
ఆర్టీసీలో మర్యాద దినోత్సవం
కరీంనగర్: ఆర్టీసీలో శుక్రవారం మర్యాద దినోత్సవం నిర్వహించారు. కరీంనగర్ బస్టాండులో జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలమన్, రీజినల్ మేనేజర్ బి.రాజు, డిప్యూటీ రీజినల్ మేనేజర్లు ఎస్.భూపతిరెడ్డి, పి.మల్లేశం ప్రయాణికులకు గులాబీపూలు అందజేసి, ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీకి సంబంధించిన వివిధ యాప్‌ల వివరాలు తెలిపే క్యూఆర్ కోడ్ గల చైన్లను అందజేశారు. కరీంనగర్ 1,2 డిపో మేనేజర్లు విజయమాధురి, శ్రీనివాస్, బస్‌స్టేషన్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ జి.సురేశ్ పాల్గొన్నారు. అనంతరం ఈడీ సోలమన్ కరీంనగర్–1 డిపోకు చెందిన టీం–20 సభ్యులతో సమావేశమయయ్యారు. డిపోను లాభా ల బాటలో నడపడానికి దిశానిర్దేశం చేశారు.
కులగణనను సవరించాలి
కరీంనగర్‌టౌన్: జనాభా గణనలో కుల గణన చేపట్టాలనే కేంద్ర నిర్ణయం చారిత్రాత్మకమైనదని, ఇది చట్టబద్ధంగా జరగాలంటే జనగణన చట్టాన్ని తగిన మార్పులతో సవరించాలని తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు. శుక్రవారం కరీంనగర్‌లో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని అనంతరం మాట్లాడారు. కులగణనకు షార్ట్‌కట్ మార్గాలు వద్దని, భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. బీసీలకు చట్టపరమైన గుర్తింపు లేకపోవడంతో గణనలో కులం అనే పదాన్ని చేర్చకపోతే, భవిష్యత్తులో గణన న్యాయబద్ధతకు లోబడి ఉండదన్నారు.
తిరంగా యాత్రను జయప్రదం చేయండి
కరీంనగర్‌టౌన్: ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయినందున వీర జవాన్లకు వందనాలు తెలుపుతూ దేశవ్యాప్తంగా తిరంగా యాత్రలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించిందని, ఈ మేరకు జిల్లాశాఖ ఆధ్వర్యంలో 19వ తేదీన కరీంనగర్‌లోని తెలంగాణచౌక్ నుంచి టవర్ సర్కిల్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపా రు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ పాల్గొంటారని అన్నారు. సాయంత్రం 5గంటలకు యాత్ర ప్రారంభమవుతుందని, బిజెపి శ్రేణులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. బోయినపల్లి ప్రవీణ్‌రావు పాల్గొన్నారు.
లైసెన్స్ ఫీజు చెల్లించాలని బెదిరింపు కాల్స్
చొప్పదండి: పట్టణంలోని వ్యాపార వాణిజ్య సంస్థల యజమానులకు మున్సిపల్ కమిషనర్ కార్పొరేషన్ ఆఫీస్, తెలంగాణ పేరుతో (ట్రూకాలర్ ఐడీ) ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించాలని కోరుతూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తి 08247649631 నంబర్ నుంచి చొప్పదండిలోని షాపు యజమానులకు ఫోన్ చేస్తూ, ఫీజులు చెల్లించాలని కోరుతూ వాట్సప్ ద్వారా క్యూఆర్ కోడ్‌లు పంపిస్తు బెదిరింపులకు పాల్పడుతున్నాడని వాపోతున్నారు. ఈ వ్యవహారం మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు ఈ ఫోన్‌తో తమకు సంబంధం లేదని ప్రకటించారు. మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు మాట్లాడుతూ వాట్సప్ ద్వారా క్యూఆర్ కోడ్ పంపించడం జరుగదని, ఇది ఫేక్ కాల్‌గా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, క్యూర్‌కోడుకు ఎలాంటి డబ్బులు చెల్లించరాదని సూచించారు.
జూలైలో బీసీ బహిరంగ సభ
కరీంనగర్: బీసీ ఉద్యమం ప్రారంభమై 35ఏళ్లు పూర్తయిన సందర్భంగా జూలైలో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధా న కార్యదర్శి కేశిపెద్ది శ్రీధర్‌రాజు పేర్కొన్నారు. ఈ సభకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మె ల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ ఎల్.రమణ హాజరవుతున్నారని తెలిపారు. బీసీల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న బీసీ సంఘాన్ని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.

ఆర్టీసీలో మర్యాద దినోత్సవం

ఆర్టీసీలో మర్యాద దినోత్సవం