
ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు పెంచొద్దు
కరీంనగర్: రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఫీజులు పెంచాలని టీజీఎఫ్‌ఆర్సీ ముందు పెట్టిన ప్రతిపాదనలను తిరస్కరించాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం బద్దం ఎల్లారెడ్డిభవన్‌లో మాట్లాడారు. ఒక్కో కళాశాల వారు ప్రస్తుతం ఉన్న ఫీజులో 50శాతం పైగా పెంచాలని ప్రతిపాదించడం దారుణమన్నారు. ఇంజినీరింగ్ విద్యను వ్యాపారమయంగా మార్చారని, యాజమాన్య కోటా సీట్లను రూ.లక్షలకు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. విద్యార్హత లేనివారితో కళాశాలలు నిర్వహిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ఫీజుల దోపిడీని సీఎం నియంత్రించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి మచ్చ రమేశ్, నగర కార్యదర్శి హేమంత్, నాయకులు సందీప్‌రెడ్డి, సాయి, మచ్చ పవన్, వినయ్‌రెడ్డి, శ్రవణ్ పాల్గొన్నారు.