
తాటిచెట్టు పై నుంచి పడి గీతకార్మికుడి మృతి
ముస్తాబాద్ (సిరిసిల్ల): మండలంలోని కొండాపూర్‌లో పెద్దూరి బలరాంగౌడ్(56 ) అనే గీతాకార్మికుడు తాటిచెట్టు పై నుంచి పడి దుర్మరణం చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. ముస్తాబాద్ మండలం కొండాపూర్‌కు చెందిన పెద్దూరి బలరాంగౌడ్ మంగళవారం సాయంత్రం తాటిచెట్టు ఎక్కేందుకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో భార్య పద్మ, ముగ్గురు కొడుకులు గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో ఇంటికి వెళ్లారు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు తాటి వనానికి వెళ్లి గాలించగా ఓ చెట్టు కింద విగతజీవిగా పడి ఉన్నాడు. మోకు జారీ చెట్టుపై నుంచి పడి మృతి చెందినట్లు కార్మికులు తెలిపారు. భార్య పద్మ, కుమారులు శివ, శ్రవణ్, సంజయ్ ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.