజయ్‌పై చట్ట పరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. తనపై చేసిన ఆరోపణలకు గాను బండి సంజయ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. సిటీ సివిల్‌ కోర్టులో పరువు నష్టం పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా, ఫోన్‌ట్యాపింగ్‌ అంశంలో తనపై నిరాధార ఆరోపణలు చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గత నెలలోనే లీగల్‌ నోటీసులు పంపారు. బండి సంజయ్‌ తనపై చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, తన ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలుగా కేటీఆర్‌ మంగళవారం పంపిన నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీన నిర్వహించిన పత్రికా సమావేశంలో బండి సంజయ్‌ తన హోదాను దుర్వినియోగం చేస్తూ కేవలం రాజకీయంగా వార్తల్లో నిలిచేందుకు ఈ తరహా ఆరోపణలు చేశారని నోటీసులో పేర్కొన్నారు.మీడియా సమావేశంలో బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవన్నారు. ఒక పార్లమెంటు సభ్యుడిగా, కేంద్రమంత్రిగా బాధ్యత కలిగిన పదవుల్లో ఉంటూ ప్రజాజీవితంలో ఉన్న మరో శాసనసభ్యుడిపై అసత్యాలతో కూడిన అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని చెప్పారు. బండి సంజయ్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. నోటీసు అందిన వారంలోపు బండి సంజయ్‌ స్పందించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే తాజాగా పరువు నష్టం దావా పిటిషన్‌ను దాఖలు చేశారు కేటీఆర్‌.

Woman smokes inside AC coach, passengers confront her in viral video4
ఏసీ కోచ్‌లో యువతి స్మోకింగ్‌.. ‘నా డబ్బుతో కొనుక్కున్న సిగరెట్‌.. మీకెందుకంత బాధ?’

సాక్షి,విశాఖపట్నం: విశాఖపట్నం-గాంధీధామ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (20803)లో జరిగిన ఓ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. ఏసీ కోచ్‌లో ఓ యువతి సిగరెట్‌ తాగుతూ ఇతర ప్రయాణికులతో వాగ్వాదానికి దిగింది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో చక్కెర్లు కొడుతున్నాయి. ఇక ఆ వీడియోను పరిశీలిస్తే.. యువతి సిగరెట్‌ తాగుతుండగా.. ఓ యువకుడు ఆమెను ప్రశ్నిస్తూ వీడియో తీస్తుంటారు. ‘ఏం చేస్తున్నారు మీరిక్కడ? ట్రైన్‌ లోపల ఎందుకు సిగరెట్‌ తాగుతున్నారు? ఇది ఏసీ కోచ్‌ మీకు కనిపించడం లేదా? అని ప్రశ్నిస్తాడు. దీంతో వీడియో తీస్తున్నారని గమనించిన ఆ ప్రయాణికురాలు.. యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు నన్నెందుకు వీడియో తీస్తున్నారు. వెంటనే డిలీట్‌ చేయండి అంటూ బెదిరింపులకు దిగింది. అందుకు ఆ యువకుడు ఒప్పుకోకపోవడంతో.. నీకెందుకు బ్రదర్‌.. ఇది నీ ట్రైన్‌ కాదు కదా ప్రశ్నించింది. ఓ చేతిలో సిగరెట్‌ పట్టుకుని.. ఈ సిగరెట్‌ను నా సొంత డబ్బుతో కొనుక్కొని తాగుతున్నా మీకెందుకు అని మరింత గట్టిగా కేకలు వేసింది. కేకలు విన్న తోటి ప్రయాణికులు ..యువతిని ట్రైన్‌లో సిగరెట్‌ తాగడం ఆపాలని కోరారు. అయితే ఆమె వారి మాటలను పట్టించుకోకుండా.. ఇది మీ ట్రైన్ కాదు కదా, మీకు ఎందుకు బాధ? అని కసురుకుంది. నేను లోపలికి వెళ్లను. నా వీడియో ఎందుకు డిలీట్ చేయడం లేదు? అని ప్రశ్నించింది. అందుకు తోటి ప్రయాణికులకు చిర్రెత్తడంతో యువతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేది లేక చివరికి ఆమె తన బెర్త్‌కి వెళ్లి ఇప్పుడు పోలీసులను పిలవండి అంటూ సవాల్ విసిరింది. ఈ వీడియో ఎప్పుడు రికార్డ్‌ చేశారో తెలియాల్సి ఉండగా.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోపై రైల్వే శాఖ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. सिगरेट पीने की तलब, बेईज्जत करवा देती हैं. वायरल वीडियो में चलती ट्रेन में इस तरह धूम्रपान करेगी तो सामने वाला आपकी करतूतों को दिखाएगा?@RailMinIndia pic.twitter.com/mXHxy0715s— Tushar Rai (@tusharcrai) September 15, 2025

latest updates on Delhi Cantonment metro station crash tragedy5
పక్కనే ఆస్పత్రి ఉండగా.. 19 కిలోమీటర్ల దూరం ఎందుకు తీసుకెళ్లినట్లు!

సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగంలో డిప్యూటీ సెక్రటరీ నవ్‌జ్యోత్‌సింగ్‌ (52) రోడ్డు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నవ్‌జ్యోత్‌సింగ్‌ మరణానికి కారణమైన నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఘటనకు సంబంధించిన ఆధారాల్ని ధ్వంసం చేసినందుకు గుర్‌గావ్‌ పోలీసులు నిందితులపై అదనపు కేసులు నమోదు చేశారు.ఆదివారం ఢిల్లీ కంటోన్మెంట్‌ మెట్రోస్టేషన్‌ సమీపంలో గగన్‌ప్రీత్‌ (38),పరిషిత్‌ మాక్కాడ్‌(40)లు ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూకారు.. గురుద్వార్‌ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తున్న నవ్‌జ్యోత్‌సింగ్‌, అతని భార్య సందీప్‌కౌర్‌ ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవ్‌జ్యోత్‌సింగ్‌ మరణించగా.. సందీప్‌కౌర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే గగన్‌ ప్రీత్‌ బీఎండబ్ల్యూకారు తమని ఓవర్‌టేక్‌ చేసేందుకు ప్రయత్నించే క్రమంలో ఢీకొట్టినట్లు సందీప్‌కౌర్‌ పోలీసులకు స్టేట్మెంట్‌ ఇచ్చారు. నిందితులు నన్ను,నా భర్త నవజోత్ సింగ్‌ను ఓ వ్యానులో ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యానులో ఉన్న నేను మమ్మల్ని సమీప ఆస్పత్రికి తరలించమని నిందితుల్ని ప్రాధేయపడ్డ.. కానీ వాళ్లు మాత్రం మమ్మల్ని ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి 19కిలోమీటర్ల దూరంలో ఉన్న జీటీబీ నగర్‌ న్యూలైఫ్‌ ఆస్పత్రికి తరలించారు. ఫలితంగా నా భర్త వ్యాన్‌లోనే ప్రాణాలు కోల్పోయారని కన్నీరు మున్నీరుగా విలపించారు. బాధితురాలి స్టేట్మెంట్‌ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ప్రధాన నిందితురాలు గగన్‌ప్రీత్ తండ్రి సదరు న్యూలైఫ్‌ ఆస్పత్రికి సహయజమాని అని నిర్ధారించుకున్నారు. దీంతో కేసును కప్పిపుచ్చే ప్రయత్నం జరిగిందా అన్న కోణంలో ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు సందీప్‌కౌర్‌కు ట్రీట్మెంట్‌ ఇచ్చిన రిపోర్టుతో పాటు కారు ప్రమాదంలో నిందితులకు కఠిన శిక్ష పడేందుకు ఉపయోగపడే ఆధారాలను తారుమారు చేసే ప్రయత్నంలో న్యూలైఫ్‌ ఆసుపత్రికి తీసుకువచ్చారని అనుమానించారు.ఇదే అంశంపై స్పష్టత ఇవ్వాలంటూ ఆస్పత్రి ప్రతినిధుల్ని పోలీసులు ప్రశ్నించారు. ట్రీట్మెంట్‌ విషయంలో సదరు ఆస్పత్రి వైద్యులు,యాజమాన్యం ప్రొటొకాల్‌ పాటించామని చెప్పాయి. కానీ రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశానికి కూతవేటు దూరంలో ఆస్పత్రి ఉంచుకొని.. 19కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూలైఫ్‌ ఆస్పత్రికే ఎందుకు తరలించారు అనే అంశంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

More Drama In PCB, Mohsin Naqvi Fire Board Members After Handshake Row vs India Says Report6
హ్యాండ్‌ షేక్‌ వివాదంలో అనూహ్య పరిణామం

భారత్‌-పాక్‌ ఆటగాళ్ల హ్యాండ్‌ షేక్‌ వివాదంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు విషయాన్ని సరిగ్గా హ్యాండిల్‌ చేయలేకపోయాడని సొంత అధికారినే సస్పెండ్‌ చేసింది. జట్టు క్రికెట్‌ ఆపరేషన్ష్‌ డైరెక్టర్‌ ఉస్మాన్‌ వాహ్లాపై పీసీబీ సస్పెన్షన్‌ వేటు వేసింది. అధ్యక్షుడు నఖ్వీ బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించి వాహ్లాను ఫైర్‌ చేశాడని తెలుస్తుంది.ఈ విషయాన్ని హ్యాండిల్‌ చేసే విషయంలో వాహ్లా నుంచి ఎక్కువగా ఆశించాము. అయితే అతను నిరాశపరిచాడు. వాహ్లా కారణంగా భారత్‌ ముందు పాక్‌ పరువు పోయింది. టాస్‌కు ముందే మ్యాచ్ రిఫరీ కరచాలనం విషయాన్ని ప్రస్తావించినా, వాహ్లా పరిస్థితిని నియంత్రించడంలో విఫలమయ్యాడని నఖ్వీ అన్నట్లు సమాచారం​.కాగా, ఆసియా కప్‌లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పాక్‌ ఆటగాళ్లకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వని విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ఆటగాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. సూపర్‌-4 దశ మ్యాచ్‌లోనూ భారత ఆటగాళ్లు నో హ్యాండ్‌షేక్‌ పాలసీని కొనసాగించనున్నట్లు తెలుస్తుంది.ఈ విషయంపై పీసీబీ ఇప్పటికే నానా యాగీ చేస్తుంది. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అలాగే మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్‌ విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేసింది. భారత ఆటగాళ్లు క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించారని, ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ ఉల్లంఘనకు పాల్పడ్డారని వారికి తగని నీతులు చెబుతుంది.ఐసీసీ తమ డిమాండ్లను పరిష్కరించకపోతే యూఏఈతో తదుపరి జరుగబోయే మ్యాచ్‌ను బహిష్కరిస్తామని బ్లాక్‌ మెయిల్‌ చేస్తుంది. ఐసీసీ మాత్రం ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. షేక్‌ హ్యాండ్‌ ఇవ్వకపోవడం అన్నది ఆటగాళ్ల వ్యక్తిగతం అంశమని లైట్‌ తీసుకుంది. పీసీబీ మాత్రం భారత్‌ ముందు తమ పరువు పోయిందని ఐసీసీ ముందు గగ్గోలు పెడుతుంది.

Tanushree Dutta Reveals Refusing Crores Offer To Join Bigg Boss Show7
'పురుషులు, మహిళలు ఓకే బెడ్‌పై.. బిగ్‌బాస్‌పై నటి షాకింగ్ కామెంట్స్‌'

బాలీవుడ్ భామ తనుశ్రీ దత్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొద్ది రోజుల క్రితమే ఇంట్లో వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ ఏడుస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. తన ఇంట్లోనే తనని వేధిస్తున్నారని.. ఈ బాధ తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ప్లీజ్ ఎవరైనా వచ్చి సాయం చేయండి అంటూ అభ్యర్థించింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.తాజాగా ఈ బాలీవుడ్ భామ బిగ్‌ బాస్‌ రియాలిటీ షోపై సంచలన కామెంట్స్ చేసింది. గత 11 ఏళ్లుగా తనకు బిగ్‌బాస్ ఆఫర్ వస్తోందని తెలిపింది. కానీ ఈ అవకాశాన్ని తాను తిరస్కరిస్తూనే ఉన్నానని వెల్లడించింది. తనకు రూ. 1.65 కోట్లు ఆఫర్ చేసినా కూడా ఈ షోలో పాల్గొనని మేకర్స్‌కు తేల్చి చెప్పానని పంచుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజైరన తనుశ్రీ దత్తా బిగ్‌బాస్ షోపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. నిర్మాతలు తనకు నింగి నుంచి చంద్రుడిని తీసుకొచ్చినా.. నా లైఫ్‌లో ఎప్పటికీ బిగ్‌బాస్‌లో పాల్గొనని చెప్పింది.తనుశ్రీ దత్తా మాట్లాడుతూ..'బిగ్‌బాస్‌ ఆఫర్‌ ప్రతి ఏటా వస్తోంది. ఈ షోలో పాల్గొనాలని మేకర్స్ తనను సంప్రదిస్తారు. ప్రతి ఏటా ఈ రియాలిటీ షో కోసం నాకు రూ. 1.65 కోట్లు ఆఫర్ చేశారు. ఎందుకంటే వారు మరో బాలీవుడ్ సెలబ్రిటీకి కూడా అంతే మొత్తాన్ని ఇచ్చారు. ఆమె కూడా నా స్థాయి నటినే. అంతకంటే ఎక్కువ డబ్బు కూడా ఇస్తామని బిగ్‌బాస్ మేకర్స్‌లో ఒకరు ఆఫరిచ్చారు. కానీ తిరస్కరించాను. ఎందుకంటే ఈ షోలో పురుషులు, మహిళలు ఓకే బెడ్‌పై పడుకుంటారు. అదే ప్లేస్‌లో కోట్లాడుకుంటారు. నా ఆహారం విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటా. ఈ రియాలిటీ షో కోసం ఒకే మంచంపై మరో వ్యక్తితో పడుకునే అమ్మాయిని అని వారు ఎలా అనుకుంటారు?.. నేను అంత చీప్‌ కాదు. వారు నాకు ఎన్ని కోట్లు ఇచ్చినా బిగ్‌బాస్‌కు వెళ్లను. నేను నా ఫ్యామిలీతోనే కలిసి ఉండనని.. తనకంటూ ప్రత్యేక స్పేస్‌ కోరుకునేదాన్ని' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.బిహార్‌కి చెందిన తనుశ్రీ దత్తా.. 2004లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ విజేతగా నిలిచింది. కానీ 'ఆషిక్ బనాయా అప్నే' పాటతో ఈమెకు చాలా గుర్తింపు వచ్చింది. తెలుగులోనూ 2005లో 'వీరభద్ర' అనే మూవీ చేసింది. తమిళంలోనూ 2010లో తీరదు విలాయాట్టు పిళ్లై అనే చిత్రంలో నటించింది. ఇవి తప్పితే 2013 వరకు హిందీలోనే పలు చిత్రాలు చేసింది. తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది.

Scientists Develop Eye Drops That May Restore Vision8
కళ్లజోడుకు గుడ్‌బై?: సర్జరీ లేకుండా.. రెండేళ్లు!

వయసు పెరిగే కొద్దీ.. దాదాపు అందరికీ ప్రెస్‌బయోపియా (కంటిచూపు లోపం) వస్తుంది. అప్పుడు చదవడం లేదా ఫోన్‌ను ఉపయోగించడం వంటి క్లోజప్ విషయాలపై దృష్టి పెట్టడం కొంత కష్టతరమవుతుంది. దీనికోసం రీడింగ్ గ్లాసెస్‌పై ఆధారపడతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పరిశోధకులు ప్రత్యేక కంటి చుక్కలను తయారు చేశారు. ఇది కొంతకాలం పాటు గ్లాసెస్‌ను వదిలించుకోవడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.రెండేళ్ల పాటు మెరుగైన దృష్టిరెండు సంవత్సరాల పాటు జరిగిన ఒక అధ్యయనంలో.. కంటి చుక్కలను తయారు చేశారు. వీటిని రోజుకు రెండు లేదా మూడు సార్లు ఉపయోగించడం వల్ల, కళ్లజోడుతో పనిలేకుండానే చిన్న అక్షరాలను చదివే సామర్థ్యం మెరుగుపడిందని తేలింది. అధ్యయనంలో.. చాలా మంది వ్యక్తులు చుక్కలను ఉపయోగించిన తర్వాత ప్రామాణిక కంటి చార్టులో (జేగర్ చార్ట్) రెండు లేదా అంతకంటే ఎక్కువ అదనపు పంక్తులను చదవగలిగారు. ఈ చుక్కలను ఉపయోగించడం వల్ల.. రెండేళ్ల పాటు మెరుగైన దృష్టిని పొందవచ్చని చెబుతున్నారు.ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు యూరోపియన్ సొసైటీ ఆఫ్ క్యాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్స్ (ESCRS)లో ప్రచురించారు. కంటి చూపు పెరగడానికి ఉపయోగించే.. చుక్కల మందులో పైలోకార్పైన్ (కన్ను దగ్గరగా ఉన్న వస్తువులపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది), డైక్లోఫెనాక్ (కొంతమందికి కలిగే చికాకును నివారించడంలో సహాయపడుతుంది) ఉపయోగించినట్లు వెల్లడించారు.రోజుకు రెండుసార్లుసాధారణంగా ప్రజలు.. రోజుకు రెండుసార్లు చుక్కలను ఉపయోగిస్తారు. అవసరమైతే మూడవ మోతాదును కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రెస్‌బయోపియా (Presbyopia) ప్రభావాన్ని బట్టి.. రోజుకు ఎన్నిసార్లు ఉపయోగించాలనేది నిర్దారించడం జరుగుతుంది. ప్రెస్‌బయోపియా తీవ్రత తక్కువగా ఉంటే తక్కువసార్లు, ఎక్కువగా ఉన్నప్పుడు మంచి రిజల్ట్స్ కోసం ఎక్కువసార్లు ఉపయోగించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరికకంటి చూపు మందగించడం వల్ల.. కొంతమంది ఆపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపరేషన్ వద్దనుకుని, సరళమైన పద్దతిలో సమస్య పరిష్కరించుకోవడానికి ఈ చుక్కల మందు ఉపయోగపడుతుంది. అయితే ప్రెస్‌బయోపియా ప్రభావం తగ్గించడానికి ఉపయోగించే చుక్కల మందు వల్ల.. స్వల్ప చికాకు లేదా తేలికపాటి తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమస్యలను నిర్మూలించడానికి మరింత అధ్యయనం అవసరమని నిపుణులు చెబుతున్నారు.

Rajasthan Woman Drove 600 Km To Convince Lover To Marry Her,what happen9
‘అయ్యో పాపం.. ప్రాణం పోగొట్టుకునేందుకేనా 600కిలోమీటర్లు ప్రయాణించింది’

జైపూర్‌: ప్రియుడిని పెళ్లికి ఒప్పించేందుకు 600 కిలోమీటర్లు ప్రయాణించిన ఓ మహిళ… చివరికి శవమై కనిపించింది. ఈ విషాద కథపై నెటిజన్లు ‘అయ్యో పాపం..ప్రేమ కోసం అంత దూరం ప్రయాణించి చివరికి ప్రాణం పోగొట్టుకుందా?’ అంటూ నిట్టూరుస్తున్నారు.పోలీసుల కథనం ప్రకారం..రాజస్థాన్‌లోని ఝుంఝునుకు చెందిన ముఖేష్‌ కుమారి అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహించేది. పదేళ్ల క్రితం తన భర్తతో మనస్పర్ధలు రావడంతో కుమారి ఆమె భర్త నుంచి విడిపోయింది. ఈ క్రమంలో గతేడాది నవంబర్‌లో అదే రాష్ట్రంలోని బర్మార్‌లో టీచర్‌గా విధులు నిర్వహించే మనారామ్‌తో మెటాలో పరిచయం పెంచుకుంది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. సోషల్‌ మీడియాలో చాటింగ్‌, వాట్సాప్‌లో వీడియో కాలింగ్‌లతో ఏడాదిపాటు మునిగిపోయారు. చివరికి ఆ ప్రేమను పెళ్లిగా మారుద్దామని అనుకున్నారు.ఈ నేపథ్యంలో పెళ్లికి ఒప్పించేందుకు ఝుంఝును నుంచి 600కిలోమీటర్ల దూరంలో ఉన్న మనారామ్‌ను కలిసేందుకు కుమారి కారులో బయలుదేరింది. మనారామ్ ఇంటికి చేరుకుని, అతని కుటుంబ సభ్యులకు వారి సంబంధం గురించి వివరించింది. దీంతో కుమారిపై మనారామ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ సమస్యను పరిష్కరించమని కోరుతూ స్థానిక పోలీసుల సాయం తీసుకున్నాడు. ఆ తర్వాత సాయంత్ర రోజు అలా మాట్లాడుకుందాం పదా అంటూ కుమారిని బయటకు తీసుకుకెళ్లాడు మనారామ్‌. ఇద్దరు ఏకాంతంగా ఉండగా.. మనరామ్‌ ఓ రాడ్డుతో కుమారి తలపై మోదీ ప్రాణాలు తీశాడు. ఆనవాళ్లన్నీ ధ్వంసం చేశాడు. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. కుమారిని కారు డ్రైవింగ్‌ సీట్లో కూర్చోబెట్టి ప్రమాదం జరిగిందని నమ్మేలా కారును సైడ్‌ కాలువలోకి పోనిచ్చాడు. ఇంటికి వచ్చి హాయిగా నిద్రపోయాడు(ఈ విషయం పోలీసుల దర్యాప్తులో తెలిపాడు). మరుసటి రోజు ఉదయం కుమారి రోడ్డు ప్రమాదానికి గురైందని పోలీసులకు సమాచారం ఇవ్వాలని తన తరుఫు లాయర్‌ను పురమాయించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. తొలుత బాధితురాలు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకుందని పోలీసులు భావించారు.అన్నీ కోణాల్లో కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కుమారి ప్రాణం తీసింది మనారామ్‌ అని నిర్ధారించుకున్నారు. కుమారి హత్య జరిగే సమయంలో నిందితుడు మనరామ్‌ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి ఉండటం అనుమానం పోలీసులకు అతనిపై అనుమానం మొదలైంది. ఆ అనుమానంతో మనారామ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా.. అసలు విషయం భయట పడింది. కుమారిని హత్య చేసింది మనారామ్‌నేనని తేల్చారు. కుమారి మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు.

What Happened Between Byreddy Shabari And CMO Kartikeya Mishra10
ఢిల్లీలో దారుణంగా తిట్టుకున్న ఎంపీ శబరి, సీఎం అడిషనల్ సెక్రటరీ!

సాక్షి, విజయవాడ: ఏరికోరి సీఎం చంద్రబాబు నియమించుకున్న ఐఏఎస్‌ అధికారితో టీడీపీ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మాటల యుద్ధానికి దిగారు. ఒకరికొకరు తిట్టుకోవడంతో పాటు పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో నడుస్తున్న ఈ పంచాయితీ హాట్‌ టాపిక్‌గా మారింది. టీడీపీ ఎంపీ శబరి వెర్సస్ సీఎంవో కార్యదర్శి కార్తికేయ మిశ్రా ఢిల్లీలో దారుణంగా తిట్టుకున్నారు. ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం రోజే జరిగిన ఈ వాగ్వాదం వివరాలు ఇలా ఉన్నాయి.. ‘‘ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం కోసం వచ్చిన సీఎం చంద్రబాబును కలిసేందుకు ఎంపీ శబరి ఎదురు చూడసాగారు. ఆ సమయంలో ఆమెను సీఎం అడిషనల్‌ సెక్రటరీ కార్తికేయ మిశ్రా‘‘సీఎం బాగా బిజీగా ఉన్నారు’’ అని చెప్పి అనుమతించలేదు. అప్పటిదాకా పడిగాపులు పడ్డ ఆమె ఆ సమాధానంతో ఒక్కసారిగా ఊగిపోయారు. ‘‘నేనొక ఎంపీని.. నాతో ఇలాగేనా మాట్లాడేది’’ అని గట్టిగా అరిచారు. దీనికి ఆయన ‘‘నీలా ఎవరూ నాతో ఇప్పటిదాకా ఇలా మాట్లాడలేదు’’ అంటూ మండిపడ్డారు. ఆ ఏకవచనం పిలుపుతో మరింత రగిలిపోయిన శబరి.. తనతో మర్యాదగా ప్రవర్తించాలంటూ వార్నింగ్‌ ఇచ్చారు. ఆ వివాదం మరింత ముదరకుండా.. కొందరు ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. కట్‌ చేస్తే.. తాజాగా ఆమె మంత్రి నారా లోకేష్‌కు ఈ వ్యవహారంపై పిర్యాదు చేశారు. లోకేష్‌కు అత్యంత సన్నిహితుడిగా కార్తీకేయ మిశ్రాకు పేరుంది. ఈ క్రమంలోనే ఆయన్ని కావాలనే చంద్రబాబుకి అదనపు కార్యదర్శిగా నియమించుకున్నారు. అయితే తాజా వివాదం నేపథ్యంలో.. సీఎంవో సీనియర్ అధికారి ఒకరి చేత విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement