
రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు
కరీంనగర్ అర్బన్: పచ్చిరొట్ట విత్తనాలను 50శాతం రాయితీపై రైతులకు అందిస్తున్నామని, జిల్లాకు 97,200 క్వింటాళ్లు కేటాయించామని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారు. మంగళవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ ప్రాంతీయ మేనేజర్‌తో కలిసి కలెక్టరేట్ ఆడిటోరియంలో వానాకాలానికి కావల్సిన విత్తనాలపై సమీక్షించారు. విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా 97,200 క్వింటాళ్లు పచ్చిరొట్ట విత్తనాలను జిల్లాకు సరఫరా చేయనున్నట్లు వివరించారు. నాణ్యమైన వరి విత్తనాలు 1.20లక్షల క్వింటాళ్లు, కంది 150 క్వింటాళ్లు, పెసర 200 క్వింటాళ్లు, మినుము 400 క్వింటాళ్లు, వేరుశనగ 1775 క్వింటాళ్లు అందిస్తున్నట్లు తెలిపారు. వీటికి రాయితీ లేదని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అందిస్తున్న వివిధ పంటల బ్రీడర్ విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ సేకరించి రైతుల సహకారంతో మూల విత్తనాలుగా ఉత్పత్తి చేసి, నాణ్యమైన విత్తనాలుగా మళ్లీ రైతులకు అందజేస్తోందని తెలిపారు. డీలర్ల దగ్గర విత్తనాలు తీసుకునేటప్పుడు రసీదు ట్యాగ్, లేబుల్ జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని, నకిలీ విత్తనాలపై అవగాహన క ల్పించాలని మండల వ్యవసాయ అధికారులను ఆ దేశించారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ తమ సొంత విక్రయ కేంద్రాల్లో ఆరుశాతం రాయితీతో విత్తనాలను అందిస్తోందని అన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాంతీయ మేనేజర్ వి ష్ణువర్ధన్ రెడ్డి, విత్తన అధికారి మౌనిక పాల్గొన్నారు.
రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి