
రాజన్న హుండీ ఆదాయం రూ.1.65 కోట్లు
హుండీ ఆదాయం లెక్కిస్తున్న ఆలయ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు
వేములవాడ: శ్రీరాజరాజేశ్వరస్వామికి హుండీలలో భక్తులు వేసిన కానుకల ద్వారా రూ.1,65,84,607 నగదు సమకూరింది. దాదాపు 20 రోజుల తర్వాత హుండీలను లెక్కించగా రూ.1.65 కోట్లతోపాటు 204 గ్రాముల బంగారం, 13.200 కిలోల వెండి సమకూరినట్లు ఆలయ ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి తెలిపారు. గుడి ఓపెన్‌స్లాబ్‌లో కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య బుధవారం హుండీని లెక్కించారు. కరీంనగర్ సహాయ కమిషనర్ కార్యాలయ అధికారి సత్యనారాయణ, శ్రీరాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.