
ఒకరికొకరు అర్థం చేసుకోవాలి
తమ కూతురుకు పెళ్లి చేస్తే పరిస్థితి ఎలా ఉండాలో అమ్మాయి తల్లిదండ్రులు ముందే ఒక ఆలోచనకు వస్తున్నారు. పెళ్లి అనేది ఇద్దరి జీవితాలను నిర్ణయించేది. అమ్మాయికి అర్థం చేసుకునే గుణం, అబ్బాయికి ఓపిక అనేది ఉన్నాయో లేవో గమనించి వివాహం చేస్తే ఆ బంధం నిలబడుతుంది. తల్లిదండ్రులు ఆ దిశగా ఆలోచన చేస్తే బాగుంటుంది.
– డాక్టర్ ప్రవీణ్‌కుమార్,
హుజూరాబాద్
ఆలోచనల్లో మార్పు రావాలి
అమ్మాయిల తల్లిదండ్రుల ధోరణి ప్రస్తుతం పూర్తిగా మారింది. గత 20 ఏళ్లలో అమ్మాయిల ఆలోచన సైతం మారింది. పెళ్లి చేసుకునే అబ్బాయి ఉద్యోగం, ఆస్తిపాస్తులు, ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే అడుగులు ముందుకు పడుతున్నాయి. అర్థం చేసుకునే గుణం, కష్టపడేతత్వం, తెలివితేటలతో ఎదిగే యువకుడికి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే సుఖపడుతుంది.
– ఆడెపు రవీందర్,
మ్యారేజ్ బ్యూరో, హుజూరాబాద్
మానసిక ఒత్తిడిలో తల్లిదండ్రులు
అబ్బాయికి 30 ఏళ్లు దాటినా పెళ్లి కాకపోవడాన్ని తల్లిదండ్రులు సమాజంలో నామోషీగా భావిస్తున్నారు. అబ్బాయిల్లో నిరుత్సాహం, పెళ్లి పట్ల విరక్తి భావం పెరుగుతోంది. కొందరిలో ఆత్మహత్య ఆలోచనలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటివారికి కౌన్సెలింగ్ ఇప్పించడం చాలా అవసరం. పెళ్లి అన్న దాన్ని పరువుగా భావించడం వల్లే అబ్బాయిలు, వారి తల్లిదండ్రుల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి.– డాక్టర్
ఎల్.వర్షి, మానసిక నిపుణుడు, హుజూరాబాద్

ఒకరికొకరు అర్థం చేసుకోవాలి

ఒకరికొకరు అర్థం చేసుకోవాలి