
బస్టాండ్ ఔట్‌పోస్ట్ తనిఖీ
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ సీపీ గౌస్ ఆలం శుక్రవారం కరీంనగర్ బస్టాండులోని పోలీస్ ఔట్‌పోస్ట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు ఔట్‌పోస్ట్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం ఔట్‌పోస్ట్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రజల భద్రతకు పెద్దపీట వేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఉంచాలన్నారు.
నలుగురు తహసీల్దార్ల బదిలీ
కరీంనగర్ అర్బన్: అసెంబ్లీ ఎన్నికల క్రమంలో ఇతర జిల్లాలకు బదిలీ అయిన తహసీల్దార్లకు పూర్వ జిల్లాలకు బదిలీ చేస్తూ సీసీఎల్‌ఏ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా నుంచి సీహెచ్.రాజు, ఎన్.రాజేష్, జి.రమేశ్ బాబు, డి.మంజుల హన్మకొండ, జగిత్యాల, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు బదిలీ కాగా నల్ల వెంకట్‌రెడ్డి, కె.సురేఖ, ఏ.రజితను జిల్లాకు బదిలీ చేశారు.