
వైభవంగా శ్రీనివాస కల్యాణం
కరీంనగర్‌కల్చరల్: కరీంనగర్ మార్కెట్ రోడ్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక మహోత్సవంలో భాగంగా సోమవారం శ్రీదేవి–భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. సహస్త్ర దీపాలంకరణ కన్నుల పండువగా నిర్వహించారు. సాయంత్రం గరుడ వాహనంపై ఆలయ మాడవీధుల్లో శ్రీవారు విహరించారు. సుడాచైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి దర్శించుకున్నారు. ఈవో కందుల సుధాకర్, ధర్మకర్తలు చకిలం గంగాధర్, చకిలం శ్రీనివాస్ పాల్గొన్నారు.
కరీంనగర్ వేంకటేశ్వర ఆలయంలో జరిగిన కల్యాణ వేడుకకు హాజరైన భక్తులు