
ప్రజావాణి.. సమస్యల ఝరి
కరీంనగర్ అర్బన్: ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజావాణికి అర్జీలు పెరుగుతున్నాయి. వచ్చిన వారే మళ్లీ మళ్లీ వస్తుండగా సాంత్వన అంతంత మాత్రమే. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి అర్జీలొచ్చాయి. కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్ అర్జీలను స్వీకరించగా పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపారు. ప్రధానంగా భూ సమస్యలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు తదితర సమస్యలు వచ్చాయి. మొత్తం 264 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు.
ఒక్కొక్కరిది ఒక్కో సమస్య
పరిష్కరించాలని వేడుకోలు
మొత్తం అర్జీలు: 264
ఎక్కువగా మున్సిపల్ కార్పొరేషన్: 63
కరీంనగర్ రూరల్ తహసీల్దార్: 12
మానకొండూర్ తహసీల్దార్: 11
ఆర్డీవో కరీంనగర్: 09
తహసీల్దార్ తిమ్మాపూర్: 10
తహసీల్దార్ జమ్మికుంట: 09