
ఉచిత వైద్య శిబిరం ప్రారంభం
కరీంనగర్: ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆది వారం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. గోదాంగడ్డలోని ముస్లిం స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించారు. కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామంలో శ్రీఅలివేలుమంగ, పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గంగులను ఆలయ కమిటీ బాధ్యులు సన్మానించా రు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, సుంకిశాల సంపత్‌రావు, కర్ర సూర్యశేఖర్, నేతి రవివర్మ, మిడిదొడ్డి నవీన్ పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పు తిరుపతి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
విజయవంతం చేయాలి
కరీంనగర్‌టౌన్: ఈనెల 19న నిర్వహించే తిరంగాయాత్ర, 22న హిందూ ఏక్తాయాత్రను విజయవంతం చేయాలని ఏక్తాయాత్ర పశ్చిమ జోన్ ఇన్‌చార్జి వాసాల రమేశ్ పిలుపునిచ్చారు. ఆదివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ, సోమవారం పార్టీలకతీతంగా జరిగే తిరంగార్యాలీ, 22న హిందూ ఏక్తాయాత్రలో ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొనేలా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించాలన్నారు. ఇటీవల పహల్గాంలో హిందువులనే ఉగ్రవాదులు దారుణంగా చంపడం వెనుక ముష్కరులు, పాకిస్తాన్ హస్తం ఉందని, హిందువులంతా ఏక్తాయాత్రలో పాల్గొని మన బలం చూపించాలని కోరారు. సమావేశంలో నాయకులు నరహరి లక్ష్మారెడ్డి, ఎన్నం ప్రకాష్, బండ రమణారెడ్డి, ధర్మారం వెంకటస్వామి, రెడ్డి శ్రీనివాస్, సుధాకర్‌పటేల్, మామిడి రమేశ్, ఉప్పరపల్లి శ్రీనివాస్, శానగొండ శ్రీనివాస్, పొన్నాల రాము, గంట్ల నరసింహారెడ్డి, పర్వతం మల్లేశం, యువ రమేశ్, శీతల రమేశ్, పుప్పాల ఆంజనేయులు, విష్ణువర్ధన్‌రావు, నరేశ్, రవి గోపాల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
క్యాండిల్ లైట్ ర్యాలీ
కరీంనగర్‌టౌన్: అంతర్జాతీయ ఎయిడ్స్ మెమోరియల్ క్యాండిల్ లైట్ డే సందర్భంగా ఆది వారం సాయంత్రం వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, డిస్టిక్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సిబ్బంది క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహంచారు. ర్యాలీని జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధ జెండా ఊపి ప్రారంభించారు. సుధ మాట్లాడుతూ... ఎయిడ్స్‌తో కోల్పోయిన వ్యక్తులను స్మరించుకోవడానికి, హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారికి సంఘీభావం చూపడానికి క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించామని అన్నారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
కరీంనగర్‌టౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని బీజేపీ విశ్రాంత ఉపాధ్యాయ, ఉద్యోగ జిల్లా సెల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆదివారం నగరంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర సెల్ కో చైర్మన్ నరహరి లక్ష్మారెడ్డి మాట్లాడారు. గత ప్రభుత్వం వలే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడా పీఆర్సీ ప్రకటించకుండా, డీఎలు ఇవ్వకుండా, రిటైర్డ్ అయినవారికి పెన్షన్, ఉద్యోగ సమయంలో దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు చెల్లించకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం పదేపదే ఆర్థిక పరిస్థితి బాగాలేదని న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం బేషజాలకు పోకుండా వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స మావేశంలో జిల్లా సెల్ నాయకులు గంట్ల నరసింహారెడ్డి, కర్ర ప్రభాకర్‌రెడ్డి, గోలి సత్యనా రాయణరెడ్డి, పింగిలి ప్రతాపరెడ్డి, అబ్బిడి మా ధవరెడ్డి, ఈరెడ్డి తిరుమలరెడ్డి పాల్గొన్నారు.

ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

ఉచిత వైద్య శిబిరం ప్రారంభం