
మానేరు వంతెనకు మరమ్మతులు
● వైబ్రేషన్స్ పెరగడంతో సేఫ్టీ అధికారుల తనిఖీలు ● రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేత?
తిమ్మాపూర్: కరీంనగర్– హైదరాబాద్– వరంగల్ ప్రధార రహదారిలో మానేరు వాగుపై నిర్మించిన వంతెన సేఫ్టీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజీవ్ రహదారి విస్తరణలో భాగంగా నూతన వంతెన నిర్మించినప్పటికీ 25 ఏళ్ల క్రితం నిర్మించిన పాత వంతెనపై కొన్ని రోజులుగా వైబ్రేషన్స్ పెరిగాయి. దీనిపై ఫిర్యాదులు అందడంతో ఆర్‌అండ్‌బీ, హెచ్‌కేఆర్ నిర్మాణ సంస్థ వెంటనే తనిఖీలు చేపట్టింది. మూడు రోజులుగా సేఫ్టీ అధికారులు వంతెనను పరిశీలిస్తున్నారు. గతంలో ఈ వంతెనకు మరమ్మతులు చేపట్టినప్పటికీ, ఇటీవల వైబ్రేషన్ సమస్యలు గుర్తించడంతో అధికారులు మరోసారి సాంకేతిక నిపుణులతో సమీక్ష చేయిస్తున్నారు.
పరిశీలనలో కీలక అంశాలు
వంతెనపై వాహనాల రాకపోకల సమయంలో అధి క వైబ్రేషన్లు గమనించడంతో, సాంకేతిక నిపుణుల బృందం వంతెన నిర్మాణ స్థిరత్వాన్ని పరిశీలిస్తోంది. గతంలో చేపట్టిన మరమ్మతులు వంతెనను బలో పేతం చేసినప్పటికీ, ప్రస్తుతం గుర్తించిన సమస్యలు దీర్ఘకాలిక భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. నిపుణులు వంతెనలోని పిల్లర్ల మధ్య ఉన్న బేరింగ్‌లు, గడ్డర్లు, గ్రౌటింగ్‌లను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఈ భాగాలలో ఏవైనా బలహీనతలు లేదా నిర్మాణ లోపాలు గుర్తిస్తే, సరిచేయడానికి తగిన మరమ్మతు పనులు చేపడుతారు. వంతెన లోడ్ బేరింగ్ సామర్థ్యం, వాహన ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నారు.
మరమ్మతు చర్యలు
పరిశీలన ఆధారంగా నిపుణులు వంతెనకు అవసరమైన మరమ్మతులను సూచించనున్నారు. బేరింగ్‌ల బలోపేతం, గ్రౌటింగ్ పనులు, ఇతర నిర్మాణ సర్దుబాట్లు ఈ చర్యలలో భాగంగా ఉండవచ్చు. అధికా రులు వంతెన సురక్షితతను నిర్ధారించడానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి, దీర్ఘకాలిక పరిష్కారాలను అమలు చేయాలని యోచిస్తున్నా రు. ఈ పనులు పూర్తయ్యే వరకు రాకపోకలపై తా త్కాలిక ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ప్రజల భద్రతను ప్రాధాన్యంగా భావిస్తూ, వంతెన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు.