మరొకరికి తీవ్ర గాయాలు
గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మల్లారెడ్డిపేటకు చెందిన ఖలీల్(45), శేఖర్ లింగన్నపేటకు వెళ్లి స్వగ్రామానికి తిరిగివస్తుండగా.. ధాన్యం కుప్పలకు ఢీకొని బైక్ అదుపుతప్పింది. 108 వాహనంలో క్షతగాత్రులను సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా ఖలీల్ మృతి చెందాడు. శేఖర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధిత కుటుంబాలిచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రేమానందం తెలిపారు.
రైలు నుంచి పడి ఒకరు..
జమ్మికుంట: ప్రమాదవశా త్తు రైలు నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. రామగుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ గంగారపు తిరుపతి తెలిపిన వివరాలు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రామశంకర్ (45) ఉపాధి కోసం స్నేహితులు మోహన్, విజయకుమార్‌తో కలిసి చైన్నైకి సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలులో వెళ్తుండగా జమ్మికుంట, బిజిగిరిషరీఫ్ రైల్వే స్టేషన్ల మధ్య ప్రమాదవశాత్తు రైలు నుంచి పడి మృతి చెందాడు. స్నేహితులు రైలు నుంచి పడినట్టు గమనించి కాజిపేట రైల్వే స్టేషన్ అధికారులకు విషయం తెలియజేశారు. మృతుడికి భార్య గుడిదేవి, ముగ్గురు కుమారులున్నా రు. మృతదేహాన్ని హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని ద ర్యాప్తు చేస్తున్నామని రామగుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి వివరించారు.
అనారోగ్యంతో యువతి బలవన్మరణం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అనారోగ్యం భరించలేక.. తల్లిదండ్రులకు భారం కావడం ఇష్టం లేని యువతి జీ వితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడింది. పోలీ సులు, స్థానికులు తెలిపిన వివరాలు. మండలంలోని రాచర్లగొల్లపల్లికి చెందిన ముద్రకోల అంజలి(18) కొన్నాళ్లుగా మూర్చ సంబంధిత వ్యా ధితో బాధపడుతోంది. కరీంనగర్, సిరిసిల్ల ఆస్పత్రుల్లో చూపించినా వ్యాధి నయం కాలేదు. తల్లి దండ్రులకు భారం కావడం ఇష్టం లేని అంజలి బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్‌కు ఊరి వేసుకుంది. మృతురాలి సోదరుడు మల్లికార్జున్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
స్వగ్రామానికి మృతదేహం
రాయికల్ దుబాయ్‌లో ఈనెల 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన రమేశ్ మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరుకుంది. కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

అనారోగ్యంతో యువతి బలవన్మరణం