నృసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

నృసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీ

May 21 2025 12:15 AM | Updated on May 21 2025 2:02 PM

ధర్మపురి: శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి గోదావరిలో స్నానాలు చేసి స్వామివార్లను దర్శించుకున్నారు.

ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు? 
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని గంజ్‌ చౌరస్తా సమీపంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. విషయం పోలీసుల వరకు చేరడంతో వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తవ్వకాలు చేపట్టిన ప్రాంతాన్ని పరిశీలించారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన సిరిసిల్లకు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా.. సదరు ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో పూజలు నిర్వహించారని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

వికసించిన మే పుష్పం

యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్‌ 17వ డివిజన్‌ సంతోష్‌నగర్‌ ఏరియాలో నివాసం ఉంటున్న బత్తుల రమేశ్‌ ఇంట్లో మే పుష్పం వికసించింది. ఏటా మే నెలలోనే ఈ పుష్పం వికసిస్తుందని, మంగళవారం వికసించడంతో స్థానికులు వచ్చి చూసి ముచ్చటపడుతున్నారని రమేశ్‌ తెలిపారు.

నృసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీ1
1/2

నృసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీ

వికసించిన మే పుష్పం2
2/2

వికసించిన మే పుష్పం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement