
రూ.కోటితో ఎస్‌టీపీ ఆధునీకరణ పనులు
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని మురుగు నీటిశుద్ధీకరణ కేంద్రాన్ని (ఎస్‌టీపీ) రూ.కోటితో ఆధునీకరించనున్నట్లు నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. మంగళవారం మధురానగర్‌లో ఉన్న మురుగునీటి శుద్ధీకరణ కేంద్రాన్ని సందర్శించారు. మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్‌ను నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునీకరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా మురుగునీటి శుద్ధీకరణ కేంద్రాన్ని ఆధునీకరించేందుకు ప్రభుత్వం రూ.కోటి కేటాయించినట్లు తెలిపారు. కుక్కల బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసేందుకు గతంలో కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఈఈ సంజీవ్ కుమార్, డీఈ అయూబ్ ఖాన్, ఏఈ గఫూర్ పాల్గొన్నారు.
ప్రశాంతంగా పాలిసెట్
సప్తగిరికాలనీ(కరీంనగర్): జిల్లాలో మంగళవారం నిర్వహించిన పాలిసెట్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా ఎనిమిది కేంద్రాల్లో పరీక్ష జరిగింది. 4,234మంది విద్యార్థులకు 1,934మంది బాలురు, 1,985 మంది బాలికలు మొత్తం 3,919 మంది పరీక్షకు హాజరయ్యారు. 315మంది గైర్హాజరైనట్లు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డి.శోభారాణి తెలిపారు.

రూ.కోటితో ఎస్‌టీపీ ఆధునీకరణ పనులు