
ఆకట్టుకున్న హల్దీ వేడుకలు
పెళ్లి కూతురుకు దుస్తులు అందిస్తున్న ఐసీడీఎస్ బృందం
రామగుండం: పట్టణంలోని తబితా ఆశ్రమంలో 16ఏళ్లుగా ఆశ్రయం పొందుతున్న నక్క మానస వివాహ వేడుకలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం హల్దీ వేడుకలు ఘనంగా నిర్వహించింది. యువతి పెళ్లి పెద్దగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష.. ఈనెల 21వ తేదీన కలెక్టరేట్‌లోని ఆలయంలో వివాహం జరిపించేందుకు నిర్ణయించారు. తొలిరోజు వేడుకల కోసం సింగరేణి ఆర్జీ–1 జీఎం సతీమణి అనిత, ఆర్తి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు భీమనాథి విజయ పుస్తె, మట్టెలు, చీర, సారె, అంతర్గాం అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు రూ.ఐదు వేల నగదు, ఎన్టీపీసీ శ్రీసీతారామ సేవాసమితి నిర్వాహకులు గోలివాడ చంద్రకళ, కంది సుజాత, బిల్లా శ్రీదేవి, కొండు రమాదేవి పెళ్లి బట్టలను పెళ్లి కూతురుకు అందజేశారు. ఫైట్‌ఫర్ బెటర్ సొసైటీ నిర్వాహకుడు మద్దెల దినేశ్, లెనిన్ జయహో సంస్థ ప్రతినిధి చక్కెన శ్రీలత పెళ్లి కుమార్తెను తయారు చేశారు. జిల్లా సంక్షేమాధికారి వేణుగోపాల్‌రావు, అంతర్గాం తహసీల్దార్ రవీందర్‌పటేల్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ప్రారంభమైన మానస వివాహ వేడుకలు
రేపు శుభముహూర్తం

ఆకట్టుకున్న హల్దీ వేడుకలు