
మధుకర్‌ను స్వదేశానికి రప్పించండి
జగిత్యాలక్రైం: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి ఇతరులకు బ్యాంక్ ఖాతా ఇచ్చి ట్రావెల్ బ్యాన్ అయిన మల్లాపూర్ మధుకర్‌ను స్వదేశానికి రప్పించాలని ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం అందించారు. జిల్లాలోని పెగడపెల్లి మండలం ఎల్లాపూర్‌కు చెందిన మల్లారపు మధుకర్ (27) ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. తన బ్యాంక్ ఖాతా ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు లావాదేవీలు జరిపారు. దీంతో అజ్మాన్‌లోని కోర్టు అతనిపై ప్రయాణ నిషేధం (ట్రావెల్ బ్యాన్) విధించింది. విషయం తెలుసుకున్న మధుకర్ తల్లిదండ్రులు మల్లవ్వ, అంజయ్య ఎన్‌ఆర్‌ఐ అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. సీఎంవో ద్వారా సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని ప్రజావాణి ఇన్‌చార్జి, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి వారికి హామీ ఇచ్చారు.