
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని సుగ్లాంపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భిక్షాటన చేసేవ్యక్తి(38) మృతి చెందాడు. ఎస్సై శ్రావణ్‌కుమార్ కథనం ప్రకారం.. పెద్దపల్లి నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆటోట్రాలీ.. భిక్షాటన చేసేవ్యక్తిని ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యక్తి గురించి పూర్తివివరాలు తెలియరాలేదు.
ధాన్యం కుప్పను ఢీకొని ఒకరు..
తిమ్మాపూర్: మండలంలోని మల్లాపూర్ శివారులో శనివారం అర్ధరాత్రి 11:30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. కరీంనగర్ మండలం మొగ్ధంపూర్ గ్రామానికి చెందిన నేరెళ్ల రంజిత్(32), సాజిద్ మల్లాపూర్‌లో తెలిసిన వ్యక్తిని కలిసి కరీంనగర్ వైపు బైక్‌పై తిరిగి వెళ్తున్నారు. రోడ్డుపై పోసిన వరికుప్పలకు ఢీకొనడంతో రంజిత్ అక్కడికక్కడే మృతిచెందాడు. సాజిద్‌కు గాయాలయ్యాయి. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు రోడ్డుపై వరి కుప్పలు వేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
చికిత్స పొందుతూ..
పెద్దపల్లిరూరల్: మద్యానికి బానిసైన చిన్నచెవ్వ భాను (23) అనే యువకుడు శుక్రవారం క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. పెద్దపల్లి మండలం రంగంపల్లిలో నివాసముంటున్న భాను అదే ప్రాంతంలో క్రిమిసంహారకమందు తాగాడు. గమనించిన స్థానికులు పెద్దపల్లిలో ప్రాథమిక చికిత్స చేయించి కరీంనగర్‌కు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి తండ్రి చెవ్వ లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై లక్ష్మణ్‌రావు తెలిపారు.
ఒకరిపై కేసు
సారంగాపూర్: బీర్‌పూర్ మండలం తుంగూర్‌లో రోడ్డుపై నిలబడిన మహిళను ద్విచక్రవాహనంతో ఢీకొట్టిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రొబేషన్ ఎస్సై రాజు కథనం ప్రకారం తుంగూర్‌కు చెందిన పుష్పలత రోడ్డుపై నిలబడి ఉంది. బీర్‌పూర్ మండలం మంగేళకు చెందిన ఉదయ్ తన బైక్‌పై వచ్చి పుష్పలతను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి సోదరుడు రవీందర్ ఫిర్యాదు మేరకు ఉదయ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.