పోలాండ్‌లో మల్యాల వాసి మృతి | - | Sakshi
Sakshi News home page

పోలాండ్‌లో మల్యాల వాసి మృతి

May 13 2025 12:14 AM | Updated on May 13 2025 12:14 AM

పోలాం

పోలాండ్‌లో మల్యాల వాసి మృతి

మల్యాల: పొలాండ్‌ దేశంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్యాలకు చెందిన పొన్నం మ నోజ్‌ గౌడ్‌ (29) దుర్మరణం పాలయ్యాడు. ఉపాధి నిమిత్తం పోలాండ్‌ వెళ్లిన మనోజ్‌ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనుకనుంచి వేగంగా వచ్చిన వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. మనోజ్‌ ఏడు నెలల క్రితమే స్వగ్రామానికి వచ్చి వెళ్లాడు.

చికిత్స పొందుతూ వ్యక్తి..

కమాన్‌పూర్‌(మంథని): మండలంలోని జూలపల్లి గ్రామానికి చెందిన పెరటి రాజిరెడ్డి(67) ఆదివారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతూ మృతిచెందా డు. పోలీసుల వివరాలు.. రాజిరెడ్డి తన ద్విచక్ర వాహనంపై గుండా బాపుతో కలిసి రాఘవపూర్‌కు వెళ్తున్న క్రమంలో కిష్టంపల్లె వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొనంతో తీవ్రగాయాలయ్యాయి. కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్‌ తెలిపారు.

భాగస్వాముల వేధింపులు.. ఒకరి ఆత్మహత్య

కరీంనగర్‌రూరల్‌: వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడుల్లో తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా తన భాగస్వాములు గురిచేసిన వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్‌ రూరల్‌ సీఐ నిరంజన్‌రెడ్డి వివరాల ప్రకారం జగి త్యాల జిల్లా వెల్గటూర్‌ మండలం కిషన్‌రావుపేటకు చెందిన మోకినపల్లి శ్రీనివాస్‌ నగరంలోని తీగలగుట్టపల్లిలో అద్దె ఇంట్లో తన కుటుంబంతో ఉంటూ ఆటోకన్సల్టెన్సీ నడుపుతూ జీవిస్తున్నాడు. భూపతి పాపయ్య, రెడ్డి రాజు, నగునూరు గోపి, యాదగిరితో ఇసుకక్వారీ, హైదరాబాద్‌లోని పలు భూముల్లో పెట్టుబడులు పెట్టాడు. వీరు శ్రీనివాస్‌కు రావాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో మా నసికంగా వేదనకు గురయ్యాడు. ఆదివారం రాత్రి తన ఇంట్లోని బెడ్‌రూంలో ఉరివేసుకొ ని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య అంజలి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

గంజాయి విక్రేతల అరెస్ట్‌

రామగుండం: గంజాయి విక్రేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్సై వెంకటస్వామి తెలిపిన వివరాలు.. అంతర్గాం పోలీస్‌స్టేషన్‌ పరిధి బుగ్గ గుట్టల్లో సోమవారం పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులను అదుపులోకి తీసుకొని సోదా చేయగా 15 కేజీల గంజాయి లభ్యమైంది. కమాన్‌పూర్‌ మండలం రొంపికుంటకు చెందిన చిందం సాయిప్రసాద్‌, తౌట శివకుమార్‌, మహబూబ్‌బాబ్‌కు చెందిన జక్క యశ్వంత్‌, భూ పాల్‌పల్లికి చెందిన జంగపల్లి కమల్‌ను అదుపులోకి తీసుకోగా, ఒడిశాకు చెందిన అలెక్స్‌ పరారీలో ఉన్నాడు. రెండు మోటార్‌ సైకిళ్లు, నాలుగు సెల్‌ఫోన్స్‌ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.

అగ్నిప్రమాదంలో ధాన్యం, కరెంటు వైర్లు దగ్ధం

ఓదెల(పెద్దపల్లి): మండలంలోని కొలనూర్‌ మల్లన్నగుట్ట నుంచి ఓదెల వరకు సోమవారం సాయంత్రం ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. నిప్పురవ్వలు కిందపడటంతో రైతులకు చెందిన కరెంట్‌ మోటర్లు, వైర్లు, వరిధాన్యం కాలిబూడిదయ్యాయి. సుమారు పదికిలోమీటర్ల వరకు మంటలు ఎగిసిపడటంతో రైతులు ఆందోళన చెందారు. రాత్రి వరకు మంటలు అదుపులోకి రాలేదు. పెద్దపల్లి ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు.

ముగిసిన చదరంగం పోటీలు

కరీంనగర్‌స్పోర్ట్స్‌: కరీంనగర్‌లోని జ్యోతినగర్‌లోని జీనియస్‌ చెస్‌ అకాడమీలో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఓపెన్‌ చదరంగం పోటీలకు విశేష స్పందన వచ్చింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 100మంది క్రీడాకారులు హాజరయ్యారు. స్విస్‌ లీగ్‌ పద్ధతిలో పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచినవారికి ప్రముఖ చార్టెడ్‌ అకౌంటెంట్‌ రమణ మూర్తి బహుమతులు ప్రదానం చేశారు. జీనియస్‌ చెస్‌ అకాడమీ వ్యవస్థాపకుడు కంకటి కనకయ్య మాట్లాడుతూ చదరంగంలో క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు ఈ టోర్నీ నిర్వహించడం జరిగిందన్నారు. న్యూరో ఫిజీషియన్‌ వెంకట్‌, జీనియస్‌ చెస్‌ అకాడమీ డైరెక్టర్‌ కంకటి అనూప్‌ కుమార్‌, సృజన్‌ కుమార్‌, తాటిపల్లి సతీశ్‌బాబు, చీఫ్‌ ఆర్బిటర్‌ అరుణ్‌, ఆర్బిటర్స్‌ రేవిక్‌, నితిన్‌, ప్రభుచంద్ర, వరుణ్‌, అభిరామ్‌, శ్రీ నిజ, స్వాతి పాల్గొన్నారు.

పోలాండ్‌లో   మల్యాల వాసి మృతి1
1/2

పోలాండ్‌లో మల్యాల వాసి మృతి

పోలాండ్‌లో   మల్యాల వాసి మృతి2
2/2

పోలాండ్‌లో మల్యాల వాసి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement