
శిశుమందిర్‌లో సీబీఎస్‌ఈ అమలు భేష్
● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్‌టౌన్: కరీంనగర్‌లోని సరస్వతి శిశు మందిర్‌లో ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ విధానాన్ని అమలు చేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం కరీంనగర్‌లోని శిశు మందిర్ పాఠశాలను సందర్శించారు. శిశు మందిర్ నూతన భవన నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ శిశు మందిర్‌లో చదువుకోవడంవల్లే తాను ఈ స్థాయికి చేరుకుని ప్రజలకు సేవ చేస్తున్నానని తెలిపారు. పాఠశాల నూతన భవన నిర్మాణానికి తనవంతుగా సాయం అందిస్తానని అన్నారు. శిశు మందిర్ పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కావా లని కోరారు. మాధవరం కాంతారావు, అజితేష్ (బిల్డర్), ఇంజినీర్ రాఘవకృష్ణ, డాక్టర్ చక్రవర్తుల రమణాచారి, ఎలగందుల సత్యనారాయణ, కోల అన్నారెడ్డి, మేచినేని దేవేందర్‌రావు, పాక సత్యనారాయణ, భూమయ్య పాల్గొన్నారు.