
భూ భారతి దేశానికే రోల్‌మోడల్
● జూన్ 2నుంచి ప్రతీ రెవెన్యూ గ్రామంలో సదస్సు ● ఆరువేల మంది సర్వేయర్లకు శిక్షణ ● రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హుజూరాబాద్: భూభారతి చట్టం దేశానికి రోల్‌మోడల్‌గా మారనుందని రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సైదాపూర్ మండలం ఘన్‌పూర్ గ్రామంలో మంగళవారం భూ భూరతి చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా మంత్రి పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూభారతి అమల్లో భాగంగా సైదాపూర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామన్నా రు. ఇప్పటివరకు మండలంలో నిర్వహించిన రెవె న్యూ సదస్సుల ద్వారా 1,600 దరఖాస్తులు వచ్చాయని, త్వరలోనే పరిష్కరిస్తారని వివరించారు. 2020లో ధరణి చట్టం తెచ్చినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల 20వేల పైచిలుకు భూ సమస్యలు ఉండేవని తెలిపారు. ఎంతోమంది రైతులు న్యాయస్థానాల చుట్టూ తిరిగి అలిసిపోయారన్నారు. భూభా రతి చట్టం ద్వారా తహసీల్దార్ స్థాయి నుంచి సీసీఎ ల్‌ఐ వరకు పరిష్కారం లభించేలా నిబంధనలు పొందుపరిచామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 6000మంది సర్వేయర్లకు మూ డు నెలల పాటు శిక్షణ ఇస్తున్నామన్నారు. మండలానికి ఆరు నుంచి 8మంది సర్వేయర్లు పనిచేయనున్నారని తెలిపారు. జూన్ 2 నుంచి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారి చొప్పున 10,956 గ్రామాల్లో రెవెన్యూ అధికారులు విధులు నిర్వహించనున్నారని తెలిపారు. ప్రతి పేదవాడికి గూడు ఉండాలన్న ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టామని, మొదటి విడతలో నాలుగున్నర లక్షల ఇండ్లు మంజూరు చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 80వేల ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. పోడు, ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటున్న అర్హులైన వారందరికీ జూన్ 2న పట్టాలు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. చాలా గ్రామాల్లో భూ పంచాయితీలు నడుస్తున్నాయని, భూ సమస్యలు పరిష్కరించాలంటూ వినతులు వస్తున్నాయన్నారు. ప్రతీ భూ యజమానికి భూధార్ కార్డు వస్తుందని తెలిపారు. చిగురుమామిడి– మానకొండూరు కాలువ పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. చొప్పదండి, మానకొండూర్ ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్, హుస్నాబాద్, దాపూర్, కోహెడ మా ర్కెట్ కమిటీ చైర్మన్లు తిరుపతిరెడ్డి, దొంత సుధాకర్, నిర్మలా జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.