
ఎన్టీపీసీ ప్లాంట్‌లో ప్రమాదం .. ఇద్దరు కార్మికులకు తీవ్
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ ప్రాజెక్టులో వేడిఆయిల్ లీకేజీ కావడంతో ఇద్దరు కాంట్రాక్టు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. రామగుండం ప్రాజెక్టు స్టేజ్–2లోని 500 మెగావాట్ల నాలుగో యూనిట్ ప్రాంతంలో ఫ్యాబ్ ఎరెక్టర్స్ సంస్థలో బుధవారం ఉదయం షిప్టులో లక్ష్మీపురం గ్రామానికి చెందిన సిరవేన కొమురయ్య, అన్నపూర్ణకాలనీకి చెందిన మహ్మద్ అంకూస్ విధులు నిర్వహిస్తున్నారు. ఆయిల్ ఫైర్ చేసేందుకు ఉన్న ట్యాంకుల నుంచి వేడి ఆయిల్ టర్బైన్‌కు వెళ్తున్న క్రమంలో అకస్మాత్తుగా లీకేజీ కావడంతో కాంట్రాక్టు కార్మికులపై పడింది. దీంతో తోటి కాంట్రాక్టు కార్మికులు ప్రమాద విషయాన్ని అధికారులకు తెలియజేశారు. వెంటనే అంబులెన్స్ ద్వారా ఇద్దరు కార్మికులను చికిత్స నిమ్తితం పర్మినెంట్ టౌన్‌షిప్‌లోని ధన్వంతరి ఆస్పత్రిలో చేర్పించారు. సిరవేన కొమురయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. అంకూస్‌కు చికిత్స కొనసాగిస్తున్నారు. ప్రమాద స్థలాన్ని అధికారులు సందర్శించి విచారణ చేస్తున్నట్లు సమాచారం.

ఎన్టీపీసీ ప్లాంట్‌లో ప్రమాదం .. ఇద్దరు కార్మికులకు తీవ్