
హిందూ శక్తిని చాటేలా ఏక్తాయాత్ర
కరీంనగర్‌టౌన్: కరీంనగర్‌లో ఈనెల 22న నిర్వహించే ‘హిందూ ఏక్తా యాత్ర’ తెలంగాణలో ఓ సంచలనం కాబోతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. హిందువుల సంఘటిత శక్తిని చాటేలా, దేశద్రోహుల వెన్నులో వణుకుపుట్టేలా యాత్ర ఉంటుందన్నారు. కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో శుక్రవారం ‘హిందూ ఏక్తా యాత్ర’ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేవారి చెంప చెళ్లుమనేలా హిందూ ఏక్తాయాత్ర నిర్వహిస్తామన్నారు. ఈ యాత్ర ఒక పార్టీకి సంబంధించినది కాదని, హిందూ శక్తిని ప్రదర్శించే యాత్ర అన్నారు. బీజేపీ నాయకులంతా ఇంటింటికీ వెళ్లి ఈనెల 22న కరీంనగర్‌లో నిర్వహించబోయే యాత్రకు తరలిరావాలంటూ ఆహ్వానించాలని కోరారు. లక్ష మందికి తగ్గకుండా ర్యాలీలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కరీంనగర్‌లో ఏ ఒక్క గల్లీ చూసినా కాషాయ జెండాలే కన్పించాలన్నారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ మేయర్ సునీల్ రావు, చెన్నమనేని వికాస్‌రావు, గుగ్గిళ్ల రమేశ్, వి.రమేశ్ ఉన్నారు.
● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్