
యూరియా వాడకం తగ్గించాలి
గన్నేరువరం: పంటల సాగులో సిపార్సు చేసిన ఎరువులు మాత్రమే వాడాలని, యూరియా తగ్గించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి జయ భాగ్యలక్ష్మి రైతులకు సూచించారు. భారతీయ మొక్కజొన్న పరిశోధన కేంద్రం లుది యానా సహకారంతో ఖాసీంపేట, పారువెల్ల గ్రామాలకు చెందిన 250 రైతులకు గడిచిన రబీలో మొక్కజొన్న విత్తనాలు, గడ్డిమందులు అందజేశారు. దీనిపై క్షేత్రస్థాయి పరిశీలన భాగంగా ఆ పంట సాగుచేసిన రైతులతో సోమవారం ఖాసీంపేట గ్రామ రైతువేదికలో నిర్వహించిన క్లస్టర్ స్థాయి సమావేశానికి జిల్లా వ్యవసాయశాఖ అధికారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పంటల సాగులో మేలైన విత్తనాల వాడాలన్నారు. ప్రతి రబీలో జీరో టిల్లర్ విధానంలో మొక్కజొన్న సాగు చేయాలన్నారు. జీరో టిల్లర్ సాగు అవగాహన కరపత్రాన్ని ఆవిష్కరించారు. కరీంనగర్ వ్యవసా య పరిశోధన కేంద్రం అధికారి ఉషారాణి, మండల వ్యవసాయశాఖ అధికారి కిరణ్మయి, శాస్త్రవేత్త శ్రావణి, ఏఈవో అనూష ఉన్నారు.
వెల్‌నెస్ సెంటర్ సందర్శన
కరీంనగర్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రి ఆవరణలో ఉన్న హెల్త్ వెల్‌నెస్ సెంటర్‌ను జిల్లా వైద్య ఆ రోగ్యశాఖ అధి కారి డాక్టర్ వెంకటరమణ సోమవారం సందర్శించారు. వెల్‌నెస్ సెంటర్లో ఉద్యోగులకు ఎంప్లాయీ హెల్త్ స్కీం ద్వారా అందుతున్న సేవలు, పెన్షనర్స్, జర్నలిస్టులకు సెంటర్ ద్వారా అందుతున్న సేవలు, ల్యాబోరేటరీ పరీక్షలు, మందుల వివరాలకు సంబంధించిన ఫార్మసీ రికార్డులు పరిశీలించారు. వెల్‌నెస్ సెంటర్ సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వైద్య ఆరోగ్య రంగంలో ప్రైవేటీకరణ ఆపాలి
కరీంనగర్: వైద్య ఆరోగ్య రంగంలో ప్రైవేటీకరణ ఆపాలని, ఆశా వర్కర్లను పర్మినెంట్ కార్మి కులుగా గుర్తించాలని ఆశ వర్కర్స్ యూని యన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి డిమాండ్ చేశారు. నగరంలోని ముకుందలాల్ మిశ్రాభవన్‌లో సోమవారం జరిగిన ఆశ వర్కర్స్ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె బుక్‌లెట్స్ ఆవిష్కరించారు. జయలక్ష్మి మాట్లాడుతూ 19ఏళ్ల నుంచి పనిచేస్తున ఆశవర్కర్లకు హెల్త్ వర్కర్లుగా గుర్తింపు లేదన్నా రు. ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కేంద్ర ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలుపెట్టాలని అన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేళ్ల శ్రీలత, పద్మ, లక్ష్మి, రజిత, పరిమిత, సత్యలక్ష్మి, ప్రియాంక, సరిత, లత పాల్గొన్నారు.

యూరియా వాడకం తగ్గించాలి

యూరియా వాడకం తగ్గించాలి