
సమష్టి నిర్ణయంతో..
రబీ సీజన్‌లో గ్రామానికి చెందిన రైతులం సమష్టిగా నిర్ణయం తీసుకుని సన్నవడ్లు సాగు చేశాం. నాకున్న రెండు ఎకరాల్లో సన్నవడ్లు సాగు చేశాను. సన్నవడ్ల సాగుతో అధిక దిగుబడులే కాకుండా, బోనస్ రూపంలో వచ్చే డబ్బులు ఈ సీజన్‌లో పెట్టుబడులకు ఎంతో ఉపయోగపడతాయి. గ్రామ రైతులందరం సన్నవడ్లు పండించడంతో జిల్లాలోని అనేక గ్రామాల నుంచి రైతులు వచ్చి సన్నాల సాగు గురించి తెలుసుకుంటున్నారు.
– గనగోని మహేశ్, యువరైతు, సింగారం
అవగాహన కల్పిస్తున్నాం
మండలంలో అనేక గ్రామాల్లో ఈ సీజన్‌లో రైతులు సన్నవడ్లు సాగు చేస్తున్నారు. సన్నవడ్ల సాగుతో వచ్చే అదనపు ఆదాయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఖరీఫ్ సీజన్‌లో రైతులు గతంలో కంటే రెట్టింపు స్థాయిలో సన్నవడ్ల విత్తనాలను కొనుగోలు చేశారు. ప్రభుత్వం ఇచ్చే రూ.500 బోనస్‌పైనే అందరి చూపు ఉంది. సింగారంలో రైతులంతా కలిసి సన్నవడ్లు పండించి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు.
– పసుల శ్రీశైలం, వ్యవసాయ విస్తరణాధికారి, ఎల్లారెడ్డిపేట

సమష్టి నిర్ణయంతో..