కేజీబీవీ విద్యార్థినులు భేష్
విద్యార్థినుల యోగా ప్రదర్శన
కరీంనగర్: వేసవి శిక్షణ శిబిరాలను సద్విని యోగం చేసుకొని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల విద్యార్థినులు ప్రదర్శించిన ప్రతిభ అభినందనీయమని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నగరంలోని సప్తగిరికాలనీలోని కేజీబీవీలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి మంగళవారం కలెక్టర్ హాజరై మాట్లాడారు. వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఉన్న 14 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల నుంచి సుమారు 100మంది విద్యార్థినులకు ఈనెల ఆరోతేదీ నుండి శిక్షణ ఇచ్చామని అన్నారు. సంగీతం, నృత్య ప్రదర్శన, పెయింటింగ్, కంప్యూటర్ పరిజ్ఞానం స్పోకెన్ ఇంగ్లిష్, యోగా, ఆర్ట్ క్రాప్ట్‌లో శిక్షణ పొందారని తెలిపారు. 15 రోజులపాటు వీరంతా శిక్షణను సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. పదోతరగతి, ఇంటర్‌లో టాపర్లుగా నిలిచిన విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు పాల్గొన్నారు.
● కలెక్టర్ పమేలా సత్పతి
కేజీబీవీ విద్యార్థినులు భేష్


