పార్టీకోసం ఐక్యంగా పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

పార్టీకోసం ఐక్యంగా పనిచేయాలి

May 23 2025 2:25 AM | Updated on May 23 2025 2:25 AM

పార్ట

పార్టీకోసం ఐక్యంగా పనిచేయాలి

చిగురుమామిడి: చిగురుమామిడి మండలంలో కాంగ్రెస్‌పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు కృషి చేయాలని, గ్రామస్థాయిలో పార్టీలోకి కొత్త రక్తాన్ని తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభా కర్‌ సూచించారు. చిగురుమామిడిలో గురువారం కాంగ్రెస్‌పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. మిగిలిన పార్టీల కన్నా అత్యధిక సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు కై వసం చేసుకోవాలన్నారు. గ్రామశాఖ అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్నారు. హుస్నాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్‌, డీసీసీ ప్రధానకార్యదర్శి చిటుమల్ల రవీందర్‌, పీసీసీ పరిశీలకుడు రఘునాథరెడ్డి, నమిలా శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

నార్మల్‌ డెలివరీలు చేయాలి

కరీంనగర్‌టౌన్‌: మొదటి కాన్పులో సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రా ల వైద్యులు, సిబ్బంది ప్రోత్సహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ పేర్కొన్నారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో గురువారం ఎంఎల్‌హెచ్‌పీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సూపర్‌వైజర్స్‌ స్టాఫ్‌తో సమీక్ష నిర్వహించారు. మొదటి కాన్పు సాధారణం కావడం వల్ల రెండోకాన్పుకు కూడా సాధారణ డెలివరీకి అవకాశం ఉంటుందన్నారు. వర్షాకాలం ప్రారంభం కానున్న దృష్ట్యా దోమలతో సంభవించే వ్యాధుల నివారణకు ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలన్నారు. ఈనెల 21 నుంచి 28వ తేదీ వరకు రెండో విడత ఇమ్యునైజేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ జరుగుతున్నందున టీకాలు పడని పిల్లలకు తప్పక ఇప్పించాలన్నారు. డీఐవో సాజిదా, సన జవేరియా, డీఎంవో శైలేంద్ర, డెమో రాజగోపాల్‌, డీపీఎం స్వామి పాల్గొన్నారు.

కాళేశ్వరంలో ఆర్టీసీ వైద్య సేవలు

కరీంనగర్‌: కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రయాణ ప్రాంగణంలో కరీంనగర్‌ జోనల్‌ హాస్పిటల్‌ సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఏవీ.గిరిసింహారావు ఆధ్వర్యంలో గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్టీసీ సిబ్బందికే కాకుండా ప్రయాణికులకు సైతం వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. ఎండ, వర్షాలతో వాతావరణంలో వ్యత్యాసంతో గ్యాస్ట్రో ఎంటిరైటిస్‌ వైరల్‌ ఇన్ఫెక్షన్లు, అలెర్జీ సోకే ప్రమాదముందని తెలిపారు. శుభ్రమైన ఆహారం, నీరు తీసుకోవాలని, మాస్కులు ధరించాలని, బీపీ, షుగర్‌, గుండె వ్యాధిగ్రస్తులు మందులు వెంట ఉంచుకోవాలన్నారు. ఈనెల 26వరకు వైద్య శిబిరం కొనసాగుతుందని తెలిపారు.

అడిషనల్‌ ఎస్పీల బదిలీ

కరీంనగర్‌క్రైం: ఉమ్మడి జిల్లాలో పలువురు అడిషనల్‌ ఎస్పీలు బదిలీ అయ్యారు. కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌లో కొనసాగుతున్న జి.నరేందర్‌ భద్రాద్రి కొత్తగూడెంకు ఆపరేషన్స్‌ అడిషనల్‌ ఎస్పీగా బదిలీ అయ్యారు. వెయిటింగ్‌లో ఉన్న ప్రతాపగిరి వెంకటరమణ కరీంనగర్‌ అదనపు డీసీపీ(అడ్మిన్‌)గా నియామకం అయ్యారు.

హెచ్‌టీ సర్వీసుల మంజూరుకు సింగిల్‌ విండో వ్యవస్థ

కొత్తపల్లి(కరీంనగర్‌): 11కేవీ, 33కేవీ, ఆపై ఓల్టేజీ హెచ్‌టీ సర్వీసుల మంజూరు వేగవంతం చేయడానికి సింగిల్‌ విండో వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు టీజీఎన్‌పీడీసీఎల్‌ కరీంనగర్‌ సర్కిల్‌ ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. సర్వీసుల మంజూరును మరింత సరళీకృతం చేయడానికి సర్కిల్‌ ఆఫీస్‌, కార్పొరేట్‌ ఆఫీస్‌లో హెచ్‌టీ మానిటర్‌ సెల్‌ను ఏర్పాటు చేసామన్నారు. 11 కేవీ ఓల్టేజీ దరఖాస్తులు సర్కిల్‌ ఆఫీస్‌ ఏడీఈ(కమర్షియల్‌)మానిటర్‌ చేస్తారని, 33 కేవీ ఓల్టేజీ, ఆపై దరఖాస్తులను కార్పొరేట్‌ ఆఫీసు ఏడీఈ(కమర్షియల్‌)మానిటర్‌ చేస్తారని వెల్లడించారు. ప్రతిరోజూ ఏడీఈలు దరఖాస్తులను డాష్‌బోర్డులో మానిటర్‌ చేస్తారన్నారు. దరఖాస్తులు సంబంధిత అధికారులకు ఎస్టిమేట్‌కకు పంపిస్తారని, అనంతరం ఫీల్డ్‌ విజిట్‌ చేసి అభ్యంతరాలు లేకుంటే మంజూరు చేయడం జరుగుతుందన్నారు.

పార్టీకోసం ఐక్యంగా పనిచేయాలి
1
1/1

పార్టీకోసం ఐక్యంగా పనిచేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement