
● దైవంగా భావిస్తా..
నర్సింగ్ ఉద్యోగాన్ని దైవంగా భావిస్తున్న. 38 ఏళ్లుగా పని చేస్తున్న. నాకు పోలీస్ కావాలని ఉండేది. నర్సింగ్ చేస్తే బాగుంటుందని మా బాబయ్ సలహా మేరకు జనరల్ నర్సింగ్ చదివాను. 1987లో ఉద్యోగం వచ్చింది. నా చేతిలో చాలా మంది డెలివరీ అయ్యారు. రిస్క్ కేసులను చేశాం. చాలా మంది గుర్తు చేస్తూ పలకరిస్తారు. చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది.
– మర్దలీన, నర్సింగ్ సూపరింటెండెంట్,
గోదావరిఖని
● తల్లిదండ్రుల ప్రోత్సాహంతో..
మాది జనగామ జిల్లా నర్మెట్ట మండలం. నాన్న ఆగయ్య, అమ్మ దేవమ్మ నన్ను నర్సింగ్ కోర్స్ చేసేందుకు బాగా ప్రోత్సహించారు. జంపింగ్, రన్నింగ్ తదితర క్రీడల్లో ముందుండే దాన్ని. ఫస్ట్ పీఈటీ అవుదామనుకున్న. కానీ నర్సింగ్ ద్వారా ప్రజలకు సేవలు అందించవచ్చని హెల్త్ డిపార్ట్‌మెంట్ వైపు వచ్చాను. ఎంజీఎంలో జనరల్ నర్సింగ్ పూర్తి చేశా. 35 ఏళ్ల నా సర్వీస్‌లో అనేక మంది పేషెంట్లకు చికిత్స చేసి చాలా సంతృప్తి పొందాను. నన్ను స్ఫూర్తిగా తీసుకొని నా కొడుకు కృపాకర్ డాక్టర్ అయ్యాడు. పీడియాట్రిషన్ పీజీ సెకండియర్ చదువుతున్నాడు. నా కూతురు కీర్తన బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఎమ్మెస్సీ నర్సింగ్ కోసం ప్రిపేర్ అవుతోంది. యువత హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగ అవకాశాలను సద్విని యోగం చేసుకొని ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావాలి.
– వి.సౌందర్య, నర్సింగ్ సూపరింటెండెంట్, గోదావరిఖని జీజీహెచ్

● దైవంగా భావిస్తా..