
టెక్నాలజీతో మెరుగైన సేవలందించాలి
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లోని పోలీస్ స్టేషన్లలో కొత్తగా ని యమితులైన కానిస్టేబుళ్లకు టెక్నాలజీ వినియోగంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలి పారు. కమిషనరేట్ కేంద్రంలోని ఐటీ కోర్ కార్యాలయంలో పోలీసులు వినియోగించే వివిధ సాఫ్ట్‌వేర్‌లు, అప్లికేషన్‌లు, సాంకేతిక పరిజ్ఞానంపై కొనసాగుతున్న శిక్షణను పురస్కరించుకొని సీపీ మాట్లాడారు. కొత్త కానిస్టేబు ళ్లకు బేసిక్ ట్రైనింగ్‌లో అందించిన శిక్షణతో పాటు, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి టెక్నాలజీపై మరింత పట్టు సాధించేలా శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. నేరాల ఛేదనలో సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుందన్నా రు. ఐటీ కోర్ కార్యాలయ ఇన్‌స్పెక్టర్ జె.సరిలా ల్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మాదక ద్రవ్యాల కట్టడిని బాధ్యతగా స్వీకరించాలి
కరీంనగర్/కొత్తపల్లి: మాదక ద్రవ్యాల కట్టడిని ‘గురు’తర బాధ్యతగా స్వీకరించాలని జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ పి.శ్రీనివాసరావు అన్నారు. బుధవారం కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ–టెక్నో స్కూల్‌లో జరుగుతున్న ఉపాధ్యాయుల శిక్షణలో భాగంగా ఆయన హాజరై మాట్లాడారు. మాదకద్రవ్యాలు మానవ శరీరానికి హాని కలిగిస్తాయని, మెదడు, నాడీవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుందని, జ్ఞాపకశక్తి క్షీణించడంతోపాటు ఏకాగ్రత లోపించడం ద్వారా వ్యక్తుల అభివృద్ధి మందగిస్తుందని పేర్కొన్నారు. అవగాహన లేమితో చాలా మంది విద్యార్థులు మాదకద్రవ్యాలకు బానిస అవుతున్నారని, ఇది అభివృద్ధికి పెద్ద ఆటంకమన్నారు. మాదకద్రవ్యాల వాడకం వల్ల నష్టాల గురించి విద్యార్థులకు స్పష్టంగా వివరిస్తే వాటి వాడకం నుంచి దూరమవుతారని అన్నారు. జి.రాము, ఎస్.అశోక్‌కుమార్, కె.లక్ష్మణ్‌కుమార్, మహమ్మద్ ఇషాక్, కె.అశోక్‌రెడ్డి, డి.ఆనందం పాల్గొన్నారు.
వసతులు బాగున్నాయా?
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ జిల్లా జైలు, సఖి కేంద్రం, శక్తి సదన్‌లను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కటారి రేవతి రావు బుధవారం సందర్శించారు. జైలులో మహిళా ఖైదీలతో మాట్లాడి సౌకర్యాలు, ఆహారం, వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు. అగర్‌బత్తుల ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించారు. సప్తగిరికాలనీలోని సఖి కేంద్రంలోని రికార్డులు చూశారు. బాధితులకు అందించిన న్యాయ, వైద్య, వసతి ఇతర సదుపాయాలపై ఆరాతీశారు. మహిళా కమిషన్ సభ్యురాలు వెంట జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, సఖి కేంద్రం అడ్మిన్ లక్ష్మి, కోఆర్డినేటర్ శ్రీలత తదితరులు ఉన్నారు.
సిటీలో పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: చెట్లకొమ్మల తొలగింపు పనుల కారణంగా గురువారం ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు గోదాంగడ్డ, ఉజ్వలపార్కు ఫీడర్ల పరిధిలోని మహాశక్తి దేవాలయం, బాలాజీ సూపర్ మార్కెట్, సంతోష్‌నగర్, సంతోషిమాత దేవాలయం, భాగ్యనగర్, శ్రీనగర్‌కాలనీ, భవానీకాలనీ, సప్తగిరికాలనీ, అంజనాద్రీ దేవాలయం, ధోబీఘాట్, గోదాం, బీఎస్‌ఎఫ్ క్వార్టర్స్, ఏఓస్ పార్కుకాలనీ, జెడ్పీ క్వార్టర్స్, భగత్‌నగర్, ఎన్‌టీఆర్ విగ్రహం నుంచి ఉజ్వలపార్కు సబ్‌స్టేషన్ వరకు, పాలిటెక్నిక్ కళాశాల, ఐటీఐ కళాశాల, డిమార్ట్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. అదేవిధంగా ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 11 కేవీ హౌసింగ్‌బోర్డు కాలనీ ఫీడర్ పరిధిలోని హౌసింగ్‌బోర్డు కాలనీ, విట్స్ కళాశాల, సుభాష్ బొమ్మ, వరహస్వామి దేవాలయం, మారుతీనగర్ ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–1 ఏడీఈ పి.శ్రీనివాస్‌గౌడ్ వివరించారు. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 11 కేవీ చేగుర్తి ఫీడర్ పరిధిలోని మొగ్దూంపూర్, నారాయణరావుపల్లి, నల్లగుంటపల్లి, చేగుర్తి పరిధిలోని వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు.