
విద్యుత్‌షాక్‌తో వివాహిత మృతి
బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండలం నీలోజిపల్లికి చెందిన వివాహిత ఎర్ర శోభ (48) విద్యుత్‌షాక్‌తో గురువారం మృతిచెందింది. ఏఎస్సై మోతీరామ్ తెలిపిన వివరాలు. శోభ స్నానం చేయడానికి ఇంటి దగ్గర ఉన్న స్నానపు గదికి వెళ్లింది. ఆ గదికి ఉన్న ఇనుప డోర్ మీదుగా తాత్కాలిక విద్యుత్ వైరుతో లైట్ ఏర్పాటు చేసుకున్నారు. ఇనుపడోర్‌కు విద్యుత్ వైరు తేలి తగిలి ఉంది. దీంతో స్నానానికి వెళ్లి డోర్ వేసుకున్న శోభకు విద్యుత్ షాక్ తగిలి మృతిచెందింది. మృతురాలి భర్త ఎర్ర రాజిరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై పేర్కొన్నారు. సంఘటన స్థలాన్ని సెస్ ఏఏఈ ప్రశాంత్ పరిశీలించారు. శోభ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరామర్శించారు. కుటుంబీకులకు రూ.15వేలు ఆర్థికసాయం అందించారు. కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేశ్‌యాదవ్, భీంరెడ్డి మహేశ్‌రెడ్డి, నాగుల వంశీ తదితరులు ఉన్నారు.
కారు, బైక్ ఢీ..
ఒకరి మృతి
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం రంగాపూర్ సమీపంలో కారు, బైక్ ఎదురెదుగా ఢీకొన్న ప్రమాదంలో రాఘవాపూర్‌కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ ఏనుగుల జగన్ (25) మృతిచెందాడు. పోలీసుల వివరాలు.. జగన్ లొంకకేసారం గ్రామంలోని తమ బంధువుల ఇంటికి బైక్‌పై బుధవారం రాత్రి వెళ్తుండగా, పెద్దపల్లి వైపు వస్తున్న కారు ఢీ కొట్టింది. వెంటనే స్థానికులు జగన్‌ను పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి కుటుంబీకులను మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పరామర్శించారు. జగన్‌కు భార్య నిఖిత, రెండున్నరేళ్లతో పాటు, మూడునెలల వయస్సుగల కూతుళ్లు ఉన్నారు. మృతుడి తండ్రి కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు బసంత్‌నగర్ ఎస్సై స్వామి తెలిపారు.
గంజాయి పట్టివేత
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని విద్యానగర్ బైపాస్‌రోడ్‌లో ఇస్లాంపురకు చెందిన ఎండీ.నబీద్ నుంచి 69 గ్రాముల గంజాయిని పట్టుకున్నట్లు పట్టణ సీఐ వేణుగోపాల్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఎస్సై వాహనాల తనిఖీలు చేస్తుండగా నబీద్ అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని తనిఖీలు చేయగా గంజాయి లభ్యమైంది. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపారు.

విద్యుత్‌షాక్‌తో వివాహిత మృతి