
మ్యాన్‌హోల్‌లో పడిన వృద్ధుడు
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని బైపాస్‌రోడ్‌లో నా యీబ్రాహ్మణ సంఘం భవనం ముందుగల మ్యాన్‌హోల్‌లో ఓ వృద్ధుడు పడిపోయాడు. పట్టణానికి చెందిన ముకుందరెడ్డి తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా వరదనీరు ఎక్కువ రావడంతో మ్యాన్‌హోల్‌లో పడిపోయాడు. విషయం తెలుసుకున్న అ గ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని వృద్ధుడిని, ద్విచక్ర వాహనాన్ని గంటపాటు శ్రమించి బయటకు తీశారు. వృద్ధుడికి స్వల్ప గాయాలు కావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సకాలంలో స్పందించడంతో వృద్ధుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
రక్షించిన అగ్నిమాపక శాఖ సిబ్బంది

మ్యాన్‌హోల్‌లో పడిన వృద్ధుడు