
వర్షం జోరు.. భక్తుల హోరు
మల్యాల: కొండగట్టు కాషాయమైంది. దీక్షాపరులతో కిక్కిరిసిపోయింది. రామలక్ష్మణ జానకీ..ౖ జె బోలో హనుమాన్ కీ.. జై శ్రీరాం..జై హనుమాన్.. అంటూ ఉప్పొంగిన భక్తిభావంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అంజన్న సన్నిధికి చేరుకున్నారు. అందమైన కొండను కారుమబ్బులు కమ్మేస్తుంటే.. ఆ సుందర దృశ్యాలను చూస్తూ.. పాదయాత్రన వచ్చిన భక్తులు పరవశించిపోయారు. గురువారం అంజన్న పెద్ద జయంతి కావడంతో బుధవారం అర్ధరాత్రి 12 తర్వాత స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. మాల విరమణ చేసి.. తలనీలాలు సమర్పించి కోనేరులో స్నానాలు చేసి.. ప్రసాదాలు తీసుకుని ఇంటిదారి పడతారు. ఆలయం తరఫున ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.