
ఈఏపీసెట్‌లో మనోళ్ల సత్తా
జమ్మికుంట/కథలాపూర్/రాయికల్/కోరుట్ల/శంకరపట్నం/హుజూరాబాద్/సిరిసిల్ల/ఇల్లంతకుంట: ఈఏపీసెట్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఔరా అనిపించారు. జమ్మికుంట పట్టణానికి చెందిన అయిత రాజ్‌కుమార్, స్వప్న దంపతుల కుమారుడు ఆర్యన్ 522వ ర్యాంకకు సాధించాడు. కథలాపూర్ మండలంలోని బొమ్మెన గ్రామానికి చెందిన కొమ్ముల శ్రీహర్షిత ఇంజనీరింగ్ విభాగంలో 779ర్యాంకు సాధించింది. తల్లిదండ్రులు కొమ్ముల రాజేందర్– మంజుల వ్యవసాయం చేస్తుంటారు. రాయికల్‌లోని ప్రభుత్వ టీచర్లు దాసరి కృష్ణహరి–లక్ష్మి కూతురు దాసరి వేద సంహిత ఇంజినీరింగ్ విభాగంలో 546వ ర్యాంకు సాధించింది. ఎలిగేటి రాజు కిషోర్– లావణ్య కూతురు మధుమిత అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో 344 ర్యాంకు సాధించింది. కోరుట్లకు చెందిన సాయిస్థ నూరెన్ రాష్ట్రస్థాయిలో 2,825 ర్యాంకు, సత్తి సీతారెడ్డి ఇంజినీరింగ్ విభాగంలో 6,910ర్యాంకు సాధించారు. శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన గంప ప్రజ్ఞాని 869 ర్యాంకు సాధించింది. హుజూరాబాద్‌కు చెందిన మహ్మద్ రిఫాహ్ ఉర్ రెహమాన్ 309ర్యాంకు, మంచికట్ల సాయి వివేకానంద 777ర్యాంకు సాధించారు. సిరిసిల్లలోని విద్యానగర్‌కు చెందిన ఎనగందుల రిషివర్ధన్ 274వ ర్యాంకు సాధించాడు. రిషివర్ధన్ తల్లి రాణీ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, తండ్రి రవీందర్ కరీంనగర్ డీపీవోగా పనిచేసి, ప్రస్తుతం సిద్దిపేట డీఆర్‌డీఏలో పనిచేస్తున్నారు.ఇల్లంతకుంట మండలం రేపాకకు చెందిన రోండ్ల దత్తాశ్రీరెడ్డి 760వ ర్యాంకు సాధించాడు. తండ్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా తల్లి స్వప్న గృహిణి. ముస్కాన్‌పేటకు చెందిన గుర్రం సిద్ధార్థరెడ్డి 1,025వ ర్యాంక్ సాధించాడు. తండ్రి సందీప్‌రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తల్లి రమాదేవి గృహిణి.

ఈఏపీసెట్‌లో మనోళ్ల సత్తా

ఈఏపీసెట్‌లో మనోళ్ల సత్తా

ఈఏపీసెట్‌లో మనోళ్ల సత్తా

ఈఏపీసెట్‌లో మనోళ్ల సత్తా

ఈఏపీసెట్‌లో మనోళ్ల సత్తా