
డాన్స్ నేర్చుకుంటున్నాను
వేసవి సెలవులు వచ్చాయంటే టీవీలకు అతుక్కుపోయేవాళ్లం. స్పెషల్ సమ్మర్ క్యాంపులో డాన్స్ నేర్చుకుంటున్నాను. చేతిరాత బాగుండేలా మా సార్ శిక్షణ ఇస్తున్నారు. చెస్ నేర్చుకుంటున్న. ఇంటికెళ్లే ముందు స్నాక్స్ ఇస్తున్నారు. సమ్మర్ క్యాంపు బాగుంది.
– ఎ.తేజస్విని, ముస్తాబాద్
స్పోకెన్ ఇంగ్లిష్ నేర్చుకుంటున్న
సెల్‌ఫోన్, సినిమాలకు దూరంగా ఉండేలా సమ్మర్ క్యాంపులు నిర్వహించడం బాగుంది. నేను స్పోకెన్ ఇంగ్లిష్ నేర్చుకుంటున్నాను. దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టాను. ఆటలంటే కూడా ఇష్టం. ఎండలో తిరగకుండా ఆటలు నేర్చుకుంటున్నాం.
– జి.చందన, ముస్తాబాద్
నైపుణ్యాలు పెంపొందించేలా క్యాంపులు
ఎండాకాలం సెలవుల్లో విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేలా ప్రభుత్వం మొదటిసారిగా క్యాంపులు నిర్వహిస్తోంది. జిల్లాలో 5వేల మందికి అవకాశం ఉంది. ప్రైవేటుకు దీటుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు క్యాంపులు ఉపయోగపడతాయి. ముఖ్యంగా పిల్లలు మొబైల్, టీవీలకు ఆకర్శితులు కాకుండా నివారిస్తాయి. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికితీసే అవకాశం ఉంది.
– శైలజ, క్వాలిటీ కోఆర్డినేటర్

డాన్స్ నేర్చుకుంటున్నాను