
ఏక్తాయాత్రకు ఏర్పాట్లు పూర్తి
కరీంనగర్‌టౌన్: హనుమాన్ జయంతి రోజున కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నగరంలో చేపడుతున్న హిందూ ఏక్తాయాత్ర ఏర్పాట్లను మంగళవారం వైశ్యభవన్ వద్ద బీజేపీ శ్రేణులతో కలిసి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 22న నిర్వహించే హిందూ ఏక్తాయాత్రకు పార్టీలకతీతంగా, హిందూ బంధువులు తరలిరానున్నారని తెలిపా రు. నగరంలోని వైశ్య భవన్ నుంచి సాయంత్రం నాలుగు గంటలకు యాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. మాజీ మేయర్ సునీల్‌రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమల ఆంజనేయులు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేశ్, నాయకులు కన్నబోయిన ఓదెలు, మాడ వెంకటరెడ్డి, బోయిన్‌పల్లి ప్రవీణ్‌రావు, కన్న కృష్ణ, బండ రమణారెడ్డి, దండు కొమరయ్య, పెద్దపల్లి జితేందర్, వంగల పవన్, సతీశ్, దుర్శెట్టి అనూప్, చొప్పరి జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.