
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి
● రాష్ట్ర పరిశీలకుడు నర్సింహారావు
కొత్తపల్లి(కరీంనగర్): ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య బోధిస్తూ విద్యార్థుల సంఖ్యను పెంచాలని రాష్ట్ర పరిశీలకుడు డా.నర్సింహారావు సూచించారు. కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్‌లో భౌతికశాస్త్రం ఉపాధ్యాయులకు గురువారం నిర్వహించిన శిక్షణ శిబిరాన్ని సందర్శించిన ఆయన మాట్లాడారు. అత్యాధునిక సాంకేతికతను జోడించి విద్యాబోధన చేయాలనే ఆలోచనలతో రాష్ట్రమంతటా ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమమైన విద్యాబోధన చేసి, విద్యార్థుల సంఖ్య మెరుగుపరచాలని కోరారు. జిల్లా రిసోర్స్ పర్సన్లు దామోదర్, భుజన్ చందర్, రామ్ కిరణ్, తిరుపతి, లింగయ్య పాల్గొన్నారు.