
హాయ్.. అయాం పూజ అంటూ..
కొత్తపల్లి(కరీంనగర్): ముగ్గురు యువకులు ముఠాగా ఏర్పడ్డా రు. మహిళల పేరిట యువకులతో చాటింగ్ చేస్తూ కోరికలు తీరుస్తామంటూ ఎరవేస్తున్నారు. ఈ ఓ వ్యక్తిని మభ్యపెట్టి దోపిడీకి పాల్పడిన సంఘటన కరీంనగర్ కొత్తపల్లి మండలంలో వెలుగు చూసింది. ఈ ముఠాలోని ఇద్దరు యువకులను శుక్రవారం పోలీ సులు అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. చింతకుంట శాంతినగర్‌కు చెందిన సరళ సందీప్ (19), మల్కాపూర్ లక్ష్మిపూర్‌కు చెందిన పొన్నాల ప్రణయ్ కుమార్(18), ఎండీ రెహాన్ జల్సాలకు అలవాటు పడి, దోపిడీలకు కొత్తరకం పన్నాగం పన్నారు. మహిళల పేరిట కోరిక తీరుస్తామంటూ వాట్సాప్‌లో యువకులకు మెసేజ్ చేస్తారు. ఆకర్షితులైన యువకులను చాటింగ్‌తో మభ్యపెడతారు. సరళ సందీప్ ఈనెల 6న తన ఫోన్ ద్వా రా మంచిర్యాల ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి వాట్సా ప్ లో హాయ్ అయాం పూజ అంటూ మెసేజ్ చేశాడు. దీంతో యు వకుడు చాటింగ్ ప్రారంభించాడు. కోరిక తీరుస్తానంటూ ఆశ చూపడంతో అదినమ్మి ఈనెల 11న కరీంనగర్ వచ్చాడు. పథకం ప్రకారం దోపిడీ చేసేందుకు సిద్ధమైన ముగ్గురు.. కొత్తపల్లికి రప్పించారు. ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై ఆ యువకుడిని వెలిచాలలోని ఒక కంటైనర్ ప్రాంతానికి తీసుకెళ్లారు. అ ప్పటికే అక్కడికి చేరుకున్న రెహాన్‌తో కలిసి చిత్రహింసలకు గురి చేశారు. రూ.50వేలు డిమాండ్ చేశారు. ఇవ్వకుంటే చంపుతామ ని బెదిరించారు. భయపడిన ఆ యువకుడు తన వద్ద ఉన్న రూ.10 వేలు ఇచ్చి, బంధువులు, స్నేహితులతో మరో రూ.12వేలు ఫోన్‌పే ద్వారా ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై సాంబమూర్తి ఆధ్వర్యంలో శుక్రవారం సరళ సందీప్, పొన్నాల ప్రణయ్ కుమార్‌ను అరెస్టు చేశారు.
మహిళల పేరిట చాటింగ్ కోరిక తీరుస్తామంటూ ఎర
తీరా వచ్చాక నిలువు దోపిడీ ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

హాయ్.. అయాం పూజ అంటూ..