Karimnagar
-
మ్యాన్‌హోల్‌లో పడిన వృద్ధుడు
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని బైపాస్‌రోడ్‌లో నా యీబ్రాహ్మణ సంఘం భవనం ముందుగల మ్యాన్‌హోల్‌లో ఓ వృద్ధుడు పడిపోయాడు. పట్టణానికి చెందిన ముకుందరెడ్డి తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా వరదనీరు ఎక్కువ రావడంతో మ్యాన్‌హోల్‌లో పడిపోయాడు. విషయం తెలుసుకున్న అ గ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని వృద్ధుడిని, ద్విచక్ర వాహనాన్ని గంటపాటు శ్రమించి బయటకు తీశారు. వృద్ధుడికి స్వల్ప గాయాలు కావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సకాలంలో స్పందించడంతో వృద్ధుడు ప్రాణాలతో బయటపడ్డాడు. రక్షించిన అగ్నిమాపక శాఖ సిబ్బంది -
విద్యుత్‌షాక్‌తో వివాహిత మృతి
బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండలం నీలోజిపల్లికి చెందిన వివాహిత ఎర్ర శోభ (48) విద్యుత్‌షాక్‌తో గురువారం మృతిచెందింది. ఏఎస్సై మోతీరామ్ తెలిపిన వివరాలు. శోభ స్నానం చేయడానికి ఇంటి దగ్గర ఉన్న స్నానపు గదికి వెళ్లింది. ఆ గదికి ఉన్న ఇనుప డోర్ మీదుగా తాత్కాలిక విద్యుత్ వైరుతో లైట్ ఏర్పాటు చేసుకున్నారు. ఇనుపడోర్కు విద్యుత్ వైరు తేలి తగిలి ఉంది. దీంతో స్నానానికి వెళ్లి డోర్ వేసుకున్న శోభకు విద్యుత్ షాక్ తగిలి మృతిచెందింది. మృతురాలి భర్త ఎర్ర రాజిరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై పేర్కొన్నారు. సంఘటన స్థలాన్ని సెస్ ఏఏఈ ప్రశాంత్ పరిశీలించారు. శోభ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరామర్శించారు. కుటుంబీకులకు రూ.15వేలు ఆర్థికసాయం అందించారు. కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేశ్‌యాదవ్, భీంరెడ్డి మహేశ్‌రెడ్డి, నాగుల వంశీ తదితరులు ఉన్నారు. కారు, బైక్ ఢీ.. ఒకరి మృతిపెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం రంగాపూర్ సమీపంలో కారు, బైక్ ఎదురెదుగా ఢీకొన్న ప్రమాదంలో రాఘవాపూర్‌కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ ఏనుగుల జగన్ (25) మృతిచెందాడు. పోలీసుల వివరాలు.. జగన్ లొంకకేసారం గ్రామంలోని తమ బంధువుల ఇంటికి బైక్‌పై బుధవారం రాత్రి వెళ్తుండగా, పెద్దపల్లి వైపు వస్తున్న కారు ఢీ కొట్టింది. వెంటనే స్థానికులు జగన్‌ను పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి కుటుంబీకులను మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పరామర్శించారు. జగన్‌కు భార్య నిఖిత, రెండున్నరేళ్లతో పాటు, మూడునెలల వయస్సుగల కూతుళ్లు ఉన్నారు. మృతుడి తండ్రి కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు బసంత్‌నగర్ ఎస్సై స్వామి తెలిపారు. గంజాయి పట్టివేతజగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని విద్యానగర్ బైపాస్‌రోడ్‌లో ఇస్లాంపురకు చెందిన ఎండీ.నబీద్ నుంచి 69 గ్రాముల గంజాయిని పట్టుకున్నట్లు పట్టణ సీఐ వేణుగోపాల్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఎస్సై వాహనాల తనిఖీలు చేస్తుండగా నబీద్ అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని తనిఖీలు చేయగా గంజాయి లభ్యమైంది. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. -
పార్టీకోసం ఐక్యంగా పనిచేయాలి
చిగురుమామిడి: చిగురుమామిడి మండలంలో కాంగ్రెస్‌పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు కృషి చేయాలని, గ్రామస్థాయిలో పార్టీలోకి కొత్త రక్తాన్ని తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభా కర్ సూచించారు. చిగురుమామిడిలో గురువారం కాంగ్రెస్‌పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. మిగిలిన పార్టీల కన్నా అత్యధిక సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు కై వసం చేసుకోవాలన్నారు. గ్రామశాఖ అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్నారు. హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్, మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్, డీసీసీ ప్రధానకార్యదర్శి చిటుమల్ల రవీందర్, పీసీసీ పరిశీలకుడు రఘునాథరెడ్డి, నమిలా శ్రీనివాస్ పాల్గొన్నారు. నార్మల్ డెలివరీలు చేయాలి కరీంనగర్‌టౌన్: మొదటి కాన్పులో సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రా ల వైద్యులు, సిబ్బంది ప్రోత్సహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ పేర్కొన్నారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో గురువారం ఎంఎల్‌హెచ్‌పీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సూపర్వైజర్స్ స్టాఫ్‌తో సమీక్ష నిర్వహించారు. మొదటి కాన్పు సాధారణం కావడం వల్ల రెండోకాన్పుకు కూడా సాధారణ డెలివరీకి అవకాశం ఉంటుందన్నారు. వర్షాకాలం ప్రారంభం కానున్న దృష్ట్యా దోమలతో సంభవించే వ్యాధుల నివారణకు ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలన్నారు. ఈనెల 21 నుంచి 28వ తేదీ వరకు రెండో విడత ఇమ్యునైజేషన్ స్పెషల్ డ్రైవ్ జరుగుతున్నందున టీకాలు పడని పిల్లలకు తప్పక ఇప్పించాలన్నారు. డీఐవో సాజిదా, సన జవేరియా, డీఎంవో శైలేంద్ర, డెమో రాజగోపాల్, డీపీఎం స్వామి పాల్గొన్నారు. కాళేశ్వరంలో ఆర్టీసీ వైద్య సేవలు కరీంనగర్: కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రయాణ ప్రాంగణంలో కరీంనగర్ జోనల్ హాస్పిటల్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఏవీ.గిరిసింహారావు ఆధ్వర్యంలో గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్టీసీ సిబ్బందికే కాకుండా ప్రయాణికులకు సైతం వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. ఎండ, వర్షాలతో వాతావరణంలో వ్యత్యాసంతో గ్యాస్ట్రో ఎంటిరైటిస్ వైరల్ ఇన్ఫెక్షన్లు, అలెర్జీ సోకే ప్రమాదముందని తెలిపారు. శుభ్రమైన ఆహారం, నీరు తీసుకోవాలని, మాస్కులు ధరించాలని, బీపీ, షుగర్, గుండె వ్యాధిగ్రస్తులు మందులు వెంట ఉంచుకోవాలన్నారు. ఈనెల 26వరకు వైద్య శిబిరం కొనసాగుతుందని తెలిపారు. అడిషనల్ ఎస్పీల బదిలీకరీంనగర్క్రైం: ఉమ్మడి జిల్లాలో పలువురు అడిషనల్ ఎస్పీలు బదిలీ అయ్యారు. కరీంనగర్ టాస్క్‌ఫోర్స్‌లో కొనసాగుతున్న జి.నరేందర్ భద్రాద్రి కొత్తగూడెంకు ఆపరేషన్స్ అడిషనల్ ఎస్పీగా బదిలీ అయ్యారు. వెయిటింగ్లో ఉన్న ప్రతాపగిరి వెంకటరమణ కరీంనగర్ అదనపు డీసీపీ(అడ్మిన్)గా నియామకం అయ్యారు. హెచ్‌టీ సర్వీసుల మంజూరుకు సింగిల్ విండో వ్యవస్థ కొత్తపల్లి(కరీంనగర్): 11కేవీ, 33కేవీ, ఆపై ఓల్టేజీ హెచ్‌టీ సర్వీసుల మంజూరు వేగవంతం చేయడానికి సింగిల్ విండో వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. సర్వీసుల మంజూరును మరింత సరళీకృతం చేయడానికి సర్కిల్ ఆఫీస్, కార్పొరేట్ ఆఫీస్‌లో హెచ్‌టీ మానిటర్ సెల్‌ను ఏర్పాటు చేసామన్నారు. 11 కేవీ ఓల్టేజీ దరఖాస్తులు సర్కిల్ ఆఫీస్ ఏడీఈ(కమర్షియల్)మానిటర్ చేస్తారని, 33 కేవీ ఓల్టేజీ, ఆపై దరఖాస్తులను కార్పొరేట్ ఆఫీసు ఏడీఈ(కమర్షియల్)మానిటర్ చేస్తారని వెల్లడించారు. ప్రతిరోజూ ఏడీఈలు దరఖాస్తులను డాష్‌బోర్డులో మానిటర్ చేస్తారన్నారు. దరఖాస్తులు సంబంధిత అధికారులకు ఎస్టిమేట్కకు పంపిస్తారని, అనంతరం ఫీల్డ్ విజిట్ చేసి అభ్యంతరాలు లేకుంటే మంజూరు చేయడం జరుగుతుందన్నారు. -
కరీంనగర్ రైల్వేస్టేషన్
అభివృద్ధికి నిదర్శనం సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్‌రూరల్: ఎన్డీఏ ప్రభుత్వ హయంలో రైల్వేస్టేషన్లు అభివృద్ధి చెందాయనడానికి కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణే నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని బికనూర్ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కరీంనగర్ రైల్వేస్టేషన్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యక్షంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ జమ్మికుంట రైల్వేస్టేషన్‌ను సైతం అమృత్ భారత్ పథకంలో ఆధునీకరిస్తామని తెలిపారు. జూన్ నెలాఖరులోగా ఉప్పల్ ఆర్వోబీ పూర్తి చేస్తామని, కరీంనగర్– హసన్‌పర్తి రైల్వేలైన్ నిర్మాణానికి రూ.1480 కోట్లు అవసరమని డీపీఆర్‌లో పేర్కొన్నట్లు తెలిపారు. తిరుపతి రైలును వారంలో నాలుగుసార్లు నడిపించేందుకు కృషి చేస్తానన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తాను ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ రైల్వేస్టేషన్‌కు కృషి చేశానని, ప్రస్తుతం తిరుపతికి వారంలో రెండు పర్యాయాలు నడుస్తున్న రైలును ప్రతిరోజూ నడిపించేలా చూడాలన్నారు. కరీంనగర్– ముంబయి, షిర్డీకి రైలు నడిపించాలన్నారు. అనంతరం రైల్వేస్టేషన్లో పర్యటించి లిఫ్టులు, ఎస్కలేటర్లు, బుకింగ్కౌంటర్లను మంత్రులు పరిశీలించారు. ఎమ్మెల్సీలు చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమురయ్య, సీపీ గౌస్ ఆలం, రైల్వే రీజినల్ మేనేజర్ గోపాలకృష్ణన్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మాజీ మేయర్ వై.సునీల్‌రావు పాల్గొన్నారు. సభ ఏర్పాట్లలో విఫలం కరీంనగర్ రైల్వే స్టేషన్లో ప్రారంభోత్సవ సభ నిర్వహణలో రైల్వేఅధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ప్రెస్ గ్యాలరీ కుర్చీల్లో రాజకీయ నాయకులతో పాటు ఇతరులు కూర్చోవడంతో మీడియా ప్రతినిధులు నిలుచునే పరిస్థితి ఏర్పడింది. స్నాక్స్, తాగేందుకు మంచినీళ్లు ఇవ్వకపోవడంతో పలువురు ఇబ్బందులకు గురయ్యారు. సభకు తీగలగుట్టపల్లి నుంచి పెద్దసంఖ్యలో మహిళలను స్థానిక బీజేపీ నాయకులు తీసుకురాగా.. రైల్వేస్టేషన్‌లోకి పోలీసులు, రైల్వే సిబ్బంది అనుమతించకపోవడం వివాదాస్పదంగా మారింది. దక్షిణ మధ్య రైల్వే అధికారులే సభ బాధ్యతలు చూసుకున్నారని, తమకు సంబంధం లేదని స్థానిక రైల్వే అధికారులు పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీబీఆర్ఎస్ లేఖలకే పరిమితం బీఆర్ఎస్ నాయకులు గతంలో ప్రతీ విషయానికి లేఖలు రాసి చేతులు దులుపుకున్నారే తప్పా ఎలాంటి అభివృద్ధి చేయలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. ప్రస్తుతం రైల్వేస్టేషన్ల అభివృద్ధి తమవల్లే జరుగుతోందని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. మాటలు కాదు.. బుల్లెట్ దిగిందా లేదా అనేది చూడాలని కోరారు. ఎన్డీఏ ప్రభుత్వ హయంలో రైల్వేస్టేషన్లు అభివృద్ధి చెందాయని చెప్పడానికి కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణే నిదర్శనమన్నారు. -
వర్షాలతో అప్రమత్తంగా ఉండండి
● కలెక్టర్ పమేలా సత్పతికరీంనగర్ అర్బన్: ముందస్తు వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ సూచనల నేపథ్యంలో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాలతో ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. నాలాల్లో పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి డ్రైనేజీ నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. శిథిలావస్థకు చేరిన, పాత ఇండ్లు వర్షాలకు నాని కూలిపోయే అవకాశం ఉన్నందున అక్కడ నివసించే వారిని ఖాళీ చేయవలసిందిగా సూచించాలని తెలిపారు. ఐరన్ విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల వల్ల జరిగే ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ శాఖలోని డీఆర్ఎఫ్ టీం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆర్డీవో మహేశ్వర్, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
భాగ్యరెడ్డి వర్మ చరిత్ర తెలుసుకోవాలి
● జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డికరీంనగర్: దళితుల అభ్యున్నతికి కృషి చేసిన ఎం.భాగ్యరెడ్డి వర్మ చరిత్ర అందరూ తెలుసుకోవాలని సుడా చైర్మన్, జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి సూచించారు. భాగ్యరెడ్డి వర్మ జయంతి సందర్భంగా ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రం వద్ద గల ఆయన విగ్రహానికి కలెక్టర్ పమేలా సత్పతి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌తో కలిసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి, మహిళల విద్య, అభివృద్ధికి భాగ్యరెడ్డి వర్మ కృషి చేశారని గుర్తు చేశారు. భాగ్యరెడ్డి వర్మ జయంతిని అధికారికంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. వచ్చే జయంతిలోగా సుడా నిధులతో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, ఐలాండ్ సుందరీకరణకు నిధులు కేటాయిస్తామని అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ భాగ్యరెడ్డి వర్మ అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కేక్‌కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఆర్డీవో మహేశ్వర్, ఎస్సీ సంక్షేమ అధికారి పవన్‌కుమార్, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్, భాగ్యరెడ్డి వర్మ జయంతి ఉత్సవ కమిటీ సభాధ్యక్షుడు కాడే శంకర్, కార్యనిర్వహణ అధ్యక్షుడు బొగ్గుల మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
మా ఊళ్లో ఏం జరుగుతోంది?
ప్రభుత్వం రూపొందించిన ‘మేరీ పంచాయతీ యాప్’లో గ్రామ పంచాయతీల సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుంది. నిధుల వినియోగంలో లోపాలు ఉన్నా, అక్రమాలు జరిగినా యాప్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ఆధారాలతో అధికారులకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. – వీరబుచ్చయ్య, డీపీవో, పెద్దపల్లి ● అందుబాటులోకి మేరీ పంచాయతీ యాప్ ● నిధుల ఖర్చులో పారదర్శకతకు ప్రాధాన్యం ● ఆదాయ, వ్యయాలను తెలుసుకునే అవకాశంరామగిరి(మంథని): గ్రామ పంచాయతీల్లో చేపట్టే అభివృద్ధి పనులను గ్రామస్తులు తెలుసుకునేందుకు కేంద్రప్రభుత్వం మేరీ పంచాయతీ(నా పంచాయతీ) యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిద్వారా ఆదాయ, వ్యయాల్లో పారదర్శకత పాటించే ఆవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు విడుదల చేసే నిధులను పాలకవర్గాలు ఎలా ఖర్చు చేస్తాయనే సమాచారం నేరుగా తెలుసుకోవచ్చు. యాప్‌ను 2019లో రూపొందించినా సాంకేతిక కారణాలతో కొంత సమాచారం అందించలేకపోయింది. ప్రస్తుతం సమగ్ర సమాచారంతో యాప్ అందుబాటులోకి వచ్చింది. పారదర్శక పాలన.. గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసే నిధులతో అభివృద్ధి పనులు చేపడతారు. వాటి వినియోగానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు యాప్‌లో పొందుపర్చాలని, తద్వార గ్రామాల్లో పారదర్శకపాలన సాగుతుందని అధికారులు చెబుతున్నారు. నిధుల వివరాలు ఆన్లైన్లో ఉండటంతో గ్రామాభివృద్ధికి ఎలాంటి పనులు చేపడుతున్నారో గ్రామస్తులు తెలుసుకోవచ్చు. వివరాల నమోదు సమయంలోనే జీపీఆర్ఎస్ ద్వారా గుర్తించే ఆవకాశం ఉండటంతో అక్కడి పనులకు కేటాయించిన నిధులను ఇతరచోట్ల వినియోగించేందుకు వీలు ఉండదు. పాలకవర్గాలు సైతం పొరపాట్లు చేయడానికి అవకాశం ఉండదు. పాలకులు, అధికారులు తప్పుడు నివేదికలు రూపొందిస్తే ప్రశ్నించడానికి వీలు కలుగుతుంది. కొరవడిన అవగాహన మేరీ పంచాయతీ యాప్‌పై గ్రామస్తులకు అవగాహన కల్పించడంలో అధికారులు వెనుకబడ్డారు. చాలా వరకు గ్రామాల్లో చదువుకున్న యువతకు తప్ప మరొకరికి ఈ యాప్ ఉన్నట్లు కూడా తెలియదంటున్నారు. యాప్‌పై అవగాహన లేక చాలామంది తమ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి వివరాలను తెలుసుకోలేకపోతున్నారు. ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్.. స్మార్ట్ ఫోన్లోని ప్లేస్టోర్ యాప్‌లో మేరీ పంచాయతీ పేరిట సెర్చ్ చేయగానే వచ్చే యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాక లాగిన్ అవ్వాలి. ఆ వెంటనే ఫైనాన్షియల్ ఇయర్, స్టేట్, జిల్లా, మండలం, పంచాయతీ వివరాలు కనిపిస్తాయి. వాటిని నమోదు చేయగానే ఆయా పంచాయతీల సమాచారం కనిపిస్తుంది. గ్రామం పేరు, లేదంటే పిన్‌కోడ్‌తో గ్రామ పంచాయతీ పూర్తి వివరాలను తెలుసుకునే వీలుంటుంది. చేసిన పనుల ఫొటోలను యాప్‌లో పొందుపరుస్తారు. పల్లెపాలనలో పారదర్శకతకు ఈ యాప్ ఎంతోగానో ఉపయోగపడుతుంది.అన్ని వివరాలు నిక్లిప్తం గ్రామ పంచాయతీల నిధుల వివరాలు మాత్రమే కాకుండా సర్పంచ్(ప్రస్తుతం లేరు), కార్యదర్శి, గ్రామ కమిటీలు, ఆస్తుల వివరాలన్నీ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా మంజూరు చేసే నిధుల వివరాలు, దేనికి ఎంతఖర్చు చేశారు, పనులు ఏదశలో ఉన్నాయన్న వివరాలు ఇందులో నమోదై ఉంటాయి. నిధుల్లో ఎక్కువగా కార్మికులు, సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చులు యాప్‌లో పొందుపర్చుతారు. ఇవే కాకుండా వచ్చే ఏడాది అంచనా వ్యయాల నమోదుతో పాటుగా, గ్రామసభల వివరాలు సైతం యాప్‌లో అందుబాటులో ఉంటాయి. అవగాహన కల్పించాలి పంచాయతీల పద్దుల వివరాలు తెలుసుకునేందుకు ఓ యాప్ ఉందనే విషయం చాలామందికి తెలియదు. దీంతో నిధుల వినియోగం విషయంలో అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రజలే నేరుగా నిధుల వివరాలను తెలుసుకునేలా యాప్‌పై అధికారులు అవగాహన కల్పించాలి. – బొంకూరి పోశం, కల్వచర్ల, రామగిరి మండలం -
అమ్మ పేరుతో ఒక మొక్క
● వన మహోత్సవంలో మహిళా గ్రూప్‌లు ● మొక్కలు నాటడంతో పాటు సంరక్షణ ● నగరంలో నాలుగు ప్రాంతాలు సిద్ధంకరీంనగర్ కార్పొరేషన్: శరవేగంగా విస్తరిస్తున్న కాంక్రీట్ జంగల్లో వాతావరణ సమతుల్యతను పాటించేందుకు ప్రభుత్వం మహిళా సంఘాల భాగస్వామ్యంతో చర్యలు చేపట్టింది. ఈ ఏడాది వనమహోత్సవంలో భాగంగా ఉమెన్స్ ఫర్ ట్రీస్ పేరిట కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ‘ఏక్ పేడ్ మా కే నామ్ పే’ (అమ్మ పేరుతో ఒక మొక్క) అనే నినాదంతో మహిళా సంఘ సభ్యులు మొక్కలు నాటడంతో పాటు, రెండేళ్ల పాటు వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టేలా కార్యాచరణ రూపొందించింది. నాలుగు ప్రాంతాలు గుర్తింపు ‘అమ్మ పేరుతో ఒక మొక్క’ అనే నినాదంతో చేపట్టిన వనమహోత్సవ విజయవంతానికి నగరపాలకసంస్థ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా చెరువులు, ఖాళీ ప్రాంతాల్లో బల్క్‌గా మొక్కలు నాటనున్నందున, నగరంలో అనువైన స్థలాలు గుర్తించారు. ఆ చెరువుల వద్ద మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతను మహిళా సమాఖ్యలకు అప్పగించింది. నగరపాలకసంస్థ పరిధిలోని పద్మనగర్‌లోని స్థలంలో దేవిశ్రీ మహిళా సంఘం, కొత్తపల్లి చెరువు సమీ పంలో గాయత్రీ మహిళా సంఘం, రేకుర్తిలోని పెంటకమ్మ చెరువు సమీపంలో శ్రీరంగనాథ మహిళా సంఘం, సీతారాంపూర్ మాలకుంట సమీపంలో నవజ్యోతి మహిళా సంఘానికి మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతలు అప్పగించారు. జూన్ 5వ తేదీ నుంచి షురూ... నగరపాలకసంస్థ పరిధిలో గుర్తించిన నాలుగు ప్రాంతాల్లో జూన్ 5వ తేదీన మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇది ఆగస్టు 31వ తేదీ వరకు అంటే దాదాపు రెండు నెలలు కొనసాగనుంది. ఈ సమయంలో ఆయా ప్రాంతాల్లో మహిళా సంఘాల సభ్యులు మొక్కలు నాటడంతో పాటు, సంరక్షణ బాధ్యతలు చేపడుతారు. ఉద్యమంలా మొక్కలు నాటాలి నగరంలో ఉద్యమంలా మొక్కలు నాటాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ సూచించారు. నగరంలో మొక్కలు నాటేందుకు గుర్తించిన స్థలాలను గురువారం పరిశీలించారు. సంబంధిత మహిళా గ్రూప్ సభ్యులకు బాటిల్, బుక్, పెన్ తదితర వస్తువులతో కూడిన కిట్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూన్ 5వ తేదీ నుంచి మొక్కలు విరివిగా నాటాలన్నారు. రెండేళ్లపాటు నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. మెప్మా పీడీ వేణు మాధవ్, నగరపాలకసంస్థ డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియుద్దీన్, ఈఈ శ్రీనివాస్, డీఈ లచ్చిరెడ్డి, ఏఈ సల్మాన్, డీఎంసీ శ్రీవాణీ, టీఎంసీ మానస, సీవోలు సునీత, పద్మ, దీప, అంజలి, స్వప్న, పద్మ, తిరుపతి పాల్గొన్నారు. -
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి
● రాష్ట్ర పరిశీలకుడు నర్సింహారావు కొత్తపల్లి(కరీంనగర్): ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య బోధిస్తూ విద్యార్థుల సంఖ్యను పెంచాలని రాష్ట్ర పరిశీలకుడు డా.నర్సింహారావు సూచించారు. కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్లో భౌతికశాస్త్రం ఉపాధ్యాయులకు గురువారం నిర్వహించిన శిక్షణ శిబిరాన్ని సందర్శించిన ఆయన మాట్లాడారు. అత్యాధునిక సాంకేతికతను జోడించి విద్యాబోధన చేయాలనే ఆలోచనలతో రాష్ట్రమంతటా ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమమైన విద్యాబోధన చేసి, విద్యార్థుల సంఖ్య మెరుగుపరచాలని కోరారు. జిల్లా రిసోర్స్ పర్సన్లు దామోదర్, భుజన్ చందర్, రామ్ కిరణ్, తిరుపతి, లింగయ్య పాల్గొన్నారు. -
అంగరంగ వైభవంగా మానస వివాహం (ఫొటోలు)
పెద్దపల్లి రూరల్: కలెక్టరే పెళ్లి పెద్ద అయ్యారు. అధికారులే అయినవాళ్లయ్యారు. తమ ఇంటి ఆడపడుచులా అక్కున చేర్చుకున్నారు. అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. రామగుండం ప్రాంతానికి చెందిన తబితా ఆశ్రమంలో ఉంటున్న నక్క మానస వివాహం.. రాజేశ్‌తో కలెక్టరేట్లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. తల్లిదండ్రులను చిన్నతనంలోనే కోల్పోయిన నక్క మానస, నక్క లక్ష్మి అక్కాచెల్లెళ్లు. వీరు 16 ఏళ్లుగా తబితా ఆశ్రమంలో ఉంటున్నారు. మానసకు వివాహం నిశ్చయం కావడంతో వివాహతంతు జరిపించేందుకు కలెక్టర్ కోయ శ్రీహర్ష చొరవ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కలెక్టరేట్ ఆవరణలోని శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని వివాహవేదిక చేశారు. అర్చకుల మంత్రోచ్ఛారణలు, బాజాభజంత్రీల మధ్య ఉదయం 11.05 గంటలకు వివాహం ఘనంగా జరిగింది. కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే విజయరమణారావు, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, అడిషనల్ కలెక్టర్ వేణు, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్ సహా పలుశాఖల జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో సేకరించిన రూ.61,800 విలువైన చెక్కును కలెక్టర్ శ్రీహర్ష వధూవరులకు అందించారు. వరుడి బం««ధుమిత్రులతో పాటు మోచి సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, కార్యదర్శి రాజు, ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు.. మోచికుల ఆ«రాధ్య దైవమైన సంత్ రవిదాస్ హరలయ్య జ్ఞాపికను వధూవరులకు అందజేశారు. -
Operation Kagar: మావోళ్లు ఎలా ఉన్నరో?
సాక్షి, పెద్దపల్లి: మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వారికి కంచుకోట అయిన ఛత్తీస్‌గఢ్‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్తో నెత్తురోడుతోంది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా 2024 జనవరిలో కేంద్ర బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో చోటుచేసుకుంటున్న ఎదురుకాల్పుల్లో సుమారు 300మందికి పైగా మా వోయిస్టులు మృతిచెందారు. ప్రభుత్వ దూకుడు, పె రుగుతున్న నిర్బంధం, వరుస ఎన్కౌంటర్లతో ఎ ప్పుడు ఏం జరుగుతుందోనని అజ్ఞాత మావోయి స్టు కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మృతిచెందడంతో జిల్లా నేతల క్షేమసమాచారంపై బంధువుల్లో ఆందోళన నెలకొంది. భయపెడుతున్న ఘటనలు మావోయిస్టుల అంతమే లక్ష్యంగా ఛత్తీస్‌గఢ్‌లో దూ సుకుపోతున్న భద్రతాదళాలకు మనజిల్లాకు చెంది న నేతలు కొరకరాని కొయ్యలా మారారు. కేంద్ర కమిటీతోపాటు వివిధ కీలక స్థానాల్లో మన జిల్లావా సులు దండాకారణ్యంలో కార్యకలాపాలు కొనసాగి స్తున్నారు. ప్రభుత్వానికి సమాంతరంగా జనతన స ర్కార్ను స్థాపించారు. అయితే, మావోయిస్టుల విస్తరణకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో 2009తో ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. అప్పటినుంచి దేశవ్యాప్తంగా ముమ్మరంగా యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ సాగిస్తోంది. తాజాగా ప్రభు త్వం ఆపరేషన్ కగార్‌ను ప్రారంభించింది. సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, డీఆర్జీ, సీ–60, ఎస్‌వోజీ, స్పెషల్ టాస్‌్కఫోర్స్ పేరుతో అడవులను జల్లెడ పడుతున్నా యి. దీంతో ఏడాదిన్నర కాలంలోనే 300 మందికిపైగా మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతిచెందా రు. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలు ఉన్నట్లు ప్రచారం జరిగినా త్రుటిలో తప్పించుకుంటున్నారు. ఇటీవల జూలపల్లికి చెందిన పుల్లూరి ప్రసాద్‌రావు ఉరఫ్ చంద్రన్న మృతిచెందారని ప్రచారం జరిగినా ఇంకా నిర్ధారణ కాలేదు. జిల్లావాసులే కీలకం పెద్దపల్లి జిల్లాలకు చెందిన పలువురు మావోయిస్టులు కేంద్ర, రాష్ట్ర కమిటీల్లో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. కిష్టంపేట గ్రామానికి చెందిన కంకణాల రాజిరెడ్డి, జాలపల్లి మండలం వడ్కా పూర్ గ్రామానికి చెందిన పుల్లూరి ప్రసాద్‌రావు ఉరఫ్ చంద్రన్న, పెద్దపల్లికి చెందిన మల్లోజుల వేణుగోపాలరావు ఉరఫ్ భూపతి, జూలపల్లి మండలం వెంకట్రాపుపల్లికి చెందిన దీకొండ శంకర్, పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామానికి చెందిన గంకిడి సత్యనారాయణరెడ్డి ఉరఫ్ విజయ్, పాలితం గ్రానికి చెందిన అలేటి రామలచ్చులు, రామగుండం మండలానికి చెందిన అప్పాసి నారాయణ ఉరఫ్ రమేశ్, గోపయ్యపల్లికి చెందిన దళ కమాండర్ దాతు ఐలయ్య, సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామానికి చెందిన జువ్వాడి వెంకటేశ్వర్రావు, మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన మల్ల రాజిరెడ్డి ఉరఫ్ మీసాల రాజన్న తదితరులు ఉన్నారు. ఎక్కడ, ఎప్పుడు ఎలాంటి ఎన్కౌంటర్ జరిగినా ఉమ్మడి కరీంనగర్ జిల్లావాసుల్లో ఆందోళన నెలకొంటోంది. -
ట్రాఫికింగ్ డాన్ హితేశ్ అరెస్ట్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: విదేశాల్లో కొలువుల పేరిట వందలాది మంది భారతీయులను విదేశాల్లోని చైనా సైబర్ కేఫ్‌లకు విక్రయించిన మానవ అక్రమ రవాణా డాన్ హితేశ్ ఎట్టకేలకు అరెస్టయ్యాడు. భారత విదేశాంగ శాఖ కోరిక మేరకు అతడిని మంగళవారం రాత్రి థాయ్‌లాండ్ ఇమిగ్రేషన్ అధికారులు ఇండియాకు డిపోర్ట్ చేశారు. బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన హితేశ్‌ను ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని, విదేశాంగశాఖకు అప్పగించారు. మార్చిలో కరీంనగర్ పోలీసులు జారీచేసిన లుక్అవుట్ నోటీసుల ఫలితంగా హితేశ్ ఇండియా రాగానే అదుపులోకి తీసుకున్నారు. హితేశ్ ఇండియాకు వస్తున్నాడన్న సమాచారంతో మంగళవారం రాత్రి కరీంనగర్ జిల్లా మానకొండూరు పోలీసులు ఢిల్లీకి చేరుకున్నారు. అయితే, గుజరాత్‌కు చెందిన హితేశ్‌ను తెలంగాణ పోలీసుల కంటే ముందే ఆ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రోజంతా జరిగిన హైడ్రామా తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కలుగజేసుకోవటంతో ఎట్టకేలకు హితేశ్‌ను తెలంగాణ పోలీసులకు అప్పగించారు. దీంతో కరీంనగర్ పోలీసులు అతన్ని సాయంత్రానికి కరీంనగర్‌కు తరలించారు. దేశవ్యాప్త నెట్వర్క్ గుజరాత్‌లోని పోర్బందర్కు చెందిన హితేశ్ మానవ అక్రమ రవాణా సూత్రధారి. ఇతను థాయ్‌లాండ్, మయన్మార్, లావోస్ దేశాల్లో సైబర్ నేరాలకు పాల్పడే కేఫ్‌లకు మనుషులను అక్రమంగా పంపిస్తాడు. విదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలిప్పిస్తానని, నెలకు రూ.లక్ష జీతమని నమ్మబలికి ఒక్కో వ్యక్తిని 3,000 డాలర్లకు చైనీస్ సైబర్ కేఫ్‌లకు విక్రయించేవాడు. మనదేశంలో ఇతనికి ప్రతి రాష్ట్రంలో ఏజెంట్లు ఉన్నారు. ఇప్పటివరకు అతడు దాదాపు 300 మందికిపైగా భారతీయులను విక్రయించాడని సమాచారం. ఇతని ఏజెంట్లలో జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన శ్యామారావు రాజశేఖర్ ఒకడు. వీరిద్దరు కలిసి గతేడాది డిసెంబర్లో కరీంనగర్ జిల్లా మానకొండూరుకు చెందిన మధుకర్‌రెడ్డి అనే యువకుడిని మయన్మార్‌కు పంపారు. అక్కడ ఆ యువకుడు తిరగబడ్డాడు. ఈ విషయాన్ని ‘సాక్షి’వరుస కథనాలతో వెలికితీయడంతో స్పందించిన బండి సంజయ్.. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వివరించారు. దీంతో తొలుత అక్కడ సైబర్‌కేఫ్‌లో చిక్కుకున్న 540 మందిని మయన్మార్ సైన్యం సాయంతో కాపాడారు.తెలంగాణ సైబర్ పోలీసులు కూడా దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మానకొండూరు, ఖానాపూర్‌లో హితేశ్‌పై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లోనే కరీంనగర్ పోలీసులు హితేశ్‌పై లుక్అవుట్ నోటీసులు జారీచేశారు. మరో కీలక నిందితుడు రాజశేఖర్ లావోస్‌లో తలదాచుకుంటున్నాడని సమాచారం. భారతీయ యువతీ యువకులను చైనీయులకు విక్రయించిన హితేశ్.. వారు తిరగబడితే చిత్రహింసలు పెట్టి చీకటిగదుల్లో వేయించేవాడు. చైనీయుల కోసం వందల మంది భారతీయులను అంగడి సరుకుగా విక్రయించాడు. చివరికి ఆ చైనీయులే అతన్ని చితకబాది థాయ్‌లాండ్ ఇమిగ్రేషన్ అధికారులకు పట్టించడం కొసమెరుపు. -
తాటిచెట్టు పై నుంచి పడి గీతకార్మికుడి మృతి
ముస్తాబాద్ (సిరిసిల్ల): మండలంలోని కొండాపూర్‌లో పెద్దూరి బలరాంగౌడ్(56 ) అనే గీతాకార్మికుడు తాటిచెట్టు పై నుంచి పడి దుర్మరణం చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. ముస్తాబాద్ మండలం కొండాపూర్‌కు చెందిన పెద్దూరి బలరాంగౌడ్ మంగళవారం సాయంత్రం తాటిచెట్టు ఎక్కేందుకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో భార్య పద్మ, ముగ్గురు కొడుకులు గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో ఇంటికి వెళ్లారు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు తాటి వనానికి వెళ్లి గాలించగా ఓ చెట్టు కింద విగతజీవిగా పడి ఉన్నాడు. మోకు జారీ చెట్టుపై నుంచి పడి మృతి చెందినట్లు కార్మికులు తెలిపారు. భార్య పద్మ, కుమారులు శివ, శ్రవణ్, సంజయ్ ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హుజూరాబాద్: పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన శ్రావణ్(34) ప్రైవేటు ఉద్యోగి. తన ద్విచక్ర వాహనం వెళ్తుండగా హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద వెనుక నుంచి టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు మృతుడి జేబులో ఉన్న సెల్ఫోన్లో ఉన్న నంబర్‌కు ఫోన్ చేసి విషయం తెలియజేయగా మృతుడి పేరు మాత్రమే తెలిసింది. చౌరస్తా వద్ద ప్రమాదం జరగడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మానేరు జలాశయ గుంతలో పడి వ్యక్తి మృతి కొత్తపల్లి(కరీంనగర్): పద్మనగర్ శివారులోని మానేరు జలాశయంలో ప్రమాదవశాత్తు సెంట్రింగ్ మేసీ్త్ర పడి మృతిచెందినట్లు కొత్తపల్లి పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. కాగజ్‌నగర్‌కు చెందిన భక్తి శివ(35) బతుకుదెరువు కోసం జగిత్యాల పట్టణానికి వచ్చి భార్యతో కలిసి ఉంటూ సెంట్రింగ్ పని చేస్తున్నాడు. ఈనెల 19న సెంట్రింగ్ పని చేసేందుకు పద్మనగర్ వచ్చాడు. పని అయిపోయాక చేపలు పట్టేందుకు మానేరు జలాశయంలోకి వెళ్లగా.. ప్రమాదవశాత్తు అక్కడి గుంతల్లో పడి మునిగిపోయాడు. 20న రాత్రి శివ మృతదేహం తేలగా.. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య పూజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాంబమూర్తి పేర్కొన్నారు. -
వర్షం జోరు.. భక్తుల హోరు
మల్యాల: కొండగట్టు కాషాయమైంది. దీక్షాపరులతో కిక్కిరిసిపోయింది. రామలక్ష్మణ జానకీ..ౖ జె బోలో హనుమాన్ కీ.. జై శ్రీరాం..జై హనుమాన్.. అంటూ ఉప్పొంగిన భక్తిభావంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అంజన్న సన్నిధికి చేరుకున్నారు. అందమైన కొండను కారుమబ్బులు కమ్మేస్తుంటే.. ఆ సుందర దృశ్యాలను చూస్తూ.. పాదయాత్రన వచ్చిన భక్తులు పరవశించిపోయారు. గురువారం అంజన్న పెద్ద జయంతి కావడంతో బుధవారం అర్ధరాత్రి 12 తర్వాత స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. మాల విరమణ చేసి.. తలనీలాలు సమర్పించి కోనేరులో స్నానాలు చేసి.. ప్రసాదాలు తీసుకుని ఇంటిదారి పడతారు. ఆలయం తరఫున ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. -
సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ
కరీంనగర్ కార్పొరేషన్: దేశంలో సాంకేతిక విప్లవానికి పునాదివేసింది మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్ గాంధీ అని డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బుధవారం రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహించింది. డీసీసీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళి అర్పించారు. రాజీవ్‌చౌక్‌లో ఉన్న విగ్రహస్థానంలో సుడానిధులతో ఏర్పాటు చేయనున్న కాంస్య విగ్రహానికి నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ శంకుస్థాపన చేశారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ 30ఏళ్ల క్రితం నగేశ్ ముదిరాజ్ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేశారని, ఆ స్థానంలో కొత్తగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్, అర్బన్ బ్యాంకు చైర్మన్ గడ్డం విలాస్‌రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, చాడగొండ బుచ్చిరెడ్డి, ఆకుల నర్సయ్య, పులి ఆంజనేయులుగౌడ్ పాల్గొన్నారు. శిక్ష పడేలా పని చేయాలి కరీంనగర్‌క్రైం: మహిళలకు సంబంధించిన కేసుల్లో నిందితులకు శిక్షపడేలా కృషి చేయాలని సీపీ గౌస్ ఆలం ఆదేశించారు. కొత్తపల్లిలోని భరోసా కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. బాధితులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి, సక్రమంగా నిర్వహించాలని సూచించారు. లైంగిక వేధింపులకు గురైనవారిని పోలీస్స్టేషన్లు, ఆసుపత్రులకు దూరంగా సురక్షితమైన వాతా వరణంలో చేయూతనివ్వడానికి భరోసా కేంద్రం ఏర్పాటైందన్నారు. భరోసా కేంద్రాల ద్వారా లైంగిక వేధింపుల కేసుల్లో శిక్షలశాతం పెరిగిందని వివరించారు. ఏసీపీ మాధవి, సీఐ శ్రీలత, ఎస్సై అనూష పాల్గొన్నారు. జిల్లా జడ్జితో భేటీజిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎస్.శివకుమార్‌ను బుధవారం సీపీ గౌస్ఆలం మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్ 14వ తేదీన జరగనున్న లోక్ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న రాజీ పడే కేసులను పరిష్కరించాలని కోరారు. లోక్ అదాలత్ సన్నద్ధతలో భాగంగా కోర్టు ఆవరణలో సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్ ఆధ్వర్యంలో కమిషనరేట్‌లోని పోలీస్స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. న్యాయమూర్తులు డి.ప్రీతి, బి.రాజేశ్వర్, ఏసీపీ వెంకటస్వామి పాల్గొన్నారు. పెండింగ్ సమస్యలకు త్వరలోనే పరిష్కారం కరీంనగర్ అర్బన్: ఉద్యోగుల అపరిష్కృత సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభించే అవకాశముందని ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ దారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కరీంనగర్ అర్బన్, కరీంనగర్ రూరల్ తహసీల్దార్లుగా బాధ్యతలు చేపట్టిన ఈ.నరేందర్, ఎన్.రాజేశ్‌ను ఆయా కార్యాలయాల్లో ఉద్యోగసంఘాల నేతలు బుధవారం కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఉద్యోగుల అపరిష్కృత సమస్యలకు త్వరలోనే పరిష్కా రం లభించనుందని వివరించారు. సమస్యల సాధన కోసం నియమించిన కమిటీకి రాష్ట్ర జేఏసీ నేతలు మారం జగదీశ్వర్, ఏలూరు శ్రీని వాసరావు నివేదించారని వివరించారు. జేఏసీ కన్వీనర్ మడిపల్లి కాళీచరణ్ గౌడ్, టీఎన్జీవోల జిల్లా కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, గూడ ప్రభాకర్ రెడ్డి, సర్దార్ హర్మిందర్‌సింగ్, లవకుమార్, రాజేశ్ భరద్వాజ్ పాల్గొన్నారు. ఉచిత సైకాలజీ కోర్సులు కరీంనగర్: కరీంనగర్ చైతనా సైకాలజికల్ లెర్నింగ్ సెంటర్ ద్వారా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి ఉచిత సైకాలజీ ఆన్లైన్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఇన్ కౌన్సెలింగ్ సైకాలజీ, చైల్డ్ సైకాలజీ, కెరియర్ కౌన్సెలింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి గ్రాడ్యుయేషన్ లేదా పీజీ సైకాలజీ ఉన్నవారు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవచ్చున్నారు. వివరాలకు 97039 35321 నంబర్‌ను సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. -
నాలుగేళ్లు శ్రమిస్తే.. ముప్పై ఏళ్లు దిగుబడి
● ఆయిల్‌పాం సాగువైపు రైతుల మొగ్గు ● రాయితీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు ● సస్యరక్షణ చర్యలు, మార్కెటింగ్ బాధ్యత కంపెనీదే ● ఈ సారి 3వేల ఎకరాల్లో సాగు లక్ష్యంకరీంనగర్అర్బన్: ఇష్టారీతిగా మందుల పిచికారీ, ఎరువుల వాడకంతో సాగు నేలలు గుల్లబారుతున్నాయి. పంట దిగుబడులు తగ్గుతుండగా పర్యావరణం ప్రమాదంలో పడుతోంది. ఈ క్రమంలో అన్నదాతకు అధిక ఆదాయన్నిచ్చే ఆయిల్‌పాం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నాలుగేళ్లు శ్రమిస్తే 30ఏళ్ల వరకు ఆదాయం వస్తుండగా మందుల పిచికారీ, ఎరువుల వాడకం ఉండదు. జిల్లాలో గత రెండేళ్లలో 2,500 ఎకరాల వరకు సాగు చేయగా తాజాగా ఈ ఆర్థిక సంవత్సరంలో 3వేల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే మానకొండూరు మండలం వేగురుపల్లిలో ముత్తారెడ్డి పంట దిగుబడి పొందుతుండగా ఆదాయాన్ని గడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యా న, వ్యవసాయ శాఖల అధికారులతో పాటు లోహి యా ఎడిబుల్ ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు జిల్లావ్యాప్తంగా రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ సాగు వైపు ప్రోత్సహిస్తున్నారు. 3వేల ఎకరాలు లక్ష్యం జిల్లాలో 3వేల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు దాదాపు 12,000 ఎకరాల్లో ఆయిల్‌పాంను సాగు చేస్తున్నారు. వివిధ మండలాల్లో మరికొంత మంది రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. నాలుగేళ్లు పంట సాగుకు శ్రమిస్తే 30 ఏళ్లపాటు ఏటా ఎకరాకు 10 నుంచి 12 టన్నుల దిగుబడులు తీయొచ్చు. ఒక టన్నుకు రూ.20,000 అయినా ఎకరాకు రూ.2 లక్షల ఆదాయం రైతుకు వస్తుంది. జూలై నుంచి జనవరి వరకు పంట దిగుబడులను తీయొచ్చని అధికారులు చెబుతున్నారు. సబ్సిడీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు ● ఆయిల్‌పాం సాగు చేసే ఎస్సీ, ఎస్టీలకు డ్రిప్ సిస్టం కోసం 100 శాతం సబ్సిడీ ఇస్తుంది. బీసీ రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. ● మొక్కలకు సబ్సిడీ అందించడంతోపాటు బిందు సేద్యం ద్వారా నీరు అందించడానికి డ్రిప్ పరికరాలనూ సబ్సిడీపై అందించనుంది. ఆయిల్‌పాం మొక్కలను 80 శాతం సబ్సిడీపై రూ.1,140 రైతు వాటా చెల్లిస్తే ఎకరాకు 57 మొక్కలు ప్రభుత్వం అందిస్తుంది. ● నాలుగేళ్లు పంట నిర్వహణకు ఎకరాకు రూ.4,200 ప్రభుత్వం రైతుకు ఇస్తుంది. ఇక వచ్చిన పంటను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ● ప్రస్తుతం మానకొండూరు మండలం అన్నారంలో కేంద్రం ఏర్పాటు చేయగా డైరెక్టర్ ఆఫ్ హర్టికల్చర్ నిర్ణయించిన రేట్ల ప్రకారం కొనుగోలు చేయనుండగా దళారీ వ్యవస్థ అసలే ఉండదు. ● పంట చేతికొచ్చే నాలుగేళ్లలో అంతర పంటలుగా మొక్కజొన్న, పత్తి, పెసర, మినుములు, బొబ్బర, వేరుశనగ మొదలగు పంటలను సాగు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. -
విద్యార్థులకు ప్రాథమిక విద్యే పునాది
● ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి ● ఉపాధ్యాయులకు కలెక్టర్ పమేలా సత్పతి సూచనకొత్తపల్లి(కరీంనగర్): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదుశాతాన్ని పెంచి, నాణ్యమైన విద్యను అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. విద్యార్థుల భవిష్యత్‌కు ప్రాథమిక విద్య పునాదిలాంటిదని, ఉపాధ్యాయులు సేవా దృక్పథంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం కొత్తపల్లిలోని సెయింట్ జార్జ్ పాఠశాలలో నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి బుధవారం హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. పిల్లలకు విద్య నేర్పడంతో పాటు ఉపాధ్యాయులు సైతం విభిన్నమైన కొత్త అంశాలను నేర్చుకోవాలన్నారు. జిల్లా యంత్రాంగం తరఫున ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న ట్రైనింగ్ మెటీరియల్ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సెయింట్ జార్జ్ పాఠశాలలో సుమారు 60మంది ప్రభుత్వ విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహిస్తున్నారు. ఆ విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. వారి శిక్షణ తీరును అడిగి తెలుసుకున్నారు. క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్‌రెడ్డి, సెయింట్ జార్జ్ పాఠశాల చైర్మన్ ఫాతిమారెడ్డి, ఎంఈవోలు పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2025
‘కొత్తపల్లికి చెందిన ఓ విద్యార్థికి ఆర్ట్స్ గ్రూపు అంటే ఇష్టం. చిన్నతనం నుంచే సోషల్ సంబంధిత సబ్జెక్టులపై పట్టు సాధించాడు. గ్రూప్స్ రాయాలనేది అతని కోరిక. పది పూర్తయ్యాక ఆర్ట్స్ గ్రూపులో చేరాలనుకున్నాడు. ఇంట్లో పెద్దల బలవంతంతో ఎంపీసీలో చేరాడు. అతను చదువలేక ఫెయిలయ్యాడు.’ ‘లింగన్నపేటకు చెందిన మరో విద్యార్థికి సీఏ చేయాలన్నది కోరిక. పది పూర్తయ్యాక ఎంఈసీలో చేరాలనుకున్నాడు. తల్లిదండ్రులేమో కొడుకును ఇంజినీర్‌గా చూడాలనుకున్నారు. బలవంతంగా ఎంపీసీలో చేర్పించారు. అయిష్టంతో చదివిన అతను పాస్‌మార్కులతో గట్టెక్కాడు. ఇంజినీరింగ్‌లో సీటు రాకపోవడంతో డిగ్రీలో ఆర్ట్స్ చదువుతున్నాడు.నా కొడుకును ఇంజినీర్‌గా చూడాలి.. డాక్టర్‌ను చేయాలి.. సీఏ చదివించి బాగా సంపాదించాలి... ఇలా తల్లిదండ్రులు తమ ఇష్టాలను పిల్లలపై రుద్దుతున్నారే తప్ప.. పిల్లల ఇష్టాలు.. అభీష్టాలు ఏంటి.. అని ఆలోచించే వారు కరువయ్యారు. సాఫ్ట్‌వేర్‌గా.. డాక్టర్‌గా బోలెడంతా డబ్బు సంపాదించాలనే ధ్యాసతోనే పదోతరగతి పాసైన తమ పిల్లలను ఎంపీసీ, బైపీసీలో చేర్పిస్తున్న తల్లిదండ్రులే ఎక్కువ ఉన్నారు. అసలు వారికి ఏ సబ్జెక్టుపై మక్కువ ఉందో తెలుసుకోవడం లేదు. తల్లిదండ్రులు చెప్పిన కోర్సులో చేరి.. సబ్జెక్టులు అర్థంకాక.. కార్పొరేట్ కాలేజీల్లో ఒత్తిడి భరించలేక చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరికొందరు ఇంటర్ ఫెయిల్ అయి ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నారు. ప్రస్తుతం పదో తరగతి ఫలితాలు వెలువడడంతో ఇంటర్లో ప్రవేశాలు తీసుకుంటున్నారు. అసలు పిల్లలకు ఏ సబ్జెక్టులు అంటే ఇష్టమో తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ఏ గ్రూప్‌లో చేరాలో నిర్ణయం తీసుకోవాల్సిన స్వేచ్ఛ ఇస్తేనే వారు ఎంచుకున్న సబ్జెక్టులో ఉత్తమ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులకు ఇష్టమైన సబ్జెక్టులను బలవంతంగా రుద్దడం కాకుండా.. వారికి ఇష్టమున్న సబ్జెక్టులను చదివేలా చూడాలని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. – వివరాలు 8లోuన్యూస్‌రీల్ -
సరికొత్తగా కరీంనగర్ రైల్వేస్టేషన్
● అమృత్‌భారత్ పథకంలో రూ.25కోట్లతో ఆధునీకరణ ● నేడు వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ ● హాజరు కానున్న కేంద్ర మంత్రి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నంకరీంనగర్రూరల్: రైలు ప్రయాణం మరింత సౌకర్యంగా ఉండేందుకు రైల్వేస్టేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. భారత్ అమృత్ మాల పథకం కింద 2023 ఆగస్టు 6న కరీంనగర్ రైల్వేస్టేషన్ ఆధునీకరణకు రూ.25.85 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో రైల్వేస్టేషన్‌ను ఎయిర్‌పోర్టు తరహాలో అభివృద్ధి చేశారు. గురువారం ఉదయం9.30గంటలకు న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌గా కరీంనగర్ రైల్వేస్టేషన్‌ను ప్రారంభించనుండగా.. కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేరుగా పాల్గొంటారు. రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్ రైల్వేస్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఆధునిక వసతులు కల్పించారు. ప్రస్తుతం ఉన్న స్టేషన్ భవనం పక్కనే మరో కొత్త భవనాన్ని నిర్మించారు. ప్రయాణికుల కోసం విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, టికెట్ బుకింగ్ కౌంటర్, షాపింగ్‌కాంప్లెక్స్ నిర్మించారు. గతంలో ఒక్కటే ఫ్లాట్‌ఫాం ఉండగా కొత్తగా 2,3 ఫ్లాట్‌ఫామ్స్ ఏర్పాటు చేశారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జితోపాటు రెండు లిఫ్టులు, రెండు ఎస్కలేటర్లు నిర్మించారు. కమర్షియల్ ఇన్స్పెక్టర్, స్టేషన్ మేనేజర్, చీఫ్ గూడ్స్ సూపర్వైజర్, డెప్యూటీ స్టేషన్ మేనేజర్లకు ప్రత్యేక కార్యాలయాలు నిర్మించారు. ప్రత్యేకంగా వాహనాల పార్కింగ్‌తోపాటు అతిపెద్ద జాతీయజెండా, ప్రధాన రోడ్డు నుంచి స్టేషన్ రోడ్డులో సెంట్రల్‌లైటింగ్ ఏర్పాటు చేశారు. విద్యుత్ అవసరాల కోసం 115 కిలోవాట్ల సోలార్ పవర్‌ప్లాంట్ నిర్మించారు. -
సూచనలు, మార్కెటింగ్
ఆయిల్‌పాం సాగుకు జిల్లాలోని నేలలు అనుకూలం. రైతులకు రాయితీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు ఇవ్వడంతో పాటు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తాం. పంట కోతకు వచ్చాక మేమే మార్కెటింగ్ నిర్వహిస్తాం. ఎకరాకు 57 మొక్కలు అవసరం కాగా ఒక మొక్క పూర్తి ఖర్చు రూ.198 కానీ, సబ్సిడీపై రైతులకు ఒక మొక్కను కేవలం రూ.20 అందిస్తున్నాం. – కె.విజయ్‌భరత్, ప్రాజెక్ట్ మేనేజర్, లోహియా ఎడిబుల్ ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్ రైతుల నుంచి స్పందన ఆయిల్‌పాం సాగుకు రైతుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. జిల్లాలో ఇప్పటికే ప్రతీ మండలంలో వంద ఎకరాలకు పైగా సాగులో ఉంది. ప్రభుత్వం అదనంగా మరో 3వేల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించింది. తదనుగుణంగా సదస్సులు నిర్వహిస్తుండగా రైతులు ముందుకొస్తున్నారు. – ఆర్.శ్రీనివాసరావు, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి -
ఎన్టీపీసీ ప్లాంట్‌లో ప్రమాదం .. ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ ప్రాజెక్టులో వేడిఆయిల్ లీకేజీ కావడంతో ఇద్దరు కాంట్రాక్టు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. రామగుండం ప్రాజెక్టు స్టేజ్–2లోని 500 మెగావాట్ల నాలుగో యూనిట్ ప్రాంతంలో ఫ్యాబ్ ఎరెక్టర్స్ సంస్థలో బుధవారం ఉదయం షిప్టులో లక్ష్మీపురం గ్రామానికి చెందిన సిరవేన కొమురయ్య, అన్నపూర్ణకాలనీకి చెందిన మహ్మద్ అంకూస్ విధులు నిర్వహిస్తున్నారు. ఆయిల్ ఫైర్ చేసేందుకు ఉన్న ట్యాంకుల నుంచి వేడి ఆయిల్ టర్బైన్‌కు వెళ్తున్న క్రమంలో అకస్మాత్తుగా లీకేజీ కావడంతో కాంట్రాక్టు కార్మికులపై పడింది. దీంతో తోటి కాంట్రాక్టు కార్మికులు ప్రమాద విషయాన్ని అధికారులకు తెలియజేశారు. వెంటనే అంబులెన్స్ ద్వారా ఇద్దరు కార్మికులను చికిత్స నిమ్తితం పర్మినెంట్ టౌన్‌షిప్‌లోని ధన్వంతరి ఆస్పత్రిలో చేర్పించారు. సిరవేన కొమురయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. అంకూస్‌కు చికిత్స కొనసాగిస్తున్నారు. ప్రమాద స్థలాన్ని అధికారులు సందర్శించి విచారణ చేస్తున్నట్లు సమాచారం. -
భూసేకరణ పరిహారం ఫైళ్లు మాయం
సిరిసిల్ల: జిల్లాలో భూసేకరణకు సంబంధించిన ఫైళ్లు మాయమయ్యాయి. జిల్లాలో భారీ, మధ్యతరహా జలాశయాల నిర్మాణాలు, కాల్వలు, రోడ్ల నిర్మాణాలకు సంబంధించి రెవెన్యూ అధికారులు పట్టాభూములను సేకరించారు. ప్రజాప్రయోజనార్థం ప్రజల నుంచి సేకరించిన భూములకు సంబంధించిన రికార్డులు(ఫైళ్లు) జిల్లా రెవెన్యూ అధికారుల వద్ద కనిపించడం లేదు. గతంలో జరిగిన భూసేకరణ, పరిహారం చెల్లింపుల ఫైళ్లు మాయం కావడంపై జిల్లా అధికారులు అయోమయానికి గురయ్యారు. గతంలో జిల్లాలో పనిచేసిన రెవెన్యూ అధికారులు ఆ రికార్డులను మాయం చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. మధ్యమానేరు జలాశయానికి సంబంధించి అప్పటి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(ఎస్డీసీ) నటరాజ్ ఫైళ్లు మాయం చేశారని అతనిపై అప్పట్లోనే కేసు నమోదైంది. అతని వద్ద ఫైళ్ల రికవరీకి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తరువాత జిల్లాలో మధ్యమానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలు–9, 8, 7, 6, 5లకు సంబంధించిన భూసేకరణలు భారీ ఎత్తున జరిగాయి. మొత్తంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన భూసేకరణకు సంబంధించిన పరిహారం చెల్లింపుల ఫైళ్లు మాయం కావడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వానికి నివేదిక.. కేసు నమోదుకు అవకాశం సిరిసిల్ల, వేములవాడ రెవెన్యూ డివిజన్ల పరిధిలో భూసేకరణ ఫైళ్లు కనిపించడం లేదు. ఆ రెండు ఆఫీస్‌ల్లో పూర్తి స్థాయిలో వెదికిన అధికారులు రికార్డులు లేవని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఇదే విషయాన్ని జిల్లా రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈమేరకు రికార్డులను మాయం చేసిన గతంలో ఇక్కడ పనిచేసిన ఆర్డీవోపై కేసు నమోదు చేయాలని భావిస్తున్నారు. ఎన్ని ఫైళ్లు మాయమయ్యాయి.. ఎంత మేరకు పరిహారం చెల్లించారు.. ఎన్ని ఎకరాలకు చెల్లించారు.. ఎందుకు రికార్డులు మాయం చేశారు అనే అంశాలను బయటకు రాకుండా జిల్లా అధికారులు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా రాజన్నసిరిసిల్ల జిల్లాలో భూసేకరణ ఫైళ్ల మాయం రెవెన్యూ అధికారుల్లో చర్చనీయాంశమైంది. గతంలో ఇక్కడ పనిచేసిన ఆర్డీవోపై కేసు నమోదై, పూర్తి స్థాయి విచారణ జరిగితే భూసేకరణలో జరిగిన అక్రమాలన్నీ బయటపడనున్నాయి. దీనిపై జిల్లా స్థాయిలో ప్రత్యేకాధికారి పూర్తి స్థాయిలో వివరాలను క్రోఢీకరిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం విశేషం. అధికారుల అయోమయం జిల్లాలో పనిచేసిన అధికారిపై కేసు నమోదుకు సిఫార్సు -
బదిలీలకు పచ్చజెండా
● ప్యాక్స్ సీఈవోలతో పాటు స్టాఫ్ అసిస్టెంట్లకు బదిలీ ● ఏళ్లుగా తిష్టవేసిన వారికి స్థానచలనం ● ఫెవికాల్ బంధం వీడేనా..?కరీంనగర్ అర్బన్: ఏళ్ల తరబడి ఒకే చోట విధులు నిర్వహిస్తున్నవారికి బదిలీలు తప్పవిక. సహకారశాఖలో కొందరు దశాబ్దాలుగా ఒకే ప్రాంతంలో పని చేస్తుండగా వారితో పాటు స్టాఫ్ అసిస్టెంట్లకు బదిలీ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన జీవో నంబర్ 44 జారీ చేసింది. అన్ని శాఖల్లో రెండేళ్లకోసారి బదిలీలు జరుగుతుండగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)లో మాత్రం కొన్నేళ్లుగా బదిలీలు లేవు. దీంతో కొందరు సీఈవోలు దశాబ్దాల తరబడి సొసైటీల్లో ఉండి సదరు సొసైటీలను దెబ్బతీయడమే గాక రైతుల పేర్లతో రుణాలను నొక్కేశారు. ఈ విషయంలో ఉమ్మడి జిల్లాలో పలువురు సస్పెండ్ అయిన విష యం తెలిసిందే. సొసైటీల చైర్మన్లు, డైరెక్టర్లను లెక్కచేయకుండా పెత్తనం చెలాయిస్తూ తలనొప్పిగా మారిన సీఈవోలు అంతా కూడబలుక్కుని స్వాహా చేసినవారున్నారు. ఈ క్రమంలో బదిలీలు జరగనుండగా సొసైటీలు గాడినపడే అవకాశముంది. దశాబ్దాలుగా పాతుకుపోయారు ఉమ్మడి జిల్లాలో 128 పీఏసీఎస్‌లు ఉన్నాయి. చాలా సొసైటీల్లో 20 ఏళ్లకుపైగా సీఈవోలు తిష్టవేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పలు చోట్ల సీఈవోలే షాడోగా వ్యవహరిస్తూ చైర్మన్లను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ప్రతీ సొసైటీకి చైర్మన్ ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. సీఈవోలు మాత్రం ఉద్యోగ విరమణ చేసేంత వరకు తమను ఏమీ చేయలేరనే ఆలోచనతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సొసైటీల సీఈవోలతో పాటు స్టాఫ్ అసిస్టెంట్ల బదిలీకి నిర్ణయించింది. మూడు నుంచి ఐదేళ్ల సర్వీస్ పూర్తయిన వారిని వెంటనే బదిలీ చేయాల్సి ఉండగా ప్రభుత్వం జీవో జారీచేసింది. ఎస్‌ఎల్‌ఈసీ మార్గదర్శకాల మేరకు పీఏసీఎస్‌లలో సీఈవోల బదిలీలను టెస్కాబ్ పర్యవేక్షించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టెస్కాబ్ అధికారులు డీసీసీబీ, సొసైటీల్లో బదిలీల ప్రక్రియపై దృష్టి సారించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం 128 సొసైటీలకు చెందిన సీఈవో లను, స్టాఫ్ అసిస్టెంట్లను ఎక్కడి నుంచి ఎక్కడికై నా బదిలీ చేసే వీలుంది. కొన్ని నెలల క్రితం సొసైటీల పాలకవర్గాలు సీఈవోలను తొలగించాలని తీర్మానాలు చేసి డీసీఈవోలతో పాటు డీసీసీబీ సీఈవోకు, టెస్కాబ్‌కు సైతం వాటిని పంపినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆదేశాల మేరకు అధికారుల బదిలీలకు జీవో 44ను జారీ చేశారు. త్వరలో డీఎల్‌ఈఎస్ సమావేశం రాష్ట్ర ప్రభుత్వం సీఈవోలను, స్టాఫ్ అసిస్టెంట్లను బదిలీ చేయడానికి నిర్ణయించి జీవో జారీ చేయడంతో ఎస్‌ఎల్‌ఈసీ సమావేశం నేడో, రేపో జరగనుంది. ఎస్‌ఎల్‌ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో డీఎల్ఈసీ సమావేశాన్ని ఉమ్మడి జిల్లాలో నిర్వహిస్తారు. ఈ కమిటీలో డీసీసీబీ చైర్మన్‌తో పాటు డీసీసీబీ సీఈవో, డీసీవో, నాబార్డు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధికారులు ఉంటారు. వాస్తవానికి ఈ కమిటీ ఎప్పటికప్పుడూ సొసైటీల్లో చైర్మన్లు, సీఈవోలకు ఇబ్బందులు వచ్చినప్పుడు సమన్వయపర్చడం, అవసరమైతే సీఈవోను బదిలీ చేయడం వంటివి చేయాలి. ఏళ్లుగా సీఈవోల బదిలీల విషయంలో టెస్కాబ్ నిర్ణయం తీసుకోకపోవడం, డీఎల్‌ఈఎస్ సమావేశాలు నిర్వహించకపోవడంతో ఇంతకాలం సీఈవోలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.ఉమ్మడి జిల్లా వివరాలు ప్రాథమిక సహకార సంఘాలు: 128 సహకార కేంద్ర బ్యాంకు శాఖలు: 67 బ్యాంకు ఉద్యోగులు: 552 సొసైటీ ఉద్యోగులు: 1700 -
ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సిందే
కరీంనగర్‌స్పోర్ట్స్: ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజ రైన సంజయ్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పెహల్గాం ఘటన అనంతరం దేశ ప్రజల్లో మార్పు వచ్చిందన్నారు. ఉగ్రవాద నిర్మూలన కోసం జరిగే యుద్ధంలో అవసరమైతే సామాన్య ప్రజలు కూడా పాల్గొనేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. మొన్నటి పాకిస్తాన్ కుట్ర సమయంలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు దేశ సైన్యానికి మద్దతుగా నిలవడం దేశభక్తికి నిదర్శనమన్నారు. యాంటీ టెర్రరిజం డే ర్యాలీని నిర్వహించేందుకు క్రికెట్ సంఘం, క్రీడాకారులు ముందుకు రావడం సంతోషంగా ఉందని అభినందించారు. జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి.ఆగంరావు, ఎన్.మురళీధర్‌రావు, సంయుక్త కార్యదర్శి పి.మనోహర్‌రావు, బండి శ్రవణ్‌కుమార్, బి.రామేశ్వర్రావు పాల్గొన్నారు.● యాంటీ టెర్రరిజం డే ర్యాలీలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ -
చదవనిద్దాం.. ఎదగనిద్దాం
గంభీరావుపేట(సిరిసిల్ల): విద్యార్థి దశలో పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత వేసే అడుగే కీలకం. ఇంటర్లో సరైన అడుగు పడితేనే జీవితంలో త్వరగా స్థిరపడతాం. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. తమ పిల్లల ఆసక్తిని తెలుసుకొని ప్రొత్సహించినప్పుడే భవిష్యత్‌లో రాణించగలుగుతారు. ఈ సత్యాన్ని తల్లిదండ్రులు తెలుసుకోవాలని విద్యావేత్తలు, మానసిక నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులకు ఇష్టమైన కోర్సులను పిల్లలపై బలవంతంగా రద్దువద్దని కోరుతున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో 10 ప్రభుత్వ కళాశాలలు, 31 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో 14 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో 15 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. అడ్మిషన్.. ఆలోచించాల్సిన సమయం పదోతరగతిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. కరీంనగర్ జిల్లాలో 12,245 మంది, రాజన్నసిరిసిల్లలో 6,629, పెద్దపల్లిలో 7,157, జగిత్యాలలో 11,636 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరంతా ఇంటర్లో చేరేందుకు సిద్ధమయ్యారు. కొందరు ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు సిద్ధమవగా.. మరికొందరు హైదరాబాద్, కరీంనగర్ వంటి పట్టణాల్లోని కార్పొరేట్ కాలేజీల్లో చేరేందుకు ఇప్పటికే అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు సమాచారం. మరికొందరు విద్యార్థులు పాలీసెట్ రాసి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అత్తెసరు మార్కులతో పాసైన వారు తక్కువ సమయంలో ఉపాధి లభించే ఐటీఐ, ఒకేషనల్ కోర్సులను ఎంచుకోవడం ఉత్తమమని విద్యావేత్తలు సూచిస్తున్నారు. అయితే ఏం చదువాలో అనే నిర్ణయం విద్యార్థులకు వదిలేయాలని, సలహాలు.. సూచనలు మాత్రమే ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. పదోతరగతి ఉత్తీర్ణులు కరీంనగర్ 12,245 రాజన్నసిరిసిల్ల 6,629 పెద్దపల్లి 7,157 జగిత్యాల 11,636 -
రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ లెక్చరర్ దుర్మరణం
ధర్మపురి: రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేట్ లెక్చరర్ దుర్మరణం పాలైన ఘటన ధర్మపురిలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై ఉదయ్‌కుమార్ కథనం ప్రకారం.. ధర్మపురికి చెందిన వొడ్నాల భూమేశ్ అలియాస్ భూమేశ్వర్ భార్య బింధు కరీంనగర్లో టీటీసీ చేస్తోంది. ధర్మారం డిగ్రీ కళాశాలలో ప్రైవేటు అధ్యాపకుడిగా పని చేస్తున్నాడు. బింధు ప్రతిరోజూ కరీంనగర్ వెళ్లడానికి ఉదయం బస్టాండ్‌కు వస్తుంది. జగిత్యాల మీదుగా కరీంనగర్ చేరుకుంటుంది. ఎప్పటిలాగే బుధవారం కూడా భర్త భూమేశ్తో కలిసి ద్విచక్రవాహనంపై బస్టాండ్‌కు వచ్చింది. అప్పుడే బస్సు వెళ్లిందని తెలుసుకున్న భూమేశ్ బస్సును అందుకునేందుకు జగిత్యాల వైపు బయల్దేరాడు. పట్టణ శివారులోని పెట్రోల్‌బంక్ వద్దకు రాగానే రాంగ్రూట్లో ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనం వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలిద్దరూ కిందపడ్డారు. భూమేశ్ (43) తలకు బలమైన గాయాలయ్యాయి. బింధు కాలుకు ఫ్యాక్చర్ అయింది. ఇద్దరినీ జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. భూమేశ్ పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. భూమేశ్‌కు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. టాటా ఏస్ వాహనం నడిపింది మైనర్ అని, అతడిది తీగళధర్మారమని పోలీసులు గుర్తించారు. భూమేశ్ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. భూమేశ్ మృతితో భార్యాపిల్లలు, తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
ఒకరి ‘దూరం’.. ఇద్దరినీ ‘చేరువ’ చేసింది
కోనరావుపేట(వేములవాడ): చిన్న చిన్న భేదాలతో పలకరింపునకు దూరమైన సొంత అన్నదమ్ములను బంధువు మరణం కలిపింది. వివరాలు.. కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన మామిండ్ల నాగయ్య, మామిండ్ల రామయ్య సొంత అన్నదమ్ములు. ఇద్దరికీ 64 ఏళ్లకు పైగా వయస్సు ఉంటుంది. ఒకే ఊరిలో ఉంటున్నా చిన్నచిన్న అభిప్రాయ భేదాలతో దశాబ్ద కాలంగా ఒకరికొకరు మాట్లాడుకోవడం లేదు. వృద్ధాప్యానికి చేరువైనా రక్తం పంచుకుని పుట్టిన అన్నదమ్ములు మాట్లాడుకోక పోవడం నాగయ్య కుమారుడు శ్రీనివాస్‌ను కలచివేసింది.ఎలాగైనా ఇద్దరినీ కలపాలని శ్రీనివాస్ కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ, సఫలం కాలేకపోయాడు. ఇదిలా ఉండగా నాగయ్య, రామయ్యల మేనల్లుడు కూన తిరుపతి నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ నెల 18న మూడో రోజు కార్యక్రమం (పిట్టకు పెట్టుడు) నిర్వహించగా, అన్నదమ్ములిద్దరూ హాజరయ్యారు. ఈక్రమంలో ఇద్దరినీ కలపాలని శ్రీనివాస్ భావించాడు. సోదరులు మామిండ్ల అంజయ్య, శ్రీనివాస్, రాజు, తిరుపతి, ఇతర బంధువులకు చెప్పడంతో వారు సహకారం అందించారు. నాగయ్య, రామయ్యకు బంధాల ప్రాధాన్యత వివరించారు. దీంతో ఇద్దరూ చెమర్చిన కళ్లతో ఆలింగనం చేసుకున్నారు. ఆత్మీయంగా పలకరించుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ ఘటన కుటుంబాల ఐక్యతకు ప్రతీకగా సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది.సావుదలకు పట్టింపులెందుకు..మేము వృద్ధాప్యంలోకి వచ్చాం. కాటికి కాలుజాపిన మాకు పట్టింపులు ఎందుకు. గతంలో చిన్నచిన్న కారణాలతో దూరమయ్యాం. ఇక నుంచి ఇద్దరం కలిసే ఉంటాం.– మామిండ్ల నాగయ్యపొరపాట్లను వదిలిపెట్టాంమేము ఐదుగురం అన్నదమ్ములం. ముగ్గురు ఇదివరకే చనిపోయారు. మేమిద్దరం ఉన్నాం. ఉన్న ఇద్దరం కలిసుంటే బాగుంటుందని అనిపించింది. పదేళ్లుగా దూరంగా ఉంటున్న మేము చనిపోయేవరకు కలిసే ఉంటాం.– మామిండ్ల రామయ్య -
నేడు మానస వివాహం.. పెళ్లి పెద్దగా కలెక్టర్ శ్రీహర్ష
రామగుండం(కరీంనగర్): స్థానిక తబితా ఆశ్రమంలో ఉంటున్న నక్క మానస ఆశ్రమం నుంచి అత్తారింటికి వెళ్లే సమయం సమీపిస్తోంది. పెళ్లి కూతురు ముఖంలో ఓ వైపు చిరునవ్వు, మరోవైపు ఆశ్రమ సంరక్షకులను, తోబుట్టువును విడిచి వెళ్తున్నాననే బాధ.. పెద్దపల్లి కలెక్టరేట్లోని దేవాలయంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష వివాహ వేడుక జరిపిస్తున్నారు. కాగా, 2021 మార్చి 15వ తేదీన ఆశ్రమంలో ఆశ్రయం పొందిన గుంజ విజయలక్ష్మి అనే యువతికి హైదరాబాద్‌లోని ఓ వ్యాపారితో వీరేందర్‌నాయక్ వివాహం జరిపించగా, నక్క మానస వివాహం రెండోది. 16ఏళ్ల క్రితమే ఆశ్రమంలో చేరిన అక్కాచెల్లెలు.. సుమారు 16ఏళ్ల క్రితం తల్లిదండ్రులను కోల్పోయిన అక్కాచెల్లెళ్లు నక్క మానస, నక్క లక్ష్మి సంరక్షణ కోసం ఇంటగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ సరీ్వస్(ఐసీపీఎస్) అధికారులు స్పందించి రామగుండంలోని తబితా ఆశ్రమంలో చేరి్పంచారు. ఆనాటి నుంచి ఆశ్రమ నిర్వాహకుడు వీరేందర్‌నాయక్–విమల దంపతులు వారికి తల్లిదండ్రులుగా మారారు. నక్క మానస డిగ్రీ పూర్తి చేయగా, నక్క లక్ష్మి ఇంటర్మీడియట్ పూర్తిచేసింది. చిన్నప్పటి నుంచే చురుకైన పాత్ర.. ఆశ్రమంలో చేరిన సమయం నుంచి చదువులో, ఇంటిపనిలో చురుగా ఉంటోంది. ఇతరులతో మర్యాదగా వ్యవహరించడం తదితర గుణగణాలు కలిగిన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది మానస. ఐదో తరగతి వరకు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో విద్యనభ్యసించగా ఆరు నుంచి పదో తరగతి వరకు మేడారం గురుకుల విద్యాలయంలో చదివి టెన్త్9.8 జీపీఏ, ఎల్లంపల్లి కేజీబీవీలో ఇంటర్మీడియట్ చదివి ఎంపీసీ గ్రూపులో 895 మార్కులు, కరీంనగర్‌లోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో బీఎస్సీ(మ్యాథ్స్) ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. ఎంత చెప్పినా తక్కువే చిన్నప్పటి నుంచి అమ్మానాన్న విమల, వీరేందర్‌నాయక్ అని తెలుసు. కానీ ఓ ఆశ్రమంలో సంరక్షకులుగా మాత్రం నాకు తెలియదు. చిన్నప్పటికీ నా బాధ్యతలు, కష్ట సుఖాలు అన్నీ వారితోనే పంచుకునే దాన్ని. ఇప్పుడు నాకు ఓ వ్యాపారితో వివాహం చేస్తుండడంతో నేను ఇల్లాలిగా మారుతున్నా. అప్పుడు నా చెల్లి నక్క లక్ష్మి, నాతోటి మిత్రులు, నా అమ్మనాన్నలు (సంరక్షకులు)విడిచి వెళ్లలేక పోతున్నా. నా వివాహం కలెక్టర్ జరిపిస్తుండడం మరీ విశేషం. – నక్క మానస, పెళ్లి కూతురు ఆనందమో.. బాధో తెలియడం లేదు పెళ్లీడుకొచ్చిన యువతికి వివాహం జరిపించడం నా కర్తవ్యం. అందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవడం ఊహకందని విషయం. బాల్యం నుంచే మమ్మల్నే తల్లిదండ్రులుగా భావిస్తూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నాం. ఇప్పుడు పెళ్లి చేసి కన్యాదానం చేయడం ద్వారా గుండెలు బరువెక్కుతున్నాయి. పెళ్లి కూతురు చెల్లి లక్ష్మి మరింత ఆవేదనకు లోనవుతుంది. ఆశ్రమంలో పెద్ద మనిగా వ్యవహరిస్తూ అన్ని విషయాల్లో ఎంతో చురుకుగా వ్యవహరించే కూతురు నక్క మానస. భవిష్యత్తులో ఆమె కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. – వీరేందర్‌నాయక్, తబితా ఆశ్రమ నిర్వాహకుడుఆకట్టుకున్న మానస హల్దీ వేడుకలు -
నేతన్నలకు నిరంతర ఉపాధి
● వస్త్రపరిశ్రమకు రూ.736.88 కోట్ల ఆర్డర్లు ● నాణ్యమైన వస్త్రాల ఉత్పత్తిని అలవాటు చేస్తున్నాం ● మార్కెట్‌తో పోటీ పడితేనే పరిశ్రమకు మనుగడ ● ‘సాక్షి’తో టెస్కో జనరల్ మేనేజర్ వి.అశోక్‌రావు వి.అశోక్‌రావు, టెస్కో జనరల్ మేనేజర్, హైదరాబాద్ సిరిసిల్ల: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నేత కార్మికులకు ఉపాధి లభించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసి వస్త్రోత్పత్తి ఆర్డర్లను ఇస్తుందని రాష్ట్ర చేనేత సహకార సంఘాల సమాఖ్య (టెస్కో) జనరల్ మేనేజర్ వి.అశోక్‌రావు అన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ) కోర్సులపై అవగాహన కల్పించేందుకు మంగళవారం సిరిసిల్లకు వచ్చారు. ఈ సందర్భంగా ఇందిర మహిళా శక్తి చీరల ఉత్పత్తి, స్కూల్ యూనిఫామ్స్ వస్త్రాల ఆర్డర్లు, నేతన్నల సంక్షేమ పథకాల అమలుపై ‘సాక్షి’కి వివరించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. ● కొత్త రకం వస్త్రాల ఉత్పత్తి సిరిసిల్లలో దశాబ్దాలుగా చేస్తున్న వస్త్రాల ఉత్పత్తికి భిన్నంగా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్లను ఇచ్చింది. ఇక్కడ సహజంగా 80–90 కౌంట్ యారన్(నూలు) వాడుతూ వస్త్రాలను ఉత్పత్తి చేస్తారు. కానీ, ఇప్పుడు చీరల బట్టను ట్విస్టేడ్ 50 కౌంట్ ధారం(యారన్)తో పవర్‌లూమ్స్‌పై ఉత్పత్తి చేస్తున్నారు. ఈ కొత్త రకం వస్త్రాలు చాలా స్మూత్‌గా ఉంటాయి. ఈ వస్త్రాన్ని ప్రభుత్వానికే కాకుండా బయట బహిరంగ మార్కెట్లోనూ విక్రయించేంత నాణ్యంగా ఉంటాయి. ప్రారంభంలో కొంత ఇబ్బంది ఉన్నా.. కొత్త రకం వస్త్రాల ఉత్పత్తులను నేతన్నలకు అలవాటు చేస్తున్నాం. ఇప్పటికే మూడు వేల మగ్గాలపై 10 లక్షల మీటర్ల ఇందిరా మహిళా శక్తి చీరల బట్ట ఉత్పత్తి అయింది. మగ్గాల మధ్య శ్రమించే కార్మికులకు మీటరుకు రూ.5.25 కూలి చెల్లించాలని స్పష్టం చేశాం. ● ఒక్క చీరకే 4.24 కోట్ల మీటర్ల ఆర్డర్లు ప్రస్తుతం రెండు విడతల్లో 2.12 కోట్ల మీటర్ల చొప్పున 4.24 కోట్ల మీటర్ల చీరల వస్త్రాల ఆర్డర్లు ఇచ్చాం. ఈ వస్త్రం విలువ రూ.318.44 కోట్లు ఉంటుంది. వస్త్రానికి అవసరమైన నూలు(ధారం)ను ప్రభుత్వమే కొనుగోలు చేసింది. సొంతంగా వస్త్రోత్పత్తి చేసే ఆసాములకు చెందిన 49 మ్యాక్స్ సంఘాలకు 577 మెట్రిక్ టన్నుల నూలు అందించాం. ఇంకా గోదాములో 28 టన్నుల నూలు అందుబాటులో ఉంది. మహిళా శక్తి చీరల ఉత్పత్తికి 1,002 మెట్రిక్ టన్నుల నూలు అవసరమని అంచనా వేసి ఆర్డర్లు ఇచ్చాం. వస్త్రోత్పత్తిని బట్టి నూలు అందిస్తాం. ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి కూడా కూలి సర్దుబాటులో భాగంగా 10 శాతం యారన్ సబ్సిడీ అందించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాం. ● 9 గజాల గోచీ చీరల బట్టకు ఇతర ప్రాంతాల్లో ఆర్డర్లు కొందరు మహిళలు 9 గజాల పొడువున్న గోచీ చీరలు కట్టుకుంటారు. వారి కోసం గర్షకుర్తి, బోయినపల్లి, ఉప్పరమల్యాల ప్రాంతాల్లోని వస్త్రోత్పత్తిదారులకు ఆర్డర్లు ఇచ్చాం. 3.50 లక్షల మీటర్ల 9 గజాల కాటన్ చీరల ఉత్పత్తి సాగుతుంది. సిరిసిల్లలో పవర్‌లూమ్స్ (సాంచాలకు), ఇతర ప్రాంతాల్లో కాటన్ చీరల ఆర్డర్లు ఇచ్చాం. చీరల బట్టనే సేకరించి హైదరాబాద్‌లోనే ప్రింటింగ్ చేయించి ఈ ఏడాదిలో ఒక్కో చీరను మహిళా సంఘాల సభ్యులకు అందిస్తాం. ● రెండో విడత కొత్త డిజైన్లు ఇస్తాం మొదటి విడత ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీకి 64 లక్షల చీరలు అవసరం ఉన్నాయి. ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చాం. రెండో విడత కొత్త రకం డిజైన్లు ఆర్డర్లు ఇస్తాం. వాటి ఆర్డర్లు కూడా సిరిసిల్లతో పాటు ఇతర ప్రాంతాల వారికి ఇస్తాం. మొత్తంగా ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్ల ఖరీదు రూ.636.88 కోట్లు ఉంటుంది. ఇవి కాకుండా స్కూల్ యూనిఫామ్స్ ఆర్డర్లు కోటి 25 లక్షల మీటర్లు, వెల్ఫేర్ శాఖలకు సంబంధించి మరో 50 లక్షల మీటర్ల వస్త్రాల ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చాం. వీటి విలువ రూ.వంద కోట్ల మేర ఉంటుంది. మొత్తంగా ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లు రూ.736.88 కోట్ల మేరకు ఉంటాయి. ● స్కూళ్లు తెరిచే నాటికి డ్రెస్ సిద్ధం ఇప్పటికే రాజీవ్ విద్యా మిషన్‌లో స్కూల్ యూనిఫామ్స్ వస్త్రాల ఉత్పత్తి చివరి దశకు చేరింది. కొన్ని స్టిచ్చింగ్ దశలో ఉన్నాయి. పాఠశాలలు తెరిచే నాటికి ఒక్కో విద్యార్థికి డ్రెస్ సిద్ధం అవుతంది. సంక్షేమ శాఖల వస్త్రాల ఉత్పత్తి, సేకరణ సాగుతుంది. గతంలో పొరుగు రాష్ట్రాల నుంచి వస్త్రాలను టెండర్ ద్వారా కొనుగోలు చేసి అందించే వారు. తెలంగాణ వచ్చిన తర్వాత స్థానిక నేతన్నలకు పని కల్పించే లక్ష్యంతో వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇస్తుంది. ● దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాల అమలు దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది. పవర్లూమ్, అనుబంధ రంగాల కార్మికులు, చేనేత (హ్యాండ్లూమ్) కార్మికులకు పొదుపు అలవాటు చేసేందుకు త్రిఫ్ట్ పథకాన్ని అమలు చేస్తుంది. పవర్లూమ్ కార్మికులు నెలకు గరిష్టంగా రూ.1,200 పొదుపు చేస్తే, ప్రభుత్వం అంతే మొత్తం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. రెండేళ్ల తర్వాత వడ్డీతో సహా దాదాపు రూ.65 వేలు పొందవచ్చు. అదే చేనేత కార్మికులు రూ.1,200 పొదుపు చేస్తే ప్రభుత్వం రూ.2,400 జమ చేస్తుంది. అంటే ప్రతి నెలా రూ.3,600 కార్మికుడి ఖాతాలో జమవుతాయి. రెండేళ్ల తర్వాత రూ.లక్ష వరకు వస్తాయి. నేత, పవర్లూమ్ కార్మికులు వృత్తిలో ఉండి ఏ విధంగా చనిపోయినా.. నేతన్న బీమా పథకంలో రూ.5లక్షల ఆర్థిక సాయం అందుతుంది. నేతన్నలు పొదుపు అలవాటు చేసుకుని, వృత్తిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నైపుణ్యం పెంచుకుని, నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేయాలి. ఆ దిశగా అడుగులు వేస్తేనే పరిశ్రమకు మనుగడ ఉంటుంది. -
తెలంగాణలో స్కిల్ సర్వే ప్రారంభం
● నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగం ● రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రామగిరి(మంథని): తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందని, జూన్ తొలివారంలో స్కిల్ సర్వే ప్రారంభమవుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్‌బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీకాలనీలో సింగరేణి ఆర్జీ–3 జీఎం సుధాకర్‌రావు అధ్యక్షతన మంగళవారం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. స్కిల్ డెవలప్మెంట్ పైలెట్ ప్రాజెక్టులుగా సీఎం నియోజకవర్గం కొడంగల్, మంథని నియోజకవర్గాలను ఎంపిక చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే 57వేల ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. నైపుణ్యం ఉన్నవారికి కచ్చితంగా ఉద్యోగం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిండం కోసం సింగరేణి సీఎండీతో మాట్లాడి సెంటినరీకాలనీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని కళాశాలగా అభివృద్ధి చేసి ఇక్కడే నుంచే నియామకాలు చేపట్టేలా కృషి చేయాలని సూచించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణశ్రీ, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, ఏపీఏ, ఆర్జీ–1, హెచ్ఆర్డీ జీఎంలు నాగేశ్వరరావు, లలిత్ కుమార్, గుంజపడుగు రఘుపతి, మంథని ఆర్డీవో సురేశ్, పర్సనల్ విభాగాధిపతి సుదర్శనం, అధికారి శ్రీహరి, ప్రతినిధులు రాజ్‌కుమార్, రాంచంద్రారెడ్డి, కోట రవీందర్‌రెడ్డి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. జూన్ తొలివారంలో పోలీసుస్టేషన్లు ప్రారంభం సాక్షి పెద్దపల్లి: వచ్చే జూన్ తొలివారంలో జిల్లాలోని నాలుగు పోలీస్స్టేషన్లు ప్రారంభిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. కాళేశ్వరంలో ఏనాడూ లేనివిధంగా ఏర్పాట్లు చేశామన్నారు. కాశీ మాదిరిగా హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఏర్పాట్లు బాగోలేవని ఎంపీ బండి సంజయ్ విమర్శించడం సరికాదని అన్నారు. వచ్చే గోదావరి పుష్కరాల కోసం ఎంపీలు కిషన్‌రెడ్డి, సంజయ్ కేంద్రప్రభుత్వం నుంచి రూ.వెయ్యి కోట్లు తీసుకురావాలని, అంతర్గాంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం కేంద్రమంత్రిని కలిసివినతి పత్రం ఇచ్చామన్నారు. విమానాశ్రయం ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. మిస్ వరల్డ్ పోటీలతో డబ్బులు వృథా చేస్తున్నామని వాట్సప్ యూనివర్సిటీలో విషప్రచారం చేస్తున్నారని, పోటీల ద్వారా తెలంగాణ సంస్కృతి, వైభవాన్ని ప్రపంచానికి చాటేందుకే నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో కోకాకోలా ఫ్యాక్టరీ నిర్మాణానికి ఓ కంపెనీ ముందుకు వచ్చిందన్నారు. ఎంపీ వంశీకృష్ణతో ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు. రాష్ట్రపతికి ఎవరైనా ఫిర్యాదు చేసుకోవచ్చని, కానీ దానికి వ్యాలిడిటీ ఉండాలన్నారు. పెద్దపల్లి, సుల్తానాబాద్ బైపాస్‌లు టెండర్ దశకు వచ్చాయని, పత్తిపాక రిజర్వాయర్‌కు డీపీఆర్ సిద్ధమవుతోందని తెలిపారు. రామగుండంలో థర్మల్ పవర్‌ప్లాంట్ నిర్మిస్తామన్నారు. -
అంజన్న పెద్ద జయంతి ఉత్సవాలు ప్రారంభం
● భద్రాచలం శ్రీసీతారాముల ఆలయం నుంచి పట్టువస్త్రాలు ● స్వామివారికి సమర్పించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ● అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ● తరలివస్తున్న హనుమాన్ దీక్షాపరులుమల్యాల: కొండగట్టులోని శ్రీఆంజనేయస్వామి పెద్ద జయంతి ఉత్సవాలు మంగళవారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే వేలాదిమంది మంది కొండగట్టుకు చేరుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు కిక్కిరిపోయాయి. శ్రీదేవి, భూదేవి, శ్రీవేంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్థానాచార్యులు కపీందర్, ప్రధాన అర్చకులు జితేంద్ర స్వామి, రామకృష్ణ, రఘు, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవమూర్తులను యాగశాలలో ప్రవేశింపజేశారు. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర ఆలయం నుంచి ఆలయ ఈఓ ఎల్.రమాదేవి పట్టువస్త్రాలు తీసుకురాగా.. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఆలయ ఈఓ శ్రీకాంత్‌రావు, అర్చకులు ఒగ్గుడోలు చప్పుళ్లు, శ్రీరాముడు, సీతాదేవి, హనుమానంతుని వేషధారణలతో భక్తులు, మహిళల కోలాటం, మంగళహారతులతో స్థానిక వైజంక్షన్ నుంచి ఆలయం వరకు శోభాయాత్ర చేపట్టి స్వామివారికి సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిమంది కొండగట్టుకు తరలిరానున్నారని, వారికి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్, వివిధ విభాగాల అధికారులు ఏర్పాట్లు చేపట్టారని అన్నారు. పెద్ద జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కొండగట్టులో పటిష్ట భద్రత హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా కొండగట్టులో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. జెఎన్టీయూలో పోలీస్ సిబ్బందితో సమావేశమయ్యారు. ఉత్సవాలకు 800మంది పోలీస్ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశామన్నారు. భక్తులందరూ క్షేమంగా తిరిగి వెళ్లేలా పనిచేయాలన్నారు. వాహనాలను క్రమపద్ధతిలో పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీఎస్పీలు వెంకటరమణ, రాములు, ఎస్బీ ఇన్స్పెక్టర్ అరిఫ్ అలీఖాన్, సీఐలు నీలం రవి, రాంనరసింహారెడ్డి పాల్గొన్నారు. -
నృసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీ
ధర్మపురి: శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి గోదావరిలో స్నానాలు చేసి స్వామివార్లను దర్శించుకున్నారు.ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు? జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని గంజ్ చౌరస్తా సమీపంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. విషయం పోలీసుల వరకు చేరడంతో వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తవ్వకాలు చేపట్టిన ప్రాంతాన్ని పరిశీలించారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన సిరిసిల్లకు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా.. సదరు ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో పూజలు నిర్వహించారని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.వికసించిన మే పుష్పంయైటింక్లయిన్కాలనీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్ 17వ డివిజన్ సంతోష్‌నగర్ ఏరియాలో నివాసం ఉంటున్న బత్తుల రమేశ్ ఇంట్లో మే పుష్పం వికసించింది. ఏటా మే నెలలోనే ఈ పుష్పం వికసిస్తుందని, మంగళవారం వికసించడంతో స్థానికులు వచ్చి చూసి ముచ్చటపడుతున్నారని రమేశ్ తెలిపారు. -
రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు
కరీంనగర్ అర్బన్: పచ్చిరొట్ట విత్తనాలను 50శాతం రాయితీపై రైతులకు అందిస్తున్నామని, జిల్లాకు 97,200 క్వింటాళ్లు కేటాయించామని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారు. మంగళవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ ప్రాంతీయ మేనేజర్‌తో కలిసి కలెక్టరేట్ ఆడిటోరియంలో వానాకాలానికి కావల్సిన విత్తనాలపై సమీక్షించారు. విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా 97,200 క్వింటాళ్లు పచ్చిరొట్ట విత్తనాలను జిల్లాకు సరఫరా చేయనున్నట్లు వివరించారు. నాణ్యమైన వరి విత్తనాలు 1.20లక్షల క్వింటాళ్లు, కంది 150 క్వింటాళ్లు, పెసర 200 క్వింటాళ్లు, మినుము 400 క్వింటాళ్లు, వేరుశనగ 1775 క్వింటాళ్లు అందిస్తున్నట్లు తెలిపారు. వీటికి రాయితీ లేదని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అందిస్తున్న వివిధ పంటల బ్రీడర్ విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ సేకరించి రైతుల సహకారంతో మూల విత్తనాలుగా ఉత్పత్తి చేసి, నాణ్యమైన విత్తనాలుగా మళ్లీ రైతులకు అందజేస్తోందని తెలిపారు. డీలర్ల దగ్గర విత్తనాలు తీసుకునేటప్పుడు రసీదు ట్యాగ్, లేబుల్ జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని, నకిలీ విత్తనాలపై అవగాహన క ల్పించాలని మండల వ్యవసాయ అధికారులను ఆ దేశించారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ తమ సొంత విక్రయ కేంద్రాల్లో ఆరుశాతం రాయితీతో విత్తనాలను అందిస్తోందని అన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాంతీయ మేనేజర్ వి ష్ణువర్ధన్ రెడ్డి, విత్తన అధికారి మౌనిక పాల్గొన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి -
ఆపరేషన్ చేయకుండా జాప్యం
● 16 గంటలపాటు ఇబ్బందుల్లో మహిళా పేషెంట్ కోల్‌సిటీ(రామగుండం): పేషెంట్లు, వారి బంధువులతో గౌరవంగా ఉండాలని, విసుక్కోకుండా ఓపిగ్గా సమాధానాలు చెబుతూ.. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లోని సేవలపై నమ్మకం కలిగించేలా వ్యవహరించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచనలు చేస్తున్నా.. ఆశించిన రీతిలో మార్పు కనిపించడం లేదని విమర్శలు వెల్లువెత్తున్నాయి. మంగళవారం ఓ పేషెంట్‌పై ఆస్పత్రి సిబ్బంది వహించిన నిర్లక్ష్యంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేషెంట్ సోదరి కుమారుడు గణేశ్ కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలానికి చెందిన చిటికెల సత్తక్క ఈనెల15న ఇంట్లో జారిపడింది. మరుసటి రోజున గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో చూపించారు. పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయాలని అడ్మిట్ చేసుకున్నారు. మంగళవారం ఆపరేషన్ చేస్తామని చెప్పిన వైద్యులు, సిబ్బంది.. సోమవారం సత్తక్కకు ఎనిమా ఇచ్చి, యూరిన్ పైప్ వేశారు. ఆపరేషన్ పూర్తయ్యేంత వరకు ఎలాంటి ఆహారం తీసుకోవద్దని చెప్పారు. దీంతో మంగళవారం ఉదయం 9 గంటల వరకు ఆహారం తీసుకోలేని సత్తక్కకు, ఆపరేషన్ ఎప్పుడు చేస్తారో తెలుసుకోవడానికి గణేశ్ సిబ్బందిని అడిగాడు. ఆపరేషన్ చేస్తామని మీకు ఎవరు చెప్పారు? పేషెంట్‌కు ఆపరేషన్ లేదు? అంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. కంగుతిన్న పేషెంట్ బంధువులు, మేం అడిగేంత వరకు ఆపరేషన్ చెయ్యమని చెప్పకుండా, పేషెంట్ ఏమీ తినకుండా నిర్లక్ష్యంగా వదిలేస్తే, నీరసించిపోయి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులని నిలదీశారు. ఈమేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్ దయాల్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. స్పందన రాకపోవడంతో గణేశ్ మీడియాకు తెలియజేస్తానని నేరుగా గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌కు వచ్చాడు. ప్రెస్క్లబబ్ మూసి ఉండడంతో తిరిగి ఆస్పత్రికి వెళ్లిన గణేశ్.. డ్యూటీ డాక్టర్ రేణుకు ఫిర్యాదు చేశాడు. స్పందించి ఆర్ఎంవో రేణుక.. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై మరో ఆర్ఎంవో రాజును వివరణ కోరగా, సాధారణంగా ఆపరేషన్ల నిర్వహణకు అనుకున్న వారి కంటే ఒకరిద్దరు పేషెంట్లను ఎక్కువగా సిద్ధంగా ఉంచుతామని, ఎంపిక చేసిన వారిలో ఎవరికై నా బీపీ తదితర అనారోగ్య సమస్యలు అకస్మాత్తుగా పెరిగితే వారికి ఆపరేషన్ చేయకుండా వాయిదా వేసి, మిగితా వారికి ఆపరేషన్లు నిర్వహిస్తామని వివరించారు. సత్తక్క పేషెంట్‌ను కూడా ఇదే తరహాలో సిద్ధం చేసినట్లు తెలిపారు. కానీ కమ్యూనికేషన్ లోపంతో ఇలా జరిగి ఉండొచ్చని, ఇందులో పేషెంట్‌కు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటున్నట్లు తెలిపారు. -
ఇల్లు గడిచేదెలా..
● ఏం కొనేలా లేదు.. ఏం తినేలా లేదు ● మండిపోతున్న కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు ● పెరిగిన రేట్లతో పేద, సామాన్యుల బెంబేలు ● ధరల నియంత్రణపై పర్యవేక్షణ కరువు‘హుజూరాబాద్‌కు చెందిన ప్రవీణ్ ఆటోడ్రైవర్. నెలకు రూ.15 వేలవరకు సంపాదిస్తాడు. గతేడాది వరకు ఆయనకు వచ్చే ఆదాయం అక్కడికక్కడే సరిపోయేది. పెరిగిన నిత్యవసర సరుకుల ధరలతో తన సంపాదన సరిపోయే పరిస్థితిలేదు. దీంతో ఆయన భార్య ఓ షాపింగ్‌మాల్‌లో రూ.5 వేలకు పనిచేస్తున్నారు’.‘కరీంనగర్‌కు చెందిన మహేశ్ ప్రైవేటు ఉపాధ్యాయుడు. నెలకు రూ.20వేల జీతం. గతేడాది వరకు నెలకు కుటుంబ ఖర్చులుపోను రూ.2 వేలు చీటి కట్టాడు. ఈ ఏడాది జీతం రూ.వెయ్యి పెరిగినా వచ్చే మొత్తం ఖర్చులకే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు’. -
తల్లిదండ్రుల ఆకాంక్ష నెరవేర్చాలి
కరీంనగర్: ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఐదు రోజుల వృత్యంతర శిక్షణ కార్యక్రమం జిల్లాకేంద్రంలోని పారమిత హెరిటేజ్ పాఠశాలలో మంగళవారం ప్రారంభమైంది. మొదటి రోజు శిక్షణ కార్యక్రమంలో గణితం నిత్య జీవితంలో గల ప్రాముఖ్యతను ఎఫ్ఎల్ఎన్ కింద ఒకటి నుంచి ఐదు తరగతుల భాష, గణిత సామర్థ్యాల పెంపు, రాబోయే రోజులలో విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. జూమ్ మీటింగ్ ద్వారా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా పలు సూచనలు ఇచ్చారు. సబ్జెక్టుపై నైపుణ్యం పెంచుకుని, విద్యార్థుల సంఖ్యను పెంచాలన్నారు. కోర్స్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న గంగాధర మండల విద్యాధికారి ప్రభాకర్‌రావు మాట్లాడుతూ విద్యా వాహిని బడిబాట కార్యక్రమం ద్వారా 33 గ్రామాలు తిరిగి విద్యార్థుల సంఖ్యను పెంచడానికి చర్చించామన్నారు. ప్రసూతి మరణాలు తగ్గించాలి కరీంనగర్‌టౌన్: ప్రసూతి మరణాలను తగ్గించడానికి చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకట రమణ సూచించారు. మంగళవారం డీఎంహెచ్‌వో అధ్యక్షతన జిల్లాస్థాయి మాతృ మరణ నివారణ కమిటీ సమీక్ష జరిగింది. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ సంరక్షణలో జాప్యాలు, అత్యవసర సేవల లభ్యతలో నిర్లక్ష్యం, రిఫెరల్ సేవలు, ప్రసవానంతర, ప్రసవ సంరక్షణ నాణ్యతను మెరుగుపరిచినప్పుడే ప్రసూతి మరణాలు అరికట్టడం సాధ్యపడుతుందని తెలిపారు. డాక్టర్లు సనజవేరియా, ఉమాశ్రీ, చందు, సుహాసిని, సంగీత, రాజగోపాల్ పాల్గొన్నారు. రోడ్డుపైనే బోరు కరీంనగర్ కార్పొరేషన్: అధికారులు అండగా ఉంటే రోడ్డు మాత్రం మనది కాదా అనుకున్నాడేమో ఏకంగా రోడ్డుపైనే బోర్ వేశాడు ఓ వ్యక్తి. నగరంలోని 36వ డివిజన్ పరిధిలోని మంకమ్మతోటలో రోడ్డుపైనే బోర్ వేయడం వివా దాస్పదమైంది. అతని ఇంటి ఎదుట ఉన్న రోడ్డు మీద బోర్ వేయడాన్ని కాలనీవాసులు ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. పైగా వాటర్ పైప్‌లైన్ పక్కనే వేయడాన్ని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపైన బోర్ వేయడంపై నగరపాలక సంస్థ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. -
ఏక్తాయాత్రకు ఏర్పాట్లు పూర్తి
కరీంనగర్‌టౌన్: హనుమాన్ జయంతి రోజున కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నగరంలో చేపడుతున్న హిందూ ఏక్తాయాత్ర ఏర్పాట్లను మంగళవారం వైశ్యభవన్ వద్ద బీజేపీ శ్రేణులతో కలిసి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 22న నిర్వహించే హిందూ ఏక్తాయాత్రకు పార్టీలకతీతంగా, హిందూ బంధువులు తరలిరానున్నారని తెలిపా రు. నగరంలోని వైశ్య భవన్ నుంచి సాయంత్రం నాలుగు గంటలకు యాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. మాజీ మేయర్ సునీల్‌రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమల ఆంజనేయులు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేశ్, నాయకులు కన్నబోయిన ఓదెలు, మాడ వెంకటరెడ్డి, బోయిన్పల్లి ప్రవీణ్‌రావు, కన్న కృష్ణ, బండ రమణారెడ్డి, దండు కొమరయ్య, పెద్దపల్లి జితేందర్, వంగల పవన్, సతీశ్, దుర్శెట్టి అనూప్, చొప్పరి జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
ఏడేళ్లుగా రోడ్డు కష్టాలు
వీణవంక: జమ్మికుంట– మానకొండూర్ నాలుగు వరుసల రహదారి పనులు ఏడేళ్లుగా కొనసాగుతూ... ఉన్నాయి. పాలకులు, ప్రభుత్వాలు మారుతున్నా రోడ్డు పూర్తికావడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అలసత్వంతో వాహనదారులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆబాది జమ్మికుంట నుంచి నర్సింగాపూర్ వరకు, వీణవంక నుంచి మానకొండూరు వరకు 66ఫీట్ల వెడల్పుతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు ఏడేళ్లు పూర్తవగా అక్కడక్కడ అసంపూర్తి రోడ్డుతో వెలువడుతున్న దుమ్ము కారణంగా వాహనదారులు యాతన పడుతున్నారు. కరీంనగర్– జమ్మికుంట మధ్య మానకొండూర్ మీదుగా నిత్యం వందలాది వాహనాలు నడుస్తుంటాయి. ఆర్టీసీ బస్సులు 16 ట్రిప్పులకు పైగా తిరుగుతాయి. నాలుగు మండలాల పరిధిలోని 100కు గ్రామాలకు ఈ దారి ప్రధానమైంది. జమ్మికుంట– నర్సింగాపూర్ మధ్య ఫోర్‌లైన్ కోసం 2018లో రూ.33 కోట్లు కేటాయించారు. వీణవంక నుంచి మానకొండూరు వరకు 66ఫీట్ల రోడ్డుకు రూ.30కోట్లు మంజూరు చేశారు. కోర్కల్– శ్రీరాములపేట గ్రామాల మధ్య కంకర పోసి వదిలేశారు. మామిడాలపల్లి అనుబంధ గ్రామమైన గొల్లపల్లి వద్ద కల్వర్టు, పచ్చునూరులో రెండు, లలితాపూర్, అన్నారం గ్రామాల మధ్య కల్వర్టుల పనులు మధ్యలో నిలిచిపోయాయి. రెడ్డిపల్లి బస్డాండ్ వద్ద గుంత ఏర్పడటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వీణవంక బ్రిడ్జి సమీపంలోని బ్రహ్మణపల్లి క్రాస్‌వద్ద రోడ్డు అస్తవ్యస్థంగా ఉంది. నర్సింగాపూర్ నుంచి వీణవంక వరకు మూడేళ్ల క్రితం ఫోర్‌లైన్ మంజూరు కాగా కంకర పోసి వదిలేశారు. మామి డాలపల్లి శివారు గొల్లపల్లి వద్ద కల్వర్టు తెగిపోయింది. అధికారులు, పాలకులు స్పందించి రోడ్డు త్వరగా పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు. అసంపూర్తిగా జమ్మికుంట– కరీంనగర్ ప్రధాన రహదారి ఐదుచోట్ల పూర్తికాని కల్వర్టులు కోర్కల్– శ్రీరాములపేట మధ్య కంకర పోసి వదిలేసిన వైనం దుమ్ముతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు -
భూ భారతి దేశానికే రోల్‌మోడల్
● జూన్ 2నుంచి ప్రతీ రెవెన్యూ గ్రామంలో సదస్సు ● ఆరువేల మంది సర్వేయర్లకు శిక్షణ ● రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిహుజూరాబాద్: భూభారతి చట్టం దేశానికి రోల్‌మోడల్‌గా మారనుందని రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సైదాపూర్ మండలం ఘన్పూర్ గ్రామంలో మంగళవారం భూ భూరతి చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా మంత్రి పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూభారతి అమల్లో భాగంగా సైదాపూర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామన్నా రు. ఇప్పటివరకు మండలంలో నిర్వహించిన రెవె న్యూ సదస్సుల ద్వారా 1,600 దరఖాస్తులు వచ్చాయని, త్వరలోనే పరిష్కరిస్తారని వివరించారు. 2020లో ధరణి చట్టం తెచ్చినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల 20వేల పైచిలుకు భూ సమస్యలు ఉండేవని తెలిపారు. ఎంతోమంది రైతులు న్యాయస్థానాల చుట్టూ తిరిగి అలిసిపోయారన్నారు. భూభా రతి చట్టం ద్వారా తహసీల్దార్ స్థాయి నుంచి సీసీఎ ల్‌ఐ వరకు పరిష్కారం లభించేలా నిబంధనలు పొందుపరిచామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 6000మంది సర్వేయర్లకు మూ డు నెలల పాటు శిక్షణ ఇస్తున్నామన్నారు. మండలానికి ఆరు నుంచి 8మంది సర్వేయర్లు పనిచేయనున్నారని తెలిపారు. జూన్ 2 నుంచి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారి చొప్పున 10,956 గ్రామాల్లో రెవెన్యూ అధికారులు విధులు నిర్వహించనున్నారని తెలిపారు. ప్రతి పేదవాడికి గూడు ఉండాలన్న ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టామని, మొదటి విడతలో నాలుగున్నర లక్షల ఇండ్లు మంజూరు చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 80వేల ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. పోడు, ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటున్న అర్హులైన వారందరికీ జూన్ 2న పట్టాలు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. చాలా గ్రామాల్లో భూ పంచాయితీలు నడుస్తున్నాయని, భూ సమస్యలు పరిష్కరించాలంటూ వినతులు వస్తున్నాయన్నారు. ప్రతీ భూ యజమానికి భూధార్ కార్డు వస్తుందని తెలిపారు. చిగురుమామిడి– మానకొండూరు కాలువ పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. చొప్పదండి, మానకొండూర్ ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్, హుస్నాబాద్, దాపూర్, కోహెడ మా ర్కెట్ కమిటీ చైర్మన్లు తిరుపతిరెడ్డి, దొంత సుధాకర్, నిర్మలా జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
రెక్కలు?
బుధవారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2025భూముల ధరలకుసాక్షిప్రతినిధి,కరీంనగర్: భూముల మార్కెట్ విలువ పెంపునకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భూముల ధరలు ఎంత మేరకు పెంచవచ్చో అధ్యయనం చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖను ఆదేశించింది. అన్ని జిల్లాల రిజిస్ట్రార్లకు ఆదేశాలు పంపింది. ప్రస్తుతం ఉన్న భూముల వివరాలు, మార్కెట్ విలువ? దాన్ని ఎంత మేరకు పెంచవచ్చో అధ్యయనం చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పలువురుశాఖల అధికారులతో కూడిన కమిటీలను కూడా సిద్ధం చేసింది. వీరు భూముల విలువపై అంచనాకు వచ్చి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నివేదికలోని సూచనలు అమలైతే దాదాపు 50 నుంచి 100 శాతం వరకు మార్కెట్ ధరలు పెంచే అవకాశాలు ఉన్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ చార్జీలతో పాటు, భూముల ధరలు పెరిగే అవకాశాలు లేకపోలేదు. కమిటీలు ఇలా.. భూముల పెంపులో ప్రభుత్వం అర్బన్, రూరల్ రెండు ప్రాంతాలుగా విభజించింది. పట్టణ ప్రాంతాల్లో అయితే.. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు అందులో ఇటీవల విలీనమైన గ్రామాలకు కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అందులో అడిషనల్ కలెక్టర్ (లోకల్‌బాడీస్) చైర్మన్‌గా ఉంటారు. సభ్యులుగా మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్‌చైర్మన్, జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు. కన్వీనర్‌గా సబ్‌రిజిస్ట్రార్ వ్యవహరిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే చైర్మన్‌గా ఆర్డీవో వ్యవహరిస్తారు. సభ్యులుగా తహసీల్దార్, ఎంపీడీవో ఉంటారు. కన్వీనర్ బాధ్యతలను సబ్‌రిజిస్ట్రార్ నిర్వహిస్తారు. భవన నిర్మాణాల ధరల నిర్ధారణకు జాయింట్ ఇన్స్పెక్టర్ జనరల్ చైర్మన్‌గా ఉండగా.. ఆర్అండ్బీ సూపరింటెండెంట్ ఇంజినీర్ సభ్యుడిగా ఉంటారు. అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలన్నీ వ్యవసాయ, రియల్ ఎస్టేట్, భూములతోపాటు అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, బహుళ అంతస్తుల భవనాల మార్కెట్ విలువను నిర్ధారిస్తారు. మే నెలాఖరుకు నివేదిక ప్రభుత్వ ఆదేశాల మేరకు రూపుదిద్దుకున్న కమిటీలు వారి పరిధిలో ఉన్న భూముల మార్కెట్ విలువపై సర్వే ప్రారంభించాయి. దాదాపుగా ఈ సర్వే కూడా కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ నెల 28న నివేదికను ప్రభుత్వానికి అంజేయనున్నారు. ఈ నివేదిక ప్రకారం.. 50 నుంచి 100శాతం వరకు మార్కెట్ విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా మొత్తం శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా), సిరిసిల్ల జిల్లా మొత్తం వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ)లుగా అవతరించడంతో ఈ ప్రాంతాల్లో భూముల ధరలకు ముఖ్యంగా రెక్కలు రానున్నాయి.న్యూస్రీల్ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు, ఆదాయ వివరాలు (రూ.కోట్లలో)ఏడాది డాక్యుమెంట్లు ఆదాయం 2024 88,762 231.98 2025 32,383 86.25 మరోసారి మార్కెట్ విలువ పెంపు 50 నుంచి 100శాతం పెంచేలా కసరత్తు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రభుత్వ ఆదేశం మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాల్లో అధ్యయనానికి కమిటీలు నివేదికకు మే నెలాఖరు సమయం భూ విలువలపై అధ్యయనం ప్రారంభించిన అధికారులు -
కేజీబీవీ విద్యార్థినులు భేష్
విద్యార్థినుల యోగా ప్రదర్శనకరీంనగర్: వేసవి శిక్షణ శిబిరాలను సద్విని యోగం చేసుకొని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల విద్యార్థినులు ప్రదర్శించిన ప్రతిభ అభినందనీయమని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నగరంలోని సప్తగిరికాలనీలోని కేజీబీవీలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి మంగళవారం కలెక్టర్ హాజరై మాట్లాడారు. వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఉన్న 14 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల నుంచి సుమారు 100మంది విద్యార్థినులకు ఈనెల ఆరోతేదీ నుండి శిక్షణ ఇచ్చామని అన్నారు. సంగీతం, నృత్య ప్రదర్శన, పెయింటింగ్, కంప్యూటర్ పరిజ్ఞానం స్పోకెన్ ఇంగ్లిష్, యోగా, ఆర్ట్ క్రాప్ట్‌లో శిక్షణ పొందారని తెలిపారు. 15 రోజులపాటు వీరంతా శిక్షణను సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. పదోతరగతి, ఇంటర్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు పాల్గొన్నారు.● కలెక్టర్ పమేలా సత్పతి -
మామిడికాయ పచ్చడి విషయంలో గొడవ
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మామిడికాయ పచ్చడి పెట?్ట విషయంలో తలెత్తిన గొడవలో భార్యను గొంతు నులిపి చంపాడు భర్త. ఈ ఘటన పందిళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సూర అంజలి– సూర రాజ్‌కుమార్ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆదివారం సాయంత్రం మామిడికాయ పచ్చడి పెట్టేందుకు అంజలి సన్నద్ధమైంది. ఇందుకోసం అవసరమైన వెల్లుల్లి కొనుక్కు రావాలని భర్త రాజ్‌కుమార్‌కు సూచించింది. ఈ విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన రాజ్‌కుమార్.. అంజలి(27)ను గొంతు నులిమి చంపేశాడు. ఈమేరకు మృతురాలి తండ్రి సంపంగి మల్లేశ్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు శవాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త రాజ్‌కుమార్‌పై కేసు నమోదు చేశామని ఎస్సై వెంకటేశ్ తెలిపారు. -
ఆకట్టుకున్న మానస హల్దీ వేడుకలు
రామగుండం(కరీంనగర్): పట్టణంలోని తబితా ఆశ్రమంలో 16ఏళ్లుగా ఆశ్రయం పొందుతున్న నక్క మానస వివాహ వేడుకలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం హల్దీవేడుకలు ఘనంగా నిర్వహించింది. యువతి పెళ్లి పెద్దగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష.. ఈనెల 21వ తేదీన కలెక్టరేట్లోని ఆలయంలో వివాహం జరిపించేందుకు నిర్ణయించారు. తొలిరోజు వేడుకల కోసం సింగరేణి ఆర్జీ–1 జీఎం సతీమణి అనిత, ఆర్తి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు భీమనాథి విజయ పుస్తె, మట్టెలు, చీర, సారె, అంతర్గాం అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు రూ.ఐదు వేల నగదు, ఎనీ్టపీసీ శ్రీసీతారామ సేవాసమితి నిర్వాహకులు గోలివాడ చంద్రకళ, కంది సుజాత, బిల్లా శ్రీదేవి, కొండు రమాదేవి పెళ్లి బట్టలు అందజేశారు.ఫైట్‌ఫర్ బెటర్ సొసైటీ నిర్వాహకుడు మద్దెల దినేశ్, లెనిన్ జయహో సంస్థ ప్రతినిధి చక్కెన శ్రీలత పెళ్లి కుమార్తెను తయారు చేశారు. జిల్లా సంక్షేమాధికారి వేణుగోపాల్‌రావు, అంతర్గాం తహసీల్దార్ రవీందర్‌పటేల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. -
ఉరివేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
రామగిరి(మంథని): కల్వచర్ల గ్రామానికి చెందిన వేముల లింగయ్య(90) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై చంద్రకుమార్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం .. లింగయ్య భార్య పద్మ కొంతకాలం క్రితం మరణించడంతో లింగయ్య ఒంటరితనం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆదివారం రాత్రి తన ఐదో కుమారుడు ఇంట్లో భోజనం చేయాలని అడుగగా తినకుండా వెళ్లి పడుకున్నాడు. సోమవారం ఉదయం బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి తలుపుతీయగా రేకులషెడ్డు కర్రకు ఉరి వేసుకుని ఉన్నాడు. తమ తండ్రి ఒంటరిగా ఉండటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి పెద్ద కుమారుడు వేముల కుమార్‌స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. -
వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
కరీంనగర్‌స్పోర్ట్స్: వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంఘటితంగా కృషి చేస్తామని జిల్లా పేటా టీఎస్ అధ్యక్షుడు బాబు శ్రీనివాస్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన జిల్లా పెటా టీఎస్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. నూతనంగా ఏర్పడ్డ కమిటీ సభ్యులు ఎల్లవేళలా సంఘం పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. పెటా టీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆడెపు శ్రీనివాస్ మాట్లాడుతూ సభ్యుల సలహాలు, సూచనలతో ముందుకు సాగుతామన్నారు. అనంతరం పెట టీఎస్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం పెటా టీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాబు శ్రీనివాస్, ఆడెపు శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షులుగా దత్తాత్రి, హరికిషన్, వి.రూపారాణి, పి.శ్రీనివాస్, ఎన్.శ్యామలాదేవి, కె.రమాదేవి, పి.శ్రీనివాస్ జి.నిర్మల ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎస్.రమేశ్‌కుమార్, వి.శ్రీలత, ఎం.చంద్రశేఖర్, వి.సూర్యప్రకాశ్, యజాజ్ అహ్మద్, బిట్ర శ్రీనివాస్, ఎం.రమేశ్, కె.వెంకటలక్ష్మి ఎన్నికయ్యారు. సంఘం కోశాధికారిగా డి.వీర్పాల్, సంయుక్త కార్యదర్శులుగా రామానందతీర్థ, బి.సత్యనారాయణ, స్నేహలత, ప్రవీణ, రాజ్‌కుమార్, సత్యానంద్, ప్రతిమ ఎన్నికయ్యారు. -
హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు అంకురార్పణ
మల్యాల: హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు సోమవారం సాయంత్రం అంకురార్పణ నిర్వహించారు. ఆలయ ప్రధాన ద్వారం, వైజంక్షన్ వద్దగల స్వాగత తోరణం, ఆలయ పరిసరాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. స్వామివారి ఉత్సవమూర్తిని దీక్ష విరమణ మంటపానికి తీసుకెళ్లి పూజలు నిర్వహించారు. అనంతరం యాగశాల శుద్ధి పుణ్యహవచనం, అంకురార్పణ, అఖండ ద్వీపస్థాపన చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు కపీందర్, ప్రధాన అర్చకులు జితేంద్ర స్వామి, రామకృష్ణ, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవి, ఆలయ ఈఓ శ్రీకాంత్‌రావు, సూపరింటెండెంట్లు చంద్రశేఖర్, సునీల్‌కుమార్, హరిహరనాథ్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి● మరో ఇద్దరికి గాయాలు సిరిసిల్లక్రైం/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మండలంలోని బంధువుల వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బంధువులు తెలిపిన వివరాలు. తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూరుకు చెందిన శనిగరపు దిలీప్(28) గజసింగవరంలోని తన బంధువుల వివాహ రిసెప్షన్‌కు ఆదివారం హాజరయ్యాడు. రాత్రి కావడంతో ఎల్లారెడ్డిపేటలోని బంధువుల ఇంట్లో నిద్రించాడు. సోమవారం తెల్లవారుజామున వేములవాడకు వెళ్తుండగా బైపాస్‌రోడ్డులోని మెడికల్ కాలేజీ వద్ద కల్వర్టులోకి బైక్ దూసుకెళ్లింది. దిలీప్ అక్కడికక్కడే మృతిచెందగా.. బైక్‌పై ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించారు. ఒక్కగానొక్క కొడుకు దిలీప్ చనిపోవడంతో తల్లిదండ్రులు చంద్రయ్య, లక్ష్మి రోదనలు మిన్నంటాయి. దిలీప్ ఓ ప్రైవేట్ మైక్రోఫైనాన్స్‌లో ఉద్యోగం చేస్తుండేవాడని తెలిసింది. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకోరుట్ల రూరల్: మండలంలోని మోహన్‌రావుపేటలో ఆదివారం రాత్రి దొంగలు తాళం వేసి ఉన్న ఇల్లలో దొంగతనానికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన సింగు సురేశ్ రెండురోజుల క్రితం తన ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. సోమవారం ఉదయం తాళం పగులగొట్టి ఉండడాన్ని గమనించిన ఇరుగు పొరుగు వారు సురేశ్‌కు ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చారు. ఇంటికి చేరిన సురేష్ బీరువాలో దాచిపెట్టిన నాలుగు తులాల బంగారం, 15 తులాల వెండి పట్టగొలుసులు, రూ.8వేల నగదు ఎత్తుకెళ్లినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. -
వైర్లు కట్‌చేసి.. సెన్సార్లు తొలగించి..
పాలకుర్తి(రామగుండం): పాలకుర్తి మండలం బసంత్‌నగర్ సమీపంలోని రాజీవ్‌రహదారిపై గ ల కన్నాల టోల్‌ప్లాజావద్ద రామగుండం ఏరి యా, స్థానిక లారీ యజమానులు సోమవారం రాత్రి ఆందోళనకు దిగారు. గోదావరిఖని ఏరి యా లారీలకు టోల్‌రుసుం వసూలు చేయకుండా ఉచిత ప్రయాణానికి అనుమతించాలని డి మాండ్ చేశారు. ఇదే సమయంలో గోదావరిఖని వైపు వెళ్తున్న రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ ఆందోళనకారుల వద్దకు వెళ్లి సంఘీభావం ప్రకటించారు. ఫోర్‌లేన్ నిర్వహణ సంస్థ హెచ్కేఆర్కు టోల్వసూళ్లపై ఉన్న శ్రద్ధ ప్రజాభద్రత, రోడ్ల నిర్వహణపై లేదన్నారు. పన్నేండేళ్లు గా టోల్ ద్వారా అధిక ఆదాయం ఆర్జిస్తున్న సంస్థ.. సర్వీసు రోడ్ల నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం చే స్తోందని ధ్వజమెత్తారు. తద్వారా అనేక ప్రమా దాల్లో వాహనదారులు ప్రాణాలకు కోల్పోయా రని తెలిపారు. స్థానిక ప్లాజాలోని కార్మికులకు పన్నెండేళ్లుగా వేతనం పెంచడం లేదన్నారు. కనీ స వేతన చట్టం అమలు చేయడం లేదని మండిపడ్డారు. గోదావరిఖని ఏరియా లారీలకు టోల్‌మాఫీ చేయాలని కోరారు. ప్లాజా వద్ద మరు గుదొడ్లు, విశ్రాంతిగది వంటి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం శోచనీయమన్నారు. ఈనేపథ్యంలోనే ఆందోళనకారులు తమ డిమాండ్లు నెరవేర్చేదాకా టోల్ వసూళ్లు నిలిపివేయాలన్నారు. క్యాబిన్లో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులను బయటకు వెళ్లగొట్టారు. టోల్గేట్లు తెరిచి ఉంచారు. ఆటోమేటిక్ సెన్సార్ల వైర్లను కట్ చేశారు. ఉచితంగా వాహనాల రాకపోకలకు వీలుగా చర్యలు తీసుకున్నారు. గతంలో ఎన్నడూలేనివిధంగా నాయకులు, లారీ యజమానులు టోల్‌ప్లాజాపై ఇలాంటి చర్యలకు పాల్పడడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. బసంత్‌నగర్ టోల్‌ప్లాజాలో వాహనాలకు ఉచిత ప్రయాణం రామగుండం, స్థానిక లారీ యజమానుల ఆందోళన హెచ్‌కేఆర్ టోల్‌ప్లాజా అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఠాకూర్ ఆగ్రహం -
పాముకాటుతో నాలుగేళ్ల చిన్నారి మృతి
● అంత్యక్రియలకు వచ్చి అనంతలోకాలకు తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని చిన్నలింగాపూర్‌లో పాముకాటుతో నాలుగేళ్ల చిన్నారి మృతిచెందింది. కామారెడ్డి జిల్లాకు చెందిన వలిదాసు కృష్ణయ్య–లలిత దంపతులుకు ఇద్దరు కూతుళ్లు స్నేహాన్షి(4), శ్రీజ(2). తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్‌లో బంధువు సంవత్సరీకం ఉండగా, మరో బంధువు సోమవారం మృతిచెందారు. ఈ రెండు కార్యక్రమాలకు హాజరయ్యేందుకు లలిత తన ఇద్దరు పిల్లలతో చిన్నలింగాపూర్లోని తలి గారింటికి వచ్చింది. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పెద్ద కూతురు స్నేహాన్షి ఆడుకుంటూ ఇంటి బయటకు వెళ్లగా పాముకరిచింది. పాపను గమనించే సరికి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిమానకొండూర్: మండలంలోని పచ్చునూర్ గ్రామ శివారులో సోమవారం అనుమానాస్పదంగా కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆంజనేయులు(50) అనే వ్యక్తి కొద్ది నెలల నుంచి గ్రామానికి చెందిన బత్తుల అజయ్ మేసీ్త్ర వద్ద కూలీ పనిచేస్తున్నాడు. సోమవారం గ్రామ శివారులోని ఓ వ్యక్తికి చెందిన పొలం సమీపంలో మృతదేహం కుళ్లి పోయిందని గ్రామ కారోబార్కు తెలుపగా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని సీఐ సంజీవ్ పరిశీలించారు. మృతుకి గల కారణాలు తెలియనందున అనుమానాస్పదంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
2డే క్రికెట్ లీగ్ టోర్నీకి వేళాయే..
● 21 నుంచి జూన్ 5 వరకు లీగ్ మ్యాచ్‌లు ● వేములవాడ, కరీంనగర్ కేంద్రంగా పోటీలుకరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో 2డే క్రికెట్ లీగ్ టోర్నీ ప్రారంభం కానుంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) రాష్ట్రస్థాయి టోర్నీల కోసం ముందస్తుగా ఉమ్మడి జిల్లా క్రికెట్ పోటీల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఈనేపథ్యంలో కరీంనగర్ జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో అండర్– 25 విభాగంలో 2డే క్రికెట్ టోర్నీ పోటీలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలలోని 9 నియోజకవర్గాల నుంటి 6 జట్లను ఎంపిక చేయగా, ఈ నెల 21 నుంచి జూన్ 6 వరకు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మ్యాచ్‌ల వివరాలను జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి.ఆగంరావు, ఎన్.మురళీధర్ రావు, ఉపాధ్యక్షుడు కె.మహేందర్‌గౌడ్ వెల్లడించారు. ఈ పోటీల్లో రాణించినవారిని అండర్– 25 ఉమ్మడి కరీంనగర్ జట్టుకు ఎంపిక చేయనున్నారు. జూన్‌లో హెచ్‌సీఏ ఆధ్వర్యంలో జరిగే ఇంటర్ డిస్ట్రిక్ టోర్నమెంట్లో కరీంనగర్ అండర్– 25 జట్టు పాల్గొననుంది. 6 జట్లు..16 మ్యాచ్‌లు.. ఉమ్మడి కరీంనగర్‌లోని 13 నియోజకవర్గాల నుంచి 6 జట్లను ఎంపిక చేశారు. 3 వేదికల్లో 16 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ, సెయింట్ అల్ఫోన్స్ పాఠశాల, వేములవాడలోని డాక్టర్ నర్సింగరావు మైదానాల్లో పోటీలు జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్‌లు జూన్ 5, 6 తేదీల్లో శాతవాహనలో జరుగనున్నాయి. మ్యాచ్‌లు ఇవే.. ● 21, 22న సిరిసిల్ల, వేములవాడ వర్సెస్ పెద్దపల్లి, మంథని, రామగుండం – శాతవాహన యూనివర్సిటీ. ● 21, 22న జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి వర్సెస్ మానకొండూర్, హుస్నాబాద్, హుజురాబాద్ – సెయింట్ అల్ఫోన్స్ స్కూల్. ● 21, 22న కరీంనగర్ రూరల్, చొప్పదండి వర్సెస్ కరీంనగర్ టౌన్ – వేములవాడ. ● 24, 25న మానకొండూర్, హుస్నాబాద్, హుజురాబాద్ వర్సెస్ సిరిసిల్ల, వేములవాడ – వేములవాడ. ● 24, 25న కరీంనగర్‌టౌన్ వర్సెస్ పెద్దపల్లి, మంథని, రామగుండం– సెయింట్ అల్ఫోన్స్. ● 24, 25న కరీంనగర్ రూరల్, చొప్పదండి వర్సెస్ జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి – శాతవాహన యూనివర్సిటీ. ● 27, 28న సిరిసిల్ల, వేములవాడ వర్సెస్ కరీంనగర్ టౌన్ – వేములవాడ. ● 27, 28న మానకొండూర్, హుస్నాబాద్, హుజురాబాద్ వర్సెస్ కరీంనగర్ రూరల్, చొప్పదండి – సెయింట్ అల్ఫోన్స్. ● 27, 28న పెద్దపల్లి, మంథని, రామగుండం వర్సెస్ జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి – శాతవాహన యూనివర్సిటీ. ● 30, 31న కరీంనగర్ రూరల్, చొప్పదండిి వర్సెస్ సిరిసిల్ల, వేములవాడ – వేములవాడ. ● 30, 31న జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి వర్సెస్ కరీంనగర్‌టౌన్ – శాతవాహన యూనివర్సిటీ. ● 30, 31న పెద్దపల్లి, మంథని, రామగుండం వర్సెస్ మానకొండూర్, హుస్నాబాద్, హుజురాబాద్– సెయింట్ అల్ఫోన్స్. ● జూన్ 2, 3న సిరిసిల్ల, వేములవాడ వర్సెస్ జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి – వేములవాడ. ● 2, 3న పెద్దపల్లి, మంథని, రామగుండం వర్సెస్ కరీంనగర్ రూరల్, చొప్పదండి – సెయింట్ అల్ఫోన్స్. ● 2, 3న కరీంనగర్ టౌన్ వర్సెస్ మానకొండూర్, హుస్నాబాద్, హుజురాబాద్ – శాతవాహన యూనివర్సిటీ. ● 5, 6న ఫైనల్.. లీగ్‌లో ఎక్కువ స్కోర్ చేసిన రెండు జట్లు – శాతవాహన యూనివర్సిటీ. -
సింగారం సన్నాల బంగారం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): వరిసాగు అంటేనే దొడ్డురకం గుర్తుకొస్తుంది. సన్నరకం ధాన్యం మన దగ్గర సాగుచేసే వారు తక్కువ. రైతులు దశాబ్దాల కాలంగా దొడ్డు వడ్ల సాగుపైనే దృష్టి సారించేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించడంతో చాలా మంది రైతులు సన్నాలు సాగుచేస్తున్నారు. ఒకరిద్దరు కాదు ఏకంగా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలోని రైతులు సన్నరకం వరి సాగుచేయగా.. కొనుగోళ్లు సైతం పూర్తయ్యాయి. సింగారం సన్నాల సాగుతో బంగారమైంది. సన్నాలు సాగుచేసిన సింగారం గ్రామ రైతుల సక్సెస్ స్టోరీ. 736 ఎకరాలకు పైగా.. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని సింగారం గ్రామం మానేరువాగును ఆనుకొని ఉంటుంది. గ్రామస్తులు ఏటా దొడ్డురకం ధాన్యం మాత్రమే సాగు చేసేవారు. కానీ ఈ ఎండాకాలం సీజన్లోనే రైతులందరూ చర్చించుకుని సన్నరకం ధాన్యం సాగు చేశారు. గ్రామంలోని 422 మంది రైతులు తమకున్న 736 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సన్నరకం ధాన్యం పండించారు. ఎకరానికి సరాసరి 18 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు. ఇప్పటి వరకు అధికారులు 6,733 క్వింటాళ్లు సేకరించి.. 5,954 క్వింటాళ్లు మిల్లులకు తరలించారు. అధికారుల లెక్కల ప్రకారం 6,733 క్వింటాళ్లపై ప్రభుత్వం ఇచ్చే బోనస్ డబ్బులు రూ.33,66,500 అదనంగా రైతులు సంపాదించారు. సింగారం గ్రామస్తులు సాగుచేసిన సన్నధాన్యం కాసుల వర్షం కురిపిస్తుంది. ఖరీఫ్‌లో సింగారం బాటలో.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జిల్లాలోని అనేక గ్రామాల రైతులు సన్నవడ్లు సాగు చేయడానికి సింగారం బాట పట్టారు. సింగారం గ్రామమంతా సన్నాలు సాగుచేసి ప్రభుత్వం ఇచ్చే బోనస్ డబ్బులతో లబ్ధి పొందనుండగా.. ఈ విషయం తెలుసుకున్న సమీ ప గ్రామాల రైతులు ఇక్కడికి వచ్చి సన్నాల సాగు, దిగుబడి గురించి తెలుసుకుంటున్నారు. సన్నాలను సాగుచేసి అధిక దిగుబడులు, బోనస్ రూపంలో వచ్చే డబ్బులతో ఆర్థికంగా ఎదగాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మొత్తంగా జిల్లాలో ఈ సీజన్లో రైతులు ఎక్కువగా సన్నవడ్ల సాగునే ఎంచుకుంటున్నారు. ఊరంతా సన్నవడ్లు 736 ఎకరాలకు పైగా సాగు రూ.33.66లక్షలు బోనస్‌గా పొందనున్న రైతులు సన్నవడ్ల సాగుతో లాభాలబాటఇతను ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన రైతు రాయిని అంజయ్య. ఇతనికి మూడున్నర ఎకరాలు భూమి ఉంది. మూడున్నర ఎకరాల్లో సన్నవడ్లు పండించాడు. దాదాపు 72 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ఈ సీజన్లో అదనంగా బోనస్ డబ్బులు రూ.36వేలు అందనున్నాయి. ఎకరానికి దాదాపు రూ.25వేలు పెట్టుబడి పెట్టాడు. సన్నవడ్లు సాగుచేయడం సంతోషంగా ఉందంటున్నాడు. సన్నవడ్లతో దిగుబడి కూడా ఎక్కువగా వస్తుందంటున్నాడు. -
సమష్టి నిర్ణయంతో..
రబీ సీజన్లో గ్రామానికి చెందిన రైతులం సమష్టిగా నిర్ణయం తీసుకుని సన్నవడ్లు సాగు చేశాం. నాకున్న రెండు ఎకరాల్లో సన్నవడ్లు సాగు చేశాను. సన్నవడ్ల సాగుతో అధిక దిగుబడులే కాకుండా, బోనస్ రూపంలో వచ్చే డబ్బులు ఈ సీజన్లో పెట్టుబడులకు ఎంతో ఉపయోగపడతాయి. గ్రామ రైతులందరం సన్నవడ్లు పండించడంతో జిల్లాలోని అనేక గ్రామాల నుంచి రైతులు వచ్చి సన్నాల సాగు గురించి తెలుసుకుంటున్నారు. – గనగోని మహేశ్, యువరైతు, సింగారంఅవగాహన కల్పిస్తున్నాం మండలంలో అనేక గ్రామాల్లో ఈ సీజన్లో రైతులు సన్నవడ్లు సాగు చేస్తున్నారు. సన్నవడ్ల సాగుతో వచ్చే అదనపు ఆదాయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఖరీఫ్ సీజన్లో రైతులు గతంలో కంటే రెట్టింపు స్థాయిలో సన్నవడ్ల విత్తనాలను కొనుగోలు చేశారు. ప్రభుత్వం ఇచ్చే రూ.500 బోనస్‌పైనే అందరి చూపు ఉంది. సింగారంలో రైతులంతా కలిసి సన్నవడ్లు పండించి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు. – పసుల శ్రీశైలం, వ్యవసాయ విస్తరణాధికారి, ఎల్లారెడ్డిపేట -
ఆకట్టుకున్న హల్దీ వేడుకలు
పెళ్లి కూతురుకు దుస్తులు అందిస్తున్న ఐసీడీఎస్ బృందం రామగుండం: పట్టణంలోని తబితా ఆశ్రమంలో 16ఏళ్లుగా ఆశ్రయం పొందుతున్న నక్క మానస వివాహ వేడుకలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం హల్దీ వేడుకలు ఘనంగా నిర్వహించింది. యువతి పెళ్లి పెద్దగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష.. ఈనెల 21వ తేదీన కలెక్టరేట్లోని ఆలయంలో వివాహం జరిపించేందుకు నిర్ణయించారు. తొలిరోజు వేడుకల కోసం సింగరేణి ఆర్జీ–1 జీఎం సతీమణి అనిత, ఆర్తి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు భీమనాథి విజయ పుస్తె, మట్టెలు, చీర, సారె, అంతర్గాం అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు రూ.ఐదు వేల నగదు, ఎన్టీపీసీ శ్రీసీతారామ సేవాసమితి నిర్వాహకులు గోలివాడ చంద్రకళ, కంది సుజాత, బిల్లా శ్రీదేవి, కొండు రమాదేవి పెళ్లి బట్టలను పెళ్లి కూతురుకు అందజేశారు. ఫైట్‌ఫర్ బెటర్ సొసైటీ నిర్వాహకుడు మద్దెల దినేశ్, లెనిన్ జయహో సంస్థ ప్రతినిధి చక్కెన శ్రీలత పెళ్లి కుమార్తెను తయారు చేశారు. జిల్లా సంక్షేమాధికారి వేణుగోపాల్‌రావు, అంతర్గాం తహసీల్దార్ రవీందర్‌పటేల్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రారంభమైన మానస వివాహ వేడుకలు రేపు శుభముహూర్తం -
విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం
పెగడపల్లి: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద తీగల కింద ఉన్న చెట్లను తొలగిస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన ఘటన మండలంలోని నంచర్లలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గ్రామ సమీపంలోని వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ సిబ్బంది, రైతులతో కలిసి ఎడ్ల రాజేందర్‌రెడ్డి (43) చెట్లను తొలగించే పనులు చేపడుతున్నాడు. అప్పటికే ట్రాన్స్ఫార్మర్కు కరెంటు సరఫరా నిలిపివేశారు. అయితే ట్రాన్స్ఫార్మర్ పైభాగాన ఉన్న చెట్టు తీగను తొలగించేందుకు రాజేందర్‌రెడ్డి పైకి ఎక్కాడు. ఈ క్రమంలో 11కేవీ విద్యుత్ తీగ తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు 108వాహనంలో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇంటి వద్ద ఉన్న తన భర్తను గ్రామానికి చెందిన కోల రాములు అనే వ్యక్తి బలవంతంగా తీసుకెళ్లాడని, విద్యుత్ సిబ్బంది ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా నిలిపి వేయకుండానే పనులు చేయడంతో తన భర్త ప్రాణాలు కోల్పోయాడని మృతుడి భార్య విజయ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ట్రైనీ ఎస్సై రవీందర్‌కుమార్ తెలిపారు. ట్రాన్స్‌కో ఏడీఈ వరుణ్ కుమార్, ఏఈ మధు సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ఏడీఈ తెలిపారు. -
వేధిస్తున్నాయి
కంటిపాపలే● న్యాయం కోసం ప్రజావాణిని ఆశ్రయిస్తున్న వృద్ధులు ● నిర్దయగా అధికారులు.. ఫిర్యాదు చేసినవారికే బెదిరింపులు ● ఒక్కరోజే 6.. ఈ ఏడాదిలో 40కి పైగా కేసులు ● అధికారుల ఉదాసీనత.. తప్పని నిరీక్షణ‘ఈ వృద్ధ దంపతులది మానకొండూరు మండలం అన్నారం. పేరు బాకారపు అయిలయ్య– రాజవ్వ. వీరికి ఇద్దరు కూతుళ్లు స్వప్న, రేఖ. వారిని పెంచి పెద్ద చేసి ఘనంగా వివాహం జరిపించారు. ఉన్న భూమిని కూడా ఇద్దరు కూతుళ్లకు రిజిస్ట్రేషన్ చేశారు. కానీ, మలి వయసులో కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిందిపోయి వేధిస్తున్నారని రోదించారు. కూతుళ్లే సర్వస్వమని భావిస్తే ఇదిగో ఇలా కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని వాపోయారు. కూడు పెట్టకపోగా సూటిపోటి మాటలతో ఎగతాళి చేస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు’.పెన్షన్‌తో బతుకుతున్న ‘నగరంలోని కొత్తయాస్వాడలో ఉంటున్న. నా భర్త రాఘవరెడ్డి మరణంతో నా బతుకు దుర్భరమైంది. ఒక్కాగానొక్క కూతురు భూమాడి లలిత ఉన్న ఇంటిని స్వాధీనం చేసుకుని బయటకు గెంటేసింది. నాలుగేళ్ల నుంచి ఒంటరిగా బతుకుతున్న. వృద్ధాప్య పింఛన్, రేషన్ బియ్యంతో జీవనం సాగిస్తున్న. నన్ను ఏదైనా అనాథాశ్రమంలో వేసి నాకో దారి చూపండని ఇప్పటికీ నాలుగు సార్లు ప్రజావాణికి వచ్చిన’. – చల్ల వెంకటమ్మ, కొత్తయాస్వాడ, కరీంనగర్ -
పుస్తకాలొచ్చేశాయ్
కరీంనగర్: పాఠశాలలు పునఃప్రారంభంనాటికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠ్యపుస్తకాల సరఫరాకు చర్యలు ప్రారంభించింది. విద్యా సంవత్సరం ప్రారంభంలో పార్ట్–1 పుస్తకాలు అందించనున్నారు. ఎస్ఏ–1 పరీక్షలు పూర్తయ్యాక సెప్టెంబర్, అక్టోబర్‌లో పార్ట్–2 పుస్తకాలు అందజేయనున్నారు. ఈ ఏడాది కొత్తగా పాఠ్యపుస్తకాలపై ఎలాంటి సమస్య ఉన్నా... డయల్ 100కు ఫోన్ చేయాలని, బాలికలను వేధించినా... బాల్యవివాహాలు చేసినా.. బాలలను పనిలో పెట్టుకున్నా చైల్డ్‌లైన్ నంబర్ 1098 కు ఫోన్ చేయాలని ముద్రించారు. జిల్లాలో వివిధ యాజమాన్యాల ఆధ్వర్యంలో 676 పాఠశాలల్లో 82 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి 3,20,430 పుస్తకాలు అవసరం కాగా.. ఇప్పటి వరకు 2,74,980 పుస్తకాలు వచ్చాయి. ఇంకా 45,450 పుస్తకాలు రావాల్సి ఉంది. గోడౌన్ల నుంచి పుస్తకాలను ఆయా పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. ఇది ఇలాఉంటే ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకూ నోట్‌బుక్స్ ఇవ్వనున్నారు. కాగా, ఇప్పటికే జిల్లాకు 86 శాతం పుస్తకాలు చేరుకున్నట్లు డీఈవో జనార్దన్‌రావు తెలిపారు. పాఠశాలల పునః ప్రారంభం నాటికి పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్ అందజేస్తామని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టు తరహాలో రైల్వేస్టేషన్ నిర్మాణం ● దక్షిణమధ్య రైల్వే అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ శివప్రసాద్కరీంనగర్రూరల్: అమృత్ భారత్ పథకంలో భాగంగా తెలంగాణలో రూ.2వేల కోట్లతో 37 రైల్వేస్టేషన్లను ఎయిర్‌పోర్టు తరహాలో అభివృద్ధి చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ శివప్రసాద్ తెలిపారు. కరీంనగర్ రైల్వేస్టేషన్లో జరిగిన ఆధునీకరణ పనులను సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, రూ.30 కోట్లతో కరీంనగర్ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేశామని, ఆరు బుకింగ్ కౌంటర్లు, రెండు ఎక్స్కావేటర్లు, లిఫ్ట్‌లు, వెయిటింగ్‌హాల్ నిర్మించినట్లు వివరించారు. స్టేషన్ ఆవరణలో కాక్‌టెల్ పార్క్‌తోపాటు అప్రోచ్‌రోడ్డు ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 22న తెలంగాణలోని కరీంనగర్, బేగంపేట, వరంగల్ రైల్వేస్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. కరీంనగర్లో కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డివిజనల్ ఇంజినీర్ భిక్షపతి, స్టేషన్ మేనేజర్ ఎం.రవీందర్, కమర్షియల్ మేనేజర్ భానుచందర్, జానకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పవర్ కట్ ప్రాంతాలుకొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ మరమ్మతు పనులు చేపడుతున్నందున మంగళవారం పలు ప్రాంతాల్లో సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్– 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు 11 కేవీ గోదాంగడ్డ ఫీడర్ పరిధిలోని శ్రీనగర్‌కాలనీ, భవానీకాలనీ, సప్తగిరికాలనీ, దోబీఘాట్, ఏఓస్ పార్కు కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. అలాగే విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందున ఉదయం 8 నుంచి 11 గంటల వరకు 11 కేవీ రేకుర్తి ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు కరీంనగర్‌రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. మరమ్మత్తు పనుల నిమిత్తం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 33/11 కేవీ చెర్లభూత్కూర్, మొగ్ధుంపూర్ సబ్స్టేషన్ల పరిధిలోని మొగ్ధుంపూర్, ఇరుకుల్ల, నల్లగుంటపల్లి, చెర్లభూత్కూర్, చామన్‌పల్లి, దుబ్బపల్లి, ఫకీర్‌పేట, జూబ్లీనగర్, బహద్దూర్‌ఖాన్‌పేట, తాహెర్‌కొండాపూర్, ఎలబోతారం గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. పుష్కరాల ప్రత్యేకాధికారిగా ప్రఫుల్ దేశాయ్కరీంనగర్ అర్బన్: సరస్వతి పుష్కరాల పర్యవేక్షణకు అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్‌ను ని యమించారు. పుష్కరాలు ముగిసే వరకు ఆయన ప్రత్యేక అధికారిగా వ్యవహరించనున్నారు. -
కోట్ల దందా!
మంగళవారం శ్రీ 20 శ్రీ మే శ్రీ 2025వందల పట్టాలు● కొత్తపల్లి మండలంలో 20 ఎకరాల సీలింగ్ ల్యాండ్ ● 30 ఏళ్లుగా నిరాటంకంగా కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ ● ఆర్డీవో హెచ్చరించినా స్పందించని రిజిస్ట్రేషన్ల శాఖ ● లోకాయుక్త ఆదేశాలతో కదిలిన కరీంనగర్ కలెక్టర్ ● సీలింగ్ భూముల్లో 460 పట్టాల రద్దుకు ఆదేశాలు ● ఇప్పటికే చేతులు మారిన రూ.వందల కోట్లుసాక్షిప్రతినిధి,కరీంనగర్ ●: ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 460 పట్టాలు కలెక్టర్ ఆదేశాలతో రద్దుకానున్నాయి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని 20 ఎకరాల సీలింగ్ ల్యాండ్‌లో ఇంతవరకూ జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలన్న లోకాయుక్త ఆదేశాలను కలెక్టర్ పమేలా సత్పతి అమలు చేశారు. వివాదాస్పద భూముల్లో ఎలాంటి రిజిస్ట్రేషన్లు ఉండరాదన్న లోకాయుక్త ఆదేశాల మేరకు త్వరలోనే జిల్లా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు. దీంతో రూ.వందల కోట్ల మేర ఇప్పటికే పలువురు చేతులు మారిన ఈ భూములు త్వరలో ప్రభుత్వ పరం కానున్నాయి. ఇప్పటికే అనేక అవినీ తి ఆరోపణలు ఎదుర్కొంటున్న రిజిస్ట్రేషన్ల శాఖకు ఇది చెరపలేని మరకే కానుంది. రిజిస్ట్రేషన్ల శాఖ నిర్వాకానికి ఆ స్థలంలో భూములు కొన్న అమాయకులు రోడ్డునపడే దుస్థితికి తీసుకువచ్చింది. అసలేం జరిగింది? కొత్తపల్లి రెవెన్యూ పరిధిలో 175,197,198 సర్వే నంబర్లలో దాదాపు 20 ఎకరాల భూమిని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ప్రభుత్వం గతంలో స్వాధీనం చేసుకుంది. 1995లో ఈ భూములు దుర్విని యోగం అవుతున్నాయని, విచారణ జరపాలని అప్పటి హైకోర్టు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. విచారణ చేసిన కలెక్టర్ ఆ భూములు సీలింగ్ పరిధిలో ఉన్నాయని, వాటిపై ఎలాంటి లావాదేవీలు చేయరాదని ఆదేశించారు. కలెక్టర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. పలువురు హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఈ భూముల్లో అక్రమ లావాదేవీలు మాత్రం ఆగలేదు. అప్పట్లో దివంగత లోక్‌సత్తా శ్రీనివాస్ ఈ భూముల పరిరక్షణకు పోరాటం చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్లను వ్యతిరేకిస్తూ లోక్‌సత్తాను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన లోక్‌సత్తా సర్వే నంబర్లు 175,197,198లో జరిగిన లావాదేవీలు సమర్పించాలని రెవెన్యూశాఖను ఆదేశించింది. దీంతో ఆ వివరాలను రెవెన్యూ అధికారులు సమర్పించారు. అంతేకాకుండా ఆ భూముల్లో ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేపట్టవద్దని రెవెన్యూ శాఖ అధికారులు రిజిస్ట్రేషన్ల శాఖను 1998 నుంచి 2023 వరకు మొత్తం ఎనిమిది సార్లు ఆదేశించినట్లు సమాచారం. అయితే, కరోనా సమయంలో ఈ వ్యవహారంపై పోరాటం చేస్తున్న లోక్‌సత్తా శ్రీనివాస్ మరణించడంతో కేసు నీరుగారిందనుకున్న పలువురు ఆ భూముల్లో తిరిగి రిజిస్ట్రేషన్లను పునఃప్రారంభించారు. రెవెన్యూశాఖ ఆదేశాలను ధిక్కరిస్తూ.. కొందరు అవినీతి అధికారులు రిజిస్ట్రేషన్లు చేయడం ఆరంభించారు. తీరా గతేడాది నవంబరులో లోకాయుక్త మూడు సర్వే నంబర్లలో ఇప్పటి వరకూ జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని ఆర్డీవో మహేశ్వర్‌ను ఆదేశించింది. వెంటనే ఆయా రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖకు ఆర్డీవో లేఖ రాశారు. అయినా, ఆయన ఆదేశాలను షరా మామూలుగానే పక్కనబెట్టింది రిజిస్ట్రేషన్ల శాఖ. ఈ విషయాన్ని ఆర్డీవో లోకాయుక్త దృష్టికి తీసుకెళ్లారు. రిజిస్ట్రేషన్ అధికారుల తీరుపై మండిపడ్డ లోకాయుక్త పట్టాలను రద్దు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన కలెక్టర్ పమేలా సత్పతి.. వివాదాస్పద సర్వే నంబర్లు 175,197,198లో పట్టాలు రద్దు చేయాలని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, గంగాధర సబ్ రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. దీంతో మూడు సర్వే నంబర్లలో జరిగిన దాదాపు 460 రిజిస్ట్రేషన్లు రద్దు కానున్నాయి. కాగా, అసలు విషయం తెలియక ఎన్నో ఆశలతో ఈ మూడు సర్వే నంబర్లలో ఇంటి స్థలం కొనుగోలు చేసిన మధ్య తరగతి వారంతా లబోదిబోమంటున్నారు. తమను రోడ్డున పడేమొద్దని ప్రాధేయపడుతున్నారు.న్యూస్రీల్సామాన్యుల గురించి ఆలోచించాలి కొత్తపల్లిలోని 175,197,198 సర్వే నంబర్లలో భూముల రిజిస్ట్రేషన్ రద్దు నిర్ణయాన్ని కలెక్టర్ పునరాలోచించాలి. అనేక సామాన్య కుటుంబాలు తెలియక కొనుగోలు చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి కొన్న సామాన్యుల గురించి ఆలోచించాలి. ఎలాంటి నోటీసులివ్వకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సహేతుకం కాదు. ప్రభుత్వం ఇప్పటికై నా పునరాలోచించి సామాన్యులకు న్యాయం చేయాలి. – రాజగోపాల్‌రెడ్డి, ప్లాట్ యజమానిపట్టా ఆధారంగా కొనుగోలు పట్టాదారు పహానిలో 175,197,198 నంబర్లు ఉండటం వల్లే చాలా మంది కొనుగోలు చేశారు. 1983 సీలింగ్ యాక్టు ప్రకారం ప్రభుత్వం ఆ భూములను బ్లాక్‌లిస్టులో పెడితే ఎవరూ కూడా కొనేవారు కాదు. సీలింగ్ భూమి అని ఎక్కడా పేర్కొనక పోగా, ఆ భూములకు పరిహారం కూడా ఇవ్వలేదు. దీంతో అనేక క్రయవిక్రయాలు జరిగాయి. ప్లాట్లు కొన్న సామాన్యులకు వ్యతిరేకంగా తీర్పు రావడం ఆందోళన కలిగిస్తోంది. – బబ్లూ వర్మ, రియల్ వ్యాపారిసమాచారం లేదు కొత్తపల్లిలోని పలు సర్వే నంబర్లు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ఉన్నాయని వీటిని ప్రోహిబిటెడ్ లిస్టులో చేర్చాలని మాకు ఆరునెలల క్రితం ఆర్డీవో నుంచి ఆదేశాలు వచ్చాయి. వెంటనే సంబంధిత సర్వే నంబర్లను ప్రొహిబిటెడ్ లిస్టులో చేర్చాం. అప్పటి నుంచి ఈ మూడు సర్వే నంబర్లలో ఎలాంటి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు కాలేదు. మళ్లీ ఇటీవల కలెక్టర్ గారి నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. ఈ ఆదేశాలను సైతం గంగాధర సబ్ రిజిస్ట్రార్‌కు పంపించాం. – ప్రవీణ్ కుమార్, జిల్లా రిజిస్ట్రార్ డాక్యుమెంట్లు రద్దు చేస్తాం కొత్తపల్లి మండలంలో ల్యాండ్ సీలింగ్‌లో ఉన్న భూములకు సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని రెండురోజుల క్రితం కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 460కి పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. అధికారుల సూచనలు పాటించి రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చి రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తాం. – అఫ్జల్ఖాన్, సబ్ రిజిస్ట్రార్, గంగాధర -
‘ఇందిరమ్మ’ను వేగవంతం చేయండి
● భూభారతి సమస్యలు పరిష్కరించండి ● కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్ అర్బన్/కరీంనగర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని, భూభారతి పోర్టల్ లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా అధికారులతో సమీక్షించారు. పైలెట్ గ్రామాల్లో 2027 ఇండ్లు మంజూరు అయ్యాయని, వెంటనే మార్కింగ్ చేసి నిర్మించేలా చూడాలన్నారు. అనర్హులు ఎవరైనా ఉంటే వారిని తొలగించి అర్హులకు స్థానం కల్పించాలన్నారు. ఇండ్లు మంజూరైనా.. వద్దనుకునే వారి స్థానంలో పేదలకు అవకాశం ఇవ్వాలన్నారు. తహసీల్దార్ల లాగిన్లలో 329 భూభారతి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటన్నింటినీ తక్షణమే విచారించి పైఅధికారుల లాగిన్ కి పంపించాలని ఆదేశించారు. అంగన్వాడీలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, వెటర్నటీ దవాఖానాలు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. పంచాయతీ సొంత భవనాల నిర్మాణానికి ప్రభుత్వ స్థలం చూపాలని తహసీల్దార్లను ఆదేశించారు. రాజీవ్ యువ వికాసం బ్యాంక్ లింకేజీ ప్రక్రియను రెండు రోజుల్లోగా పూర్తిచేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్ తదితరులు ఉన్నారు. భవిత కేంద్రంలో సౌకర్యాలు కల్పించాలి దివ్యాంగ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన భవిత సెంటర్లలో సౌకర్యాలు, వసతులు కల్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ముకరంపురలోని భవిత సెంటర్ ను సోమవారం సందర్శించారు. పెయింటింగ్ పనులను పరిశీలించారు. పిల్లలను ఆకట్టుకునేలా పెయింటింగ్ పనులు చేపట్టాలన్నారు. సెంటర్ చుట్టూ పచ్చదనం ఉండేలా మొక్కలు నాటాలని, పిల్లలు ఆడుకునేందుకు ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల బోధన కోసం అవసరమైన అన్ని పరికరాలు, స్టడీ మెటీరియల్ తెప్పించాలని ఆదేశించారు. రెయిలింగ్, ర్యాంపు రాంప్ వంటివి పటిష్టంగా ఏర్పాటు చేయాలన్నారు. ఫిజియోథెరపిస్టు కచ్చితంగా కేంద్రానికి వచ్చేలా చూడాలని అన్నారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, జీసీడీవో కృపారాణి, ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఆంజనేయులు పాల్గొన్నారు. -
ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించండి
కరీంనగర్‌కార్పొరేషన్: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ ఆదేశించారు. సోమవారం బల్దియా సమావేశ మందిరంలో టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్, శానిటేషన్, ఎస్టాబ్లిష్మెంట్, రెవెన్యూ విభాగాలకు చెందిన అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నగరపాలక సంస్థకు చెందిన ప్రజల నుంచి వచ్చే ప్రజావాణి దరఖాస్తులపై అధికారులు నిర్లక్ష్యం వహించరాదన్నారు. సెక్షన్ వారీగా సంబంధిత సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరపాలక సంస్థ నిబంధనల ప్రకారం సమస్య న్యాయబద్ధంగా ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. ఫిర్యాదులు వచ్చిన వెంటనే ఫీల్డ్ లెవల్లో సమస్యను పరిశీలించాలని సూచించారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ వేణుమాధవ్, పలు సెక్షన్ల అధికారులు పాల్గొన్నారు. -
మనసత్తా ప్రపంచానికి తెలిసింది
కరీంనగర్‌టౌన్: యుద్ధానికి విరామమే తప్ప ము గియలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశానికి ఆపదొస్తే టెర్రరిస్టుల అంతూ చూసేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. ఆపరేషన్ సిందూర్‌తో మన సైనిక సత్తా యావత్ ప్రపంచానికి తెలి సిందన్నారు. పాకిస్తాన్ ప్రజల ప్రాణాలకు నష్టం లేకుండా ఉగ్రవాద శిబిరాలను ముట్టుపెట్టిన ఘ నత మన సైనికులదేనని కొనియాడారు. బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కరీంనగర్‌లోని గీతాభవన్ చౌరస్తా నుంచి రాంనగర్ మార్క్‌ఫెడ్ గ్రౌండ్ వరకు తిరంగా ర్యా లీ నిర్వహించారు. వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు ర్యాలీకి తరలివచ్చి ప్రధాని మోదీ నాయకత్వానికి, సైన్యానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ, పహల్గాంలో మతం పేరు అడిగి ప్రజలను చంపడం దుర్మార్గమన్నారు. పిల్లల ముందు తండ్రిని, భార్యల ముందు భర్తను ప్యాంటు విప్పి కాల్చి చంపాలని ఏ మతం చెప్పిందని ప్రశ్నించారు. మన సైనికుల ధైర్యసాహసాలను గుర్తు చేస్తూ నిర్వహిస్తున్న తిరంగా యాత్ర.. మద్దతిస్తున్న ప్రజానీకానికి వందనాలు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా కంట్రోల్ రూం బాధ్యతలు నిర్వర్తిస్తూ సైనికుల ధైర్యసాహసాలను కళ్లారా చూసే అదృష్టం తనకు కలిగిందని వివరించారు. మన సైనికులను చూసి గర్విస్తున్నానని వెల్లడించారు. ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ మేయర్ సునీల్‌రావు, గంగాడి కృష్ణారెడ్డి, డాక్టర్ రమణాచారి, బాస సత్యనారాయణరావు, చొప్పరి జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. ● కేంద్ర మంత్రి బండి సంజయ్ -
వాటాధనం ఇవ్వడం లేదు
సంఘంలో 400 మంది సభ్యులం ఉన్నాం. సంఘ పరిధిలో 8 చెరువులున్నాయి. ఆ చెరువుల ద్వారా ఉపాధి పొందుతున్నాం. సంఘం ద్వారా కొనుగోలు చేసిన ఆస్తులున్నాయి. చేపలు పట్టి వాటి అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సభ్యులకు పంచాల్సి ఉండగా అధ్యక్షుడు ఇవ్వడం లేదు. 16 నెలల నుంచి ఒకసారి మాత్రమే మొక్కుబడిగా సమావేశం నిర్వహించగా నియంతలా వ్యవహరిస్తున్నాడు. లెక్కలు చెప్పకుండానే చెరువులోని చేపలను కాంట్రాక్టర్‌కు అప్పగించారు. మాకు న్యాయం చేయండి. – మత్స్యకారులు, ఇందుర్తి, చిగురుమామిడి -
‘మోదీ మంత్రివర్గంలో సభ్యుడిగా ఉండటం నా అదృష్టం’
కరీంనగర్: ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా తిరంగా ర్యాలీలో నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు(సోమవారం) కరీంనగర్ తెలంగాణ చౌక్ నుంచి రామ్ నగర్ వరకూ తిరంగా ర్యాలీని బీజేపీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడారు.‘యుద్దానికి విరామమే తప్ప ముగియలేదు. దేశానికి ఆపదొస్తే అంతు చూసేందుకు మన సైన్యం రెడీగా ఉంది. ఆపరేషన్ సింధూర్ తో మన సైనిక సత్తా యావత్ ప్రపంచానికి తెలిసింది. పాకిస్తాన్ ప్రజల ప్రాణాలకు నష్టం లేకుండా ఉగ్రవాద శిబిరాలను మట్టుపెట్టినం. మోదీ నాయకత్వానికి, భారత సైన్యానికి సంఘీభావంగా ‘తిరంగా ర్యాలీ. మోదీ మంత్రివర్గంలో సభ్యుడిగా కొనసాగడం నా అదృష్టం. కంట్రోల్ రూం బాధ్యతలు నిర్వర్తిస్తూ సైన్యం సాహసాలను కళ్లారా చూసే భాగ్యం కలిగింది’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. -
గత తప్పులతోనే రూ.కోట్లు వృథా
● బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సుడా చైర్మన్ ధ్వజం కరీంనగర్ కార్పొరేషన్: గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులతో నగరంలో కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయిందని సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి విమర్శించారు. చేసిందంతా చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై నెపం నెట్టివేయడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం నగరంలోని సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో మాట్లాడుతూ కేబుల్ బ్రిడ్జిపై రూ.6 కోట్లతో డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారని, టెండర్లో బాధ్యత, భద్రత మరిచిపోవడంతో, నెల రోజుల్లోనే విలువైన సామగ్రి దొంగలపాలైందన్నారు. ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం సంబంధమన్నారు. కోట్ల రూపాయలతో ఆధునీకరించిన కూడళ్లలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని అన్నారు. స్మార్ట్‌సిటీ నిధులు రూ.16 కోట్లతో డంప్‌యార్డ్‌లో ఏర్పాటు చేసిన బయోమైనింగ్ మిషన్ ఎందుకు పనిచేయకుండా పోయిందో చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దన్నసింగ్, జీడీ రమేశ్, కొడూరి రవీందర్‌గౌడ్, బత్తిని చంద్రయ్య, మార్క రాజాగౌడ్, నదీమ్, సాయికిరణ్ పాల్గొన్నారు. నేడు వాలీసుగ్రీవ ఆలయ వార్షికోత్సవం శంకరపట్నం: కన్నాపూర్ వాలీసుగ్రీవ దేవాలయంలో సోమవారం సీతారాముల వార్షిక వేడుకలకు ఆలయం ముస్తాబు చేశారు. వార్షికోత్సవం సందర్భంగా సోమవారం పంచామృత అభిషేకం, సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. మంగళవారం హోమ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
అంతరిక్షం గురించి తెలుసుకుంటా
ఇస్రో శిక్షణకు ఎంపికకావడం నాకు సంతోషంతోపాటు గర్వంగా ఉంది. చిన్నవయసులోనే అంతరిక్షం గురించి తెలుసుకునే అవకావం రావడం సంతోషంగా ఉంది. శిక్షణ సమయంలో శాస్త్రవేత్తలు తెలియజేసే అంశాలను బాగా పరిశీలించి ఉన్నత విద్య అభ్యసిస్తా. –పొలవేణి సాత్విక శాస్త్రవేత్త అవుతాను ఇస్రో శిక్షణతో మరింత చదువుకుని శాస్త్రవేత్తను అవుతా. 11రోజుల శిక్షణతో చాలా విషయాలు నేర్చుకుంటా. నాకు అవకాశం కల్పించిన ఇస్రోకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నా ఉన్నతికి శిక్షణ ఒక మైలురాయి అవుతుంది. –పడాల సిరివెన్నెల విద్యార్థులకు మంచి అవకాశం ఇస్రో శిక్షణకు పెద్దపల్లి జిల్లా విద్యార్థులు ముగ్గురు, జగిత్యాల జిల్లా విద్యార్థిని ఒకరు వెళ్లడం చాలా ఆనందంగా ఉంది. విద్యార్థుల భవిష్యత్‌కు మ ంచి అవకాశం. శిక్షణలో అవకాశం రావడం వారికి వరం. 11 రోజుల శిక్షణలో అంతరిక్షంతోపాటు చాలావిషయాలు తెలుసుకుంటారు. –బి.రవినందన్‌రావు, జిల్లా సైన్స్ అధికారి, పెద్దపల్లి -
ఉచిత వైద్య శిబిరం ప్రారంభం
కరీంనగర్: ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆది వారం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. గోదాంగడ్డలోని ముస్లిం స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించారు. కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామంలో శ్రీఅలివేలుమంగ, పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గంగులను ఆలయ కమిటీ బాధ్యులు సన్మానించా రు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, సుంకిశాల సంపత్‌రావు, కర్ర సూర్యశేఖర్, నేతి రవివర్మ, మిడిదొడ్డి నవీన్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పు తిరుపతి, శ్రీనివాస్ పాల్గొన్నారు. విజయవంతం చేయాలికరీంనగర్టౌన్: ఈనెల 19న నిర్వహించే తిరంగాయాత్ర, 22న హిందూ ఏక్తాయాత్రను విజయవంతం చేయాలని ఏక్తాయాత్ర పశ్చిమ జోన్ ఇన్చార్జి వాసాల రమేశ్ పిలుపునిచ్చారు. ఆదివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ, సోమవారం పార్టీలకతీతంగా జరిగే తిరంగార్యాలీ, 22న హిందూ ఏక్తాయాత్రలో ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొనేలా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించాలన్నారు. ఇటీవల పహల్గాంలో హిందువులనే ఉగ్రవాదులు దారుణంగా చంపడం వెనుక ముష్కరులు, పాకిస్తాన్ హస్తం ఉందని, హిందువులంతా ఏక్తాయాత్రలో పాల్గొని మన బలం చూపించాలని కోరారు. సమావేశంలో నాయకులు నరహరి లక్ష్మారెడ్డి, ఎన్నం ప్రకాష్, బండ రమణారెడ్డి, ధర్మారం వెంకటస్వామి, రెడ్డి శ్రీనివాస్, సుధాకర్‌పటేల్, మామిడి రమేశ్, ఉప్పరపల్లి శ్రీనివాస్, శానగొండ శ్రీనివాస్, పొన్నాల రాము, గంట్ల నరసింహారెడ్డి, పర్వతం మల్లేశం, యువ రమేశ్, శీతల రమేశ్, పుప్పాల ఆంజనేయులు, విష్ణువర్ధన్‌రావు, నరేశ్, రవి గోపాల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. క్యాండిల్ లైట్ ర్యాలీ కరీంనగర్‌టౌన్: అంతర్జాతీయ ఎయిడ్స్ మెమోరియల్ క్యాండిల్ లైట్ డే సందర్భంగా ఆది వారం సాయంత్రం వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, డిస్టిక్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సిబ్బంది క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహంచారు. ర్యాలీని జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధ జెండా ఊపి ప్రారంభించారు. సుధ మాట్లాడుతూ... ఎయిడ్స్‌తో కోల్పోయిన వ్యక్తులను స్మరించుకోవడానికి, హెచ్ఐవీతో జీవిస్తున్న వారికి సంఘీభావం చూపడానికి క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించామని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలికరీంనగర్టౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని బీజేపీ విశ్రాంత ఉపాధ్యాయ, ఉద్యోగ జిల్లా సెల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆదివారం నగరంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర సెల్ కో చైర్మన్ నరహరి లక్ష్మారెడ్డి మాట్లాడారు. గత ప్రభుత్వం వలే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడా పీఆర్సీ ప్రకటించకుండా, డీఎలు ఇవ్వకుండా, రిటైర్డ్ అయినవారికి పెన్షన్, ఉద్యోగ సమయంలో దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు చెల్లించకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం పదేపదే ఆర్థిక పరిస్థితి బాగాలేదని న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం బేషజాలకు పోకుండా వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స మావేశంలో జిల్లా సెల్ నాయకులు గంట్ల నరసింహారెడ్డి, కర్ర ప్రభాకర్‌రెడ్డి, గోలి సత్యనా రాయణరెడ్డి, పింగిలి ప్రతాపరెడ్డి, అబ్బిడి మా ధవరెడ్డి, ఈరెడ్డి తిరుమలరెడ్డి పాల్గొన్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
హుజూరాబాద్: అప్పుల బాధతో ఓ రైతు మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. రాయికల్‌కు చెందిన రావుల తిరుపతిరెడ్డి(38)కి రెండెకరాల భూమి ఉంది. కొద్దిరోజుల క్రితం హార్వెస్టర్ కొనుగోలు చేశాడు. పంట దిగుబడి సరిగా రాక.. హార్వెస్టర్‌కు కిస్తీలు చెల్లించలేకపోయాడు. మరోవైపు అప్పు రూ.10లక్షలకు చేరుకుంది. అప్పు ఎలా తీర్చాలో తెలియక కొద్దిరోజులుగా మనస్తాపంతో ఉంటున్నాడు. శనివారం రాత్రి ఇంట్లో ఒంటరిగా పడుకున్నాడు. భార్య కవిత పిల్లలతోపాటు ఇంటి ఆవరణలో పడుకుంది. ఉదయం తిరుపతిరెడ్డి బయటకు రాకపోవడంతో కవిత ఇంట్లోకి వెళ్లి చూడగా ఉరేసుకుని చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై భార్గవ్ తెలిపారు. -
ఆగని గొర్రెల మృత్యువాత
ధర్మారం(ధర్మపురి): బొమ్మారెడ్డిపల్లిలో అస్వస్థతకు గురైన గొర్రెల్లో ఆదివారం ఉదయం వరకు 99 మృత్యువాతపడినట్లు గొర్రెలకాపరులు తెలిపారు. కొమ్ము కనకయ్య, రాజేశం, రేచవేని మల్లేశం, సమ్మెడ కొమురయ్య, గాడి నాగయ్యకు చెందిన గొర్రెలు మృత్యువాతపడ్డాయి. గ్రామశివారులో కోసిన వరిపొలంలో గొర్రెల మంద మేతకు వెళ్లి అస్వస్థతకు గురైన విషయం విదితమే. ఈక్రమంలో శనివారం 48 మృత్యువాతపడగా.. ఆదివారం ఉదయం వరకు వాటి సంఖ్య 99కి చేరింది. మరికొన్ని అస్వస్థతతో బాధపడుతున్నాయి. సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్ ఆదివారం గొర్రెలకాపరులను పరామర్శించారు. గొర్రెల మృతికి గల కారణాల గురించి పశువైద్యాధికారి అజయ్‌ను అడిగి కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొత్త నర్సింహులు, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు యసోద అజయ్, మండల అధ్యక్షుడు సోగాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
హనుమాన్ పెద్ద జయంతికి ఏర్పాట్లు
మల్యాల: కొండగట్టు అంజన్న స్వామి ఆలయం పెద్ద జయంతికి ముస్తాబవుతోంది. ఈనెల 20 నుంచి 22 ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ వేడుకలకు వివిధ రాష్ట్రాల నుండి సుమారు రెండు లక్షల మంది భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. వారి కోసం నాలుగు లక్షల లడ్డూ ప్రసాదాలు సిద్ధం చేశారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్‌దీపాలతో అలంకరించారు. చలువ పందిళ్లు వేశారు. హరిత హోటల్ సమీపంలో షెడ్డు నిర్మాణాన్ని శరవేగంగా చేపడుతున్నారు. జయంతికి వచ్చే భక్తుల కోసం జేఎన్టీయూ చెక్‌పోస్టు వద్ద, దిగువ కొండగట్టు వద్ద స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. భక్తుల నీడ కోసం వైజంక్షన్ వరకు షామియానాలు ఏర్పాటు చేశారు. కాలినడకన వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా ఆలయ ప్రధాన ద్వారం వరకు కార్పెట్ వేశారు. ఎండల నేపథ్యంలో చలివేంద్రాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేందుకు స్థలాలను ఎంపిక చేశారు. పార్కింగ్ స్థలాలను ఎంపిక చేసి, సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టారు. బొజ్జ పోతన్న ఆలయం నుంచి కొండగట్టు వై జంక్షన్ వరకు మూడు ఆర్టీసీ బస్సులను ఉచితంగా నడిపించనున్నారు. కోనేరులో ఎప్పటికప్పుడు నీరు నింపేలా చర్యలు చేపట్టారు. కోనేరు సమీపంలో 120 షవర్లు ఏర్పాటు చేశారు. కొండగట్టులో ఉన్న ఐదు లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకులను నీటితో నింపారు. – లడ్డూ ప్రసాదం కోసం ప్రత్యేకంగా ఏడు కౌంటర్లు, కేశఖండన, ప్రత్యేక దర్శనం టికెట్ల కోసం పది కౌంటర్లు ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసేందుకు 381మంది కార్మికులను నియమించారు. ఫైరింజన్ యంత్రం మూడు రోజులు అందుబాటులో ఉండనుంది. భక్తులు అస్వస్థతకు గురైతే తక్షణమే చికిత్స అందించేందుకు వైద్య శిబిరాలతోపాటు 108 వాహనం అందుబాటులో ఉంచనున్నారు. ఆలయ పరిసరాల్లో ఇప్పటికే 64 సీసీ కెమెరాలుండగా.. అదనంగా మరో 48 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆర్జిత సేవలు రద్దు కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో ఈనెల 20 నుంచి 23 వరకు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈఓ శ్రీకాంత్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ముస్తాబవుతున్న కొండగట్టు సిద్ధంగా లడ్డూ, ప్రసాదాలు ఈనెల 20 నుంచి 22వరకు ఉత్సవాలు ఉత్సవాలకు సర్వం సిద్ధం హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో సర్వం సిద్ధం చేశాం. ప్రత్యేక క్యూలైన్లు, లడ్డూప్రసాదాలు, కేశఖండన, ప్రత్యేక దర్శనాల కోసం ఏర్పాట్లు చేశాం. స్వామివారి జయంతి ఉత్సవాలను విజయవంతం చేయడంలో అందరూ సహకరించాలి. – శ్రీకాంత్‌రావు, కొండగట్టు ఆలయ ఈఓ -
శిక్షణతో మరింత పదును
జ్యోతినగర్(రామగుండం): భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) స్కూల్ విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం.. యువ విజ్ఞాన కార్యక్రమ్(యువిక)–2025 ద్వారా పిల్లల ఆలోచనలకు మెరుగులు దిద్దితే..భావితరానికి శాస్త్రవేత్తలుగా మార్చుకోవచ్చనే క్రమంలో ఇస్రో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గత మార్చిలో దరఖాస్తులు చేసుకోగా రాష్ట్రవ్యాప్తంగా 12 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. పెద్దపల్లి జిల్లా నుంచి ముగ్గురు, జగిత్యాల జిల్లా నుంచి ఒకరు.. మొత్తంగా నలుగురు ఎంపికకాగా ఈనెల 19(నేటి) నుంచి ఈనెల 30వ తేదీ వరకు హైదరాబాద్ బాలానగర్ ఇస్రో కేంద్రంలో శిక్షణ పొందనున్నారు. ఇస్రో శిక్షణలో ఉమ్మడి జిల్లాకు చెందిన నలుగురు ● పెద్దపల్లి మండలం రాగినేడుజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన భౌతిక, రసాయనశాస్త్ర ఉపాధ్యాయుడు కె.జగదీశ్వర్‌రెడ్డి పర్యవేక్షణలో పోలవేణి సాత్విక, పడాల సిరివెన్నెల. ● పాలకుర్తి మండలం కన్నాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భౌతిక, రసాయనశాస్త్ర ఉపాధ్యాయుడు బి.రవినందన్‌రావు మార్గదర్శనంలో తోడేటి సాయివర్షిత ● జగిత్యాల జిల్లా కొడిమ్యాల తెలంగాణ ఆదర్శ పాఠశాలకు చెందిన కొలకాని అశ్విని. ‘ఇస్రో’ యువికా శిక్షణలో మన విద్యార్థులు రాష్ట్రంలో 12 మంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి నలుగురు హైదరాబాద్‌లో నేటినుంచి 30వ తేదీ వరకు వరకు శిక్షణ సంతోషంగా ఉంది జిల్లా సైన్స్ అధికారి రవినందన్‌రావు సర్ ద్వారా నేను యువికాకు దరఖాస్తు చేసుకున్నాను. యువికా–2025లో ఎంపికయ్యాను. హైదరాబాద్ ఇస్రో కేంద్రంలో శిక్షణ కోసం వచ్చాం. శిక్షణకు ఎంఇక కావడం చాలా సంతోషంగా ఉంది. –తోడేటి సాయి వర్షిత ఉపయోగపడుతుంది ఇస్రోలో తీసుకునే శిక్షణ జీవితంలో ఎంతోఉపయోగపడుతుంది. అంతరిక్షం గురించి తెలుసుకోవడం మా అదృష్టం. సైన్స్‌లో రాణించి శాస్త్రవేత్తను అవుతా. దేశంకోసం మరిన్ని ప్రయోగాలు చేసి శభాష్ అనిపించుకుంటా. –కొలకాని అశ్విని -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని సుగ్లాంపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భిక్షాటన చేసేవ్యక్తి(38) మృతి చెందాడు. ఎస్సై శ్రావణ్‌కుమార్ కథనం ప్రకారం.. పెద్దపల్లి నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆటోట్రాలీ.. భిక్షాటన చేసేవ్యక్తిని ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యక్తి గురించి పూర్తివివరాలు తెలియరాలేదు. ధాన్యం కుప్పను ఢీకొని ఒకరు..తిమ్మాపూర్: మండలంలోని మల్లాపూర్ శివారులో శనివారం అర్ధరాత్రి 11:30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. కరీంనగర్ మండలం మొగ్ధంపూర్ గ్రామానికి చెందిన నేరెళ్ల రంజిత్(32), సాజిద్ మల్లాపూర్‌లో తెలిసిన వ్యక్తిని కలిసి కరీంనగర్ వైపు బైక్‌పై తిరిగి వెళ్తున్నారు. రోడ్డుపై పోసిన వరికుప్పలకు ఢీకొనడంతో రంజిత్ అక్కడికక్కడే మృతిచెందాడు. సాజిద్‌కు గాయాలయ్యాయి. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు రోడ్డుపై వరి కుప్పలు వేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతూ.. పెద్దపల్లిరూరల్: మద్యానికి బానిసైన చిన్నచెవ్వ భాను (23) అనే యువకుడు శుక్రవారం క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. పెద్దపల్లి మండలం రంగంపల్లిలో నివాసముంటున్న భాను అదే ప్రాంతంలో క్రిమిసంహారకమందు తాగాడు. గమనించిన స్థానికులు పెద్దపల్లిలో ప్రాథమిక చికిత్స చేయించి కరీంనగర్‌కు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి తండ్రి చెవ్వ లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై లక్ష్మణ్‌రావు తెలిపారు. ఒకరిపై కేసుసారంగాపూర్: బీర్పూర్ మండలం తుంగూర్‌లో రోడ్డుపై నిలబడిన మహిళను ద్విచక్రవాహనంతో ఢీకొట్టిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రొబేషన్ ఎస్సై రాజు కథనం ప్రకారం తుంగూర్కు చెందిన పుష్పలత రోడ్డుపై నిలబడి ఉంది. బీర్పూర్ మండలం మంగేళకు చెందిన ఉదయ్ తన బైక్‌పై వచ్చి పుష్పలతను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి సోదరుడు రవీందర్ ఫిర్యాదు మేరకు ఉదయ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
వామ్మో.. ఎములాడ రోడ్డు
కొత్తపల్లి: కరీంనగర్– వేములవాడ ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారింది. కొత్తపల్లి మండలం బావుపేట వద్ద ఏర్పడ్డ గుంతలతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత 15 రోజులుగా సమస్య తీవ్రమవుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి నిర్మాణంలో ఇరువైపుల చేపట్టిన డ్రైనేజీ నీటి మళ్లింపులో చోటు చేసుకున్న తప్పిదంతోనే రహదారిపై నీళ్లు నిలుస్తున్నాయని, పెద్దపెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. 13.8 కిలోమీటర్ల రహదారి కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్ (బావుపేట) పారిశ్రామిక ప్రాంతం మీదుగా వేములవాడ, కామారెడ్డిలకు వెళ్లే రహదారిపై నిత్యం నెలకొన్న రద్దీని దృష్టిలో పద్మనగర్–ఒడ్యారం మధ్య 13.8 కిలోమీటర్ల నాలుగు లైన్ల రహదారి విస్తరణ పనులను రూ.89 కోట్ల నిధులతో చేపట్టారు. ఈ రహదారి విస్తరణ ప్రస్తుతం నవ్వులు పాలవుతోంది. ఒక సారి రోడ్డు..మరోసారి వంతెనలు.. నిర్మించిన ఈ రహదారిపై మరో సమస్య ఏర్పడింది. గతంలో సైతం రోడ్డుపై నిలుస్తున్న నీటిని మళ్లించడంలో అవస్థలు ఎదురయ్యాయి. ప్రస్తుతం డ్రైనేజీ నీటితో రహదారి పూర్తి చెడిపోతోంది. డ్రైనేజీ నీటి మళ్లింపు లేక పద్మనగర్– ఒడ్యారం రహదారి విస్తరణ పనుల్లో భాగంగా కొత్తపల్లి మండలం బావుపేటలో రోడ్డు కిరువైపుల చేపట్టిన డ్రైనేజీ వ్యవస్థల వల్ల తరచూ సమస్య తలెత్తుతోంది. వర్షం పడినప్పుడు వరద నీరు ఎటూ వెళ్లాలేక నిలిచిన రోజులున్నాయి. ఇప్పుడైతే బావుపేటలోని ఎన్టీఆర్ తమిళకాలనీ నుంచి వస్తున్న మురికి నీరు రోడ్డుకిరువైపుల ఉన్న డ్రైనేజీలోకి చేరుతోంది. ఆ నీటి మళ్లింపు లేక రోడ్డుపై నిలుస్తోంది. ఫలితంగా రోడ్డంతా డ్రైనేజీ నీటితో నిండిపోవడంతో రోడ్డు పూర్తిగా చెడిపోయింది. రోడ్డుపై గుంతలు ఏర్పడి వాహనదారులకు తెలియక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గ్రానైట్ లోడ్ వాహనాలు ఈ రహదారిపై వెళ్తుండడం, యూ టర్న్ చేసుకొనే వాహనాలు బ్రేక్‌లు వేస్తుండటంతో రోడ్డు పూర్తిగా చెడిపోతోంది. ఫలితంగా ద్విచక్రవాహనదారులు కిందపడుతుండగా, కార్లు గుంతల్లో చిక్కుకుంటున్నాయి. ప్రమాదకరంగా ప్రధాన రహదారి బావుపేట వద్ద రోడ్డుపై పారుతున్న డ్రైనేజీ నీరు గుంతల్లో ఇరుక్కుంటున్న వాహనాలు ప్రమాదాల బారిన పడుతున్న ప్రయాణికులు పట్టించుకోని అధికారులుగుంతలతో ప్రమాదాలు బావుపేట వద్ద డ్రైనేజీ నీటి మళ్లింపు లేక రోడ్డుపై ఏర్పడ్డ గుంతలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ప్రయాణం వాహనదారులకు నరకంగా మారింది. పారిశ్రామిక ప్రాంతం బావుపేట నుంచి కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, కామారెడ్డి తదితర ప్రాంతాలతో పాటు అటు వైపు నుంచి బావుపేటకు వచ్చే వాహనాలతో రోడ్డు బిజీగా మారింది. దీంతో వాహనాల తాకిడి అధికంగా ఉండటంతో రోడ్డుపై గుంతలు ఎక్కువై ప్రమాదాలు జరుగుతున్నాయి.డ్రైనేజీ నీటిని మళ్లించాలి పద్మనగర్– ఒడ్యారం రహదారి నిర్మాణ పనులు లోపభూయిష్టంగా చేపట్టడంతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. బావుపేట వద్ద మురికి నీటి మళ్లింపు చేపట్టకపోవడంతో రహదారిపై నిలిచి ప్రమాదాలు జరుగుతున్నాయి. మోకాలు లోతు గుంతలు ఏర్పడటంతో వాహనాలు చిక్కుకుంటున్నాయి. ప్రధాన రహదారి కావడంతో నిత్యం వందలాది వాహనాలతో రహదారి మరింత చెడిపోతోంది. ఆర్అండ్బీ అధికారులు స్పందించి ఈ రహదారి మరమ్మతు చేపట్టాలి. – కుంట తిరుపతి, బీజేపీ మండల అధ్యక్షుడు, కొత్తపల్లి -
కాళేశ్వరం టు హైదరాబాద్
విద్యానగర్(కరీంనగర్): ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని మంథని నియోజకవర్గంలో ఉన్న కాళేశ్వరం త్రివేణి సంగమంలో ఈనెల 14 నుంచి సరస్వతీ పుష్కరాలు వైభవంగా సాగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచే కాకుండా ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వేలాదిమంది నిత్యం తరలివెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చి వెళ్లేవారు ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో ఉన్న పలు దర్శనీయ ప్రాంతాలను తిలకించవచ్చు. ● హైదరాబాద్ వాసులు వరంగల్ మీదుగా సరస్వతీ పుష్కరాలకు కాళేశ్వరం వెళ్తే ఉస్మాన్ సాగర్ సరస్సు, కీసరగుట్ట, శామీర్‌పేట్ లేక్ వ్యూ తిలకించవచ్చు. ● వరంగల్ జిల్లాలో ప్రవేశించిన తరువాత పాకాల సరస్సు, వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట, ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యం, కాకతీయ రాక్ గార్డెన్, కాకతీయ మ్యూజికల్ గార్డెన్, భద్రకాళి ఆలయం, రామప్ప సరస్సు, రామప్ప ఆలయాన్ని దర్శించవచ్చు. ● మేడిగడ్డ బ్యారేజీ, కన్నేపల్లి పంప్‌హౌజ్ సందర్శించిన తరువాత కాళేశ్వరం చేరుకుని సరస్వతీ పుష్కర స్నానాలు చేసి కాళేఽశ్వర మక్తీశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవచ్చు. ● తిరుగు ప్రయాణంలో కరీంనగర్ మీదుగా హైదరాబాద్‌కు వెళ్తే మార్గమధ్యలో ఉన్న మంత్ర కూటమిగా ప్రసిద్ధి చెంది, గోదావరి తీరంలో ఉన్న మంథనిలోని బౌద్ధ, జైన క్షేత్రాలను, గౌతమేశ్వర, సిద్దేశ్వర, వరద రాజేశ్వర తదితర 20 ఆలయాలను దర్శించవచ్చు. ● పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లోని రామగిరి దుర్గం సందర్శించవచ్చు. ఈ దుర్గంపై సీతారాముల ఆలయం, రామస్థాపిత శివలింగం, జానకీదేవి పాదముద్రలతోపాటు అనేక కట్టడాలు ఉన్నాయి. ● కమాన్‌పూర్ మండలకేంద్రంలోని ఆదివరాహస్వామివారిని దర్శించుకోవచ్చు. కోరిన కోర్కెలు తీర్చే ఆదివరాహస్వామి మహిమగల దేవుడని ప్రసిద్ధి. మంథని ఎక్స్‌రోడ్డు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంటుంది. ● సుల్తానాబాద్ దగ్గరలోని ధూళికట్టలో శాతావాహనుల కాలం నాటి కోటలు, బౌద్ధ స్తూపాలు చూడవచ్చు. కరీంనగర్లో ఎలగందుల ఖిల్లా, ఉజ్వలపార్క్, రాజీవ్ జింకల పార్క్, అగ్రహారం, నాంపల్లి గుట్ట వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని, సిద్దిపేట మీదుగా హైదరాబాద్ చేరుకోవచ్చు. వయా కరీంనగర్ దారిలో అనేక దర్శనీయ స్థలాలు పుష్కరాలకు వచ్చేవారికి మధురానుభూతి -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
● రాష్ట్ర ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ జగదీశ్వర్కరీంనగర్ అర్బన్: తెలంగాణలో ఉన్న ఉద్యోగుల పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదని, ఒకటి, రెండు డీఏల పెండింగ్ తప్పా ఐదు డీఏల పెండింగ్ ఎక్కడ లేదని రాష్ట్ర ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. ఉద్యోగులంతా అసంతప్తితో ఉన్నారని, సీఎం తమ సమస్యలను పరిష్కరిస్తారన్న నమ్మకం ఉందని అన్నారు. శనివారం స్థానిక టీఎన్జీవో భవన్లో ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి మా ట్లాడారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ గ్రాడ్యుటీ, పెన్షన్ బెనిఫిట్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దుపై ప్రభుత్వ జాప్యంపై అసహనం వ్య క్తం చేశారు. ఏసీబీ కేసులను త్వరగా తేల్చాలని, తిరిగి విధుల్లోకి తీసుకోవడంలో జాప్యం తగదని అన్నారు. హెల్త్ కార్డులకు సంబంధించిన విషయాలపై 204 సంఘాలతో ఏర్పడిన జేఏసీ నాయకులతో ప్రభుత్వానికి పలుసార్లు నివేదిక ఇవ్వడం జరిగిందని, సీఎం ఐఏఎస్‌లతో త్రీమేన్ కమిటీ నివేదిక కోరడం జరిగిందని వివరించారు. రాబోయే 15 రోజుల్లో కమిటీ ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కాళిచరణ్, కేంద్ర సంఘం నేతలు నాగుల నరసింహస్వామి, గూడ ప్రభాకర్ రెడ్డి, సర్దార్ హర్మిందర్ సింగ్, జిల్లా కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు ఒంటెల రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
● 14 తులాల బంగారం, 50తులాల వెండి అపహరణ ● క్లూస్‌టీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌లో తాళం వేసిన ఇంట్లో దొంగలు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. క్లూస్‌టీం, డాగ్స్క్వాడ్లలో రంగంలోకి దిగారు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు. రాచర్లబొప్పాపూర్‌కు చెందిన ఈరవేణి లతిక–శివకుమార్ దంపతుల ఇంట్లో శనివారం మధ్యాహ్నం గుర్తుతెలియని దొంగలు ఇంటి ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. వేసవి సెలవులు కావడంతో లతిక ఇంటికి తాళం వేసి ఐదు రోజుల క్రితం తన తల్లి గారి ఊరు దోమకొండ మండలం అంబారిపేటకు వెళ్లింది. శనివారం తిరిగి రాగా.. ఇంటి తాళం పగులగొట్టి ఉండడం గమనించి.. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తాళాలు ధ్వంసం చేసి ఉన్నాయి. అందులో దాచి ఉంచిన సుమారు 14తులాల బంగారం, 50తులాల వెండిని దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించింది. లతిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తున్నట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. -
విషాహారం తిని 48 గొర్రెల మృత్యువాత
ధర్మారం(ధర్మపురి): పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి గ్రామంలో విషాహారం తిని 48 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మరో 32 జీవాలు తీవ్రఅస్వస్థతకు గురయ్యాయి. బాధితుల కథనం ప్రకారం.. రేషవేని మల్లేశం, సమ్మెట కొమురయ్య, కొమ్ము రాజేశం, కనుకయ్య, దాడి నాగయ్య అనే గొర్రెల పెంపకందారులకు దాదాపు 600 గొర్రెలు ఉన్నాయి. వీటిన్నింటినీ ఒకేమందగా ఏర్పాటు చేసి పెంచుతున్నారు. వీటిని ఎప్పటిలాగే శుక్రవారం సాయంత్రం గ్రామశివారులోని వరి పొలాల్లోకి తీసుకెళ్లారు. వరి కోసిన పొలంలో మేత మేసిన గొర్రెలను రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. శనివారం ఉదయం చూసేవరకు గొర్రెలు అస్వస్థతకు గురయ్యాయి. అందులో కొన్ని మృత్యువాత పడ్డాయి. వెంటనే స్థానిక పశువైద్యాధికారి అజయ్‌కుమార్‌కు వారు సమాచారం అందించారు. ఆయన వచ్చేలోగా 32 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. సిబ్బంది సాయంతో మిగతా వాటికి ధర్మారంలోని ప్రైవేటు మెడికల్ షాపుల నుంచి మందులను తెప్పించి వేశారు. అయినా.. వాటి పరిస్థితిలో మార్పు కనిపించలేదు. సాయంత్రం వరకు మరో 16 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. మొత్తంగా రాత్రి వరకు మొత్తం 48 గొర్రెలు మృత్యువాత పడగా మరికొన్ని మరణించే అవకాశం ఉందని బాధితులు ఆందోళన చెందుతున్నారు. మరణించిన గొర్రెల తో దాదాపు రూ.5లక్షలకుపైగా నష్టం వాటిల్లిందని కాపలదారులు ఆందోళన చెందుతున్నారు.విషాహారమా? అంతుచిక్కని రోగమా ?అస్వస్థతకు గురైన రెండురోజులకే గొర్రెలు మృత్యువాత పడడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఐదుగురు గొర్రెల పెంపకందారులు సామూహికంగా గ్రామశివారులోని కోసిన వరి పొలంలో మేతకు తీసుకుళ్లిన రాత్రి నుంచే అస్వసత్థకు గురికావడం.. ఆ వెంటనే ఒకదాని వెనుక మరోటి మృత్యువాత పడడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పొలం పంట కోసం క్రిమిసంహాకర మందు పిచికారీ చేసిన గడ్డి తినడంతో ఘటన జరిగిందా? లేదా మరేదైన వింతవ్యాధి సోకిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై పశువైద్యాధికారి అజయ్‌ను వివరణ కోరగా పొలంలో చల్లించిన విషపూరిత గుళికల ప్రభావంతో మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీనిపై జిల్లా అధికారులకు నివేదిక పంపిస్తానని ఆయన అన్నారు.ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతివేములవాడరూరల్: వేములవాడ మండలం నందికమాన్ వద్ద ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు. కోనరావుపేట మండలం కొలనూరుకు చెందిన కూన తిరుపతి(45) వేములవాడ అర్బన్ మండలం కొడుముంజలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్నాడు. కరీంనగర్ డిపోకు చెందిన బస్సు ఢీకొన్న సంఘటనలో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య లావణ్య, కూతురు అక్షయ, కుమారులు హేమంత్, ఆదిత్య ఉన్నారు. ఈ సంఘటనపై పట్టణ సీఐ వీరప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
భూ భారతితో భూ సమస్యలు పరిష్కారం
● ఈ చట్టం దేశంలోనే రోల్ మోడల్ ● అధికారులే నేరుగా ప్రజల వద్దకు బుగ్గారం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం రోల్‌మోడల్ అని, దేశంలోని 18రాష్ట్రాల్లో భూ చట్టాలపై అధ్యయనం చేసి ఈ చట్టాన్ని రూపొందించామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై న జగిత్యాల జిల్లా బుగ్గారం ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతు బల్గూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. భూమి రిజిస్ట్రేషన్ అవగానే మ్యూటేషన్ తొందరగా అయ్యేలా చూడాలని, 30 రోజుల గడువుతో సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. మరో రైతు గడ్డం భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా హమాలీలు లేక కాంటా సాగడం లేదని తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అన్ని సమస్యలకు భూభారతి చట్టంతో పరిష్కారం లభిస్తుందన్నారు. అన్నదమ్ముల మధ్య ఉన్న భూ సమస్యలకు మాత్రమే 30 రోజుల గడువు పడుతుందని, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. చట్టంలో అధికారులు ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. భూ సమస్యల పరిష్కారానికి వచ్చే వారికి అధికారులు అవసరమైన సూచనలు, సలహాలివ్వాలని సూచించారు. ఈనెల చివరి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తామని అన్నారు. ధర్మపురికి ఆర్డీవో కార్యాలయం, సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ.. గతంలో ఉన్న ధరణిని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. అనంతరం చట్టం కింద పరిష్కరించిన పలు సమస్యలకు సంబంధించిన ప్రొసీడింగ్స్ కాపీలను దరఖాస్తుదారులకు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, ఎస్పీ అశోక్‌కుమార్, అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, ఆర్డీవో మధుసూదన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. డివైడర్‌ను ఢీకొన్న కారుజగిత్యాలక్రైం: జగిత్యాల కలెక్టరేట్ ఎదుట శనివారం ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో నుజ్జునుజ్జయ్యింది. డివైడర్ కూలిపోయింది. జగిత్యాల విద్యానగర్‌కు చెందిన రవిబాబు కలెక్టరేట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను అతివేగంగా ఢీకొంది. కారు బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కారును అక్కడి నుంచి తొలగించారు. -
అమ్మా.. నాన్న.. కన్నా..
జీవనశైలిలో మార్పు రావాలి వివాహాలు ఆలస్యంగా జరుగుతుండడం వల్ల అప్పటికే ఊబకాయం, వృత్తిపరమైన మానసిక ఒత్తిడితో బీపీ, షుగర్ వస్తున్నాయి. మహిళల్లో పీసీవోడీ సమస్యలు పెరుగుతున్నాయి. వయస్సు పెరిగే కొద్దీ ఫెర్టిలిటీ సామర్థ్యం తగ్గుతుంది. సాధారణంగా మహిళలకు 20–35 ఏళ్ల మధ్య గర్భం ధరించడం మంచిదిగా భావిస్తారు. మహిళల్లో థైరాయిడ్ సమస్యలు, హార్మోన్స్ అసమతుల్యతలు ఉంటే చికిత్స చేయించుకోవాలి. పోషకాహారం తీసుకోవాలి. మద్యం, డ్రగ్స్ పూర్తిగా మానాలి. పిల్లలు పుట్టాలంటే దంపతులు జీవ న విధానంలో మార్పులు చేసుకోవాలి. గర్భం రావడానికి మానసికంగా ఆందోళన లేకుండా, ప్రశాంతంగా ఉండటం చాలా అవసరం. అందుకోసం యోగా, వ్యాయామం చేయాలి. – డాక్టర్ ఎనమల్ల శ్రీదేవి, ఫెర్టిలిటీ స్పెషలిస్టు కరీంనగర్‌టౌన్: నూతన జీవితం ప్రారంభించిన తర్వాత ‘అమ్మా నాన్న’ అనే మధుర పిలుపును వినాలనే కోరిక ప్రతి జంటలోనూ ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో చాలా మంది దంపతులు ఈ ఆనందాన్ని అనుభవించలేక సంతానలేమితో బాధపడుతున్నారు. సంతానలేమి సమస్యకు అనేక కారణాలు ఉన్నప్పటికీ.. దంపతులు తమ స్వయంకృతాపరాధంతో చేసే పనులతోనే సమస్యను మరింత జఠిలం చేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కొందరు ఆలస్యంగా వివాహాలు చేసుకుని సంతానం లేక బాధ పడుతుండగా.. మరి కొందరిలో ఊబకాయ సమస్య సంతానానికి ప్రధాన అవరోధం అవుతోంది. కారణాలేవైనా మానసిక, శారీరక దృఢత్వం, సంతోషకరమైన జీవన విధానమే సంతాన సాఫల్యానికి మూలం అని వైద్యులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సంతాన లేమితో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. దీంతో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల వంటి పట్టణాల్లో సంతాన సాఫల్య కేంద్రాలు విరివిగా వెలుస్తున్నాయి. సాంకేతికత అందుబాటులోకి వచ్చినా.. ఓ వైపు శాస్త్ర సాంకేతిక అభివృద్ధి వల్ల ఐవీఎఫ్, ఐయూఐ వంటి చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చినా.. మానసిక, సమాజపు ఒత్తిళ్లు సంతానలేమితో బాధపడుతున్న వారిని కలతకు గురి చేస్తున్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం, ఆరోగ్య పరీక్షల ద్వారా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే సంతాన ఆశను సాకారం చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. కానీ, ఉరుకులు పరుగుల జీవనశైలి, బాగా సంపాదించి సెటిల్ కావాలనే ఆశతో కొంతమంది పిల్లల్ని కనాలనే ఆలోచన కూడా మరిచిపోతున్నారని, వయస్సు పెరిగితే పిల్లలు కనడం తీవ్ర ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందని ఫెర్టిలిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫెర్టిలిటీ సెంటర్లకు క్యూ.. పెళ్లి జరిగి ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగకపోవడంతో దంపతులు ఫెర్టిలిటీ సెంటర్లకు క్యూ కడుతున్నారు. కొంత మంది ఫలితం పొందుతుండగా, మరికొంత మంది లక్షలు కుమ్మరించినా ఎలాంటి ఫలితం లేదని వాపోతున్నారు. తాజా గణాంకాల ప్రకారం మనదేశంలో వివాహితులలో సుమారు 15–20 శాతం జంటలు గర్భధారణ సమస్యలతో ఆస్పత్రులకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. సంతానలేమికి దారితీసే అలవాట్లు మద్యపానం, ధూమపానం చేసే వారిలో అండాలు, శుక్రకణాలు విడుదల కాకపోవడం, నాణ్యత లోపించడం వంటివి జరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరో వైపు ఇటీవల కాలంలో జీవితంలో స్థిరపడిన తర్వాతే వివాహం చేసుకోవాలనే ఆలోచన అనేక మందిలో పెరిగింది. దీంతో 30 ఏళ్ల తర్వాత వివాహాలు చేసుకుంటున్నారు. ఇది కూడా సంతానలేమి సమస్యకు దారితీస్తోంది. మల్టీ టాస్కింగ్, తక్కువ నిద్ర వంటి కారణాలు సంతాన లభ్యతను తగ్గిస్తున్నాయి.జీవనశైలి మార్పులు : ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, పనిబాధ్యతలు, రాత్రివేళ పని, ఊబకాయం వంటివి హార్మోన్ల అసమతుల్య తకు దారితీస్తున్నాయి. ఆహారపు అలవాట్లు : ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం కూడా ఫెర్టిలిటీపై ప్రభావం చూపుతోంది. ఫెస్టిసైడ్స్ ప్రభావం : ఇక పురుగు మందులు వాడిన ఆహార పదార్థాలు, కాలుష్యం, పౌష్టికాహారం తీసుకోకపోవడం, క్రమపద్ధతిలేని భోజనం జంక్‌ఫుడ్, ల్యాప్‌టాప్ వంటివి అతిగా వాడడం, నిద్రలేమి, శారీరక శ్రమ లేకపోవడం వంటి సమస్యలు సైతం సంతాన లేమికి దారితీస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దుస్తులు : బిగుతు దుస్తులు కూడా సంతాన లేమికి కారణంగా వైద్యులు చెబుతున్నారు. టైట్‌గా ఉండే జీన్స్‌ప్యాంట్లు, లోదుస్తులు కూడా తరుచూ వేసుకోవద్దని సూచిస్తున్నారు. -
అప్పుల ఊబికి నేతన్నలు బలి
● రెండు రోజుల్లో ఇద్దరు కార్మికుల బలవన్మరణం ● ఆర్థిక ఇబ్బందులే ప్రధాన కారణం ● సిరిసిల్లలో పనుల్లేవని మనస్తాపం ● సొంతిళ్లు లేక దైన్యం ● ఆస్పత్రి నుంచి నేరుగా శ్మశానానికి తరలింపుసిరిసిల్లటౌన్: కార్మికక్షేత్రంలో సిరిసిల్లలో పనులు లేక.. అప్పుల పాలై నేతకార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఉపాఽధి కరువై..కుటుంబ పోషణ భారమై..అప్పులు తీర్చే మార్గం కనిపించక ఇద్దరు కార్మికులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. వరుసగా రెండు రోజుల్లో ఇద్దరు ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా విషాదం నింపింది. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రం బీవైనగర్‌కు చెందిన కొండ రాకేశ్(44) ఆరేళ్ల క్రితం ముంబయి నుంచి సిరిసిల్లకు వచ్చి నేత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. భార్య ఉజ్వల, కొడుకులు ఆదిత్య(14), నిహార్(12)లతో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. వస్త్రపరిశ్రమలో సంక్షోభంతో చాలా రోజులుగా పనులు సరిగ్గా లేవు. కుటుంబ అవసరాల కోసం గతంలోనే రూ.6లక్షల వరకు అప్పులు చేశాడు. ఏడాదిగా పనులు సరిగ్గా లేక అప్పులు చెల్లించలేకపోయాడు. తీవ్ర మసస్థాపానికి గురై గురువారం రాత్రి ఇంట్లోనే ఉరేసుకున్నాడు. శనివారం ఉదయం వరకు పోస్టుమార్టం గది వద్దే బంధువులు, కుటుంబీకులు పడిగాపులుగాచి అక్కడి నుంచే నేరుగా శ్మశానవాటికకు తీసుకెళ్లారు. ఇద్దరు కార్మికుల ఆత్మహత్య విషాదాంతం ఇద్దరు నిరుపేద కార్మికులు కొండ రాకేశ్, మేర్గు సాగర్ కష్టపడి భార్య, పిల్లలకు మంచి భవిష్యత్‌ను ఇద్దామనుకున్నారు. కానీ విధి వేరేలా తలంచింది. అప్పులు తీర్చలేని స్థితిలో కనీసం సొంతింటి కల తీరకుండానే ఇద్దరు బతుకులు విషాదాంతమయ్యాయి. ఇరువురికి సొంతిల్లు లేదు. డబుల్బెడ్రూమ్ కోసం అప్లయ్ చేయగా జాబితాలో పేర్లు రాలేదు. కుటుంబ అవసరాల కోసం విధి లేని పరిస్థితిలో శక్తికి మించిన అప్పులు చేశారు. అప్పులు తీర్చే మార్గం కనిపించక ఉరేసుకుని మృతిచెందారు. సొంతిల్లు లేకపోవడంతో శనివారం ఉదయం వరకు భార్య, పిల్లలు, బంధువులు పోస్టుమార్టం గది పడిగాపులు కాచి అక్కడి నుంచి నేరుగా మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లారు. సొంతిల్లు లేకపోవడంతో శనివారం ఇద్దరి మృతదేహాలకు పోస్టుమార్టం కాగానే జిల్లా ఆస్పత్రి నుంచి నేరుగా అంత్యక్రియలకు తీసుకెళ్లారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు జిల్లా ఆస్పత్రి మార్చురీ వద్ద బాధిత కుటుంబీకులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. ఇద్దరి దయనీయ పరిస్థితులను చూసిన స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. భోజనం చేసిన గంటలోపే..పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన మేర్గు సాగర్(38) పన్నెండేళ్ల్ల క్రితమే అల్లీపూర్ నుంచి సిరిసిల్లకు వచ్చాడు. భార్య అస్మిత బీడీలు చేస్తుండగా, సాగర్ నేతకార్మికుడిగా పనిచేస్తున్నాడు. గతంలో సాగర్ భార్య, కూతురుకు అనారోగ్యం, ఇంటి అవసరాల కోసం దాదాపు రూ.5లక్షల వరకు అప్పు చేశాడు. పనులు సరిగ్గా లేక వాటిని తీర్చలేక మనోవేదనకు గురయ్యేవాడు. శుక్రవారం రాత్రి 9 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి 10 గంటలకు పడుకున్నాడు. రాత్రి 11 గంటల సమయంలో పక్క గదిలో సాగర్ ఉరివేసుకుని చనిపోయాడు. -
ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
ధర్మపురి: ధర్మపురి గోదావరిలోని పుష్కరఘాట్ వద్ద శనివారం ఓ వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వేంకటేశ్వర్లపల్లెకు చెందిన రాయశెట్టి సాయిలు (70) శనివారం దైవ దర్శనం కోసం ధర్మపురి వచ్చాడు. గోదావరిలోని పుష్కరఘాట్ వద్ద లుంగితో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయిలు భార్య గతంలోనే మృతి చెందినట్లు సమాచారం. అప్పటినుంచి మనస్తాపానికి గురవుతున్న సాయిలు.. తాను కూడా ధర్మపురిలోనే చనిపోతానని అంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సాయిలుకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కుమారుడు భిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్‌కుమార్ తెలిపారు. విద్యుత్‌షాక్‌తో మాజీ సర్పంచ్ మృతిహుజూరాబాద్: విద్యుత్‌షాక్‌తో సైదాపూర్ మాజీ సర్పంచ్ కనుకుంట్ల విజయకుమార్(57) శని వారం మృతి చెందాడు. స్థానికు ల వివరాల ప్రకారం.. విజయ్ కుమార్ హనుమాన్ దీక్షలో ఉన్నాడు. శనివారం ఉదయం ఇంటివద్ద పూజ ముగించుకొని వాటర్ ప్లాంట్ షెడ్డు పక్కన ఉన్న జేవైరుపై టవల్ అరవేసే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విజయ్‌కుమార్ భార్య కవిత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. హ్యాండ్లూమ్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులుసిరిసిల్ల: హైదరాబాద్‌లోని కొండాలక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(ఐఐటీహెచ్) కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చేనేత, జౌళిశాఖ అధికారులు పేర్కొన్నారు. మూడేళ్ల డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు పదో తరగతి లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు జూలై ఒకటో తేదీ నాటికి బీసీ, ఇతర సాధారణ వర్గాలకు 23 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్లు ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. 2025–2026 విద్యాసంవత్సరానికి 60 సీట్లు ఉన్నాయని, ఎంపికై న అభ్యర్థులకు నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కమిషన్ ద్వారా నెలకు రూ.5వేలు, తెలంగాణ చేనేత, జౌళిశాఖ ద్వారా మరో రూ.2500 ఉపకార వేతనం అందిస్తారన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 91105 56854, 96181 15357, 77948 97298, 90300 79242 నంబర్లలో సంప్రదించగలరు. -
కాంగ్రెస్ పాలనలో కరీంనగర్ కళా విహీనమైంది
కరీంనగర్: బీఆర్ఎస్ హయాంలో కళకళలాడిన కరీంనగర్ కాంగ్రెస్ పాలనలో కళావిహీనమైందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. జిల్లాలో నిలిచిపోయిన పనులు ప్రారంభించాలని కోరుతూ ఉమ్మడి జిల్లాకు చెందిన నాయకులతో కలిసి శనివారం కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ.. కరీంనగర్ సమస్యలపై ఇప్పటికే ఎన్నోసార్లు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చామన్నారు. అయినా స్పందించే నాథుడే కరువయ్యారన్నారు. జిల్లాకు ఇన్చార్జి మంత్రి ఎవరో ప్రజలకు తెలియడం లేదన్నారు. ఇప్పటివరకు అభివృద్ధిపై అధికారులతో ఒక్క రివ్యూ సమావేశం నిర్వహించిన దాఖలు లేవన్నారు. ఆరు రోజులుగా నగరరంలోని రాంనగర్ ప్రాంతంలో మంచినీరు రావడం లేదన్నారు. అధికారులను ప్రశ్నిస్తే మోటార్లు కాలిపోయాయని సమాధానం ఇస్తున్నారని, వేసవిలో ప్రజలకు తాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాల న్నారు. రేషన్‌కార్డుల మంజూరుపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కరీంనగర్ డంపింగ్ యార్డు తొలగింపు ఏమైందని కేంద్రమంత్రి సంజయ్‌ని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో 5వేల కుటుంబాలు దళితబంధు కోసం ఎదురుచూస్తున్నాయని అన్నారు. ప్రభుత్వంపై నిరసన తెలిపిన దళితులపై అక్రమంగా కేసులు పెట్టారన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకు లబ్ధిదారుల నుంచి రూ.50వేలు వసూలు చేస్తున్నారని, ఈ విషయమై విచారణ జరిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, శ్రీనివాస్, చల్లా హరిశంకర్, పెండ్యా ల శ్యాంసుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగర సమస్యలపై ఎన్నోసార్లు కలెక్టర్‌కు విన్నవించాం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ -
22న కరీంనగర్, రామగుండం రైల్వేస్టేషన్ల ప్రారంభం
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్, రామగుండం రైల్వేస్టేషన్ల ప్రారంభోత్సవం తేదీ ఖరారైంది. ఈ నెల 22న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రెండు రైల్వేస్టేషన్లు వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఉమ్మడి జిల్లాలో రామగుండం, కరీంనగర్, పెద్దపల్లి రైల్వేస్టేషన్లను అటల్ మిషన్ ఫర్ రిజునవేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్మిషన్ పథకం కింద రూ.73 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొదటిఫేజ్‌లో కరీంనగర్‌కు రూ.26.06 కోట్లు, రామగుండంకు రూ.26.50 కోట్లు విడుదలయ్యాయి. వాస్తవానికి గత నెలలోనే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండాల్సి ఉండగా.. పహల్గాం ఉగ్రదాది, ఆ తరువాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కారణంగా కార్యక్రమం వాయిదాపడింది. ఆదివారం కరీంనగర్ రైల్వేస్టేషన్లో ఏర్పాట్లను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పరిశీలించనున్నారు. జీఎం పర్యటన కరీంనగర్‌రూరల్: కరీంనగర్ రైల్వేస్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను శనివారం దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ పరిశీలించారు. ఈ నెల 22న రైల్వేస్టేషన్‌ను ప్రారంభిస్తున్న దృష్ట్యా పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మాజీ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ రైల్వే జీఎంను కలిసి పలు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. స్టేషన్ మేనేజర్ ఎం.రవీందర్, అధికారులు పాల్గొన్నారు.హైపర్ టెన్షన్ డే ర్యాలీ కరీంనగర్‌టౌన్: ప్రపంచ హైపర్ టెన్షన్ డే సందర్భంగా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నగరంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని డీఎంహెచ్‌వో వెంకటరమణ ప్రారంభించారు. సిబ్బందికి స్క్రీనింగ్ చేసి రక్తపోటు నిర్ధారణ అయిన వారికి చికిత్స అందించారు. డాక్టర్లు ఉమాశ్రీరెడ్డి, విప్లవశ్రీ, సనా, రాజగోపాల్, స్వామి పాల్గొన్నారు. పరీక్ష కేంద్రాల తనిఖీ కరీంనగర్‌క్రైం: డిగ్రీ పరీక్షలు జరుగుతున్న కరీంనగర్‌లోని అన్ని డిగ్రీ కళాశాలల సెంటర్లను శాతవాహన విశ్వవిద్యాలయ వీసీ యు.ఉమేశ్‌కుమార్ శనివారం చేశారు. ఇన్విజిలేషన్ విధానం, విద్యార్థుల హాల్ టికెట్లు, పరీక్ష కేంద్రాల్లో వసతులు, పరీక్షలు నిర్వహణ అంశాలను పరిశీలించారు. బెస్ట్ అవెలబుల్ స్కూల్స్ ఎంపికకు దరఖాస్తులు విద్యానగర్(కరీంనగర్): 2025–26 విద్యా సంవత్సరానికి గాను బెస్ట్ అవెలబుల్ స్కూల్స్ ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఉప సంచాలకుడు పి.పవన్‌కుమార్ తెలిపారు. రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్లో ఉత్తమ పాఠశాలలను ఎంపిక చేయడానికి జిల్లాలోని ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ పథకంలో రెసిడెన్షియల్లో ప్రతి విద్యార్థికి ట్యూషన్, హాస్టల్ వసతి, భోజనానికి రూ.42వేలు, నాన్ రెసిడెన్షియల్లో ప్రతి విద్యార్ధికి రూ.28వేలు చెల్లించడం జరుగుతుందన్నారు. ఆసక్తిగల పాఠశాలల యాజమాన్యాలు ఈనెల 22 వరకు దరఖాస్తులు సమర్పించాలని కోరారు. 22న హ్యాండ్‌బాల్ జట్ల ఎంపిక కరీంనగర్‌స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో కొత్తపల్లిలోని అకడమిక్ హైట్స్ పాఠశాలలో అండర్–19 జూనియర్స్ బాలబాలికల జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్ష కార్యదర్శులు వీర్ల వెంకటేశ్వర్ రావు, బసరవేణి లక్ష్మణ్ తెలిపారు. రాణించిన క్రీడాకారులను ఈ నెల 28 నుంచి 30వరకు నల్గొండ జిల్లా నకిరేకల్‌లో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఆధార్ కార్డు, వయస్సు ధ్రువీకరణ పత్రంతో మధ్యాహ్నం 3గంటలకు రిపోర్టు చేయాలని, వివరాలకు 9441925807, 8978995730 నంబర్లను సంప్రదించాలన్నారు. -
శిశుమందిర్‌లో సీబీఎస్ఈ అమలు భేష్
● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్కరీంనగర్టౌన్: కరీంనగర్‌లోని సరస్వతి శిశు మందిర్‌లో ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ విధానాన్ని అమలు చేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం కరీంనగర్‌లోని శిశు మందిర్ పాఠశాలను సందర్శించారు. శిశు మందిర్ నూతన భవన నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ శిశు మందిర్‌లో చదువుకోవడంవల్లే తాను ఈ స్థాయికి చేరుకుని ప్రజలకు సేవ చేస్తున్నానని తెలిపారు. పాఠశాల నూతన భవన నిర్మాణానికి తనవంతుగా సాయం అందిస్తానని అన్నారు. శిశు మందిర్ పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కావా లని కోరారు. మాధవరం కాంతారావు, అజితేష్ (బిల్డర్), ఇంజినీర్ రాఘవకృష్ణ, డాక్టర్ చక్రవర్తుల రమణాచారి, ఎలగందుల సత్యనారాయణ, కోల అన్నారెడ్డి, మేచినేని దేవేందర్‌రావు, పాక సత్యనారాయణ, భూమయ్య పాల్గొన్నారు. -
ప్రతిభకు ప్రోత్సాహం
● కార్పొరేట్ విద్యకు స్నేహహస్తం ● ప్రభుత్వ విద్యాసంస్థల్లో పదోతరగతి పూర్తి చేసుకున్నవారికి సదావకాశం ● కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత విద్య ● ఈనెల 31వరకు ప్రవేశాలకు తుది గడువుకరీంనగర్: విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ కీలకం. ఇంటర్ విద్య కోసం ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలో చేరాలని అందరికీ ఉంటుంది. ఇలాంటి వారి కలసాకారం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ‘కార్పొరేట్ విద్య’ పథకాన్ని తీసుకొచ్చింది. పదో తరగతిలో ప్రతిభ చాటిన వారు ఈ పథకం ద్వారా ఉజ్వల భవితకు బాటలు వేసుకునేందుకు వీలుంటుంది. దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. భర్తీకి అధికారుల దృష్టి కార్పొరేట్ కళాశాల విద్యా పథకం ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి పూర్తి చేసుకున్న వారికి ఓ వరం. రెండేళ్ల పాటు విద్యార్థులకు అయ్యే ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. అవగాహన లోపం, తగినంత ప్రచారం లేకపోవడంతో ఈ పథకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. గతం మాదిరిగా కాకుండా ఈ విద్యా సంవత్సరం కేటాయించిన సీట్లు పూర్తిస్థాయిలో భర్తీపై అధికారులు దృష్టిసారించారు. వీరికే అవకాశం ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీలతో పాటు దివ్యాంగ విద్యార్థులు కార్పొరేట్ కళాశాల పథకంతో లబ్ధి పొందేందుకు అవకాశం కల్పించింది. 2025–26 విద్యా సంవత్సరానికి ఇంటర్లో చేరేందుకు ప్రభుత్వ యాజమాన్యాల్లోని విద్యాసంస్థల్లో పదోతరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించనున్నారు. ఈ పథకంలో భాగంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు రెండు సంవత్సరాల పాటు ఫీజు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. ఇవీ అర్హతలు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల, ఆదర్శ, కేజీబీవీ, ఎయిడెడ్, బెస్ట్ అవలెబుల్, నవోదయ పాఠశాలల్లో చదివి ఉండాలి. జీపీఏ 7.0 ఆపై సాధించిన వారు అర్హులు. దరఖాస్తు విధానం విద్యార్థులు http://telanganaepass. cg g.g ov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 31వ తేదీ తుది గడువు. 10వ తరగతి పాస్ మెమో, కులం, ఆదాయం(రూ.2లక్షల లోపు ఉండాలి) ధృవీకరణ పత్రాలు మీసేవా ద్వారా పొందినవి, బ్యాంకు పాస్‌బుక్, ఆధార్‌కార్డు నంబర్, రేషన్‌కార్డు నంబర్, పాస్‌పోర్టు సైజ్ఫొటో, ప్రభుత్వ షెడ్యూల్డ్ కులం వసతి గృహాల విద్యార్థులు(3) సంవత్సరాల బోనోఫైడ్ ధ్రువీకరణ పత్రం జతపర్చాలి. ఈ పాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునేటప్పుడు విద్యార్థులు ప్రాధాన్యత క్రమంలో మూడు కళాశాలలను ఎంపిక చేసుకోవాలి.జిల్లాలో ఈ ఏడాది పదోతరగతి ఫలితాలుఅంశం బాలురు బాలికలు మొత్తం హాజరైనవారు 6,616 5,892 12,508 ఉత్తీర్ణులు 6,451 5,794 12,245 ఉత్తీర్ణత శాతం 97.51 98.34 97.90మంచి అవకాశం కార్పొరేట్ కళాశాల విద్యా పథకంతో పేద విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. ఎలాంటి ఫీజులు చెల్లించకుండానే ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్ పూర్తి చేయవచ్చు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆన్లైన్లో గడువులోగా దరఖాస్తులు సమర్పించాలి. రెండేళ్ల పాటు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత విద్య వసతులు సద్వినియోగం చేసుకోవాలి. – పి.పవన్‌కుమార్, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి -
వెయ్యి కంపెనీలు.. 3వేల ఉద్యోగాలు
● యువతకు ఉద్యోగాల కల్పన లక్ష్యం ● రేపు సింగరేణి మెగా జాబ్‌మేళా ● వేదిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ● పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నిరుద్యోగులకు అవకాశం గోదావరిఖని: నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా సింగరేణి యాజమాన్యం ఈనెల 18న మెగా జాబ్ మేళా నిర్వహణకు చురుకుగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో సుమారు వెయ్యికిపైగా కంపెనీలు పాలుపంచుకుంటాయి. తమకు అవసరమైన మూడువేలకుపైగా ఉద్యోగాలు ఇచ్చేందుకు నిర్ణయించాయి. సింగరేణి సంస్థ, నోబల్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ ఆధ్యర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. యువత వద్దకే కంపెనీలు.. ఉద్యోగాల సాధన కోసం యువకులు ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు కంపెనీల వద్దకు వెళ్లకుండానే.. ఆయా కంపెనీలే యువత వద్దకు వస్తోంది. ఈమేరకు సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకుంది. గోదావరిఖని సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 18న ఉదయం 8గంటల నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. రామగుండం రీజియన్‌లోని మూడు ఏరియాలతో పాటు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఈ జాబ్‌మేళాలో పాల్గొనే అవకాశం కల్పించారు. అన్ని ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలి.. మెగా జాబ్‌మేళాకు హాజరైయ్యే యువతకు సింగరేణి అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. ఇప్పటికే స్టేడియంలో ఏర్పాట్లు చేస్తోంది. నిరుద్యోగులు తమ బయోడేటా, అర్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, అవసరమైన ఇతర ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలి. మరింత సమాచారం కోసం హెల్త్‌లైన్ నంబర్లు 94911 44252, 99483 77353 నంబర్లలో సంప్రదించాలి. ఏర్పాట్లు చేస్తున్న సింగరేణి.. మండుతున్న ఎండల ధాటికి యువత ఇబ్బందులు పడకుండా పెద్ద కూలర్లు ఏర్పాటు చేయాలని సింగరేణి నిర్ణయించింది. ఎండదెబ్బ తాకకుండా షామియానాలు వేస్తోంది. తాగునీరు, హెల్ప్‌డెస్క్ కౌంటర్లు, రిజిస్ట్రేషన్ కౌంటర్లు, ఇంటర్వ్యూల కోసం ప్రత్యేక స్టేజీ, అభ్యర్థుల ఎంట్రీ, ఎగ్జిట్ దారులను ఏర్పాటు చేస్తున్నారు. డీమార్ట్‌లో 200 ఉద్యోగాలు పారిశ్రామిక ప్రాంతంలో త్వరలోనే డీమార్ట్ మెగా షా పింగ్మాల్ ప్రారంభిస్తారు. అందులో పనిచేసేందుకు సుమారు 200మంది సిబ్బంది అవసరం. ఇలాంటి అనేక కంపెనీలు మెగా జాబ్‌మేళాలో పాల్గొంటాయి. అపోలో ఫార్మసీ, నాన్సీహెల్త్ కేర్, లైఫ్ సర్కిల్ హెల్త్ సర్వీస్, మెడిప్లస్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, పేటీఎం, ఎంఆర్ఎఫ్ లిమిటెడ్, ఫ్లిప్‌కార్ట్, హెచ్ఎఫ్సీఎల్ లిమిటెడ్ తదితర సంస్థలకు చెందిన హెచ్ఆర్లు ఈ ఇంటర్వ్యూలో పాల్గొని తమకు అవసరమైన ఉద్యోగులను ఎంపిక చేసుకుంటారు. ఉద్యోగాలు ఇవే.. ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, సెక్యూరిటీ, ఆస్పత్రులు, ఆఫీస్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ, సాఫ్ట్వేర్, ఆఫీస్ అడ్మిస్ట్రేటివ్, నర్సింగ్ అర్హతలు – ఏడో తరగతి నుంచి పీజీ వరకు – డిప్లొమా – బీఫార్మా, ఎంఫార్మా – హోటల్ మేనేజ్మెంట్, డ్రైవింగ్ – బీఈ, బీటెక్, ఎంటెక్ – బీఏ, బీఎస్సీ, బీకాం – ఎంబీఏ, ఎంసీఏ, ఎంసీఎస్ సద్వినియోగం చేసుకోవాలి యువత సౌకర్యం కోసం సింగరేణి మెగా జాబ్ మేళా నిర్వహిస్తోంది. సుమారు వెయ్యి కంపెనీల ప్రతినిధులను ఒకేవేదిక వద్దకు చేర్చుతోంది. వారికి అవసరమైన నిపుణులను గుర్తించి ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి. ఆసక్తి, అర్హత గల నిరుద్యోగ యువత హాజరు కావాలి. ఎక్కడో, ఎప్పుడో నిర్వహించే ఇంటర్వ్యూల కోసం రోజుల తరబడి ఎదుదుచూసే దానికన్నా మన చెంతకు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. – లలిత్‌కుమార్, జీఎం, ఆర్జీ–1 -
కొలువుల వేట
చదువుల మూట.. సప్తగిరికాలనీ(కరీంనగర్): ప్రస్తుత కాలంలో యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. నేటికాలంలో ప్రభుత్వ ఉద్యోగాల మాట దేవుడెరుగు. ప్రైవేటు రంగంలోకి వెళ్తామన్నా పోటీ నెలకొందని పలువురు అంటున్నారు. చదువుకు తగిన ఉద్యోగం, ఉద్యోగానికి తగిన వేతనం దొరక్క నానా తంటాలు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇటీవల జిల్లాల్లోని ఉపాధి కల్పన కార్యాలయాలు ప్రైవేటు కంపెనీలతో జాబ్‌మేళా నిర్వహిస్తున్నా.. వేలల్లో నిరుద్యోగులు ప్రయివేటు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఆందోళన కలిగిస్తోన్న నిరుద్యోగ రేటు ఉమ్మడి జిల్లాలో ఏటా వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్న వారి కన్నా.. నిరుద్యోగులుగా నమోదవుతున్న వారే అధికంగా ఉంటున్నారు. జాతీయ కార్మిక బలగం వార్షిక (2023–24)నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 16.06శాతం ఉన్నట్లు చెబుతోంది. డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సులు చదివినా జీవనోపాధి లభించకపోవడం నిరుద్యోగానికి ప్రధాన కారణమని తెలిపింది. డిమాండ్ ఉన్న కోర్సులు ప్రస్తుతకాలంలో చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు, స్నేహితులు చెప్పిన విధంగా కోర్సులు ఎన్నుకుంటున్నారు. వారికి నచ్చిన నచ్చకపోయినా కోర్సులు పూర్తి చేస్తున్నారు. ఆ కోర్సులకు మార్కెట్లో డిమాండ్ ఉందా? లేదా అనే అంశాన్ని మర్చిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో వైద్యసేవలందించే సంస్థలు పెరిగిపోతుండటంతో నర్సింగ్, ఫార్మసీ కోర్సులు పూర్తిచేసినవారికి ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండనున్నాయని, ఐటీఐ, ట్రేడ్‌ల్లో కోర్సులు అభ్యసించినవారికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. సుమారు 5వేల మంది నమోదు ఉమ్మడి జిల్లాలోని ఉపాధి కల్పన కార్యాలయాల్లో ఏడాదికి సుమారు 5వేల మంది యువత నిరుద్యోగులుగా నమోదు చేసుకుంటున్నారని అధికారులు చెబతున్నారు. ప్రతీనెలా సుమారుగా రెండు ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నారు. హాజరైన వారిలో 50శాతం మంది ఉద్యోగాలకు ఎంపిక అవుతున్నారని అధికారులు చెబుతున్నారు. చాలామందిలో సరైన ఉద్యోగ సామర్థ్యాలు లేక నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతున్నదని నిపుణులు చెబుతున్నారు. చాలామంది కోర్సు పూర్తిచేస్తున్నారే తప్పా... ఉపాధి మార్గాల వైపు దృష్టి సారించలేకపోతున్నారని వివరిస్తున్నారు. వేతనం తక్కువగా ఉందనుకోవటం, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం, ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడకపోవటం ప్రధాన కారణాలు అంటున్నారు. ఎంపికవుతున్నా.. నిరుద్యోగ యువతకు ఉపాధి కార్యాలయాల్లో జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నా సరిగా సద్విని యోగం చేసుకోవడం లేదు. కొందరు ఎంపికై నా హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో పని చేసేందుకు విముఖత చూపుతున్నారు. నిరుద్యోగులకు బాసటగా నిలిచేందుకు ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో కెరీర్ కౌన్సెలింగ్, కమ్యూనికేషన్స్ స్కిల్స్, పోటీపరీక్షలపై అవగాహన కల్పిస్తున్నాం. – టి.తిరుపతిరావు, ఉపాధి కల్పనాధికారి, కరీంనగర్ హైదరాబాద్‌లో ఉద్యోగం మాది కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామం. నేను బీఎస్సీ నర్సింగ్ చేశాను. ఏప్రిల్‌లో ఉపాధి కల్పన కార్యాలయంలో నిర్వహించిన జాబ్‌మేళాలో పాల్గొన్న. హైదరాబాద్‌లోని ఓ ట్రస్ట్‌లో ఉద్యోగం వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. నిరుద్యోగులుగా ఖాళీగా ఉండే బదులు ఏదైన ఒక కంపెనీ వెతుక్కుని ప్రతీ ఒక్కరు ఉపాధి పొందాలి. – ఎం మానస, శ్రీరాములపల్లి -
ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెట్టొద్దు
● బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ● వేములవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ వేములవాడ: ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెట్టొద్దని బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. రైతులకు ఇబ్బంది కలిగితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్లో ఫిర్యాదు చేయాలని రైతులను కోరారు. రుద్రంగిలో శుక్రవారం జరిగే ప్రభుత్వ కార్యక్రమంలో హాజరయ్యేందుకు వెళ్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వేములవాడ తహసీల్దార్ ఆఫీస్ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావులతో కలిసి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, రవాణా, గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమయ్యేలా చూడాలన్నారు. ఏఎంసీ వైస్‌చైర్మన్ కనికరపు రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మట్టిలారీలను అడ్డుకున్న గ్రామస్తులు
● నలుగురిపై కేసు నమోదు ఓదెల(పెద్దపల్లి): కొలనూర్ అప్పమాయ చెరువు నుంచి నల్లమట్టి తరలిస్తున్న లారీలను గ్రామస్తులు శుక్రవారం అడ్డుకున్నారు. కొలనూర్ గ్రామానికి చెందిన జక్కుల మధు, రేగుల తిరుపతి, సాత్తూరి అనిల్, శ్రీనివాస్ ఆధ్వర్యంలో లారీలకు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. కలెక్టర్ అనుమతి ఇచ్చినా.. నిబంధనలు అతిక్రమించి 25 టైర్ల లారీల్లో నల్లమట్టి తరలిస్తున్నారని వారు ఆరోపించారు. సుమారు ఐదు గంటలపాటు లారీలను ఆపడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఓదెల తహసీల్దార్ సునీత సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులను పొత్కపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత మట్టితరలింపు యథావిధిగా కొనసాగింది. కాగా, కలెక్టర్ అనుమతితో మట్టి తరలిస్తున్న లారీలను అడ్డుకొన్న జక్కుల మధు, మద్దెల శ్రీనివాస్, సాత్తూరి అనిల్, రేగుల తిరుపతిపై కేసు నమోదు చేసినట్లు సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి తెలిపారు. -
ఒకరిపై ఒకరు ఉపాధ్యాయుల దాడి
● నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన ఎంఈవోకు గాయం ధర్మపురి: విద్యార్థులకు వి ద్యాబుద్ధులు నేర్పించాల్సి న ఉపాధ్యాయుడు విద్యార్థులందరూ చూస్తుండగా మరో ఉపాధ్యాయుడిపై దాడి చేయగా ఇద్దరికి నచ్చ జెప్పడానికి వచ్చిన మండ ల విద్యాధికారి చేతికి గాయమైన ఘటన దోనూ ర్ ప్రభుత్వ పాఠశాలలో కలకలం రేపింది. పోలీ సులు, బాధిత ఉపాధ్యాయుడు తెలిపిన వివరాలు.. దోనూర్లో జెడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్ పాఠశాలలున్నాయి. జెడ్పీహెచ్ఎస్లో శుక్రవా రం నిర్వహించిన పీటీఏ సమావేశానికి మండల విద్యాధికారి సీతామహాలక్ష్మి ముఖ్య అథితిగా, రెండు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు హాజరయ్యారు. స మావేశంలో రానున్న రోజుల్లో పాఠశాలల బలో పేతం, నాణ్యమైన విద్యాబోధన కోసం తీసుకో వాల్సిన జాగ్రత్తలు వివరించారు. సమావేశం అ నంతరం పాఠశాల ఆవరణలో కొందరు ఉపాధ్యాయులు మాట్లాడుకుంటుండగా, జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన ఉపాధ్యాయుడు గాడిపెల్లి మహే శ్ ఎంపీపీఎస్‌కు చెందిన కాశెట్టి రమేశ్‌పై దాడి చేశాడు. అక్కడే ఎంఈవో సీతామహాలక్ష్మి ఇరువురికి నచ్చజెప్పడానికి ప్రయత్నించగా ఆమెను మహేశ్ నెట్టేయడంతో చేతికి గాయమైంది. అంతే కాకండా అసభ్య పదజాలంతో దూషించాడు. కాగా, మహేశ్‌పై గతంలో అనేక ఆరోపణలున్నాయని, అతడి తీరుపై జిల్లా విద్యాశాఖకు తెలిపినట్లు ఎంఈవో పేర్కొన్నారు. పాత కక్షలను మ నసులో పెట్టుకొని రమేశ్‌పై మహేశ్ దాడికి పా ల్పడినట్లు పేర్కొన్నారు. ఎంఈవో, బాధిత ఉపాధ్యాయుడి ఫిర్యాదు మహేశ్‌పై కేసు నమోదు చేశారు అలాగే మహేశ్‌ను సస్పెండ్ చేస్తూ డీఈవో రాము ఉత్తర్వులు జారీ చేశారు. -
హాయ్.. అయాం పూజ అంటూ..
కొత్తపల్లి(కరీంనగర్): ముగ్గురు యువకులు ముఠాగా ఏర్పడ్డా రు. మహిళల పేరిట యువకులతో చాటింగ్ చేస్తూ కోరికలు తీరుస్తామంటూ ఎరవేస్తున్నారు. ఈ ఓ వ్యక్తిని మభ్యపెట్టి దోపిడీకి పాల్పడిన సంఘటన కరీంనగర్ కొత్తపల్లి మండలంలో వెలుగు చూసింది. ఈ ముఠాలోని ఇద్దరు యువకులను శుక్రవారం పోలీ సులు అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. చింతకుంట శాంతినగర్‌కు చెందిన సరళ సందీప్ (19), మల్కాపూర్ లక్ష్మిపూర్‌కు చెందిన పొన్నాల ప్రణయ్ కుమార్(18), ఎండీ రెహాన్ జల్సాలకు అలవాటు పడి, దోపిడీలకు కొత్తరకం పన్నాగం పన్నారు. మహిళల పేరిట కోరిక తీరుస్తామంటూ వాట్సాప్‌లో యువకులకు మెసేజ్ చేస్తారు. ఆకర్షితులైన యువకులను చాటింగ్‌తో మభ్యపెడతారు. సరళ సందీప్ ఈనెల 6న తన ఫోన్ ద్వా రా మంచిర్యాల ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి వాట్సా ప్ లో హాయ్ అయాం పూజ అంటూ మెసేజ్ చేశాడు. దీంతో యు వకుడు చాటింగ్ ప్రారంభించాడు. కోరిక తీరుస్తానంటూ ఆశ చూపడంతో అదినమ్మి ఈనెల 11న కరీంనగర్ వచ్చాడు. పథకం ప్రకారం దోపిడీ చేసేందుకు సిద్ధమైన ముగ్గురు.. కొత్తపల్లికి రప్పించారు. ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై ఆ యువకుడిని వెలిచాలలోని ఒక కంటైనర్ ప్రాంతానికి తీసుకెళ్లారు. అ ప్పటికే అక్కడికి చేరుకున్న రెహాన్‌తో కలిసి చిత్రహింసలకు గురి చేశారు. రూ.50వేలు డిమాండ్ చేశారు. ఇవ్వకుంటే చంపుతామ ని బెదిరించారు. భయపడిన ఆ యువకుడు తన వద్ద ఉన్న రూ.10 వేలు ఇచ్చి, బంధువులు, స్నేహితులతో మరో రూ.12వేలు ఫోన్‌పే ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై సాంబమూర్తి ఆధ్వర్యంలో శుక్రవారం సరళ సందీప్, పొన్నాల ప్రణయ్ కుమార్‌ను అరెస్టు చేశారు. మహిళల పేరిట చాటింగ్ కోరిక తీరుస్తామంటూ ఎర తీరా వచ్చాక నిలువు దోపిడీ ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు -
ఆర్టీసీలో మర్యాద దినోత్సవం
కరీంనగర్: ఆర్టీసీలో శుక్రవారం మర్యాద దినోత్సవం నిర్వహించారు. కరీంనగర్ బస్టాండులో జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలమన్, రీజినల్ మేనేజర్ బి.రాజు, డిప్యూటీ రీజినల్ మేనేజర్లు ఎస్.భూపతిరెడ్డి, పి.మల్లేశం ప్రయాణికులకు గులాబీపూలు అందజేసి, ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీకి సంబంధించిన వివిధ యాప్‌ల వివరాలు తెలిపే క్యూఆర్ కోడ్ గల చైన్లను అందజేశారు. కరీంనగర్ 1,2 డిపో మేనేజర్లు విజయమాధురి, శ్రీనివాస్, బస్‌స్టేషన్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ జి.సురేశ్ పాల్గొన్నారు. అనంతరం ఈడీ సోలమన్ కరీంనగర్–1 డిపోకు చెందిన టీం–20 సభ్యులతో సమావేశమయయ్యారు. డిపోను లాభా ల బాటలో నడపడానికి దిశానిర్దేశం చేశారు. కులగణనను సవరించాలి కరీంనగర్‌టౌన్: జనాభా గణనలో కుల గణన చేపట్టాలనే కేంద్ర నిర్ణయం చారిత్రాత్మకమైనదని, ఇది చట్టబద్ధంగా జరగాలంటే జనగణన చట్టాన్ని తగిన మార్పులతో సవరించాలని తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు. శుక్రవారం కరీంనగర్లో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని అనంతరం మాట్లాడారు. కులగణనకు షార్ట్‌కట్ మార్గాలు వద్దని, భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. బీసీలకు చట్టపరమైన గుర్తింపు లేకపోవడంతో గణనలో కులం అనే పదాన్ని చేర్చకపోతే, భవిష్యత్తులో గణన న్యాయబద్ధతకు లోబడి ఉండదన్నారు. తిరంగా యాత్రను జయప్రదం చేయండి కరీంనగర్‌టౌన్: ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయినందున వీర జవాన్లకు వందనాలు తెలుపుతూ దేశవ్యాప్తంగా తిరంగా యాత్రలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించిందని, ఈ మేరకు జిల్లాశాఖ ఆధ్వర్యంలో 19వ తేదీన కరీంనగర్‌లోని తెలంగాణచౌక్ నుంచి టవర్ సర్కిల్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపా రు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ పాల్గొంటారని అన్నారు. సాయంత్రం 5గంటలకు యాత్ర ప్రారంభమవుతుందని, బిజెపి శ్రేణులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. బోయినపల్లి ప్రవీణ్‌రావు పాల్గొన్నారు. లైసెన్స్ ఫీజు చెల్లించాలని బెదిరింపు కాల్స్ చొప్పదండి: పట్టణంలోని వ్యాపార వాణిజ్య సంస్థల యజమానులకు మున్సిపల్ కమిషనర్ కార్పొరేషన్ ఆఫీస్, తెలంగాణ పేరుతో (ట్రూకాలర్ ఐడీ) ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించాలని కోరుతూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తి 08247649631 నంబర్ నుంచి చొప్పదండిలోని షాపు యజమానులకు ఫోన్ చేస్తూ, ఫీజులు చెల్లించాలని కోరుతూ వాట్సప్ ద్వారా క్యూఆర్ కోడ్లు పంపిస్తు బెదిరింపులకు పాల్పడుతున్నాడని వాపోతున్నారు. ఈ వ్యవహారం మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు ఈ ఫోన్‌తో తమకు సంబంధం లేదని ప్రకటించారు. మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు మాట్లాడుతూ వాట్సప్ ద్వారా క్యూఆర్ కోడ్ పంపించడం జరుగదని, ఇది ఫేక్ కాల్‌గా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, క్యూర్కోడుకు ఎలాంటి డబ్బులు చెల్లించరాదని సూచించారు. జూలైలో బీసీ బహిరంగ సభ కరీంనగర్: బీసీ ఉద్యమం ప్రారంభమై 35ఏళ్లు పూర్తయిన సందర్భంగా జూలైలో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధా న కార్యదర్శి కేశిపెద్ది శ్రీధర్‌రాజు పేర్కొన్నారు. ఈ సభకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మె ల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ ఎల్.రమణ హాజరవుతున్నారని తెలిపారు. బీసీల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న బీసీ సంఘాన్ని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. -
వేంకటేశ్వరస్వామి గుట్టపైకి రహదారి
● సుందరగిరి వెంకన్న బ్రహ్మోత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్చిగురుమామిడి: చిగురుమామిడి మండలం సుందరగిరి వేంకటేశ్వరస్వామి గుట్టపైకి రహదారి నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన రథోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి, రథాన్ని లాగారు. అనంతరం మాట్లాడుతూ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి కమ్యూనిటీ హాల్‌ను నిర్మిస్తానని హామీ ఇచ్చారు. కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు వెళ్లి ప్రతీ ఒక్కరు మొక్కులు తీర్చుకోవాలని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉందని సూచించారు. హుస్నాబాద్ వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్, ఆలయ కమిటీ చైర్మన్ చొల్లేటి శంకరయ్య, ఈవో రాజ్‌కుమార్, డైరెక్టర్లు పూల లచ్చిరెడ్డి, జీల సంపత్‌యాదవ్, ఎనగందుల శారద, బూట్ల కవిత, పూజారులు శేషం నవీనాచార్యులు, సుధీరాచా ర్యులు, మాజీ సర్పంచ్‌లు శ్రీమూర్తి రమేశ్, దేవులపల్లి భద్రయ్య పాల్గొన్నారు. -
హిందూ శక్తిని చాటేలా ఏక్తాయాత్ర
కరీంనగర్‌టౌన్: కరీంనగర్లో ఈనెల 22న నిర్వహించే ‘హిందూ ఏక్తా యాత్ర’ తెలంగాణలో ఓ సంచలనం కాబోతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. హిందువుల సంఘటిత శక్తిని చాటేలా, దేశద్రోహుల వెన్నులో వణుకుపుట్టేలా యాత్ర ఉంటుందన్నారు. కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో శుక్రవారం ‘హిందూ ఏక్తా యాత్ర’ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేవారి చెంప చెళ్లుమనేలా హిందూ ఏక్తాయాత్ర నిర్వహిస్తామన్నారు. ఈ యాత్ర ఒక పార్టీకి సంబంధించినది కాదని, హిందూ శక్తిని ప్రదర్శించే యాత్ర అన్నారు. బీజేపీ నాయకులంతా ఇంటింటికీ వెళ్లి ఈనెల 22న కరీంనగర్లో నిర్వహించబోయే యాత్రకు తరలిరావాలంటూ ఆహ్వానించాలని కోరారు. లక్ష మందికి తగ్గకుండా ర్యాలీలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కరీంనగర్లో ఏ ఒక్క గల్లీ చూసినా కాషాయ జెండాలే కన్పించాలన్నారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ మేయర్ సునీల్ రావు, చెన్నమనేని వికాస్‌రావు, గుగ్గిళ్ల రమేశ్, వి.రమేశ్ ఉన్నారు.● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ -
70 కేంద్రాల్లో వందశాతం పూర్తి
● 2.39లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు ● వీసీలో కలెక్టర్ పమేలా సత్పతికరీంనగర్ అర్బన్: జిల్లాలో 328 కొనుగోలు కేంద్రాల ద్వారా 2 లక్షల 39వేల 996 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే కొనుగోలు చేశామని కలెక్టర్ పమేలా సత్పతి వెల్లడించారు. శుక్రవారం వీసీలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివరించారు. 29,630 మంది రైతులకు రూ.445.23 కోట్లు జమ చేశామని వివరించారు. 80 శాతం మంది రైతులకు చెల్లింపులు పూర్తయ్యాయని అన్నారు. 70 కొనుగోలు కేంద్రాల్లో 100శాతం సేకరణ పూర్తయ్యిందన్నారు. రోజుకు సుమారుగా 8,300 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొంటున్నామని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, పౌర సరఫరాల సంస్థ డీఎం రజనీకాంత్, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా సహకార అధికారి రామానుజం ఉన్నారు. -
బస్టాండ్ ఔట్‌పోస్ట్ తనిఖీ
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ సీపీ గౌస్ ఆలం శుక్రవారం కరీంనగర్ బస్టాండులోని పోలీస్ ఔట్‌పోస్ట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు ఔట్‌పోస్ట్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం ఔట్‌పోస్ట్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రజల భద్రతకు పెద్దపీట వేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఉంచాలన్నారు. నలుగురు తహసీల్దార్ల బదిలీకరీంనగర్ అర్బన్: అసెంబ్లీ ఎన్నికల క్రమంలో ఇతర జిల్లాలకు బదిలీ అయిన తహసీల్దార్లకు పూర్వ జిల్లాలకు బదిలీ చేస్తూ సీసీఎల్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా నుంచి సీహెచ్.రాజు, ఎన్.రాజేష్, జి.రమేశ్ బాబు, డి.మంజుల హన్మకొండ, జగిత్యాల, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు బదిలీ కాగా నల్ల వెంకట్‌రెడ్డి, కె.సురేఖ, ఏ.రజితను జిల్లాకు బదిలీ చేశారు. -
ముంపు.. ముప్పు!
కానరాని ముందుచూపు ● ఏటా వానాకాలం అదే సమస్య ● అయినా పాఠం నేర్వని బల్దియా ● ౖపైపెనే సిల్ట్ తొలగింపు పనులుకరీంనగర్ కార్పొరేషన్: ఏటా వర్షాకాలం నగరం ఎదుర్కొనే ముంపు ముప్పుపై నగరపాలకసంస్థకు ముందు చూపు కరువైంది. వర్షం కురిసిన ప్రతీసారి ఈ సమస్య నగరాన్ని అతలాకుతలం చేస్తున్నా, నివారణ చర్యలు కనిపించడం లేదు. మరో నెల రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికి, ముంపు ప్రాంతాలను రక్షించేందుకు అధికారుల వద్ద ఇప్పటివరకు ఎలాంటి ప్రణాళిక లేకుండా పోయింది. వానొస్తే జాగారమే నగరంలోని ముకరంపుర విమానం వీధి ప్రజలకు వర్షాకాలం వస్తుందంటే కంటిమీద కునుకుండదు. గట్టివాన పడితే డ్రైనేజీ ద్వారా ఇళ్లను మురుగునీళ్లతో కూడిన వరద ముంచెత్తుతుంది. నగరంలోని ఎగువ ప్రాంతాలైన రాంనగర్, పద్మనగర్, జ్యోతినగర్ తదితర ప్రాంతాల నుంచి ముకరంపుర, అంబేడ్కర్ స్టేడియం, లక్ష్మినగర్ మీదుగా వెళ్లే అతి పెద్ద నాలా ఈ వీధి పక్కనుంచి వెళ్తుంది. కరీంనగర్, సిరిసిల్ల ప్రధాన రహదారిపై నిర్మించిన కల్వర్టు గుండా వరదనీళ్లు దిగువభాగానికి సులువుగా వెళ్లడం లేదు. కల్వర్టు కింద సిల్ట్ రాయిలా మారడం, చెత్తా చెదారం ఇరుక్కుపోవడంతో వరదనీళ్లు నిలిచిపోతున్నాయి. సిల్ట్ తీయకపోవడంతో కొద్దిపాటి వరదకే నాలా పక్కనే ఉన్న విమానం వీధిని, ఇళ్లను నీళ్లు ముంచెత్తుతున్నాయి. గతేడాది ఇళ్లల్లోకి వచ్చిన మురుగునీళ్లతో వంటసామగ్రి, ఆహారపదార్థాలు, వస్తువులు పూర్తిగా తడిసిపోయిన సంఘటనను ఇంకా కాలనీ వాసులు మరిచిపోలేదు. మళ్లీ వర్షాకాలం వస్తున్నా, పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఈ ఏడాది కూడా తమకు ముంపు తప్పేట్లులేదని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. వరద ముందుకు పోయేదెలా? ప్రతి వర్షాకాలం నగరంలోని ఆర్టీసీ వర్క్‌షాప్, రాంనగర్, శర్మనగర్,మంచిర్యాల చౌరస్తా, కోతిరాంపూర్, ఎన్టీఆర్ చౌరస్తా, రాజీవ్‌రహదారి బైపాస్ తదితర ప్రాంతాల్లో ముంపు ప్రభావం అధికంగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో వరదనీళ్లు సాఫీగా వెళ్లే పరిస్థితి లేకపోవడం మూలంగా, అవి ముంపునకు గురవుతున్నాయి. రహదారిలపై ఉన్న కల్వర్టులు చిన్నగా ఉండడం, నాలాలు ఒక్కో చోట ఒక్కో రకంగా ఉండడం, సిల్ట్ తొలగించకపోవడం, నిర్వహణా లోపం ఫలితంగా వర్షాకాలం ముంపు తప్పడం లేదు. నాలాల నుంచి వచ్చే భారీ వరదకు సరిపడా కల్వర్టులు లేకపోవడంతో వరద మెయిన్ రోడ్డెక్కుతుంటాయి. ఏటా ఈ సమస్య ఎదురవుతున్నా, ఇప్పటివరకు కల్వర్టు వైశాల్యం పెంచడం, నాలాలను సరిచేయడం లాంటి శాశ్వత పనులు చేపట్టడం లేదు. నామమాత్రంగా సిల్ట్ తొలగింపు ప్రతి వర్షాకాలం ముందు నాలాలు, డ్రైనేజీల్లో సిల్ట్ తీయడానికి టెండర్ పిలుస్తారు. ఈ ఏడాది నగరవ్యాప్తంగా 15 పనులకు గాను సుమారు రూ.44 లక్షలతో టెండర్ పిలిచారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ కాంట్రాక్ట్ ఖరారు కానుంది. టెండర్ దక్కించుకుంటున్న కాంట్రాక్టర్లు సిల్ట్‌ను ౖపైపెనే తీస్తున్నారని, లోతుకు వెళ్లడం లేదనే ఆరోపణలున్నాయి. సిల్ట్ రాయిలా మారిన చోట డ్రిల్లింగ్‌తో తొలగించే అవసరం పడుతుంది. అలా కాకుండా ౖపైపెనే చెత్తాచెదారం, సిల్ట్ తీస్తుండడం, కిందిభాగంలో రాయిలా మారిన సిల్ట్ అలానే ఉండడంతో పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. పూర్తిస్థాయి వర్షాకాలానికి సమయం ఉన్నందున ఇప్పటికై నా ముంపు ప్రాంతాలను గుర్తించి, శాశ్వత పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం నగరపాలకసంస్థ ఉన్నతాధికారులపై ఉంది. అధికారుల్లో పట్టింపు లేదు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని చెబుతున్నా అధికారులు పట్టించుకోవం లేదు. రాంనగర్ రోడ్ నెంబర్ 7 వద్ద మెయిన్ డ్రైనేజీ సిల్ట్‌తో నిండి మురుగునీళ్లు ముందుకు కదలడం లేదు. గతేడాది ఇలానే నీళ్లు వెళ్లే పరిస్థితి లేక వర్షాకాలం కాలనీలోని ఇండ్లకు నీళ్లు చేరాయి. ముందుగా సిల్ట్ తొలగించి ముంపు బాధనుంచి తప్పించాలని చెబుతున్నా,సీడీఎంఏకు కూడా ఫిర్యాదు చేసినా స్పందన లేదు. – బోనాల శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ -
‘సుడా’కు స్థలం కేటాయింపు
● సిక్‌వాడీలో 847 చదరపు గజాలు అప్పగింత ● సొంత భవన నిర్మాణానికి సుడా సన్నాహాలుకరీంనగర్ కార్పొరేషన్: శాతవాహన అర్బన్ డెవలెప్మెంట్ అథారిటి (సుడా)కి సొంత భవనం నిర్మాణం కాబోతుంది. నగరంలోని సిక్‌వాడీలో వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పక్కనున్న ప్రభుత్వ స్థలాన్ని సుడాకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సుడా కూడా ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ‘సుడా’ రూపుదాల్చుకున్నా సొంత భవనం అంటూ లేకుండా పోయింది. అప్పట్లో సుడా పాలకవర్గాన్ని నియమించిన తరువాత కూడా కొన్ని సంవత్సరాల వరకు కనీసం కార్యాలయాన్ని కూడా సమకూర్చలేదు. చివరకు జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయ భవన సముదాయంలోని ఓ భవనంలో అద్దె ప్రాతిపదికన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. నెలకు రూ.40 వేల చొప్పున అద్దెతో ప్రస్తుతం సుడా కార్యాలయం జెడ్పీసముదాయంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సుడా పాలకవర్గం కూడా మారిపోయింది. సొంత భవనం నిర్మించుకునేందుకు స్థలం కేటాయించాలంటూ ఇటీవల సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి స్వయంగా కలెక్టర్ పమేలా సత్పతికి విజ్ఞప్తి చేశారు. స్పందించిన కలెక్టర్ సిక్‌వాడీలోని సర్వేనంబర్ 258లో 847 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ స్థలాన్ని సుడా స్వాధీన పరుచుకుంది. ఆ స్థలంలో ఉన్న పురాతన భవనం శిథిలావస్థకు చేరడంతో ఇటీవలే కూల్చివేశారు. గతంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆ పాత భవనాన్ని వినియోగించేవాళ్లు. స్థలం కేటాయించడంతో,ఇక భవన నిర్మాణాన్ని చేపట్టేందుకు సుడా సన్నహాలు చేస్తోంది. -
వ్యక్తిగత బాధ్యతతోనే డెంగీ నివారణ
● జిల్లా వైద్యాధికారి వెంకటరమణ కొత్తపల్లి(కరీంనగర్): వ్యక్తిగత బాధ్యతతోనే డెంగీని నివారించవచ్చునని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కొత్తపల్లి ఆరోగ్య కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో వెంకటరమణ మాట్లాడుతూ ఏటా మే 16న నిర్వహించే ప్రపంచ డెంగీ దినాన్ని ఈ ఏడాది చెక్, క్లీన్, కవర్ అనే ప్రతిజ్ఞతో జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఇన్ఫెక్టెడ్ ఆడ ఏడిస్ ఈజిప్ట్ దోమకాటుతో డెంగీ వ్యాప్తి చెందుతుందన్నారు. నీరు నిలిచే ప్రాంతాలను శుభ్రపరచడం, పాత్రలు, ట్యాంకులు మూతలతో కప్పి ఉంచడంతో పాటు మన శరీరాన్ని కప్పి ఉండే విధంగా దుస్తులు ధరించడం వల్ల డెంగీని నిరోధించవచ్చన్నారు. అంతకముందు రోగుల వివరాలు, మందుల నిల్వలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీటీసీవో కె.వీ.రవీందర్‌రెడ్డి, పీవోడీటీ ఉమాశ్రీ రెడ్డి, డీఐవో సాజిదా, పీవోఎన్ సీడీ విప్లవ శ్రీ, పీఓఎంసీహెచ్ సనా జవేరియా, డీఎంవో శైలేంద్ర, డెమో రాజగోపాల్, డీపీవో స్వామి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నజియా, సబ్ యూనిట్ ఆఫీసర్ రామనాథం, మల్లయ్య పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన ఈతసరదా
● ఈతకు వెళ్లి యువకుడి మృతి ఎలిగేడు(పెద్దపల్లి): స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసేందుకు వచ్చిన యువకుడు ముష్కి రాజీవ్‌గాంధీ(36) ఈత కోసమని వెళ్లి నీటమునిగి చనిపోయాడు. ఈ ఘటన ముప్పిరితోట గ్రామంలో చోటుచేసుకుంది. జూలపల్లి ఎస్సై సనత్ కుమార్ కథనం ప్రకారం.. గోదావరిఖనిలోని జైభీమ్‌నగర్‌కు చెందిన ముష్కి రాజీవ్‌గాంధీ ఈనెల 14న ముప్పిరితోట గ్రామంలో జరిగిన శ్రీవేంకటేశ్వరస్వామి రథోత్సవం, జాతరకు వచ్చాడు. సాయంత్రం వేళ సరదాగా స్నేహితులతో కలిసి వ్యవసాయ బావిలో ఈత కొట్టడానికి వెళ్లాడు. ప్లాస్టిక్ డబ్బా కట్టుకుని బావిలో దిగాడు. ప్రమాదవశాత్తు బావిలో నీట మునిగి మృతి చెందాడు. గురువారం ఉదయం వ్యవసాయ బావి నుంచి మృతదేహాన్ని బయటకు తీసి సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. నీటి సంపులో పడి చిన్నారి మృతివేములవాడ అర్బన్: నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్‌లో గురువారం విషాదం నింపింది. స్థానికులు తెలిపిన వివరాలు. తిప్పాపూర్‌లో బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం వచ్చింది. నాలుగేళ్ల చిన్నారి జిక్రా ఫాతిమా ప్రమాదవశాత్తు ఇంటి ముందు నీటిసంపులో పడిపోయింది. ఆలస్యంగా గమనించిన కుటుంబ సభ్యులు వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే మృతిచెందింది. ఈ సంఘటనపై పోలీసులను వివరణ కోరగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. రైలు ఢీకొని యువకుడు..మల్యాల: కొడిమ్యాల మండలం రాంసాగర్‌కు చెందిన అనుముల శేఖర్ (37) కొండగట్టు సమీపంలో రైలు ఢీకొని మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. వార్డు సభ్యుడిగా పనిచేసిన శేఖర్ ఇటీవల దుబాయ్ వెళ్లి వచ్చాడు. బుధవారం కొండగట్టు సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మల్యాల సీఐ నీలం రవి, ఎస్సై నరేశ్‌కుమార్‌లు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. అయితే ప్రమాదవశాత్తు రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొందా? రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి జైలుజగిత్యాలక్రైం: అతిగా మద్యం సేవించి వాహనం నడిపి పట్టుబడిన వ్యక్తికి న్యాయమూర్తి ఒకరోజు జైలుశిక్ష విధించారు. రాయికల్ మండలం ఉప్పుమడుగు గ్రామానికి చెందిన అల్లెపు వెంకటనర్సయ్య ఇటీవల అతిగా మద్యం సేవించి వాహనం నడుపగా రాయికల్ ఎస్సై సుదీర్‌రావు పట్టుకుని అతడిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని గురువారం స్పెషల్ జ్యూడిషియల్ మెజిస్టేట్ సెకెండ్ క్లాస్ న్యాయమూర్తి కరుణాకర్ ముందు హాజరు పర్చగా ఒకరోజు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. గొర్రె, మేకల దొంగల అరెస్టుమల్యాల: గొర్రెలు, మేకలు ఎత్తుకెళ్లి విక్రయిస్తూ జల్సాలు చేస్తున్న ముగ్గురు దొంగలను పట్టుకొని అరెస్టు చేసినట్లు మల్యాల సీఐ నీలరం రవి, ఎస్సై నరేశ్‌కుమార్ తెలిపారు. జగిత్యాలకు చెందిన ముద్దవేని అనిల్, మహ్మద్ మోసిన్, వెంకటేశ్‌లు రాత్రివేళ గ్రామాల్లో మోటారు సైకిల్, ఆటోల్లో తిరుగుతూ షెడ్లలోని గొర్రెలు, మేకలను దొంగిలించి కొన్నింటిని అమ్ముకోగా, మరికొన్నింటిని కోసి మాంసం విక్రయించే వారన్నారు. వచ్చిన డబ్బులను సమానంగా పంచుకొని జల్సాలు చేస్తున్నట్లు తెలిపారు. గురువారం మల్యాల ప్రాథమిక సహకార కేంద్రం వద్ద వాహనాల తనిఖీ చేపట్టగా బైక్, ఆటోలో రెండు మేకలు, రెండు గొర్రెలు తీసుకెళ్తున్న వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా వివిధ ప్రాంతాల్లో గొర్రెలు, మేకలు దొంగిలించినట్లు అంగీకరించారన్నారు. బైక్, ఆటో, రెండు మేకలు, రెండు గొర్రెలు స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. -
టికెట్ బుక్ చేసుకొని.. అక్కడే ఆగిపోయి
ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన ఆర్మీ జవాన్ అంతటి అనిల్ జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఆ ప్రాంతంలోనే బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్నాడు. గత 8 నెలలుగా జమ్మూసెక్టార్లోనే ఉంటున్నాడు. ఈనెల 7న ఇంటికొచ్చేందుకు టికెట్ బుక్ చేసుకున్నాడు. కానీ 6వ తేదీ నుంచి యుద్ధ సన్నాహాలు మొదలుకావడంతో అక్కడే ఉండిపోయాడు. ఇల్లంతకుంట మండల కేంద్రం నుంచి 11 మంది యువకులు ఆర్మీలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అంతటి అనిల్ -
ముగ్గురు యువకులపై కత్తులతో దాడి
● ఒకరి పరిస్థితి విషమం జగిత్యాలక్రైం: పుట్టిన రోజు వేడుకలకు సిద్ధమవుతున్న యువకుడితో పాటు అతని ఇద్దరు స్నేహితులపై కత్తులతో దాడి చేయడంతో ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన గురువారం లింగంపేట శివారులో చోటు చేసుకుంది. జగిత్యాలరూరల్ మండలం అంతర్గాంకు చెందిన ఏళ్ల అరవింద్ తన జన్మదిన వేడుకల కోసం అంతర్గాం, లింగంపేట శివారులోని గంగమ్మతల్లి ఆలయం వద్ద ఏర్పాట్లు చేసుకున్నాడు. అరవింద్ అతని స్నేహితులు తోపారపు గంగాధర్, ఉయ్యాల వంశీలు ఉండగా ఉండగా అదే గ్రామానికి చెందిన మహేశ్, రాకేశ్, చందు, దినేశ్‌తో పాటు మరికొంతమంది కత్తులతో దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. గంగాధర్‌కు 23 చోట్ల గాయాలు కాగా, అరవింద్, వంశీలకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆటోలో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా విషయం తెలుసుకున్న సీఐ వేణుగోపాల్, ఎస్సై గీత బాధితుల నుంచి వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మహేశ్, రాకేశ్, దినేశ్, చందులతో పాటు మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై వేణుగోపాల్ తెలిపారు. -
ప్రతీ జిల్లాలో రైతువిజ్ఞాన కేంద్రం
జగిత్యాలఅగ్రికల్చర్: కృషి విజ్ఞాన కేంద్రాలు, డాట్ సెంటర్లు లేని అన్నిజిల్లాల్లో రైతువిజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ జానయ్య తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో గురువారం శ్రీరైతు ముంగిట్లో శాస్త్రవేత్తలుశ్రీ కార్యక్రమం నిర్వహించారు. జానయ్య ముఖ్యఅథితిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికే 17 జిల్లాల్లో డాట్ సెంటర్లు, కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయన్నారు. మిగతా జిల్లాల్లో రైతువిజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఒక్కో కేంద్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతీజిల్లాలో 50 ఎకరాలు అందుబాటులో ఉన్నచోట రైతువిజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో లేదని, వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం అనేక రైతు కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడుతూ, వాతావరణ మార్పులతో పంటలపై అనేకరకాల పురుగులు, తెగుళ్లు దాడి చేస్తున్నాయన్నారు. వాటి నివారణకు శాస్త్రవేత్తలు లోతుగా పరిశోధనలు చేయాలని కోరారు. ఆర్ఎంపీల మాదిరిగా గ్రామాల్లో ఫార్మర్స్ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం తెలంగాణ సీడ్ సంస్థ రూపొందించిన శ్రీమన సంస్థ– మన విత్తనంశ్రీ ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్ శ్రీలత, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ సైదానాయక్, జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖాధికారులు భాస్కర్, శ్యాంప్రసాద్, రైతు నాయకులు రవీందర్‌రెడ్డి, నారాయణరెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ వర్శిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ జానయ్య -
క్రికెట్ జట్ల ఎంపిక పోటీలు
● నేడు కరీంనగర్, గోదావరిఖని, జగిత్యాల, వేములవాడ శిక్షణ శిబిరాల్లో ఎంపికలు కరీంనగర్‌స్పోర్ట్స్: క్రికెట్ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించేందుకు కరీంనగర్ జిల్లా క్రికెట్ సంఘం శ్రీకారం చుట్టింది. క్రీడాకారుల ప్రతిభ ఆధారంగానే ఎంపికలు జరిగే అవకాశాలు ఉంటాయని క్రికెట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. ప్రస్తుతం అండర్– 17 నుంచి 23 వరకు ఎంపిక పోటీలు నిర్వహించి భవిష్యత్‌లో అన్నిరకాల కేటగిరీలో ఇలాగే ఎంపికలు నిర్వహించేందుకు సన్నద్ధం చేయనున్నట్లు తెలిపారు. 13 నియోజకవర్గాలు.. 6 జట్లు.. ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాల నుంచి 6 జట్లను ఎంపిక చేయనున్నారు. కరీంనగర్ టౌన్ 1వ జట్టు, కరీంనగర్ రూరల్, చొప్పదండి 2, పెద్దపల్లి, మంథని, రామగుండం 3, సిరిసిల్ల, వేములవాడ 4, జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి 5, మానకొండూర్, హుస్నాబాద్, హుజురాబాద్ 6వ జట్టుగా ఎంపిక చేసినట్లు సంఘం బాధ్యులు తెలిపారు. కరీంనగర్, వేములవాడ, జగిత్యాల, గోదావరిఖనిలోని క్రికెట్ శిబిరాల్లో ఎంపిక పోటీలు జరుగనున్నాయి. క్రీడాకారులు వయస్సు ధ్రువీకరణపత్రం, ఆధార్, సొంత కిట్, వైట్ డ్రెస్‌తో హాజరుకావాలని పేర్కొన్నారు. కరీంనగర్ డ్రిస్ట్రిక్ట్ జట్టు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 6 జట్ల ఎంపిక అనంతరం రౌండ్ రాబిన్ పద్ధతిలో పోటీలు నిర్వహిస్తారు. లీగ్స్, క్వార్టర్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ నిర్వహించి ఎవరైతే అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తారో వారిని కరీంనగర్ జిల్లా జట్టుకు ఎంపిక చేస్తారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్‌లో జరిగే పోటీల్లో పాల్గొననున్నట్లు సమాచారం. పటిష్ట జట్టు ఎంపిక కోసం.. ప్రస్తుతం క్రికెట్ ఎంపిక పోటీలకు పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరవుతున్నారు. అందరి ప్రతిభను చూడలేకపోతున్నాం. అప్పుడప్పుడు మంచి క్రీడాకారుడు కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడీ పోటీలతో క్రీడాకారులు తమ టాలెంట్ ఒక మ్యాచ్‌లో మిస్సయితే మరో మ్యాచ్‌లో చూపించే అవకాశం ఉంటుంది. ఉత్తమ జట్టు ఎంపిక చేసే అవకాశం కూడా కలుగుతుంది. – ఆగంరావు, జిల్లా అధ్యక్షుడు -
ఇల్లాలు.. కన్నీళ్లు
కరీంనగర్‌క్రైం: పెళ్లి చేసుకొని కోటి ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన మహిళలకు మొదట్లో బాగానే ఉన్నప్పటికీ రోజులు గడుస్తున్న కొద్ది రకరకాల రూపాల్లో వేధింపులు ఎదురవుతున్నాయి. అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్త, మామ, ఆడబిడ్డల వేధింపులు పెరుగుతున్నాయి. పోలీసుస్టేషన్లలో పెద్ద ఎత్తున పిటిషన్లు ఈ కారణాలతోనే వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఆర్థిక పరిస్థితుల పరంగా వెనకబడడంతో మగవారు మద్యం, గంజాయి ఇతర దురలవాట్లకు బానిసవుతున్నారు. దీంతో నిత్యం మద్యం తాగి ఇంట్లో గొడవ పెట్టడం, ఇల్లాలిని తిట్టడం, భౌతిక దాడులకు పాల్పడడం జరుగుతోంది. ఇలాంటి కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు ● అనుమానం పెనుభూతంగా మారి ఇల్లాలిని హత్య చేయడం వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అలాగే, వివిధ రకాల వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ● ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుమానం కారణంగానే హత్యలు, ఆత్మహత్యలకు దారితీస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు మహిళలు ఇంట్లో ఆర్థిక పరిస్థితి చితికిపోవడంతో భవిష్యత్తు జీవితాన్ని ముందుకు తీసుకెళ్లలేమని భయపడి ముందుగానే తనువు చాలిస్తున్నారు. ● బతుకుబండిని మోయలేక వ్యసనాలకు అలవాటుపడి భర్తలు.. ఇంట్లో పరిస్థితులు రోజురోజుకు దిగజారి కనీస అవసరాలను సైతం వివాహితలు పుట్టింటివారికి చెప్పుకోలేక బలవన్మరణానికి పాల్పడిన ఘటనలు అనేకం ఉంటున్నాయి. ● అలాగే మిస్సింగ్ కేసుల్లో కూడా ఎక్కువ శాతం వివాహితలు ఉంటున్నట్లు గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతోంది. ఇంట్లో సమస్యలు భరించలేక, వేధింపులు తట్టుకోలేక ఇళ్ల నుంచి వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. వేధింపులు ఆగడంలేదు సమాజంలో మహిళలపై వేఽ దింపులు పెరుగుతున్నాయి. అదనపు కట్నం కోసం వివిధ విషయాల వల్ల ఆడవారిపై భర్త, వారి కుటుంబ సభ్యుల గృహహింస కేసులు పెరుగుతుండడం కనిపిస్తుంది. చిన్న విషయాలకే హత్యలు, ఆత్మహత్యల ఘటనలు జరుగుతున్నాయి. ఆడవారి భద్రతకు మరింత కఠిన చట్టాలు అవసరం. – కర్రె పావని, ఆదరణ సేవా సమితి, ఎన్జీవో నిర్వాహకురాలు కౌన్సెలింగ్ ఇస్తున్నాం గృహహింస కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. భర్త, భర్త కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేస్తున్నారని చాలా ఫిర్యాదులు వస్తుంటాయి. మేము సాధ్యమైనంత వరకు కౌన్సెలింగ్ ఇచ్చి జంటలను కలుపుతున్నాము. తీరుమార్చుకోకపోతే కేసులు నమోదు చేసి కోర్టుకు పంపిస్తున్నాం. – శ్రీలత, సీఐ, కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్ -
ఎనిమిదేళ్లుగా దేశ సేవలోనే..
నేను గత ఎనిమిదేళ్లుగా దేశ సేవలోనే ఉంటున్నాను. మా నాన్న అంజయ్య మద్దిమల్లలో పనులు చేసుకుంటాడు. తల్లి లక్ష్మి ఇంటి వద్దే ఉంటుంది. నేను ప్రస్తుతం పంజాబ్ సమీపంలోని పటిండ వద్ద విధులు నిర్వర్తిస్తున్నాను. మాకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో పాక్ బాంబు పడింది. – తాళ్లపల్లి వినోద్, ఎగ్లాస్పూర్ (కోనరావుపేట) దేశ సేవలో.. నా తల్లిదండ్రులు బెదిరె నాంపెల్లి–లక్ష్మి. అమ్మానాన్న గ్రామంలోనే ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటారు. నేను 2019లో ఆర్మీలో చేరాను. గత ఐదేళ్లుగా ఆర్మీలో పనిచేస్తుండడం సంతోషంగా ఉంది. దేశం కోసం పనిచేయడం గర్వంగా ఉందని వేణు పేర్కొన్నాడు. – బెదిరె వేణు, మామిడిపల్లి (కోనరావుపేట) -
దేశరక్షణలో పల్లె యువత
● సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న జిల్లా బిడ్డలు ● కశ్మీర్లో కాపలాగా ఉన్న యువకులు ● గర్వంగా భావిస్తున్న కుటుంబ సభ్యులు కోనరావుపేట(వేములవాడ)/ఇల్లంతకుంట(మానకొండూర్): దేశరక్షణలో జిల్లా యువత ముందుంటున్నారు. ఉగ్రవాద ముష్కరులను మట్టుబెట్టడంలో మేమున్నామంటూ దేశసరిహద్దుల్లో గస్తీ కాస్తున్నారు. ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనగా జిల్లాలో ఉద్విగ్న పరిస్థితులు ఏర్పడ్డాయి. భారత సైన్యంలో పనిచేస్తున్న జిల్లాకు చెందిన యువతలో అత్యధికులు జమ్మూకశ్మీర్‌లోని దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్నారు. సరిహద్దుల్లో గస్తీ కాస్తూ రక్షణగా నిలుస్తున్న వారిలో కోనరావుపేట మండలం మామిడిపల్లి నుంచి జవ్వాజి ప్రసాద్, బెదిరె వేణు, కోనరావుపేట నుంచి కస్తూరి ప్రశాంత్‌రెడ్డి, అజ్జు, ఎగ్లాస్పూర్ నుంచి తాళ్లపెల్లి శ్రీకాంత్, తాళ్లపెల్లి వినోద్, వేములవాడ మండలం చెక్కపల్లి నుంచి మెతుకు మధుకర్‌రెడ్డి, ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన అంతటి అనిల్ ఉన్నారు. గత కొన్నేళ్లుగా జమ్మూకశ్మీర్, లడక్‌లో దేశభద్రత విధుల్లో నిమగ్నమై ఉన్నారు. -
విద్యార్థుల సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యం
● డీటీసీ పురుషోత్తం తిమ్మాపూర్(మానకొండూర్): విద్యార్థులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు విద్యాసంస్థల బస్సులు నిబంధనలకు అనుగుణంగా ఉండాలని రవాణా శాఖ అధికారులు సూచించారు. గురువారం తిమ్మాపూర్‌లోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో డీటీసీ పురుషోత్తం ఆధ్వర్యంలో విద్యాసంస్థల యాజమాన్యాలు, డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా డీటీవో చక్రవర్తి మాట్లాడుతూ, జిల్లాలో 666 స్కూల్ బస్సుల్లో 550 మాత్రమే ఫిట్నెస్ కలిగి ఉన్నాయని, గతేడాది విద్యాసంస్థల వాహనాల వల్ల ప్రమాదాలు జరగలేదని, దీంతో కరీంనగర్ ప్రమాదరహిత జిల్లాగా నిలిచిందని అభినందించారు. స్కూల్ బస్సులు పూర్తిగా పసుపు రంగులో, పిల్లల బొమ్మలతో, అటెండర్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. 60 ఏళ్లు దాటినవారు, ఆరోగ్య సమస్యలున్నవారు డ్రైవింగ్ చేయరాదని ఆదేశించారు. 15 ఏళ్లు దాటిన వాహనాలను ఉపయోగించకూడదని, ప్రతీ 10 బస్సులకు ఒక అదనపు బస్సు సిద్ధంగా ఉంచాలన్నారు. ట్యాక్స్ బకాయిలు లేకుండా చూడాలన్నారు. 9, 10వ తరగతి విద్యార్థులు రవాణా శాఖ చిల్డ్రన్ పార్క్‌లో అవగాహన కార్యక్రమానికి హాజరుకావాలని ఆదేశించారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరించారు. ప్రైవేట్ విద్యాసంస్థల ప్రతినిధి యాదగిరి శేఖర్‌రావు మాట్లాడుతూ, స్కూల్ బస్సులను వివాహాలు, రాజకీయ కార్యక్రమాల కోసం అడగవద్దని, నష్టం జరిగితే యాజమాన్యంపైనే భారం పడుతుందని విజ్ఞప్తి చేశారు.శిక్షణతో పాఠశాల విద్య బలోపేతంకొత్తపల్లి(కరీంనగర్): పాఠశాల విద్య బలోపేతానికి ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం దోహదపడుతుందని వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి అన్నారు. కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని గురువారం పరిశీలించారు. శిక్షణ తరగతులను కింది స్థాయి ఉపాధ్యాయుల వరకు చేర్చవలసిన బాధ్యత జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్‌పైన ఉందని, ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. అన్ని మండలాల్లో శిక్షణ తరగతుల సమయం ఒకే విధంగా ఉండేలా జిల్లా స్థాయిలోనే తయారు చేసుకోవాలని సూచించారు. ప్రతీ ఉపాధ్యాయుడు అప్డేట్ అవుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని పేర్కొన్నారు. డీఈవో జనార్దన్‌రావు, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ఆంజనేయులు, ఆనందం, మహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పవర్ కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందున శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మల్కాపూర్, లక్ష్మీపూర్ గ్రామాలతో పాటు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 33/11 కేవీ బద్ధిపల్లి సబ్‌స్టేషన్ పరిధిలోని బద్ధిపల్లి, నాగులమల్యాల, కమాన్‌పూర్, గ్రానైట్ పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. ఆకట్టుకున్న సాయిబాబా జీవిత చరిత్రకరీంనగర్కల్చరల్: మన సమైక్యత కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో గురువారం కళాభారతిలో షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర నాటక ప్రదర్శన అలరించింది. సంస్థ అధ్యక్షుడు రొడ్డ యాదగిరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎస్టీవ్ దేవేందర్, చిందం శ్రీనివాస్, నెల్లుట రవీందర్రావు, సంస్థ కార్యదర్శి అగస్టీన్, కెప్టెన్ మధుసూదన్‌రెడ్డి తదితరులున్నారు. -
కార్మికుల పిల్లలకు ప్రత్యేక బోధన
● కలెక్టర్ పమేలా సత్పతికరీంనగర్/కొత్తపల్లి: జిల్లాలోని వలస కార్మికుల పిల్లలందరినీ చదువు వైపు ఆకర్షించామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో వలస కార్మికుల పిల్లలు, ఉపాధ్యాయులు, యజమానులతో గురువారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వలస కార్మికుల పిల్లలు చదువుకు దగ్గర కావాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా విద్యా బోధన చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఎంపిక చేసిన 16 పాఠశాలల్లో సుమారు 500 మందికి ప్రత్యేక ఉపాధ్యాయుల ద్వారా గత ఫిబ్రవరి నుంచి బోధిస్తున్నామని అన్నారు. జిల్లా యంత్రాంగం తరఫున పిల్లలందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించామని, ఒడిశా కార్మికుల పిల్లల కోసం ఆ రాష్ట్రం నుంచి పుస్తకాలు తెప్పించి ఇచ్చామని వెల్లడించారు. ఈనెల 24 వరకు తరగతులు కొనసాగుతాయని, చివరి పరీక్ష నిర్వహించి ప్రగతి పత్రాలు అందజేస్తామని తెలిపారు. అనంతరం విద్యార్థులను జింకలపార్కు, ఉజ్వల పార్క్ సందర్శనకు తీసుకెళ్లారు. డీఈవో జనార్దన్‌రావు, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, జిల్లా సైన్స్ ఆఫీసర్ జైపాల్‌రెడ్డి, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్‌రెడ్డి, గంగాధర ఎంఈవో ప్రభాకర్‌రావు, ఇటుకబటీ యజమానుల సంఘం అధ్యక్షుడు హరిచంద్రప్రసాద్ పాల్గొన్నారు. నాణ్యమైన విద్య అందించాలి మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైనవిద్య అందించాలని ఉపాధ్యాయులు కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు విభిన్న అంశాలలో ఐదురోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్లో నిర్వహిస్తున్న కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. రానున్న విద్యా సంవత్సరంలోనూ మరిన్ని కొత్త సేవలు ఆవిష్కరిస్తామని తెలిపారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలవాలన్నారు. వారిని నిత్యం గమనిస్తూ చెడుదోవ పట్టకుండా చూడాలన్నారు. పొక్సో, యాంటీ డ్రగ్, ట్రాఫిక్, డిజిటల్ అరెస్ట్ వంటి విషయాలపై అవగాహన కల్పించారు. డీఈవో జనార్దన్‌రావు, అల్ఫోర్స్ చైర్మన్ నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మౌలిక సదుపాయాలకు పెద్దపీట!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఎట్టకేలకు దక్షిణమధ్య రైల్వే బడ్జెట్ 2025–26 వెలుగుచూసింది. వాస్తవానికి ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండు లేదా మూడు రోజుల తర్వాత స్థానిక రైల్వే విభాగాల కేటాయింపులను పింక్ బుక్ పేరిట విడుదల చేస్తారు. కానీ.. దాదాపు నాలుగు నెలల తరువాత బడ్జెట్ వెలుగుచూడటం ఇదేతొలిసారి. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల మార్గాల్లో నెలకొన్న ఈ బడ్జెట్లో రైల్వే పనుల కోసం దాదాపు రూ.435 కోట్లకుపైగా నిధులు కేటాయించింది. ఇవే కాకుండా పలు అభివృద్ధి పనులకు మిగిలిన జిల్లాల్లోని స్టేషన్లతోకలిపి మరికొన్ని రూ.కోట్లు కేటాయించడం గమనార్హం. ఈసారి స్టేషన్ల ఆధునీకరణ, స్టేషన్లలో లూప్లైన్ల ఏర్పాటు, గూడ్స్ షెడ్ల నిర్మాణం, స్టేషన్లలో అదనపు మెయిన్ లైన్ల ఏర్పాటుకు ఈ నిధులు కేటాయించింది.కొత్తపల్లి– మనోహరాబాద్‌కు రూ.205 కోట్లుఅత్యంత కీలకదశలో ఉన్న కొత్తపల్లి–మనోహరాబాద్ (151 కిమీ) మార్గానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.205 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం సిద్దిపేట (సుమారు 77 కిమీ) వరకు లైన్ పూర్తయి సర్వీసు కూడా నడుస్తోంది. సిరిసిల్ల–సిద్ధిపేట మధ్య లైన్‌పనులు నడుస్తున్నాయి. ఇప్పటికే కరీంనగర్, సిరిసిల్లలో భూసేకరణ వేగంగా సాగుతోంది. 2026 వరకు ట్రాక్ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. మిడ్‌మానేరులో బ్రిడ్జి పనులు సవాలుగా మారనున్నాయి. ఫలితంగా 2027లో పూర్తి అవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.సర్వేలకు..ఉమ్మడి జిల్లా పరిధిలోని మూడు లైన్లకు ఫైనల్ లొకేషన్ సర్వేలకు నిధులు కేటాయించింది. కరీంనగర్–హసన్‌పర్తి రూ.1.55 కోట్లు, పెద్దపల్లి బైపాస్ లైన్ ఎఫ్ఎల్ఎస్ సర్వే రూ.2 లక్షలు, పెద్దపల్లి–నిజామాబాద్ డబ్లింగ్ లైన్ ఎఫ్ఎస్ఎల్ సర్వే కోసం రూ.3.56 కోట్లు ఇచ్చింది.మెయిన్‌లైన్‌కు● నిజామాబాద్– కరీంనగర్–పెద్దపల్లి లైన్ కోసం రూ.13.86 కోట్లు● పెద్దపల్లి బైపాస్ లైన్ (2.169 కిమీ) ను బల్లార్షా కాజీపేట మెయిన్ లైన్‌కోసం రూ.36.99 కోట్లుస్టేషన్ల కోసం..● నూకపల్లి– నూకపల్లి మల్యాల హాల్ట్ స్టేషన్‌ను బ్లాక్ స్టేషన్‌గా మార్చేందుకు రూ.15.85 కోట్లు● కరీంనగర్లో అదనంగా రెండు లూప్లైన్ల నిర్మాణం, రైల్వేస్టేషన్ కోసం రూ.27.50 కోట్లు● నిజామాబాద్–పెద్దపల్లి సెక్షన్లో లింగపేట–జగిత్యాల స్టేషన్లోలూప్లైన్ కోసం రూ.19.89 కోట్లు● మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి ప్లాట్‌ఫారాల అభివృద్ధికి రూ.4.54 కోట్లు● పెద్దపల్లిలో గూడ్స్ షెడ్ అభివృద్ధి కోసం రూ.9.99 కోట్లు● పెద్దపల్లి–నిజామాబాద్ మార్గంలో న్యూ క్రాసింగ్ స్టేషన్ పూడురు (నూకపల్లి మల్యాల–గంగాధర స్టేషన్ మధ్యలో) రూ.23.59 కోట్లు● సుల్తానాబాద్–ఎస్టీబీడీ యార్డ్ విస్తరణ, అప్‌గ్రేడేషన్ కోసం రూ.రూ.36.80 కోట్లు● మణుగూరు–రామగుండం (రాఘవాపురం) 200 కి.మీ లైన్‌కు ఈసారి నామమాత్రపు నిధులు కేటాయించారు.రైలు వంతెనల కోసం..● కొలనూరు–పెద్దపల్లి ఆర్వోబీ కోసం రూ.29.33 కోట్లు● పెద్దపల్లి–రాఘవాపురం ఆర్వోబీ కోసం రూ.36.83 కోట్లు● కొలనూరు–పెద్దపల్లి స్టేషన్ల మధ్య ఆర్యూబీ రూ.7.41 కోట్లు -
జీపీవో నియామక ప్రక్రియ కొలిక్కి
● 25న జిల్లా కేంద్రంలో రాత పరీక్ష ● ఇక సొంత జిల్లాలకు కేటాయించేలా చర్యలుకరీంనగర్అర్బన్: గ్రామ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిన గ్రామ పాలన అధికారి(జీపీవో) నియామక ప్రక్రియ కొలిక్కి వస్తోంది. ఇతర శాఖలకు సర్దుబా టు అయిన పూర్వ వీఆర్వో, వీఆర్ఏల నుంచి ఇటీవల మరోమారు ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకుంది. సొంత జిల్లాను వదిలి ఇతర జిల్లాకు వచ్చినవా రిని తిరిగి స్వస్థలాలకు పంపేలా కసరత్తు చేస్తుండడంతో హర్షం వ్యక్తమవుతోంది. కాగా ఈ నెల 25న జీపీవో భర్తీ ప్రక్రియకు పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో రెండు పరీక్షా కేంద్రాలను గుర్తించగా ప్రభుత్వానికి నివేదించారు. 175 మంది పరీక్ష రాయనున్నారు. 175 మంది ఆసక్తి భూభారతి చట్టం అమలులో భాగంగా సర్కారు ప్రతీ రెవెన్యూ గ్రామానికి గ్రామ పరిపాలన అధికారిని (జీపీవో) నియమించాలని నిర్ణయించింది. గతంలో ఆయా శాఖల్లో సర్దుబాటు అయిన వీఆర్వోలు, వీఆర్ఏల నుంచి గత డిసెంబరులో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. అప్పట్లో 217 మంది మాతృశాఖకు తిరిగి వచ్చేందుకు దరఖాస్తులు చేశారు. ఇందులో డిగ్రీ అర్హత కలిగినవారు, ఇంటర్, ఇంటర్‌లోపు వా రీగా విద్యార్హతను బట్టి లెక్కతేల్చారు. ఇక ఉత్తర్వులు రావడమే తరువాయి అనుకుంటున్న సందర్భంలో నేరుగా నియమిస్తే కోర్టు చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న యోచనతో ప్రభుత్వం గత నెల 26 వరకు మరోమారు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందులో ఇంటర్, డిగ్రీ వారికే అవకాశం ఇస్తూ స్క్రీనింగ్ పరీక్ష రాయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సర్వీసు విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో కేవలం 175 మంది మాత్రమే మాతృశాఖకు వచ్చేందుకు సుముఖత చూపారు. ఇందులో 119 మంది వీఆర్వోలు, 56 మంది వీఆర్ఏలు ఉన్నారు. జిల్లాల వారీగా జాబితా తయారీ ఇటీవల తిరిగి రెవెన్యూ శాఖలోకి వస్తామని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న పూర్వ వీఆర్వో, వీఆర్ఏల సమాచారాన్ని కలెక్టరేట్ అధికారులు జిల్లాల వారీగా జాబితాను సిద్ధం చేసి పెడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా తగు చర్యలు తీసుకునేలా కసరత్తు పూర్తిచేశారు. సీసీఎల్ఏ నుంచి వచ్చే ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. సొంత జిల్లాలకు అవకాశం వీఆర్వో వ్యవస్థ రద్దు సమయంలో సర్దుబాటు పేరిట మిగులు సిబ్బందిని ఇతర జిల్లాలకు కేటాయించారు. అలా భూపాలపల్లి, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల్లో పని చేస్తున్నారు. గతంలో జిల్లాలో విధులు నిర్వహించగా సుదూరంలో విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఇతర జిల్లాల నుంచి వచ్చి జిల్లాలో విధులు నిర్వహిస్తున్నవారి జాబితాను రూపొందించారు. వారంతా ఆయా జిల్లాలకు తరలివెళ్లేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తుండటంతో వారిలో ఆనందం కనిపిస్తోంది. -
మనదీ ఘన చరిత్రే
● చారిత్రక కట్టడాలకు నిలయం ● పర్యాటకంలో ఉమ్మడి కరీంనగర్ ● ప్రపంచ సుందరీమణులకు చూపించని వైనం ● అధికారులకు కనిపించని ఉమ్మడి జిల్లా ఘన సంస్కృతివిద్యానగర్(కరీంనగర్): ఉమ్మడి కరీంనగర్ చారిత్రక భాండాగారం. ప్రాచీన సంస్కృతి, కళారూపాలు, చారిత్రక వారసత్వ సంపద కలిగిన గొప్ప జిల్లా. గత చరిత్రకు ఆలవాలమైన చారిత్రక కట్టడాలు, స్మారక చిహ్నాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, వినోదం కలిగించే సందర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయి. విశ్వసుందరి పోటీలు మన రాష్ట్ర రాజధానిలో జరుగుతున్న వేళ కరీంనగర్ చారిత్రాత్మక కళా వైభవాన్ని మన అధికారులు విస్మరించడంపై ఉమ్మడి జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.– 8లోu -
సరస్వతీ నమస్తుతే..
కాళేశ్వరం: సరస్వతి నది పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో గురువారం ఉదయం 5.44 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛరణలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి పుష్కరాలను ప్రారంభించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి సరస్వతి ఘాట్‌లోని త్రివేణి సంగమం, అంతర్వాహిని సరస్వతి నదిలో పుష్కర స్నానాలు ఆచరించారు. కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో క్యూలైన్లో భక్తులు గంటల తరబడి నిల్చొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం వరకు భక్తుల రద్దీ నెలకొంది. మొదటి రోజు భక్తుల తాకిడి.. తొలిరోజు ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేటు వాహనాల్లో వచ్చిన భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. భక్తుల తాకిడితో ఆలయ పరిసరాలు, గోదావరి తీరం కిక్కిరిసింది. పార్కింగ్ స్థలాల్లో వాహనాల రద్దీ నెలకొంది. సుమారు 50 వేల మంది భక్తులు పుష్కర స్నానాలు చేసినట్లు అధికారులు అంచనా వేశారు. హారతి గద్దెలకు ఏడు జీవనదుల పేర్లు పుష్కరాల సందర్బంగా కాశీ పండితులచే నవరత్నమాల హారతి కార్యక్రమం నిర్వహించడానికి చతుర్వేదసరస్వతి ఘాట్ వద్ద ఏడు గద్దెలు నిర్మించారు. దేవాదాయశాఖ అధికారులు ఆ గద్దెలకు ఏడు జీవనధుల పేర్లను ప్రకటించారు. వాటిలో గంగా, య మున, గోదావరి, సరస్వతి, నర్మద, సిందూ, కావేరి పేర్లను తయారు చేసి ప్రదర్శించారు. కాళేశ్వర శాశ్వత అభివృద్ధికి తోడ్పాటు కాళేశ్వర శాశ్వత అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మాస్టర్ ప్లాన్ తయారు చేసి నివేదించాలని మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్‌ను సీఎం కోరారు. పుష్కర ఏర్పాట్లపై సీఎం సంతృప్తి వ్యక్తం చేసి మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులను అభినందించారు. విశేష పూజలతో పుష్కరాలు ప్రారంభం మొదటిరోజు సుమారు 50 వేల మంది పుణ్యస్నానం -
పెళ్లి పెద్దగా పెద్దపల్లి కలెక్టర్
సాక్షి,పెద్దపల్లి: బాజాభజంత్రీలు.. మేళతాళాలు.. వేదపండితుల మంత్రోచ్ఛారణలు.. తరలివచ్చే అతిథుల సమక్షంలో ఓ అనాథ యువతి వివాహం జరిపించేందుకు పెద్దపల్లి జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. తల్లిదండ్రులను కోల్పో యి రామగుండంలోని తబిత బాలల సంరక్షణ కేంద్రంలో మానస, తన చెల్లితో కలిసి 16 ఏళ్లుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో జనగామ జిల్లా రఘనాథపల్లికి చెందిన రాజేశ్‌తో ఇటీవల ఆమెకు వివాహం నిశ్చయమైంది. ఆ యువతికి పెళ్లిపెద్దగా కలెక్టర్ కోయ శ్రీహర్ష వ్యవహరించేందుకు ముందుకు వచ్చారు. జిల్లా సంక్షేమశాఖ అధికారి వేణుగోపాల్‌రావు, అదనపు కలెక్టర్లు, బాలల పరిరక్షణ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈనెల 21న యువతి వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టరేట్లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని వేదికగా ఎంచుకున్నారు. ఈమేరకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. -
జమిలి ఎన్నికలతో దేశానికి మేలు
కరీంనగర్‌టౌన్: వన్ నేషన్, వన్ ఎలక్షన్ (జమిలి ఎన్నికలు) నిర్వహణతో దేశానికి లాభమే తప్ప నష్టం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ సాయిని మల్లేశం, కో కన్వీనర్లు మాడ వెంకట్‌రెడ్డి, వాసాల రమేశ్ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని కెమిస్ట్ భవన్లో మేధావులతో సమావేశం నిర్వహించారు. పలువురు మేధావులు వన్ నేషన్, వన్ ఎలక్షన్‌పై తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈసందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే సమయం ఆదాతో పాటు పరిపాలనపై దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుందన్నారు. మనకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1967 వరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు జరిగేవని, తర్వాత కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు కావడం, 1970లో ఏడాది ముందే లోక్‌సభ రద్దు చేయడంతో ఈ విధానం మారిందన్నారు. సమావేశానికి ముందుగా పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన వారికి, ఇటీవల ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన సైనికులకు నివాళి అర్పించి సంతాపం ప్రకటించారు. మాజీ మేయర్ సునీల్‌రావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేశ్, బంగారు రాజేంద్రప్రసాద్, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, బోయినపల్లి ప్రవీణ్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
రాజన్న హుండీ ఆదాయం రూ.1.65 కోట్లు
హుండీ ఆదాయం లెక్కిస్తున్న ఆలయ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వేములవాడ: శ్రీరాజరాజేశ్వరస్వామికి హుండీలలో భక్తులు వేసిన కానుకల ద్వారా రూ.1,65,84,607 నగదు సమకూరింది. దాదాపు 20 రోజుల తర్వాత హుండీలను లెక్కించగా రూ.1.65 కోట్లతోపాటు 204 గ్రాముల బంగారం, 13.200 కిలోల వెండి సమకూరినట్లు ఆలయ ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి తెలిపారు. గుడి ఓపెన్‌స్లాబ్‌లో కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య బుధవారం హుండీని లెక్కించారు. కరీంనగర్ సహాయ కమిషనర్ కార్యాలయ అధికారి సత్యనారాయణ, శ్రీరాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మల్లారెడ్డిపేటకు చెందిన ఖలీల్(45), శేఖర్ లింగన్నపేటకు వెళ్లి స్వగ్రామానికి తిరిగివస్తుండగా.. ధాన్యం కుప్పలకు ఢీకొని బైక్ అదుపుతప్పింది. 108 వాహనంలో క్షతగాత్రులను సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా ఖలీల్ మృతి చెందాడు. శేఖర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధిత కుటుంబాలిచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రేమానందం తెలిపారు.రైలు నుంచి పడి ఒకరు..జమ్మికుంట: ప్రమాదవశా త్తు రైలు నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. రామగుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ గంగారపు తిరుపతి తెలిపిన వివరాలు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రామశంకర్ (45) ఉపాధి కోసం స్నేహితులు మోహన్, విజయకుమార్‌తో కలిసి చైన్నైకి సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలులో వెళ్తుండగా జమ్మికుంట, బిజిగిరిషరీఫ్ రైల్వే స్టేషన్ల మధ్య ప్రమాదవశాత్తు రైలు నుంచి పడి మృతి చెందాడు. స్నేహితులు రైలు నుంచి పడినట్టు గమనించి కాజిపేట రైల్వే స్టేషన్ అధికారులకు విషయం తెలియజేశారు. మృతుడికి భార్య గుడిదేవి, ముగ్గురు కుమారులున్నా రు. మృతదేహాన్ని హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని ద ర్యాప్తు చేస్తున్నామని రామగుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి వివరించారు.అనారోగ్యంతో యువతి బలవన్మరణంఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అనారోగ్యం భరించలేక.. తల్లిదండ్రులకు భారం కావడం ఇష్టం లేని యువతి జీ వితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడింది. పోలీ సులు, స్థానికులు తెలిపిన వివరాలు. మండలంలోని రాచర్లగొల్లపల్లికి చెందిన ముద్రకోల అంజలి(18) కొన్నాళ్లుగా మూర్చ సంబంధిత వ్యా ధితో బాధపడుతోంది. కరీంనగర్, సిరిసిల్ల ఆస్పత్రుల్లో చూపించినా వ్యాధి నయం కాలేదు. తల్లి దండ్రులకు భారం కావడం ఇష్టం లేని అంజలి బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్‌కు ఊరి వేసుకుంది. మృతురాలి సోదరుడు మల్లికార్జున్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.స్వగ్రామానికి మృతదేహంరాయికల్ దుబాయ్‌లో ఈనెల 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన రమేశ్ మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరుకుంది. కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
సేవ.. ఆధ్యాత్మిక తోవ
వేములవాడ: యువత ఇటు సేవ.. అటు ఆధ్యాత్మిక బాటలో వెళ్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయంలో వివిధ సేవలకు హాజరవుతున్నారు. చుట్టుపక్కల జిల్లాలకు చెందిన యువతీయువకులు సైతం రాజన్న ఆలయంలో చేపట్టే హుండీ లెక్కింపు, ఆలయంలో భక్తులకు అందించే వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీని ద్వారా తమకు సేవ చేశామన్న ఆనందంతోపాటు ఆధ్యాత్మిక చింతన కలుగుతుందని వారు పేర్కొంటున్నారు. భగవంతుడు, భక్తుల సేవలో తరిస్తున్న యువతను చూసి ఇతరులు సైతం స్ఫూర్తిపొందుతారని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. హుండీ లెక్కింపులో పాల్గొన్న యువతీయువకులను ఆలయ అధికారులు అభినందించారు. ఆలయ ఈవో వినోద్‌రెడ్డి, ఏఈవోలు శ్రవణ్, శ్రీనివాస్ మాట్లాడుతూ యువత సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. సెలవులు వృథా కావద్దనే.. వేసవి సెలవులు వృథా కావద్దనే ఉద్దేశంతోనే వేములవాడ రాజన్న హుండీ లెక్కింపులో సేవలందించేందుకు వచ్చాం. స్వామి వారికి భక్తులు సమర్పించిన డబ్బులను లెక్కించడం ఆనందంగా ఉంది. ఇలాంటి సేవ లభించినందుకు గర్వపడుతున్నాం. – అమూల్య, రిత్విక, అక్షయ(నిర్మల్ జిల్లా కడెం) భక్తిభావంతో వచ్చాం మేమంతా రాజన్నపై భక్తిభావంతో సేవ చేసేందుకు వచ్చాం. బుధవారం నాటి హుండీ లెక్కింపులో పాల్గొన్నాం. సేవా చేసేందుకు వచ్చే వారికి కొంచె ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. – అభిలాష్, కౌషిక్, మనోజ్, మహేశ్, శరత్, రంజిత్(జగిత్యాల జిల్లా గొల్లపల్లి) రాజన్న హుండీ లెక్కింపులో యువత వేసవి సెలవుల్లో విద్యార్థులు సైతం.. -
ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు పెంచొద్దు
కరీంనగర్: రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఫీజులు పెంచాలని టీజీఎఫ్ఆర్సీ ముందు పెట్టిన ప్రతిపాదనలను తిరస్కరించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం బద్దం ఎల్లారెడ్డిభవన్‌లో మాట్లాడారు. ఒక్కో కళాశాల వారు ప్రస్తుతం ఉన్న ఫీజులో 50శాతం పైగా పెంచాలని ప్రతిపాదించడం దారుణమన్నారు. ఇంజినీరింగ్ విద్యను వ్యాపారమయంగా మార్చారని, యాజమాన్య కోటా సీట్లను రూ.లక్షలకు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. విద్యార్హత లేనివారితో కళాశాలలు నిర్వహిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ఫీజుల దోపిడీని సీఎం నియంత్రించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి మచ్చ రమేశ్, నగర కార్యదర్శి హేమంత్, నాయకులు సందీప్‌రెడ్డి, సాయి, మచ్చ పవన్, వినయ్‌రెడ్డి, శ్రవణ్ పాల్గొన్నారు. -
టెక్నాలజీతో మెరుగైన సేవలందించాలి
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లోని పోలీస్ స్టేషన్లలో కొత్తగా ని యమితులైన కానిస్టేబుళ్లకు టెక్నాలజీ వినియోగంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలి పారు. కమిషనరేట్ కేంద్రంలోని ఐటీ కోర్ కార్యాలయంలో పోలీసులు వినియోగించే వివిధ సాఫ్ట్వేర్లు, అప్లికేషన్లు, సాంకేతిక పరిజ్ఞానంపై కొనసాగుతున్న శిక్షణను పురస్కరించుకొని సీపీ మాట్లాడారు. కొత్త కానిస్టేబు ళ్లకు బేసిక్ ట్రైనింగ్‌లో అందించిన శిక్షణతో పాటు, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి టెక్నాలజీపై మరింత పట్టు సాధించేలా శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. నేరాల ఛేదనలో సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుందన్నా రు. ఐటీ కోర్ కార్యాలయ ఇన్స్పెక్టర్ జె.సరిలా ల్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల కట్టడిని బాధ్యతగా స్వీకరించాలికరీంనగర్/కొత్తపల్లి: మాదక ద్రవ్యాల కట్టడిని ‘గురు’తర బాధ్యతగా స్వీకరించాలని జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ పి.శ్రీనివాసరావు అన్నారు. బుధవారం కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ–టెక్నో స్కూల్లో జరుగుతున్న ఉపాధ్యాయుల శిక్షణలో భాగంగా ఆయన హాజరై మాట్లాడారు. మాదకద్రవ్యాలు మానవ శరీరానికి హాని కలిగిస్తాయని, మెదడు, నాడీవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుందని, జ్ఞాపకశక్తి క్షీణించడంతోపాటు ఏకాగ్రత లోపించడం ద్వారా వ్యక్తుల అభివృద్ధి మందగిస్తుందని పేర్కొన్నారు. అవగాహన లేమితో చాలా మంది విద్యార్థులు మాదకద్రవ్యాలకు బానిస అవుతున్నారని, ఇది అభివృద్ధికి పెద్ద ఆటంకమన్నారు. మాదకద్రవ్యాల వాడకం వల్ల నష్టాల గురించి విద్యార్థులకు స్పష్టంగా వివరిస్తే వాటి వాడకం నుంచి దూరమవుతారని అన్నారు. జి.రాము, ఎస్.అశోక్‌కుమార్, కె.లక్ష్మణ్‌కుమార్, మహమ్మద్ ఇషాక్, కె.అశోక్‌రెడ్డి, డి.ఆనందం పాల్గొన్నారు.వసతులు బాగున్నాయా?కరీంనగర్‌క్రైం: కరీంనగర్ జిల్లా జైలు, సఖి కేంద్రం, శక్తి సదన్లను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కటారి రేవతి రావు బుధవారం సందర్శించారు. జైలులో మహిళా ఖైదీలతో మాట్లాడి సౌకర్యాలు, ఆహారం, వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు. అగర్బత్తుల ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించారు. సప్తగిరికాలనీలోని సఖి కేంద్రంలోని రికార్డులు చూశారు. బాధితులకు అందించిన న్యాయ, వైద్య, వసతి ఇతర సదుపాయాలపై ఆరాతీశారు. మహిళా కమిషన్ సభ్యురాలు వెంట జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, సఖి కేంద్రం అడ్మిన్ లక్ష్మి, కోఆర్డినేటర్ శ్రీలత తదితరులు ఉన్నారు. సిటీలో పవర్ కట్ ప్రాంతాలుకొత్తపల్లి: చెట్లకొమ్మల తొలగింపు పనుల కారణంగా గురువారం ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు గోదాంగడ్డ, ఉజ్వలపార్కు ఫీడర్ల పరిధిలోని మహాశక్తి దేవాలయం, బాలాజీ సూపర్ మార్కెట్, సంతోష్‌నగర్, సంతోషిమాత దేవాలయం, భాగ్యనగర్, శ్రీనగర్‌కాలనీ, భవానీకాలనీ, సప్తగిరికాలనీ, అంజనాద్రీ దేవాలయం, ధోబీఘాట్, గోదాం, బీఎస్ఎఫ్ క్వార్టర్స్, ఏఓస్ పార్కుకాలనీ, జెడ్పీ క్వార్టర్స్, భగత్‌నగర్, ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఉజ్వలపార్కు సబ్‌స్టేషన్ వరకు, పాలిటెక్నిక్ కళాశాల, ఐటీఐ కళాశాల, డిమార్ట్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. అదేవిధంగా ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 11 కేవీ హౌసింగ్‌బోర్డు కాలనీ ఫీడర్ పరిధిలోని హౌసింగ్‌బోర్డు కాలనీ, విట్స్ కళాశాల, సుభాష్ బొమ్మ, వరహస్వామి దేవాలయం, మారుతీనగర్ ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–1 ఏడీఈ పి.శ్రీనివాస్‌గౌడ్ వివరించారు. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 11 కేవీ చేగుర్తి ఫీడర్ పరిధిలోని మొగ్దూంపూర్, నారాయణరావుపల్లి, నల్లగుంటపల్లి, చేగుర్తి పరిధిలోని వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. -
తాత ఉన్నాడా.. అంటూ బంగారం చోరీ
జమ్మికుంట: తాత ఉన్నాడా అంటూ మాటలు కలిపిన ఓ గుర్తు తెలియని వ్యక్తి వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీ చేసిన సంఘటన బుధవారం జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. టౌన్ సీఐ రవి తెలిపిన వివరాలు... గ్రామానికి చెందిన ఇంజమూరి వెంకటలక్ష్మి ఇంటిముందుకు బుధవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి వచ్చి తాతా ఉన్నాడా అంటూ ఆమె మెడలోని తులం బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి కొడుకు వెంకటసత్యనారాయణస్వామి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ వివరించారు. వివాహిత ఆత్మహత్యకోనరావుపేట(వేములవాడ): మండలంలోని మంగళ్లపల్లికి చెందిన వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మంగళ్లపల్లికి చెందిన సాసాల లక్ష్మి(50)కి ఇటీవల రెండు సార్లు కిడ్నీలో రాళ్ల కోసం ఆపరేషన్లు జరిగాయి. బుధవారం చిన్న కోడలు సీమంతం గంభీరావుపేటలో జరుగగా కుటుంబసభ్యులు వెళ్లారు. లక్ష్మి మల్లారం శివారులోని ఓ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతికి గల కారణాలు తెలియరాలేదు. మృతురాలికి భర్త అంజయ్య, కుమారులు మహేశ్, బ్రహ్మానందం, కూతురు జ్యోతి ఉన్నారు. వేములవాడ ఎస్సై మారుతి కేసు విచారణ చేపడుతున్నారు. పుష్కరాల్లో ఆర్టీసీ సిబ్బంది కోసం వైద్య శిబిరంవిద్యానగర్(కరీంనగర్): సరస్వతీ పుష్కరాల విధినిర్వహణలో ఉండే ఆర్టీసీ సిబ్బంది కోసం ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు కరీంనగర్ జోనల్ హాస్పిటల్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏవీ గిరిసింహారావు తెలిపారు. కాళేశ్వరంలోని ప్రత్యేక ప్రయాణ ప్రాంగణంలో ఈవైద్య శిబిరం ఈనెల 15 నుంచి 26 వరకు కొనసాగుతుందని వివరించారు. ఆర్థికసాయం శంకరపట్నం: మండలంలోని మొలంగూర్ గ్రామానికి చెందిన వేముల చంద్రబాగ ఇటీవల మృతిచెందారు. బుధవారం ఆమె కుమారుడు శ్రీనివాస్‌కు 2004–05 ఎస్సెస్సీ స్నేహితులు వెంకటేశ్, సద్దాం, సంతోష్ రూ.11వేలు అందించారు. -
అటు పుష్కరాలు.. ఇటు పనులు
మంథని: పన్నెండేళ్లకోసా నిర్వహించే సరస్వతీ పుష్కరాలు గురువారం ప్రారంభం కానున్నాయి. మంథని నియోజకవర్గంలోని కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణాహిత నదులు కలుస్తుండంతో ఇక్కడ అంతర్వాహిణిగా ప్రవహించే సరస్వతీ నదికి పుష్కరాలు నిర్వహిస్తారు. 12రోజుల పాటు జరిగే పుష్కరాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరివస్తారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. వారికి అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించింది కానీ.. అఽధికారుల ముందుచూపు లేమి, కొందరు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో భక్తులకు అవస్థలు తప్పేలాలేవు. ఇప్పుడే వంతెన మరమ్మతులు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా(ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల సరిహద్దుల్లోని మంథని మండలం) అడవిసోమన్‌పల్లి వంతెన అప్పటిసీఎం పీవీ నరసంహారావు హయాంలో నిర్మించారు. దాని సామర్థ్యాన్ని మించి వాహనాలు రాకపోకలు సాగించడం, పురాత వంతెన కావడంతో శిథిలావస్థకు చేరింది. దాని మరమ్మతులకు ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసింది. సుమారు నెలరోజులుగా మరమ్మతులు కొనసా..గుతున్నాయి. దానిపై పగుళ్లు చూపాయి. పెద్దగుంతలు ఏర్పడ్డాయి. ఆ ప్రాంతంతోపాటు పాత నిర్మాణాన్ని తొలగించి సిమెంట్, కాంక్రీట్‌తో పనులు చేస్తున్నారు. ఒకవైపు వాహనాలకు అనుమతి ఇచ్చి మరోవైపు పనులు చేస్తున్నారు. పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి వంతెన మీదుగా వాహనాలు నడుస్తున్నాయి. అంతేగాకుండా బొగ్గు లారీలు, ఇతర భారీ వాహనాలు సైతం పెద్దఎత్తున రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్‌కు తీవ్రఅంతరాయం ఏర్పడుతోంది. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఇరువైపులా ఉన్న మానేరుతో ప్రమాదం ఏర్పడుతుంది. వాహనాలకు అంతరాయం ఒకేవైపు వాహనాల రాకపోకలతో భారీగా ట్రాఫిక్ స్తంభిస్తోంది. సాధారణ రోజుల్లో ఈపరిస్థితి ఉంటే.. పుష్కరాల సందర్భంగా 12 రోజులపాటు నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే అవకాశం ఉంది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్రమైన అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది. రోడ్డు విస్తరణ.. అభివృద్ధి మల్హర్ మండలం కొయ్యూర్ నుంచి కాటారం మండలం దన్వాడ రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. సరస్వతీ పుష్కరాల తేదీలు ఏడాది ముందుగానే ప్రకటించారు. మంథని– కాటారం మధ్య విస్తరణ, అభివృద్ధి, సరిహద్దు వంతెన మరమ్మతులు ఆలస్యంగా ప్రారంభించడమే కాకుండా నత్తనడకన సాగుతుండడంతో పుష్కరాల వేళ భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు. సరస్వతీ పుష్కరాల వేళ.. అధికారుల ముందుచూపు లేమి మంథని–కాటారం మధ్య సాగుతున్న అభివృద్ధి పనులు రెండు జిల్లాల సరిహద్దు వంతెనకు మరమ్మతులు ట్రాఫిక్‌కు అంతరాయం.. అసౌకర్యానికి గురవుతున్న వాహనదారులు అసౌకర్యం కలగకుండా చర్యలు మంథని మండలం అడవిసోమన్‌పల్లి వంతెనపై చేపట్టిన మరమ్మతు పనులతో వాహనదారులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటాం. పనులను పర్యవేక్షిస్తూ వర్క్ ఇన్స్పెక్టర్లు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. వాహనదారులు సహకరించాలి. –జఫార్, డీఈఈ, ఆర్ అండ్ బీ, మంథని -
మహిళలు బలోపేతం కావాలి
● కలెక్టర్ పమేలా సత్పతి తిమ్మాపూర్(మానకొండూర్): ప్రభుత్వం అందించే శిక్షణ, పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రంలో 20 మంది మహిళలకు గత నెల 12 నుంచి ఎలక్ట్రికల్ ఆటో డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. కార్యక్రమాన్ని బుధవారం కలెక్టర్ పరిశీలించారు. మహిళల సాధికారత లక్ష్యంగా ఎలక్ట్రికల్ ఆటో డ్రైవింగ్ శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ఈ ఆటోలను నిర్వహణ ఖర్చు లేకుండా నడపవచ్చన్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఆటోల కొనుగోలుకు రుణ సౌకర్యం కల్పించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. మహిళా ఆటో డ్రైవర్లు డ్రైవింగ్ రంగంలో మరింత మంది మహిళలను ప్రోత్సహించాలని ఆకాంక్షించారు. శిక్షణలో పాల్గొన్న మహిళలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అనంతరం శిక్షణ పొందిన మహిళా డ్రైవర్లు ఆటో నడుపుతుండగా కలెక్టర్ స్వయంగా ప్రయాణించి వారి నైపుణ్యాన్ని పరిశీలించారు. మహిళా ప్రాంగణ జిల్లా మేనేజర్ సుధారాణి, కిషన్‌రెడ్డి, బజాజ్ కంపెనీ మేనేజర్లు అనిల్‌కుమార్, నాగరాజు పాల్గొన్నారు. -
చేతులెత్తేశారు!
గురువారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2025నిద్ర..● భయపెడుతున్న గుర్‌గుర్ ● జనాభాలో 10 శాతం మంది బాధితులు ● హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణమంటున్న డాక్టర్లు ● ప్రారంభంలో చికిత్స చేస్తే ఫలితమంటున్న నిపుణులుగురక..ఉమ్మడి జిల్లా జనాభాగుండెపోటు!‘కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తిది ప్రైవేట్ జాబ్. రోజూ ఉదయమే విధులకు వెళ్లి పొద్దంతా పని చేసి సాయంత్రానికి అలసిపోయి ఇంటికి చేరేవాడు. రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్రలోకి జారుకోగానే గురకపెట్టేది. అతడికి తెలియకుండానే గురకతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడేది. శ్వాసలో ఇబ్బంది గురించి కుటుంబ సభ్యులు చెప్పినా పెడచెవిన పెట్టాడు. గురకే కదా అని నిర్లక్ష్యం చేశాడు. కొద్దిరోజులకు సమస్య తీవ్రరూపం దాల్చినా పట్టించుకోలేదు. ఓ రోజు వేకువజామున నిద్రలోనే గుండెపోటుకు గురై మృతిచెందాడు’.కరీంనగర్: 10,05,711జగిత్యాల: 13,57,796పెద్దపల్లి: 7,95,332సిరిసిల్ల: 5,52,037 ‘నగరపాలకసంస్థ పరిధిలోని 44వ డివిజన్లో గత జనవరి 21న నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభలో రేషన్‌కార్డుల అర్హుల జాబితా ప్రదర్శించారు. డివిజన్‌కు సంబంధించి 92 మంది రేషన్‌కార్డులు కొత్తగా పొందేందుకు అర్హులని అధికారులు పేర్లు చదివి వినిపించారు. ఆ జాబితాలో దరఖాస్తు దారు ఐడీ, ఆధార్‌కార్డు, ఇంటినంబర్, డివిజన్, మొబైల్ నంబర్లు తదితర వివరాలు ఉన్నాయి. అలాగే 41వ డివిజన్లో 62 మంది కొత్త రేషన్‌కార్డులకు అర్హులని గుర్తించారు. కానీ, ఇప్పటివరకు ఆ జాబితాల్లో ఉన్న ఏ ఒక్కరిని లబ్ధిదారులుగా ఎంపిక చేయలేదు, ఒక్క రేషన్‌కార్డు కూడా జారీ కాలేదు’.కరీంనగర్‌కార్పొరేషన్: నగరంలో తాగునీటికి ఎలాంటి కొరత లేదని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ స్పష్టం చేశారు. ఎల్ఎండీలో నీటి మట్టం క్రమేపీ తగ్గుతున్నా, నగరంలో నీటి సరఫరాకు సరిపడా నీళ్లున్నాయని తెలిపారు. ఈ వేసవి మొత్తం సరఫరా చేసే స్థాయిలో నీటిమట్టం ఉందన్నారు. నీటి సరఫరాలో అక్కడక్కడా సమస్యలు ఏర్పడుతున్నా, ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తున్నట్లు వివరించారు. వేసవిలో నీటి వినియోగం భారీగా పెరగడం, ఎల్ఎండీలో నీటి మట్టం తగ్గుతుండడం, నగరంలో తాగునీటి సరఫరా, ఎదురవుతున్న సమస్యలు, పరిష్కారాల తీరును ‘సాక్షి’కి వెల్లడించారు.కరీంనగర్‌కార్పొరేషన్: కొత్తగా రేషన్‌కార్డులు పొందడానికి అర్హులన్నారు.. అర్హుల జాబితా సైతం రూపొందించారు. ఏకంగా ఆ జాబితాను ప్రజాపాలనలో భాగంగా చేపట్టిన వార్డు సభల్లో ప్రదర్శించారు. పేర్లు చదివి వినిపించారు. అందులో నుంచి లబ్ధిదారులను ఎంపిక చేయడమే తరువాయి అని చెప్పారు. కానీ, తర్వాత చేతులెత్తేశారు. నాలుగు నెలలు దాటుతున్నా ఆ జాబితాలో పేర్లున్న ఒక్కరిని కూడా లబ్ధిదారులుగా ఎంపిక చేయలేదు. ఆ జాబితా అనంతరం దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్‌కార్డులు వస్తుండగా, పాత జాబితాలో ఉన్నవారికి మాత్రం కనీస సమాధానం కరువైంది. నగరంలో రేషన్‌కార్డుల జారీ ప్రక్రియలో నెలకొన్న గందరగోళానికి నిదర్శనమిది. గతేడాది దరఖాస్తుల స్వీకరణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న రేషన్‌కార్డుల ప్రక్రియలో కదలిక వచ్చింది. గతేడాదిలో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభల్లో ఆరుగ్యారంటీలకు సంబంధించి దరఖాస్తులను అధికారులు స్వీకరించగా, ఆ సభల్లో రేషన్‌కార్డు కోసం కూడా చాలా మంది అర్జీలు ఇచ్చారు. అంతేకాకుండా నేరుగా రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లున్నారు. మరోవైపు కులగణన సందర్భంగా రేషన్‌కార్డులు లేవని సమాచారం ఇచ్చినవారిని కూడా అర్హులుగా గుర్తించారు. ఇలా వివిధ కేటగిరీల్లో వచ్చిన రేషన్‌కార్డుల దరఖాస్తుల ఆధారంగా, డివిజన్ల వారీగా ‘రేషన్‌కార్డుల అర్హుల జాబితా’ రూపొందించారు. ఈ జాబితాను ఈ ఏడాది జనవరి 21న నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభల్లో ప్రదర్శించారు. ఆ జాబితా ఎక్కడ? రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి ప్రజాపాలన వార్డు సభలు నిర్వహించిన సందర్భంలో ప్రదర్శించిన అర్హుల జాబితా ప్రస్తుతం ఏమైందో తెలియడం లేదు. నగరంలోని 60 డివిజన్లకు సంబంధించి దాదాపు 5 వేల మందిని కొత్త రేషన్‌కార్డులు పొందేందుకు అర్హులుగా పేర్కొన్నారు. ప్రజాపాలన వార్డు సభల్లో స్వయంగా అధికారులే అర్హులుగా ప్రకటించడంతో ఆ జాబితాలో ఉన్నవారు తాము లబ్ధిదారులుగా మారడం ఖాయమంటూ ఆశపడ్డారు. ఏళ్లుగా రేషన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న తమ నిరీక్షణ ఫలించనుందనుకున్నారు. కానీ, జాబితాలో పేరు మాత్రమే తప్ప రేషన్‌కార్డు రాకపోవడం, పైగా ఆ జాబితా ఏమైందో కూడా తెలియని పరిస్థితి నెలకొనడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. పైగా ఏ వార్డు సభలో అర్హుల జాబితా ప్రదర్శించారో, ఆ జాబితాలో ఉన్నవారికి కార్డులు రాకపోగా, ఆ సభలో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రం రేషన్‌కార్డులు రావడం గమనార్హం. ఇదిలాఉంటే నగరపాలకసంస్థ అధికారులు మాత్రం తాము అర్హుల జాబితాలో ఉన్న పేర్ల ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, లబ్ధిదారుల వివరాలను సివిల్సప్లైశాఖకు పంపించామంటున్నారు. ఏదేమైనా ప్రభుత్వం గుర్తించిన అర్హుల జాబితాలో నుంచి ఏ ఒక్కరినీ లబ్ధిదారులుగా ఎంపిక చేయకపోవడం, ఆ జాబితానే పరిగణలోకి తీసుకోకపోవడంపై నెలకొన్న గందరగోళానికి జిల్లా ఉన్నతాధికారులు తెరదించాల్సి ఉంది.న్యూస్‌రీల్ వార్డు సభల్లో ప్రదర్శించిన జాబితా ఎక్కడ? రేషన్‌కార్డుల జారీపై నగరంలో గందరగోళం -
తాగునీటి కొరత లేదు
● ఎల్ఎండీలో సరిపడా నీరు ● సరఫరాలో అక్కడక్కడా సమస్యలున్నాయి ● ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తున్నాం ● ‘సాక్షి’తో నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్సాక్షి: చాలా ప్రాంతాల్లో నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదంటున్నారు. కారణమేమిటి?కమిషనర్: అలాంటి పరిస్థితి లేదు. అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా జరుగుతోంది. నగరంలో మెజార్టీ ప్రాంతాల్లో నల్లా నీళ్లు వస్తున్నాయి. అక్కడక్కడా సమస్యలు ఏర్పడితే వెంటనే పరిష్కరిస్తున్నాం. వేసవి దృష్ట్యా రోజు విడిచి రోజు నీటి సరఫరా చేస్తున్నాం. కొత్తపల్లిలో రెండు బావులు అద్దెకు తీసుకొని నీటి సరఫరా చేపట్టాం. -
మావోయిస్టు పార్టీతో కేంద్రం శాంతి చర్చలు జరపాలి
కరీంనగర్‌క్రైం: మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని, ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క నారాయణరావు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఫిల్మ్ భవన్లో పౌరహక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా 5వ మహాసభలు అధ్యక్షుడు శ్రీపతి రాజగోపాల్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈసందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ, సింగరేణి ఓపెన్ కాస్ట్‌ల విధ్వంసానికి, ఇటుక బట్టీలలో ఒరిస్సా కార్మికుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఉమ్మడి పౌరహక్కుల సంఘం జిల్లా కమిటీ పోరాటాలు నిర్వహించిందన్నారు. సంఘం నాయకులు కామ్రేడ్ గోపి రాజన్న, జాపా లక్ష్మారెడ్డి, అజాం ఆలీ, డాక్టర్ రామనాథం, నర్రా ప్రభాకర్ అక్రమ హత్యలు మొదలు జగిత్యాల జిల్లా రేచపల్లికి చెందిన పోగుల రాజేశంను అక్రమంగా అరెస్ట్ చేసిందని, అతడి కూతురును అల్లుడు హత్య చేస్తే కూతురు చివరి చూపునకు నోచుకోకుండా హింసించిందని ఆరోపించారు. సీనియర్ జర్నలిస్ట్ ఎన్. వేణుగోపాల్ మాట్లాడుతూ, కగార్ పేరుతో ఆదివాసీలను, వారికి మద్దతుగా ఉన్న మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్ పేరుతో హత్యలు చేస్తున్నారని ఆరోపించారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆపరేషన్ కగార్‌ను ఆపివేయాలని, ఛత్తీస్‌గఢ్‌లో సైనిక క్యాంపులను ఎత్తివేయాలని తదితర అంవాలపై తీర్మాణాలు చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాధన కుమారస్వామి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు రమేశ్చందర్, ప్రధాన కార్యదర్శి పాణి, ముడిమడుగుల మల్లన్న తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీ అధ్యక్షుడిగా బొంకూరి లక్ష్మణ్, ఉపాధ్యక్షులుగా పుల్ల సుచరిత, నారా వినోద్, కార్యదర్శిగా బొడ్డుపల్లి రవి, సహాయ కార్యదర్శులుగా గడ్డం సంజీవ్, రెడ్డిరాజుల సంపత్, కోశాధికారిగా మాదవనేని పర్వతాలును ఎన్నుకున్నారు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నక్క నారాయణరావు -
ఎందుకురా నీ బతుకు చావరాదు..! అని తిట్టడంతో
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కులపెద్దలు చేసిన పంచాయితీ ఒకరి నిండు ప్రాణాన్ని తీసింది. పంచాయితీలో బూతులు తిట్టడంతో అవమాన భారంగా భావించిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన కడమంచి స్వామి(34) ఇంట్లో లేనప్పుడు అ తని భార్యపై అదే గ్రామానికి చెందిన టేకు ప్రేమ్‌కుమార్ లైంగికదాడికి యత్నించాడు. స్వామికి ఈ విషయం తెలియడంతో ప్రేమ్‌కుమార్‌ను నిలదీశా డు.మూడు రోజుల క్రితం కులపెద్దలు పంచాయితీ పెట్టి ప్రేమ్‌కుమార్‌కు జరిమానా విధించారు. దీంతో కోపోద్రిక్తుడైన ప్రేమ్‌కుమార్ స్వామిని అందరిముందే బూతులు తిట్టాడు. అంతేకాకుండా చావమని తిట్టడంతో అవమానంగా భావించిన స్వామి మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మృతుని భార్య ఫిర్యాదుతో ప్రేమ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ట్రెయినీ ఎస్సై కె.వినీతారెడ్డి తెలిపారు. అయితే గ్రామానికి చెందిన కొందరు పెద్దమనుషులతోపాటు కొందరు విలేకరులు కలిసి ఈ పంచాయితీ నిర్వహించినట్లు తెలిసింది. వీరిద్దరి నుంచి రూ.4లక్షల చొప్పున మొత్తం రూ.8లక్షలు పంచాయితీ దరావతుగా తీసుకోవడంతోపాటు ఆ మొత్తం కూడా ఖర్చు అయినట్లు తెలిపారనే చర్చ సాగుతోంది. -
ప్రాణాలు కాపాడేదెలా?
సాక్షి, పెద్దపల్లి: రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి సత్వరమే అత్యవసర వైద్యసేవలు అందించి ప్రాణాలు నిలబెట్టేందుకు ఉద్దేశించిన ట్రామాకేర్ కేంద్రాలు ప్రతిపాదనదశ వీడడం లేదు. కేంద్రప్రభుత్వం 2012లో ట్రామాకేర్ వైద్యసేవలు ప్రారంభించినా.. జిల్లాలో రాజీవ్ రహదారి విస్తరించి ఉన్నా ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. నిత్యం ఏదోఒక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూనే ఉండడంతో గాయపడినవారిని సమీపంలోని జిల్లా ఆస్పత్రులు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. చాలా సందర్భాల్లో సత్వర వైద్య సేవలు అందక గాయపడినవారు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదం జరిగిన తొలిగంట(గోల్డెన్ అవర్)లో సరైన వైద్యం అందిస్తే ప్రాణాపాయ స్థితిలోని వ్యక్తి బతికే అవకాశాలు ఉన్నాయి. తాజా గా రాష్ట్రప్రభుత్వం 90 వరకు ట్రామాకేర్ సెంటర్ల ఏర్పాటుకు అడుగులు వేస్తున్న తరుణంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోనూ వాటిని అందుబాటులోకి తీసుకు రావాలని స్థానికులు కోరుతున్నారు. ట్రామా వస్తే.. ఎంతోమేలు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, రహదారులపై ప్రమాదాలు జరిగినా, ఇంట్లో జారీపడినా, భవనాలు కూలీ తీవ్రంగా గాయపడినా బాధితులకు సత్వరమే అత్యవసర వైద్య చికిత్సలు అందించడానికి ట్రామాకేర్లను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. బాధితుల ప్రాణాలు రక్షించడమే ధ్యేయంగా రహదారుల చెంతనే వీటిని ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్దేశించింది. ట్రామాకేర్ సెంటర్ల ద్వారా ఆర్థో, న్యూరో, జనరల్ సర్జన్, జనరల్ ఫిజీషియన్, అనెస్తీషియా, ఎంబీబీఎస్, ఎక్స్‌రే, అంబులెన్స్, డ్రైవర్, సహాయకులు మందులు, అత్యవసర ఆపరేషన్ ఽథియేటర్, ఐసీయూ తదితర అన్నిరకాల సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రధానంగా రెఫరల్ కేసుల సంఖ్య బాగా తగ్గుతుంది. చొరవ తీసుకుంటే జిల్లాలో ట్రాామా సెంటర్ ఏర్పాటు చేయాలని మూడేళ్లుగా డిమాండ్ వస్తోంది. జిల్లాలో ట్రామా సెంటర్ ఏర్పాటు కోసం జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు చొరవ చూపితే స్థానికంగా ఎంతోమందికి అత్యవసర వైద్యం అందుబాటులోకి వచ్చి ప్రాణాలు దక్కుతాయి. జిల్లాలో ఈ ఏడాది జరిగిన ప్రమాదాలు ప్రతిపాదనలు దాటని ట్రామాకేర్ సెంటర్ సత్వర వైద్యం అందక పోతున్న ప్రాణాలు స్థానిక నేతలు చొరవ చూపాలని డిమాండ్ ప్రతిపాదన దశల్లోనే.. జిల్లాలో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలనే అంశం ప్రతిపాదన దశలోనే ఉంది. ఇప్పటివరకు ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి ఎటువంటి సూచనలు రాలేదు. ప్రభత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. సెంటర్ ఏర్పాటు అయితే, రహదారి ప్రమాద బాధితులకు ఎంతో మేలు చేకూరుతుంది. – శ్రీధర్, డీసీహెచ్‌వో -
ఒకరికొకరు అర్థం చేసుకోవాలి
తమ కూతురుకు పెళ్లి చేస్తే పరిస్థితి ఎలా ఉండాలో అమ్మాయి తల్లిదండ్రులు ముందే ఒక ఆలోచనకు వస్తున్నారు. పెళ్లి అనేది ఇద్దరి జీవితాలను నిర్ణయించేది. అమ్మాయికి అర్థం చేసుకునే గుణం, అబ్బాయికి ఓపిక అనేది ఉన్నాయో లేవో గమనించి వివాహం చేస్తే ఆ బంధం నిలబడుతుంది. తల్లిదండ్రులు ఆ దిశగా ఆలోచన చేస్తే బాగుంటుంది. – డాక్టర్ ప్రవీణ్‌కుమార్, హుజూరాబాద్ ఆలోచనల్లో మార్పు రావాలి అమ్మాయిల తల్లిదండ్రుల ధోరణి ప్రస్తుతం పూర్తిగా మారింది. గత 20 ఏళ్లలో అమ్మాయిల ఆలోచన సైతం మారింది. పెళ్లి చేసుకునే అబ్బాయి ఉద్యోగం, ఆస్తిపాస్తులు, ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే అడుగులు ముందుకు పడుతున్నాయి. అర్థం చేసుకునే గుణం, కష్టపడేతత్వం, తెలివితేటలతో ఎదిగే యువకుడికి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే సుఖపడుతుంది. – ఆడెపు రవీందర్, మ్యారేజ్ బ్యూరో, హుజూరాబాద్ మానసిక ఒత్తిడిలో తల్లిదండ్రులు అబ్బాయికి 30 ఏళ్లు దాటినా పెళ్లి కాకపోవడాన్ని తల్లిదండ్రులు సమాజంలో నామోషీగా భావిస్తున్నారు. అబ్బాయిల్లో నిరుత్సాహం, పెళ్లి పట్ల విరక్తి భావం పెరుగుతోంది. కొందరిలో ఆత్మహత్య ఆలోచనలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటివారికి కౌన్సెలింగ్ ఇప్పించడం చాలా అవసరం. పెళ్లి అన్న దాన్ని పరువుగా భావించడం వల్లే అబ్బాయిలు, వారి తల్లిదండ్రుల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి.– డాక్టర్ ఎల్.వర్షి, మానసిక నిపుణుడు, హుజూరాబాద్ -
లారీ బోల్తా పడి డ్రైవర్, క్లీనర్‌కు గాయాలు
ధర్మపురి: ప్రమాదవశా త్తు లారీ బోల్తాపడి డ్రైవర్, క్లీనర్‌కు తీవ్రగాయాలైన ఘటన మండలంలోని ఆకసాయిపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. నిజామాబాద్ నుంచి మంచిర్యాల వైపు ఉల్లిగడ్డల లోడుతో వెళ్తున్న లారీ ఆకసాయిపల్లె గుట్టమలుపు వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ శివనాగరాజు, క్లీనర్ దుర్గారావు క్యాబిన్లో ఇరుక్కుపోయారు. వారిని బయటకు తీసి 108 అంబులెన్సులో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు.దుబాయి నుంచి వచ్చిన వారానికే..● బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతిధర్మపురి: దుబాయి నుంచి వచ్చి వారం రోజులకే బైక్ అదుపుతప్పి కిందపడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని దోనూర్లో వెలుగుచూసింది. ఎస్సై ఉదయ్‌కుమార్ కథనం ప్రకారం.. రాజారం గ్రామానికి చెందిన నారకట్ల చంద్రయ్య (43) కూతురుకు పెళ్లి చేద్దామని వారంక్రితం దుబాయి నుంచి వచ్చాడు. మంగళవారం దోనూర్లో ఉంటున్న తన బంధువుల ఇంటికి వెళ్లాడు. ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. చంద్రయ్య తల రాయికి తగలడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. చంద్రయ్యకు భార్య ధనలక్ష్మి, కూతురు శ్రీజ, కుమారుడు తేజ ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.ఉరేసుకుని ఒకరి ఆత్మహత్యకోరుట్ల: పట్టణంలోని అల్లమయ్యగుట్ట చింతలవాడకు చెందిన టేకి సాయిలు (35) మంగళవా రం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ని జామాబాద్ జిల్లా నవీపేట్ మండలం లింగా పూర్‌కు చెందిన సాయిలు కొంతకాలంగా ఇక్క డ హమాలీగా పనిచేస్తున్నాడు. రెండునెలల క్రితం సాయిలు తల్లి అనారోగ్యంతో మృతిచెందింది. అప్పటి నుంచి మనస్తాపంతో ఉంటున్నాడు. నాలుగురోజుల క్రితం భార్య పిల్లలతో కలిసి నిజామాబాద్‌లోని తల్లిగారింటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సాయిలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కలవారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.5 లోగా దరఖాస్తు చేసుకోవాలిపెద్దపల్లిరూరల్: ఒడిశా రాష్ట్రంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో ఫస్టియర్ డిప్లొమా కోర్సులో చేరేందుకు ఆసక్తి, అర్హత గలవారు జూన్ 5లోగా దరఖాస్తు చేసుకోవాలని చేనేత, జౌళిశాఖ డెప్యూటీ డైరెక్టర్ విద్యాసాగర్ కోరారు. తెలంగాణ రాష్ట్రానికి 9 సీట్లు కేటాయించారని పేర్కొన్నారు. మూడేళ్ల డిప్లొమా కోర్సులో చేరేందుకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి 17 నుంచి 25 ఏళ్లలోపు వయసు గలవారు అర్హులన్నారు. ఆసక్తి, అర్హత గలవారు కరీంనగర్‌లోని చేనేత, జౌళిశాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమ ర్పించాలని కోరారు. -
ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తి అరెస్ట్
జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని హనుమాన్‌వాడలో ద్విచక్రవాహనంపై వస్తున్న పాదం మల్లేశం, వితన్విల మృతికి కారణమైన నస్పూరి మణిదీప్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ వేణుగోపాల్ తెలిపారు. మల్లేశం, ఆయన సోదరుడి కూతురు వితన్వి సోమవారం రాత్రి ద్విచక్రవాహనంపై వస్తుండగా మణిదీప్ అతిగా మద్యం సేవించి అతివేగంగా కారు నడిపి ఢీకొట్టాడు. ఈ ఘటనలో మల్లేశం, వితన్వి మృతిచెందారు. మల్లేశం సోదరుడు రాజశేఖర్ ఫిర్యాదు మేరకు మణిదీప్‌పై కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఎస్సై గీత, ఏఎస్ఐ మోహన్, కానిస్టేబుల్ జీవన్ పాల్గొన్నారు. వడదెబ్బతో ఒకరి మృతివెల్గటూర్: వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని జగదేవుపేటలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నర్సయ్య (46) రెండురోజులు ఎండలో వ్యవసాయ పనులకు వెళ్లాడు. వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. నర్సయ్యకు భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
మధుకర్‌ను స్వదేశానికి రప్పించండి
జగిత్యాలక్రైం: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి ఇతరులకు బ్యాంక్ ఖాతా ఇచ్చి ట్రావెల్ బ్యాన్ అయిన మల్లాపూర్ మధుకర్‌ను స్వదేశానికి రప్పించాలని ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం అందించారు. జిల్లాలోని పెగడపెల్లి మండలం ఎల్లాపూర్‌కు చెందిన మల్లారపు మధుకర్ (27) ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. తన బ్యాంక్ ఖాతా ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు లావాదేవీలు జరిపారు. దీంతో అజ్మాన్‌లోని కోర్టు అతనిపై ప్రయాణ నిషేధం (ట్రావెల్ బ్యాన్) విధించింది. విషయం తెలుసుకున్న మధుకర్ తల్లిదండ్రులు మల్లవ్వ, అంజయ్య ఎన్ఆర్ఐ అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. సీఎంవో ద్వారా సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని ప్రజావాణి ఇన్చార్జి, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి వారికి హామీ ఇచ్చారు. -
హోంగార్డుల బదిలీకి దర్బార్
● సీపీ గౌస్ ఆలం కరీంనగర్‌క్రైం: హోంగార్డుల బదిలీకి కమిషనరేట్‌లో మంగళవారం సీపీ గౌస్ ఆలం ప్రత్యేకంగా దర్బార్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయని, ఆ సమయంలో తాత్కాలిక ప్రాతిపదికన కొత్త జిల్లాలకు కేటాయించబడిన హోంగార్డుల సంఖ్య ఆధారంగా బదిలీలు జరిగాయన్నారు. కరీంనగర్ నుంచి కొత్తగా ఏర్పడిన జిల్లాలకు బదిలీపై వెళ్లిన హోంగార్డులకు గత 9ఏళ్లుగా బదిలీలు జరగలేదన్నారు. వారి అభ్యర్థన మేరకు త్వరలో బదిలీలు చేపడతామని హామీ ఇచ్చారు. బదిలీలు పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం పోలీస్ కమిషనర్ అధ్యక్షతన ఇద్దరు ఏసీపీలు, ఏవో, రిజర్వ్ ఇన్స్పెక్టర్తో కూడిన కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కరీంనగర్‌కు 300మంది హోంగార్డులు కేటాయించినట్లు తెలిపారు. జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, హన్మకొండ, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు బదిలీలు జరగనున్నాయని వెల్లడించారు. ఏవో ముని రామయ్య, ఏసీపీలు మాధవి, శ్రీని వాస్, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, సురేశ్ పాల్గొన్నారు. -
సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి
సైదాపూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రైతు సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మంగళవారం మండలంలోని దుద్దెనపల్లి, బొమ్మకల్ గ్రామాల్లో నిర్వహించిన రైతు సదస్సులో పాల్గొని రైతులతో ముఖాముఖి నిర్వహించారు. భూ భారతి చట్టం అమలులో భాగంగా సైదాపూర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని అన్నారు. రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. రెవెన్యూ సదస్సుల్లో భూ రికార్డుల్లో పేరు తప్పులు, విస్తీర్ణం హెచ్చుతగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, పట్టా పాసుబుక్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్దారణ, పార్ట్–బీలో చేర్చిన భూముల సమస్యలు, తదితర అంశాలపై దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. కొత్త ఆర్వోఆర్ చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి పరిష్కారం చూపుతారన్నారు. ఫైలట్ మండలంలో సదస్సులు పూర్తి అయిన తర్వాత జిల్లావ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తామన్నారు. రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. అక్కడే పరిష్కారమయ్యే దరఖాస్తులను తహసీల్దార్ పరిశీలించాలని ఆదేశించారు. హుజూరాబాద్ ఆర్డీవో రమేశ్‌బాబు, తహసీల్దార్ శ్రీనివాస్, కనకయ్య, సిబ్బంది పాల్గొన్నారు.● కలెక్టర్ పమేలా సత్పతి -
రూ.కోటితో ఎస్టీపీ ఆధునీకరణ పనులు
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని మురుగు నీటిశుద్ధీకరణ కేంద్రాన్ని (ఎస్టీపీ) రూ.కోటితో ఆధునీకరించనున్నట్లు నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. మంగళవారం మధురానగర్‌లో ఉన్న మురుగునీటి శుద్ధీకరణ కేంద్రాన్ని సందర్శించారు. మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్‌ను నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునీకరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా మురుగునీటి శుద్ధీకరణ కేంద్రాన్ని ఆధునీకరించేందుకు ప్రభుత్వం రూ.కోటి కేటాయించినట్లు తెలిపారు. కుక్కల బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసేందుకు గతంలో కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఈఈ సంజీవ్ కుమార్, డీఈ అయూబ్ ఖాన్, ఏఈ గఫూర్ పాల్గొన్నారు. ప్రశాంతంగా పాలిసెట్సప్తగిరికాలనీ(కరీంనగర్): జిల్లాలో మంగళవారం నిర్వహించిన పాలిసెట్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా ఎనిమిది కేంద్రాల్లో పరీక్ష జరిగింది. 4,234మంది విద్యార్థులకు 1,934మంది బాలురు, 1,985 మంది బాలికలు మొత్తం 3,919 మంది పరీక్షకు హాజరయ్యారు. 315మంది గైర్హాజరైనట్లు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డి.శోభారాణి తెలిపారు. -
నువ్వులేని లోకంలో నేనుండలేను కొడుకా..
కరీంనగర్ జిల్లా: ‘కొడుకా.. నువ్వే గుర్తొస్తున్నావ్... ఒక్కగానొక్క కొడుకని అపురూపంగా చూసుకున్నా.. చదువుకుంటా అంటే హైదరాబాద్ పంపిన. మాయ దారి బెట్టింగ్‌లో రూ.లక్షలు పోగొట్టుకున్నా.. సరే బిడ్డా అని ధైర్యం చెప్పిన. అయినా మమ్మల్ని మోసం చేస్తివి. బెట్టింగ్‌కు బలై ఈ లోకాన్నే విడిచిపోతివి. నిన్ను మర్చిపోలేకపోతున్నా కొడుకా.. నీవు లేని లోకం నాకు వద్దు బిడ్డా’అంటూ.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో ఓ తండ్రి పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మన్నెంపల్లి గ్రామానికి చెందిన తిరుపతిరావు(49) కొడుకు నిఖిల్‌రావు (21) ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్‌లకు అలవాటుపడి రూ.లక్షల్లో అప్పు చేశాడు. అవి తీర్చలేక, మానసిక ఒత్తిడితో రెండు నెలల క్రితం వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నిఖిల్ ఒక్కగానొక్క కొడుకు కావడంతో, అతని మృతిని తిరుపతిరావు తట్టుకోలేకపోయాడు. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఆదివారం తన వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగాడు. స్థానికులు వెంటనే అతన్ని హైదరాబాద్‌లోని ఒక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు. ఆన్లైన్ బెట్టింగ్తో కొడుకు.. అతని మరణం తట్టుకోలేక తండ్రి మరణించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. -
ఇంధనం కరువు
● జనవరి నుంచి పెట్రోల్, డీజిల్ బిల్లులు పెండింగ్ ● పోలీసు వాహనాలకు డీజిల్ కరువు ● కరీంనగర్ కమిషనరేట్‌లో రూ.కోటికిపైగా బిల్లులు ● సిరిసిల్ల, రామగుండంలో రూ.40 లక్షల చొప్పున బాకీ ● వాహన మెయింటెనెన్స్ బిల్లులు కూడా రావడంలేదు ● మూడు నెలలుగా రాని స్టేషన్ నిర్వహణ బడ్జెట్సాక్షిప్రతినిధి,కరీంనగర్: తెలంగాణ పోలీసులు సాంకేతికత, కేసుల దర్యాప్తు విషయంలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలుస్తున్నారు. ఈ విషయం ఇటీవల మరోసారి రుజువైంది. కానీ, కొన్నినెలలుగా పోలీసులకు సమయానికి నిధులు అందడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పోలీసు వాహనాలకు పెట్రోల్, డీజిల్ బిల్లులు జనవరి నుంచి పెండింగ్‌లో ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్ పెట్రోల్ బిల్లులతోపాటు వాహనాల మరమ్మతులకు సంబంఽధించి మెయింటెనెన్స్ బిల్లులు కూడా రావడం లేదని వాపోతున్నారు. స్టేషన్ మెయింటెనెన్స్‌కు సంబంధించి అర్బన్, రూరల్ ఏరియాల్లో నెలనెలా కొంత మొత్తం అందజేస్తారు. ఈ మొత్తం కూడా మూడు నెలలుగా రావడం లేదని పలువురు ఎస్‌హెచ్‌వోలు వాపోతున్నారు. గరిష్టంగా కరీంనగర్లో ఉమ్మడి కరీంనగర్జిల్లాలో కరీంనగర్, రామగుండం కమిషనరేట్లు, సిరిసిల్ల, జగిత్యాల ఎస్పీ కార్యాలయాలు ఉన్నాయి. కరీంనగర్ కమిషనరేట్ బిల్లులు జనవరి నుంచి పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రతీ నె లా రూ.25 లక్షలకుపైగా నిధులు కావాల్సి ఉంటుంది. ఈ లెక్కన కరీంనగర్ కమిషనరేట్‌లోనే దాదాపు రూ.కోటి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. సిరిసిల్ల లోనూ గత నాలుగు నెలలుగా బిల్లులు రావడం లేదని సమాచారం. అక్కడా దాదాపు రూ.40 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉందని సిబ్బంది వాపోతున్నారు. రామగుండంలో ఏప్రిల్ నెలకు సంబంధించి రూ.40 లక్షలు మాత్రమే బిల్లులు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. జగిత్యాలలో ఎలాంటి సమస్య లేదని స్పష్టంచేశారు. అంతా బానే ఉందని పైకి చెబుతున్న యూనిట్లలోనూ వాస్తవాలు వేరే ఉన్నాయని సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. వాహనాల మరమ్మతుల డబ్బులు సకాలంలో విడుదల కాకపోవడంతో మెయింటెనెన్స్‌కు ఇబ్బందిగా ఉంటుందని పలువురు పోలీసు అధి కారులు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమైన సందర్భాల్లో తమ చేతుల నుంచి డీజిల్ పోయించుకుంటున్నామని వాపోతున్నారు. మెయింటెనెన్స్‌కు తిప్పలే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని రెండు కమిషనరేట్లు, రెండు ఎస్పీ కార్యాలయాల్లో స్టేషన్ మెయింటెనెన్స్ డబ్బులు మూడు నెలలుగా రావడం లేదని సమాచారం. ప్రాంతాన్ని బట్టి అర్బన్, రూరల్ ఏరియాలకు ప్రతీ నెలా స్టేషనరీ, తదితర మెమెంటెనెన్స్కు కొంతమొత్తం రావాల్సి ఉంటుంది. వీటిని స్టేషనరీతోపాటు వచ్చిన వారికి టీ, కాఫీల కోసం వినియోగిస్తారు. ఈ మొత్తం కూడా మూడు నెలలుగా రావడం లేదని పోలీసు అధికారులు వాపోతున్నారు. దీంతో పోలీసులు పలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. చాలాసార్లు తామే తొలుత చేతి నుంచి ఖర్చు చేసి, బిల్లులు వచ్చాక సర్దుబాటు చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.యూనిట్ వాహనాలు కరీంనగర్ 380 రామగుండం 168 జగిత్యాల 242 సిరిసిల్ల 211 (నోట్: వాహనాల సంఖ్యలో స్వల్ప వ్యత్యాసాలు ఉండొచ్చు) -
24,25 తేదీల్లో తానా రాష్ట్రస్థాయి సదస్సు
కరీంనగర్‌టౌన్: తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్‌హోమ్స్ అసోసియేషన్ (తానా) కరీంనగర్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 24, 25 తేదీల్లో నగరంలోని ప్రతిమ హోటల్లో తానాకాన్–2025 పేరుతో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ బాధ్యులు వెల్లడించారు. ఐఎంఏ హాల్లో సోమవారం సదస్సుకు సంబంధించి బ్రౌచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం తానా బాధ్యులు మాట్లాడుతూ తానా జోన్–2 పరిధిలోని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల బాధ్యులు పాల్గొంటారని తెలిపారు. మే 24న సీఎంఈ నిర్వహించబడుతుందని, 25న చిన్న, మధ్యతరహా ఆసుపత్రులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు జరగనున్నాయని తెలిపారు. అందులో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, ఆసుపత్రుల అనుమతులు, కాలుష్య నియంత్రణ బోర్డు నియమాలు, ట్రేడ్ లైసెన్స్, ఎస్టీపీ, ఇతర అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఇదే రోజు రాష్ట్ర తానా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరుగుతుందన్నారు. రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా డాక్టర్ అరుణ్ కఠారి ఎన్నికై నట్లు వెల్లడించారు. నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి సుమారు 500 మంది వైద్యులు హాజరవుతారని తెలిపారు. తానాకాన్–2025 ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు చాట్ల శ్రీధర్, రాజ్‌కుమార్, బీఎన్ రావు, జగన్మోహన్ రావు, ఎనమల్ల నరేశ్, శేష శైలజ, నవీన్, మహేశ్, రవికాంత్ పాల్గొన్నారు. -
యూరియా వాడకం తగ్గించాలి
గన్నేరువరం: పంటల సాగులో సిపార్సు చేసిన ఎరువులు మాత్రమే వాడాలని, యూరియా తగ్గించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి జయ భాగ్యలక్ష్మి రైతులకు సూచించారు. భారతీయ మొక్కజొన్న పరిశోధన కేంద్రం లుది యానా సహకారంతో ఖాసీంపేట, పారువెల్ల గ్రామాలకు చెందిన 250 రైతులకు గడిచిన రబీలో మొక్కజొన్న విత్తనాలు, గడ్డిమందులు అందజేశారు. దీనిపై క్షేత్రస్థాయి పరిశీలన భాగంగా ఆ పంట సాగుచేసిన రైతులతో సోమవారం ఖాసీంపేట గ్రామ రైతువేదికలో నిర్వహించిన క్లస్టర్ స్థాయి సమావేశానికి జిల్లా వ్యవసాయశాఖ అధికారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పంటల సాగులో మేలైన విత్తనాల వాడాలన్నారు. ప్రతి రబీలో జీరో టిల్లర్ విధానంలో మొక్కజొన్న సాగు చేయాలన్నారు. జీరో టిల్లర్ సాగు అవగాహన కరపత్రాన్ని ఆవిష్కరించారు. కరీంనగర్ వ్యవసా య పరిశోధన కేంద్రం అధికారి ఉషారాణి, మండల వ్యవసాయశాఖ అధికారి కిరణ్మయి, శాస్త్రవేత్త శ్రావణి, ఏఈవో అనూష ఉన్నారు. వెల్నెస్ సెంటర్ సందర్శన కరీంనగర్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రి ఆవరణలో ఉన్న హెల్త్ వెల్నెస్ సెంటర్‌ను జిల్లా వైద్య ఆ రోగ్యశాఖ అధి కారి డాక్టర్ వెంకటరమణ సోమవారం సందర్శించారు. వెల్నెస్ సెంటర్లో ఉద్యోగులకు ఎంప్లాయీ హెల్త్ స్కీం ద్వారా అందుతున్న సేవలు, పెన్షనర్స్, జర్నలిస్టులకు సెంటర్ ద్వారా అందుతున్న సేవలు, ల్యాబోరేటరీ పరీక్షలు, మందుల వివరాలకు సంబంధించిన ఫార్మసీ రికార్డులు పరిశీలించారు. వెల్నెస్ సెంటర్ సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో ప్రైవేటీకరణ ఆపాలి కరీంనగర్: వైద్య ఆరోగ్య రంగంలో ప్రైవేటీకరణ ఆపాలని, ఆశా వర్కర్లను పర్మినెంట్ కార్మి కులుగా గుర్తించాలని ఆశ వర్కర్స్ యూని యన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి డిమాండ్ చేశారు. నగరంలోని ముకుందలాల్ మిశ్రాభవన్లో సోమవారం జరిగిన ఆశ వర్కర్స్ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె బుక్లెట్స్ ఆవిష్కరించారు. జయలక్ష్మి మాట్లాడుతూ 19ఏళ్ల నుంచి పనిచేస్తున ఆశవర్కర్లకు హెల్త్ వర్కర్లుగా గుర్తింపు లేదన్నా రు. ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కేంద్ర ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలుపెట్టాలని అన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేళ్ల శ్రీలత, పద్మ, లక్ష్మి, రజిత, పరిమిత, సత్యలక్ష్మి, ప్రియాంక, సరిత, లత పాల్గొన్నారు. -
రేపు వేములవాడ బంద్
వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా జూన్ 15 నుంచి మూసివేస్తామనడంపై ఈనెల 14న వేములవాడలో బంద్ పాటించాలని రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ కోరారు. ఈమేరకు సోమవారం కరపత్రం ఆవిష్కరించి మాట్లాడారు. 1100 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన దేవతామూర్తులను తొలగించొద్దని, భక్తులను యథావిధిగా దర్శనాలకు అనుమతించాలని కోరారు. ఆలయాన్ని మూసివేయడంతో చాలా మంది వ్యాపారులు తమ ఉపాధి కోల్పోతారన్నారు. విస్తరణ పనులను ఎన్నేళ్లలో పూర్తి చేస్తారో ప్రకటించాలని కోరారు. కార్యదర్శి రామతీర్థపు రాజు తదితరులు పాల్గొన్నారు. రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ -
ప్రదర్శనకు ప్రతిపాదిత మాస్టర్‌ప్లాన్
కరీంనగర్ కార్పొరేషన్: శాతవాహన అర్బన్ డెవలెప్మెంట్ అథారిటి (సుడా) ఆధ్వర్యంలో రూ పొందించిన నగర కొత్త మాస్టర్ ప్లాన్‌ను ప్రజల కు తెలియచేసేందుకు నగరపాలకసంస్థ కార్యాలయంలో ప్రదర్శనకు ఉంచారు. కార్యాలయానికి వచ్చిన సందర్శకులు పరిశీలించారు. కొత్త మాస్టర్ ప్లాన్‌లో రెసిడెన్షియల్ జోన్, కమర్షియల్ జోన్, ఇండస్ట్రియల్ జోన్, రోడ్ల వెడల్పు, కొత్త రోడ్లు తదితర అంశాలను ఆసక్తిగా గమనించారు. ప్రతిపాదిత మాస్టర్‌ప్లాన్‌కు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే జారీ కాగా, 90 రోజుల అనంతరం ఆమోదం పొందనుంది. -
ప్రజావాణి.. సమస్యల ఝరి
కరీంనగర్ అర్బన్: ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజావాణికి అర్జీలు పెరుగుతున్నాయి. వచ్చిన వారే మళ్లీ మళ్లీ వస్తుండగా సాంత్వన అంతంత మాత్రమే. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి అర్జీలొచ్చాయి. కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్ అర్జీలను స్వీకరించగా పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపారు. ప్రధానంగా భూ సమస్యలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు తదితర సమస్యలు వచ్చాయి. మొత్తం 264 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య పరిష్కరించాలని వేడుకోలుమొత్తం అర్జీలు: 264 ఎక్కువగా మున్సిపల్ కార్పొరేషన్: 63 కరీంనగర్ రూరల్ తహసీల్దార్: 12 మానకొండూర్ తహసీల్దార్: 11 ఆర్డీవో కరీంనగర్: 09 తహసీల్దార్ తిమ్మాపూర్: 10 తహసీల్దార్ జమ్మికుంట: 09 -
డాన్స్ నేర్చుకుంటున్నాను
వేసవి సెలవులు వచ్చాయంటే టీవీలకు అతుక్కుపోయేవాళ్లం. స్పెషల్ సమ్మర్ క్యాంపులో డాన్స్ నేర్చుకుంటున్నాను. చేతిరాత బాగుండేలా మా సార్ శిక్షణ ఇస్తున్నారు. చెస్ నేర్చుకుంటున్న. ఇంటికెళ్లే ముందు స్నాక్స్ ఇస్తున్నారు. సమ్మర్ క్యాంపు బాగుంది. – ఎ.తేజస్విని, ముస్తాబాద్ స్పోకెన్ ఇంగ్లిష్ నేర్చుకుంటున్న సెల్‌ఫోన్, సినిమాలకు దూరంగా ఉండేలా సమ్మర్ క్యాంపులు నిర్వహించడం బాగుంది. నేను స్పోకెన్ ఇంగ్లిష్ నేర్చుకుంటున్నాను. దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టాను. ఆటలంటే కూడా ఇష్టం. ఎండలో తిరగకుండా ఆటలు నేర్చుకుంటున్నాం. – జి.చందన, ముస్తాబాద్ నైపుణ్యాలు పెంపొందించేలా క్యాంపులు ఎండాకాలం సెలవుల్లో విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేలా ప్రభుత్వం మొదటిసారిగా క్యాంపులు నిర్వహిస్తోంది. జిల్లాలో 5వేల మందికి అవకాశం ఉంది. ప్రైవేటుకు దీటుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు క్యాంపులు ఉపయోగపడతాయి. ముఖ్యంగా పిల్లలు మొబైల్, టీవీలకు ఆకర్శితులు కాకుండా నివారిస్తాయి. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికితీసే అవకాశం ఉంది. – శైలజ, క్వాలిటీ కోఆర్డినేటర్ -
మానేరు వంతెనకు మరమ్మతులు
● వైబ్రేషన్స్ పెరగడంతో సేఫ్టీ అధికారుల తనిఖీలు ● రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేత?తిమ్మాపూర్: కరీంనగర్– హైదరాబాద్– వరంగల్ ప్రధార రహదారిలో మానేరు వాగుపై నిర్మించిన వంతెన సేఫ్టీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజీవ్ రహదారి విస్తరణలో భాగంగా నూతన వంతెన నిర్మించినప్పటికీ 25 ఏళ్ల క్రితం నిర్మించిన పాత వంతెనపై కొన్ని రోజులుగా వైబ్రేషన్స్ పెరిగాయి. దీనిపై ఫిర్యాదులు అందడంతో ఆర్అండ్బీ, హెచ్‌కేఆర్ నిర్మాణ సంస్థ వెంటనే తనిఖీలు చేపట్టింది. మూడు రోజులుగా సేఫ్టీ అధికారులు వంతెనను పరిశీలిస్తున్నారు. గతంలో ఈ వంతెనకు మరమ్మతులు చేపట్టినప్పటికీ, ఇటీవల వైబ్రేషన్ సమస్యలు గుర్తించడంతో అధికారులు మరోసారి సాంకేతిక నిపుణులతో సమీక్ష చేయిస్తున్నారు. పరిశీలనలో కీలక అంశాలు వంతెనపై వాహనాల రాకపోకల సమయంలో అధి క వైబ్రేషన్లు గమనించడంతో, సాంకేతిక నిపుణుల బృందం వంతెన నిర్మాణ స్థిరత్వాన్ని పరిశీలిస్తోంది. గతంలో చేపట్టిన మరమ్మతులు వంతెనను బలో పేతం చేసినప్పటికీ, ప్రస్తుతం గుర్తించిన సమస్యలు దీర్ఘకాలిక భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. నిపుణులు వంతెనలోని పిల్లర్ల మధ్య ఉన్న బేరింగ్లు, గడ్డర్లు, గ్రౌటింగ్‌లను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఈ భాగాలలో ఏవైనా బలహీనతలు లేదా నిర్మాణ లోపాలు గుర్తిస్తే, సరిచేయడానికి తగిన మరమ్మతు పనులు చేపడుతారు. వంతెన లోడ్ బేరింగ్ సామర్థ్యం, వాహన ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నారు. మరమ్మతు చర్యలు పరిశీలన ఆధారంగా నిపుణులు వంతెనకు అవసరమైన మరమ్మతులను సూచించనున్నారు. బేరింగ్ల బలోపేతం, గ్రౌటింగ్ పనులు, ఇతర నిర్మాణ సర్దుబాట్లు ఈ చర్యలలో భాగంగా ఉండవచ్చు. అధికా రులు వంతెన సురక్షితతను నిర్ధారించడానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి, దీర్ఘకాలిక పరిష్కారాలను అమలు చేయాలని యోచిస్తున్నా రు. ఈ పనులు పూర్తయ్యే వరకు రాకపోకలపై తా త్కాలిక ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ప్రజల భద్రతను ప్రాధాన్యంగా భావిస్తూ, వంతెన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. -
ఇద్దరిని బలిగొన్న అతివేగం
● బైక్‌పై వస్తుండగా ఢీకొన్న కారు ● రెండేళ్ల చిన్నారి, ఆమె పెద్దనాన్న దుర్మరణం ● చిన్నారి మృతితో ఇరు కుటుంబాల్లో విషాదంజగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లాకేంద్రంలోని హనుమాన్వాడ సమీపంలోని పూరెల్లవాడలో ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో రెండేళ్ల చిన్నారి.. ఆమె పెద్దనాన్న అక్కడికక్కడే మృతిచెందారు. పూరెల్లవాడకు చెందిన పాదం మల్లేశం (35), ప్రవళిక దంపతులకు సంతానం లేదు. అతని సోదరుడు పాదం శేఖర్, నవ్య దంపతుల కూతురు వితన్వి (2)ని కన్న కూతురులా చూసుకుంటున్నారు. ఆమెను ఎక్కువగా తమ ఇంటివద్దనే ఉంచుకుంటున్నారు. ఈ క్రమంలో మల్లేశం వితన్విని పొలానికి తీసుకెళ్లాడు. సోమవారం రాత్రి బైక్‌పై ఇంటికి వస్తున్నారు. ఇంటికి సమీపంలోకి రాగానే కండ్లపల్లి వైపు నుంచి జగిత్యాలకు వస్తున్న కారు అతివేగంగా వచ్చి మల్లేశం, వితన్విని ఢీకొంది. ఈ ఘటనలో మల్లేశ్, వితన్వి అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ వేణుగోపాల్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. రెండు కుటుంబాల్లో విషాదం మల్లేశం, వితన్వి మృతితో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అటు మల్లేశ్ భార్య ప్రవళిక, వితన్వి తల్లిదండ్రలు శేఖర్, నవ్య తీవ్రంగా రోదిస్తున్నారు. చిన్నారితో నిత్యం ఆటపాటలతో సంతోషంగా ఉండే శేఖర్, నవ్య తమ కూతురు లేదని తెలుసుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. -
నిర్లక్ష్యం వీడని వైద్యులు
జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్‌లో తరుచూ సంఘటనలు చోటుచేసుకుంటుండడంతో ఆస్పత్రికి వచ్చేందుకు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ఇదే ఆస్పత్రిలో అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఆదివారం మాతాశిశు సంరక్షణ కేంద్రంలో ఓ బాలుడు మృతిచెందిన సంఘటన తెలిసిందే. ముమ్మాటికీ ఇది వైద్యుల నిర్లక్ష్యమేనంటూ ఆస్పత్రి ఎదుట బాబు బంధువులు, కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. ఆర్‌ఎంవోతో పాటు ఎస్సై, ఇతర డాక్టర్లు సదరు వైద్యుడిపై ఫిర్యాదు తీసుకుని విచారణ చేపడుతున్నారు. ఏడాది క్రితం ఓ గర్భిణికి సిజేరియన్ చేసి కడుపులోనే కర్చీఫ్ మర్చిపోయి కుట్లు వేసిన ఘటన ఇంకా కళ్లముందే కదలాడుతోంది. ఆ మహిళ ఆర్నెళ్లపాటు నరకయాతన అనుభవించింది. చెకప్ కోసం మళ్లీ వైద్యుడి వద్దకు రాగా కడుపులో కర్చీఫ్ ఉన్నట్లు గుర్తించి చికిత్స చేశారు. వైద్యుల నిర్లక్ష్యమో.. సిజేరియన్లు వికటించడమోగానీ ఇదే ఆస్పత్రిలో ఐదుగురు బాలింతలు మృతిచెందారు. జగిత్యాలకు చెందిన ఓ గర్భిణి ఆస్పత్రిలో మగ బిడ్డకు జన్మనివ్వగా.. సిజేరియన్ చేసి కుట్లు వేశారు. ఆ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది. కొద్దిరోజుల పాటు వైద్యసేవలు అందినప్పటికీ బాబు చనిపోయిన తాజా ఘటనతో మళ్లీ భయాందోళనకు గురవుతున్నారు. వైద్యులపై ఆరోపణల వెల్లువ మాతాశిశు సంక్షేమ కేంద్రంలో పనిచేస్తున్న కొందరు వైద్యులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యులు కొందరు సొంతంగా ఆస్పత్రులు నిర్వహిస్తుండడంతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన వారిని తమ ఆస్పత్రికి పంపిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు బాబు చనిపోయిన సంఘటన ఉదాహరణగా నిలుస్తోంది. పెగడపల్లి మండలం సుద్దపల్లికి చెందిన రాజు, జ్యోత్న్స దంపతులకు శనివారం మాతాశిశు కేంద్రంలో బాబు పుట్టాడు. అతను ఆరోగ్యం బాగా లేదని, ఫలానా ఆస్పత్రిలో చాలామంచిగా చూస్తారని, అక్కడకు తీసుకెళ్లాలని ఆ దంపతులకు గుర్తుతెలియని వ్యక్తి సలహా ఇచ్చాడు. వాస్తవానికి అది అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ డాక్టర్‌దని సమాచారం. బాబు అప్పటికే బరువు లేకపోవడం, పరిస్థితి సీరియస్‌గా ఉందని తిరిగి మాతాశిశు సంరక్షణ కేంద్రానికే పంపాడు. అప్పటికే బాబు చనిపోవడంతో వైద్యుల నిర్లక్ష్యమేనంటే ఆందోళనకు దిగారు. ఆ దంపతులను బయటి ఆస్పత్రికి వెళ్లమన్నది ఎవరు..? ఏ ఆస్పత్రికి వెళ్లారు..? అనే దానిపై ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. కమీషన్ల కోసమేనా..? జగిత్యాల ఎంసీహెచ్‌లో తరచూ సంఘటనలు వైద్యం అందక తాజాగా బాబు మృతి ప్రభుత్వ వైద్యుల తీరుపై విమర్శలు ఆస్పత్రులు కొత్తగా ఏర్పాటు చేసిన వారు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలతో కుమ్మక్కు అవుతారు. తమ ఆస్పత్రికి రోగులను తీసుకొస్తే కమీషన్లు ఇస్తామంటూ ఎర చూపుతారు. గ్రామీణ ప్రాంతంవారు, అమాయకులు ఆర్ఎంపీ చెప్పిన ఆస్పత్రికే వెళ్తారు. మాతాశిశు సంరక్షణ కేంద్రంలోనూ ఎవరైనా ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేశారా..? గుర్తుతెలియని వ్యక్తులు చెప్పారా..? తేలాల్సి ఉంది. ఫలానా ఆస్పత్రిలో మంచిగా చికిత్స చేస్తారని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే మాతాశిశు సంరక్షణ కేంద్రంలో ప్రసవాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గతంలో 400కు పైగా అయ్యే ప్రసవాలు ప్రస్తుతం 200కు మించి జరగడం లేదని తెలుస్తోంది. పూర్తిస్థాయిలో వైద్యులు ఉన్నప్పటికీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఆరోపణలు వస్తున్నాయి. కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి ఆస్పత్రిపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. విచారణ చేస్తున్నాం బాబు మృతి ఘటనపై పూర్తిస్తాయిలో విచారణ చేపడుతున్నాం. దంపతులను ఇందులో పనిచేస్తున్న వైద్యుడి ఆస్పత్రికి వెళ్లాలని సూచించిన వ్యక్తిని కూడా విచారిస్తున్నాం. పూర్తిస్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటాం. ఎంసీహెచ్‌లో మెరుగైన వైద్యం అందుతుంది. నిర్లక్ష్యం ఎక్కడా లేదు. – సుమన్‌రావు, ఇన్చార్జి సూపరింటెండెంట్ -
వైభవంగా శ్రీనివాస కల్యాణం
కరీంనగర్‌కల్చరల్: కరీంనగర్ మార్కెట్ రోడ్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక మహోత్సవంలో భాగంగా సోమవారం శ్రీదేవి–భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. సహస్త్ర దీపాలంకరణ కన్నుల పండువగా నిర్వహించారు. సాయంత్రం గరుడ వాహనంపై ఆలయ మాడవీధుల్లో శ్రీవారు విహరించారు. సుడాచైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి దర్శించుకున్నారు. ఈవో కందుల సుధాకర్, ధర్మకర్తలు చకిలం గంగాధర్, చకిలం శ్రీనివాస్ పాల్గొన్నారు.కరీంనగర్ వేంకటేశ్వర ఆలయంలో జరిగిన కల్యాణ వేడుకకు హాజరైన భక్తులు -
పోలాండ్‌లో మల్యాల వాసి మృతి
మల్యాల: పొలాండ్ దేశంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్యాలకు చెందిన పొన్నం మ నోజ్ గౌడ్ (29) దుర్మరణం పాలయ్యాడు. ఉపాధి నిమిత్తం పోలాండ్ వెళ్లిన మనోజ్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనుకనుంచి వేగంగా వచ్చిన వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. మనోజ్ ఏడు నెలల క్రితమే స్వగ్రామానికి వచ్చి వెళ్లాడు. చికిత్స పొందుతూ వ్యక్తి..కమాన్‌పూర్(మంథని): మండలంలోని జూలపల్లి గ్రామానికి చెందిన పెరటి రాజిరెడ్డి(67) ఆదివారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతూ మృతిచెందా డు. పోలీసుల వివరాలు.. రాజిరెడ్డి తన ద్విచక్ర వాహనంపై గుండా బాపుతో కలిసి రాఘవపూర్‌కు వెళ్తున్న క్రమంలో కిష్టంపల్లె వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొనంతో తీవ్రగాయాలయ్యాయి. కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. భాగస్వాముల వేధింపులు.. ఒకరి ఆత్మహత్యకరీంనగర్రూరల్: వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడుల్లో తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా తన భాగస్వాములు గురిచేసిన వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి వివరాల ప్రకారం జగి త్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్‌రావుపేటకు చెందిన మోకినపల్లి శ్రీనివాస్ నగరంలోని తీగలగుట్టపల్లిలో అద్దె ఇంట్లో తన కుటుంబంతో ఉంటూ ఆటోకన్సల్టెన్సీ నడుపుతూ జీవిస్తున్నాడు. భూపతి పాపయ్య, రెడ్డి రాజు, నగునూరు గోపి, యాదగిరితో ఇసుకక్వారీ, హైదరాబాద్‌లోని పలు భూముల్లో పెట్టుబడులు పెట్టాడు. వీరు శ్రీనివాస్‌కు రావాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో మా నసికంగా వేదనకు గురయ్యాడు. ఆదివారం రాత్రి తన ఇంట్లోని బెడ్రూంలో ఉరివేసుకొ ని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య అంజలి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. గంజాయి విక్రేతల అరెస్ట్రామగుండం: గంజాయి విక్రేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై వెంకటస్వామి తెలిపిన వివరాలు.. అంతర్గాం పోలీస్‌స్టేషన్ పరిధి బుగ్గ గుట్టల్లో సోమవారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులను అదుపులోకి తీసుకొని సోదా చేయగా 15 కేజీల గంజాయి లభ్యమైంది. కమాన్‌పూర్ మండలం రొంపికుంటకు చెందిన చిందం సాయిప్రసాద్, తౌట శివకుమార్, మహబూబ్బాబ్కు చెందిన జక్క యశ్వంత్, భూ పాల్పల్లికి చెందిన జంగపల్లి కమల్‌ను అదుపులోకి తీసుకోగా, ఒడిశాకు చెందిన అలెక్స్ పరారీలో ఉన్నాడు. రెండు మోటార్ సైకిళ్లు, నాలుగు సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. అగ్నిప్రమాదంలో ధాన్యం, కరెంటు వైర్లు దగ్ధంఓదెల(పెద్దపల్లి): మండలంలోని కొలనూర్ మల్లన్నగుట్ట నుంచి ఓదెల వరకు సోమవారం సాయంత్రం ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. నిప్పురవ్వలు కిందపడటంతో రైతులకు చెందిన కరెంట్ మోటర్లు, వైర్లు, వరిధాన్యం కాలిబూడిదయ్యాయి. సుమారు పదికిలోమీటర్ల వరకు మంటలు ఎగిసిపడటంతో రైతులు ఆందోళన చెందారు. రాత్రి వరకు మంటలు అదుపులోకి రాలేదు. పెద్దపల్లి ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. ముగిసిన చదరంగం పోటీలుకరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్‌లోని జ్యోతినగర్‌లోని జీనియస్ చెస్ అకాడమీలో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓపెన్ చదరంగం పోటీలకు విశేష స్పందన వచ్చింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 100మంది క్రీడాకారులు హాజరయ్యారు. స్విస్ లీగ్ పద్ధతిలో పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచినవారికి ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ రమణ మూర్తి బహుమతులు ప్రదానం చేశారు. జీనియస్ చెస్ అకాడమీ వ్యవస్థాపకుడు కంకటి కనకయ్య మాట్లాడుతూ చదరంగంలో క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు ఈ టోర్నీ నిర్వహించడం జరిగిందన్నారు. న్యూరో ఫిజీషియన్ వెంకట్, జీనియస్ చెస్ అకాడమీ డైరెక్టర్ కంకటి అనూప్ కుమార్, సృజన్ కుమార్, తాటిపల్లి సతీశ్‌బాబు, చీఫ్ ఆర్బిటర్ అరుణ్, ఆర్బిటర్స్ రేవిక్, నితిన్, ప్రభుచంద్ర, వరుణ్, అభిరామ్, శ్రీ నిజ, స్వాతి పాల్గొన్నారు. -
● దైవంగా భావిస్తా..
నర్సింగ్ ఉద్యోగాన్ని దైవంగా భావిస్తున్న. 38 ఏళ్లుగా పని చేస్తున్న. నాకు పోలీస్ కావాలని ఉండేది. నర్సింగ్ చేస్తే బాగుంటుందని మా బాబయ్ సలహా మేరకు జనరల్ నర్సింగ్ చదివాను. 1987లో ఉద్యోగం వచ్చింది. నా చేతిలో చాలా మంది డెలివరీ అయ్యారు. రిస్క్ కేసులను చేశాం. చాలా మంది గుర్తు చేస్తూ పలకరిస్తారు. చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది. – మర్దలీన, నర్సింగ్ సూపరింటెండెంట్, గోదావరిఖని ● తల్లిదండ్రుల ప్రోత్సాహంతో.. మాది జనగామ జిల్లా నర్మెట్ట మండలం. నాన్న ఆగయ్య, అమ్మ దేవమ్మ నన్ను నర్సింగ్ కోర్స్ చేసేందుకు బాగా ప్రోత్సహించారు. జంపింగ్, రన్నింగ్ తదితర క్రీడల్లో ముందుండే దాన్ని. ఫస్ట్ పీఈటీ అవుదామనుకున్న. కానీ నర్సింగ్ ద్వారా ప్రజలకు సేవలు అందించవచ్చని హెల్త్ డిపార్ట్మెంట్ వైపు వచ్చాను. ఎంజీఎంలో జనరల్ నర్సింగ్ పూర్తి చేశా. 35 ఏళ్ల నా సర్వీస్‌లో అనేక మంది పేషెంట్లకు చికిత్స చేసి చాలా సంతృప్తి పొందాను. నన్ను స్ఫూర్తిగా తీసుకొని నా కొడుకు కృపాకర్ డాక్టర్ అయ్యాడు. పీడియాట్రిషన్ పీజీ సెకండియర్ చదువుతున్నాడు. నా కూతురు కీర్తన బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఎమ్మెస్సీ నర్సింగ్ కోసం ప్రిపేర్ అవుతోంది. యువత హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ అవకాశాలను సద్విని యోగం చేసుకొని ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావాలి. – వి.సౌందర్య, నర్సింగ్ సూపరింటెండెంట్, గోదావరిఖని జీజీహెచ్ -
ఈఏపీసెట్‌లో మనోళ్ల సత్తా
జమ్మికుంట/కథలాపూర్/రాయికల్/కోరుట్ల/శంకరపట్నం/హుజూరాబాద్/సిరిసిల్ల/ఇల్లంతకుంట: ఈఏపీసెట్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఔరా అనిపించారు. జమ్మికుంట పట్టణానికి చెందిన అయిత రాజ్‌కుమార్, స్వప్న దంపతుల కుమారుడు ఆర్యన్ 522వ ర్యాంకకు సాధించాడు. కథలాపూర్ మండలంలోని బొమ్మెన గ్రామానికి చెందిన కొమ్ముల శ్రీహర్షిత ఇంజనీరింగ్ విభాగంలో 779ర్యాంకు సాధించింది. తల్లిదండ్రులు కొమ్ముల రాజేందర్– మంజుల వ్యవసాయం చేస్తుంటారు. రాయికల్‌లోని ప్రభుత్వ టీచర్లు దాసరి కృష్ణహరి–లక్ష్మి కూతురు దాసరి వేద సంహిత ఇంజినీరింగ్ విభాగంలో 546వ ర్యాంకు సాధించింది. ఎలిగేటి రాజు కిషోర్– లావణ్య కూతురు మధుమిత అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో 344 ర్యాంకు సాధించింది. కోరుట్లకు చెందిన సాయిస్థ నూరెన్ రాష్ట్రస్థాయిలో 2,825 ర్యాంకు, సత్తి సీతారెడ్డి ఇంజినీరింగ్ విభాగంలో 6,910ర్యాంకు సాధించారు. శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన గంప ప్రజ్ఞాని 869 ర్యాంకు సాధించింది. హుజూరాబాద్‌కు చెందిన మహ్మద్ రిఫాహ్ ఉర్ రెహమాన్ 309ర్యాంకు, మంచికట్ల సాయి వివేకానంద 777ర్యాంకు సాధించారు. సిరిసిల్లలోని విద్యానగర్‌కు చెందిన ఎనగందుల రిషివర్ధన్ 274వ ర్యాంకు సాధించాడు. రిషివర్ధన్ తల్లి రాణీ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, తండ్రి రవీందర్ కరీంనగర్ డీపీవోగా పనిచేసి, ప్రస్తుతం సిద్దిపేట డీఆర్డీఏలో పనిచేస్తున్నారు.ఇల్లంతకుంట మండలం రేపాకకు చెందిన రోండ్ల దత్తాశ్రీరెడ్డి 760వ ర్యాంకు సాధించాడు. తండ్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా తల్లి స్వప్న గృహిణి. ముస్కాన్‌పేటకు చెందిన గుర్రం సిద్ధార్థరెడ్డి 1,025వ ర్యాంక్ సాధించాడు. తండ్రి సందీప్‌రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తల్లి రమాదేవి గృహిణి. -
● నర్సింగ్ వృత్తి పవిత్రమైంది
మాది మంచిర్యాల జిల్లా మందమర్రి. నర్సింగ్ కోర్స్ చదివితే భవి ష్యత్తు బాగుంటుందని మా మామయ్య, అత్తమ్మ ప్రోత్సహించారు. రామగుండం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో నాకు సీటు వచ్చింది. కాలేజీ హాస్టల్లో ఉంటూ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. జీజీహెచ్ ఆస్పత్రిలో మాకు ఇచ్చిన క్లినికల్ స్టడీలో చాలా విషయాలు తెలుసుకున్న. నర్సింగ్ వృత్తి చాలా పవిత్రమైందని అర్థమైంది. కాలేజీ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఫ్యాకల్టీలు చాలా బాగా క్లాసులు చెబుతున్నారు. – మార్త, నర్సింగ్ స్టూడెంట్, గోదావరిఖని ● సేవలోనే నిజమైన సంతృప్తి గర్భిణులకు సేవలందించడం నిజ మైన సంతృప్తి. సాధారణ డెలివరీలు లక్ష్యాన్ని మించి పెంచేందు కు ప్రత్యేక సేవలందించడం గ ర్వంగా ఉంది. సాధారణ డెలి వరీ జరిగి తల్లీబిడ్డలు ఇంటికి వె ళ్తుండగా వారు ఆనందంగా చెప్పే మాటలు వింటుంటే ఇంతకంటే ఈ జీవితానికి ఏం కావాలి అనిపిస్తుంది. – ఎన్.సునీత, మిడ్వైఫరీ, మాతాశిశు కరీంనగర్ ● అదృష్టంగా భావిస్తున్నా రోగులకు సేవ చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. ఏ సంబంధం లేకున్నా ఆస్పత్రికి వచ్చినవారిని ఆప్యాయంగా పలకరించి వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తెలయజేయడం మా విధి. కొన్ని సందర్భాల్లో రోగి కుటుంబసభ్యులు కూడా పట్టించుకోరు. అలాంటి సమయంలో మమ్మల్ని దేవతలుగా చూస్తారు. – పి.విజయలక్ష్మి, గ్రేడ్–1 నర్సింగ్ సూపరింటెండెంట్, కరీంనగర్ -
ఏజేఆర్ ఆటోమోటివ్స్ షోరూం ప్రారంభం
కరీంనగర్: నగరంలోని విట్స్ కళాశాల ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన బుల్ కన్స్ట్రక్షన్స్ ఎక్విపెమెంట్ ఏజెఆర్ ఆటోమోటివ్స్ షోరూంను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, బుల్ మిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సౌత్ జోన్ హెడ్ వి.సోమసుందరం, స్టేట్హెడ్ ఎన్.సురేశ్ బాబు, షోరూం డీలర్ అంబటి జోజిరెడ్డి ఆదివారం ప్రారంభించారు. బుల్ కంపెనీకి సంబంధించి ఒక స్టాండర్డ్ పోర్ట్, స్టాండర్డ్ క్వాలిటీ, మంచి పర్ఫార్మెన్స్ ఉంటుందన్నారు. బుల్ కన్స్ట్రక్షన్స్ ఎక్విప్మెంట్ ద్వారా గంటకు లీటర్ డీజిల్ ఆదా చేయడం జరుగుతుందన్నారు. సర్వీస్ విషయంలోనూ 100శాతం క్వాలిటీ అందిస్తామని తెలిపారు. కాంట్రాక్టర్ జగ్గారెడ్డి, ఫాదర్ సంతోష్ పాల్గొన్నారు.