
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హుజూరాబాద్: పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన శ్రావణ్(34) ప్రైవేటు ఉద్యోగి. తన ద్విచక్ర వాహనం వెళ్తుండగా హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద వెనుక నుంచి టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు మృతుడి జేబులో ఉన్న సెల్‌ఫోన్‌లో ఉన్న నంబర్‌కు ఫోన్ చేసి విషయం తెలియజేయగా మృతుడి పేరు మాత్రమే తెలిసింది. చౌరస్తా వద్ద ప్రమాదం జరగడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మానేరు జలాశయ గుంతలో పడి వ్యక్తి మృతి
కొత్తపల్లి(కరీంనగర్): పద్మనగర్ శివారులోని మానేరు జలాశయంలో ప్రమాదవశాత్తు సెంట్రింగ్ మేసీ్త్ర పడి మృతిచెందినట్లు కొత్తపల్లి పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. కాగజ్‌నగర్‌కు చెందిన భక్తి శివ(35) బతుకుదెరువు కోసం జగిత్యాల పట్టణానికి వచ్చి భార్యతో కలిసి ఉంటూ సెంట్రింగ్ పని చేస్తున్నాడు. ఈనెల 19న సెంట్రింగ్ పని చేసేందుకు పద్మనగర్ వచ్చాడు. పని అయిపోయాక చేపలు పట్టేందుకు మానేరు జలాశయంలోకి వెళ్లగా.. ప్రమాదవశాత్తు అక్కడి గుంతల్లో పడి మునిగిపోయాడు. 20న రాత్రి శివ మృతదేహం తేలగా.. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య పూజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాంబమూర్తి పేర్కొన్నారు.