
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
● రాష్ట్ర ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ జగదీశ్వర్
కరీంనగర్ అర్బన్: తెలంగాణలో ఉన్న ఉద్యోగుల పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదని, ఒకటి, రెండు డీఏల పెండింగ్ తప్పా ఐదు డీఏల పెండింగ్ ఎక్కడ లేదని రాష్ట్ర ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. ఉద్యోగులంతా అసంతప్తితో ఉన్నారని, సీఎం తమ సమస్యలను పరిష్కరిస్తారన్న నమ్మకం ఉందని అన్నారు. శనివారం స్థానిక టీఎన్జీవో భవన్‌లో ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి మా ట్లాడారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ గ్రాడ్యుటీ, పెన్షన్ బెనిఫిట్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దుపై ప్రభుత్వ జాప్యంపై అసహనం వ్య క్తం చేశారు. ఏసీబీ కేసులను త్వరగా తేల్చాలని, తిరిగి విధుల్లోకి తీసుకోవడంలో జాప్యం తగదని అన్నారు. హెల్త్ కార్డులకు సంబంధించిన విషయాలపై 204 సంఘాలతో ఏర్పడిన జేఏసీ నాయకులతో ప్రభుత్వానికి పలుసార్లు నివేదిక ఇవ్వడం జరిగిందని, సీఎం ఐఏఎస్‌లతో త్రీమేన్ కమిటీ నివేదిక కోరడం జరిగిందని వివరించారు. రాబోయే 15 రోజుల్లో కమిటీ ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కాళిచరణ్, కేంద్ర సంఘం నేతలు నాగుల నరసింహస్వామి, గూడ ప్రభాకర్ రెడ్డి, సర్దార్ హర్మిందర్ సింగ్, జిల్లా కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు ఒంటెల రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.