వానాకాలం లాస్‌ | - | Sakshi
Sakshi News home page

వానాకాలం లాస్‌

Dec 29 2025 8:44 AM | Updated on Dec 29 2025 8:44 AM

వానాక

వానాకాలం లాస్‌

ఆలస్యంగా కురిసిన వర్షాలు

నిండా ముంచిన అకాల వర్షం

2025లో పత్తి రైతులకు నిరాశే

పంటలకు తెగుళ్లు.. అన్నదాతకు దిగులు

సేంద్రియ పద్ధతులు.. చిరుధాన్యాలవైపు యువ రైతుల చూపు

యాసంగి భేష్‌..

కరీంనగర్‌ అర్బన్‌: ఈ ఏడాది అకాల వృష్టి అన్నదాతను నిండా ముంచింది. సకాలంలో కురవాల్సిన వర్షాలు అకాలంతో పాటు వరుసగా విరుచుకుపడటం ఆర్థికంగా కృంగదీసింది. నీట మునిగిన పంటలు.. విరిగిన పడిన చెట్లు సాక్షిగా నిలిస్తే మొత్తంగా 2025 సంవత్సరంలో రైతన్నకు యాసంగి దన్నుగా నిలవగా.. వానాకాలం సాగు కన్నీటిని మిగిల్చింది. యాసంగి సాగుకు రైతులు సిద్ధమవుతుండగా రానున్న సంవత్సరమైనా ఆశలకు జీవం పోస్తుందో చూడాలి. ఇక పత్తి రైతులకు ఏడాదిలో ఒకే పంట కాగా పెట్టిన పెట్టుబడులు రాని దుస్థితి. ఏటా రూ.1400కోట్ల విలువ గల పంట దిగుబడి రావాల్సి ఉండగా కేవలం రూ.700కోట్లకే పరిమితమవడం రైతు ఆర్థిక స్థితిని చాటుతోంది. మార్కెటింగ్‌ విషయంలో ఏ వస్తువైనా తయారీ కంపెనీ ధర నిర్ణయిస్తుండగా సాగులో మాత్రం దళారీ దయపై బతకాల్సిన దారుణ దుస్థితి. సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని వదిలిన యువత సాగురంగాన్నే ఆశ్రయిస్తున్నారు.

అంచనాలు తలకిందులు

జిల్లాలో 70శాతానికి పైగా ప్రజల జీవనాధారం వ్యవసాయమే. పత్తి, వరి ప్రధాన పంటలు కాగా ఏటా పత్తి సాగు తదుపరి ధాన్యం విస్తీర్ణముండేది. భారీవర్షాలతో జలాశయాలు నిండుకుండను తలపించడంతో ధాన్యమే ఎక్కువగా సాగు చేశారు. పత్తి జిల్లాలో 45,605 ఎకరాల్లో సాగు చేయగా ఎకరాన 10 క్వింటాళ్లు లెక్క కట్టిన 4,56,050 క్వింటాళ్ల దిగుబడి రావాలి. చాలా చోట్ల ఎకరాన 15 క్వింటాళ్ల దిగుబడి తీస్తుంటారు. ఈ ఏడాది తెగుళ్లు ముప్పేట దాడి చేయడం, వరుస వర్షాలతో సగానికి తగ్గింది. వ్యవసాయ మార్కెట్లు, జిన్నింగ్‌ మిల్లుల్లో 1.60లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేయగా ప్రైవేట్‌ వ్యాపారులు మరో 40వేల క్వింటాళ్లు కొనుగోలు చేశారని సమాచారం. పత్తితో సరాసరి దిగుబడి వస్తే రైతుల కు రూ.364.84కోట్లు రావాల్సి ఉండగా ఎకరాన 5 క్వింటాళ్లతో రైతుకు వచ్చింది రూ.183కోట్లు.

ధాన్యం మోదం..ఖేదం

గత యాసంగిలో 2.30లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా ఎకరాన 40నుంచి 55 బస్తాల వరకు దిగుబడి పొందారు. వానాకాలంలో వరి సాగుకే అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. 2.70లక్షల ఎకరాల్లో సాగు కాగా దొడ్డురకం 6.75లక్షల టన్నులు వస్తుందని అంచనా వేయగా కొనుగోలు చేసింది 4.60లక్షల టన్నులు మాత్రమే. సన్నరకం 2,50,038 టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేయగా కొనుగోలు చేసింది 68,278 టన్నులు కాగా దాదాపు సగానికి దిగుబడి పడిపోయింది.

వానాకాలం లాస్‌1
1/1

వానాకాలం లాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement