తాగి నడిపితే వాహనాలు సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

తాగి నడిపితే వాహనాలు సీజ్‌

Dec 29 2025 8:44 AM | Updated on Dec 29 2025 8:44 AM

తాగి నడిపితే వాహనాలు సీజ్‌

తాగి నడిపితే వాహనాలు సీజ్‌

తాగి నడిపితే వాహనాలు సీజ్‌ ● 31న 44చోట్ల డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు సాంస్కృతిక కేంద్రంగా కఫిసొ నేటి నుంచి ప్రజావాణి పవర్‌కట్‌ ప్రాంతాలు

● 31న 44చోట్ల డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు

కరీంనగర్‌క్రైం: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డిసెంబర్‌ 31 సాయంత్రం నుంచి జనవరి 1వ తేదీ వేకువజామున వరకు నగరంలోని 44చోట్ల డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపడతామని, మద్యం తాగి పట్టుబడితే వెంటనే వాహనం సీజ్‌ చేస్తామని సీపీ గౌస్‌ ఆలం ఒక ప్రకటనలో హెచ్చరించారు. నూతన సందర్భంగా సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లావ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 31న రాత్రి కరీంనగర్‌ లోయర్‌ మానేరు డ్యామ్‌ కట్ట, తీగల వంతెనపైకి వెళ్లడం నిషేధమని సూచించారు. డీజేల వినియోగంపై పూర్తి నిషేధం ఉందన్నారు.ఽ బహిరంగప్రదేశాల్లో టపాసులు పేల్చొద్దని తెలిపారు. ఉల్లంఘించిన వారిపై సెక్షన్‌ 188 ఐపీసీ ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. నగర శివార్లలోని గెస్ట్‌హౌస్‌లు, ఫాంహౌస్‌లపై ప్రత్యేక నిఘా ఉంచామని. డ్రగ్స్‌ వాడకాన్ని గుర్తించేందుకు నార్కోటీంలు, శిక్షణ పొందిన జాగిలాలు, డ్రగ్‌ డిటెక్ట్‌కిట్లు సిద్ధం చేశామన్నారు. వేడుకల సమయంలో మహిళలను వేధించే ఆకతాయిల ఆట కట్టించేందుకు షీటీం నిరంతరం పర్యవేక్షిస్తాయని, ముఖ్య ప్రాంతాల్లో ఫుట్‌ పెట్రోలింగ్‌, పికెట్స్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

కరీంనగర్‌కల్చరల్‌: కవులు, కళాకారులు, రచయితలు, మేధావుల కలయికతో కఫిసొ సాంస్కృతిక కేంద్రంగా వెలుగొందుతుండం అభినందనీయమని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు అన్నారు. ఆదివారం జరిగిన కరీంనగర్‌ ఫిలిం సొసైటీ సర్వసభ్య సమావేశానికి హాజరై మాట్లాడారు. మరో ఏడాదిలో స్వర్ణో త్సవాలు జరుపుకోబోతున్న కరీంనగర్‌ ఫిలిం సొసైటీ ప్రస్థానం చారిత్రకమైందన్నారు. 2026 ఏడాదికి కరీంనగర్‌ ఫిలిం సొసైటీ నూతన కార్యవర్గానికి జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎనిమిదవసారి పొన్నం రవిచంద్ర, కార్యదర్శిగా లక్ష్మీ గౌతమ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. కోశాధికారిగా చెన్నా అనిల్‌ కుమార్‌, ఉపాధ్యక్షులుగా కోల రామచంద్రారెడ్డి, సయ్యద్‌ ముజఫర్‌, జాయింట్‌ సెక్రటరీలుగా మాడిశెట్టి గోపాల్‌, కొమరవెల్లి వెంకటేశం, కార్యవర్గ సభ్యులుగా అన్నవరం దేవేందర్‌, గాజోజు నా గభూషణం, రాచకొండ చక్రధర్‌రావు, కందుకూరి అంజయ్య ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షురాలిగా కలెక్టర్‌ పమేలా సత్పతి, గౌరవసలహాదారులుగా నారదాసు లక్ష్మణ్‌ రావు, జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌, మహేశ్‌ కొనసాగనున్నారు.

కరీంనగర్‌ అర్బన్‌: ప్రజల సమస్యల పరిష్కా రం కోసం నిర్వహించే ప్రజావాణిని యథావిఽ దిగా కొనసాగుతుందని కలెక్టర్‌ పమేలా సత్పతి తెలిపారు. ఎన్నికల కోడ్‌తో గత కొన్ని రోజులుగా ప్రజావాణిని రద్దు చేసిన విషయం విదితమే. సోమవారం నుంచి ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు, జిల్లా ప్రజలు తమ సమస్యలను వివరించవచ్చని పేర్కొన్నారు.

కొత్తపల్లి: విద్యుత్‌ లైన్ల పనులు చేపడుతున్నందున సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11 కె.వీ.శ్రీరాంనగర్‌ ఫీడర్‌ పరిధిలోని వెంకటేశ్వరకాలనీ, కమాన్‌, విద్యానగర్‌, సాలంపుర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్‌ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement