
వాటాధనం ఇవ్వడం లేదు
సంఘంలో 400 మంది సభ్యులం ఉన్నాం. సంఘ పరిధిలో 8 చెరువులున్నాయి. ఆ చెరువుల ద్వారా ఉపాధి పొందుతున్నాం. సంఘం ద్వారా కొనుగోలు చేసిన ఆస్తులున్నాయి. చేపలు పట్టి వాటి అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సభ్యులకు పంచాల్సి ఉండగా అధ్యక్షుడు ఇవ్వడం లేదు. 16 నెలల నుంచి ఒకసారి మాత్రమే మొక్కుబడిగా సమావేశం నిర్వహించగా నియంతలా వ్యవహరిస్తున్నాడు. లెక్కలు చెప్పకుండానే చెరువులోని చేపలను కాంట్రాక్టర్‌కు అప్పగించారు. మాకు న్యాయం చేయండి.
– మత్స్యకారులు, ఇందుర్తి, చిగురుమామిడి