
వేధిస్తున్నాయి
కంటిపాపలే
● న్యాయం కోసం ప్రజావాణిని ఆశ్రయిస్తున్న వృద్ధులు ● నిర్దయగా అధికారులు.. ఫిర్యాదు చేసినవారికే బెదిరింపులు ● ఒక్కరోజే 6.. ఈ ఏడాదిలో 40కి పైగా కేసులు ● అధికారుల ఉదాసీనత.. తప్పని నిరీక్షణ
‘ఈ వృద్ధ దంపతులది మానకొండూరు మండలం అన్నారం. పేరు బాకారపు అయిలయ్య– రాజవ్వ. వీరికి ఇద్దరు కూతుళ్లు స్వప్న, రేఖ. వారిని పెంచి పెద్ద చేసి ఘనంగా వివాహం జరిపించారు. ఉన్న భూమిని కూడా ఇద్దరు కూతుళ్లకు రిజిస్ట్రేషన్ చేశారు. కానీ, మలి వయసులో కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిందిపోయి వేధిస్తున్నారని రోదించారు. కూతుళ్లే సర్వస్వమని భావిస్తే ఇదిగో ఇలా కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని వాపోయారు. కూడు పెట్టకపోగా సూటిపోటి మాటలతో ఎగతాళి చేస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు’.
పెన్షన్‌తో బతుకుతున్న
‘నగరంలోని కొత్తయాస్వాడలో ఉంటున్న. నా భర్త రాఘవరెడ్డి మరణంతో నా బతుకు దుర్భరమైంది. ఒక్కాగానొక్క కూతురు భూమాడి లలిత ఉన్న ఇంటిని స్వాధీనం చేసుకుని బయటకు గెంటేసింది. నాలుగేళ్ల నుంచి ఒంటరిగా బతుకుతున్న. వృద్ధాప్య పింఛన్, రేషన్ బియ్యంతో జీవనం సాగిస్తున్న. నన్ను ఏదైనా అనాథాశ్రమంలో వేసి నాకో దారి చూపండని ఇప్పటికీ నాలుగు సార్లు ప్రజావాణికి వచ్చిన’. – చల్ల వెంకటమ్మ, కొత్తయాస్వాడ, కరీంనగర్

వేధిస్తున్నాయి