
70 కేంద్రాల్లో వందశాతం పూర్తి
● 2.39లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు ● వీసీలో కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ అర్బన్: జిల్లాలో 328 కొనుగోలు కేంద్రాల ద్వారా 2 లక్షల 39వేల 996 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే కొనుగోలు చేశామని కలెక్టర్ పమేలా సత్పతి వెల్లడించారు. శుక్రవారం వీసీలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివరించారు. 29,630 మంది రైతులకు రూ.445.23 కోట్లు జమ చేశామని వివరించారు. 80 శాతం మంది రైతులకు చెల్లింపులు పూర్తయ్యాయని అన్నారు. 70 కొనుగోలు కేంద్రాల్లో 100శాతం సేకరణ పూర్తయ్యిందన్నారు. రోజుకు సుమారుగా 8,300 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొంటున్నామని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, పౌర సరఫరాల సంస్థ డీఎం రజనీకాంత్, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా సహకార అధికారి రామానుజం ఉన్నారు.