గోవుల గోపన్న అన్వేష్
మానవ శరీర సంపూర్ణ వికాసానికి ఆవు పాలే శ్రేష్టం. ఇదే సిద్ధాంతంతో గోవుల సంతాన ఉత్పత్తినే ఉపాధి మార్గంగా ఎంచుకున్నాడు. గోవులను కొనుగోలు చేసి సంరక్షిస్తున్నాడు. వివిధ ప్రాంతాల్లో ఆవులను సంరక్షిస్తున్న తీరును సాంకేతిక పరిజ్నానం (గూగుల్, యూట్యూబ్)తో తెలుసుకుంటూ అవగాహన పొందాడు. గుజరాత్ రాష్ట్రం నుంచి ఆవులను కొనుగోలు చేయగా ప్రస్తుతం వారే ఇతని వద్ద కొనుగోలు చేయడం విశేషం. కర్నాటక, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చి లేగలను తీసుకెళుతున్నారు. కాగా 40 ఆవులు, 10 లేగదూడలుండగా ఆవు పాలతో పాటు నాణ్యమైన సంతానం తీస్తూ ఏటా రూ.8లక్షల ఆదాయం గడిస్తున్నారు.


