
సూచనలు, మార్కెటింగ్
ఆయిల్‌పాం సాగుకు జిల్లాలోని నేలలు అనుకూలం. రైతులకు రాయితీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు ఇవ్వడంతో పాటు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తాం. పంట కోతకు వచ్చాక మేమే మార్కెటింగ్ నిర్వహిస్తాం. ఎకరాకు 57 మొక్కలు అవసరం కాగా ఒక మొక్క పూర్తి ఖర్చు రూ.198 కానీ, సబ్సిడీపై రైతులకు ఒక మొక్కను కేవలం రూ.20 అందిస్తున్నాం.
– కె.విజయ్‌భరత్, ప్రాజెక్ట్ మేనేజర్, లోహియా ఎడిబుల్ ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్
రైతుల నుంచి స్పందన
ఆయిల్‌పాం సాగుకు రైతుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. జిల్లాలో ఇప్పటికే ప్రతీ మండలంలో వంద ఎకరాలకు పైగా సాగులో ఉంది. ప్రభుత్వం అదనంగా మరో 3వేల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించింది. తదనుగుణంగా సదస్సులు నిర్వహిస్తుండగా రైతులు ముందుకొస్తున్నారు.
– ఆర్.శ్రీనివాసరావు, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి

సూచనలు, మార్కెటింగ్