
తల్లిదండ్రుల ఆకాంక్ష నెరవేర్చాలి
కరీంనగర్: ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఐదు రోజుల వృత్యంతర శిక్షణ కార్యక్రమం జిల్లాకేంద్రంలోని పారమిత హెరిటేజ్ పాఠశాలలో మంగళవారం ప్రారంభమైంది. మొదటి రోజు శిక్షణ కార్యక్రమంలో గణితం నిత్య జీవితంలో గల ప్రాముఖ్యతను ఎఫ్‌ఎల్‌ఎన్ కింద ఒకటి నుంచి ఐదు తరగతుల భాష, గణిత సామర్థ్యాల పెంపు, రాబోయే రోజులలో విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. జూమ్ మీటింగ్ ద్వారా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా పలు సూచనలు ఇచ్చారు. సబ్జెక్టుపై నైపుణ్యం పెంచుకుని, విద్యార్థుల సంఖ్యను పెంచాలన్నారు. కోర్స్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న గంగాధర మండల విద్యాధికారి ప్రభాకర్‌రావు మాట్లాడుతూ విద్యా వాహిని బడిబాట కార్యక్రమం ద్వారా 33 గ్రామాలు తిరిగి విద్యార్థుల సంఖ్యను పెంచడానికి చర్చించామన్నారు.
ప్రసూతి మరణాలు తగ్గించాలి
కరీంనగర్‌టౌన్: ప్రసూతి మరణాలను తగ్గించడానికి చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకట రమణ సూచించారు. మంగళవారం డీఎంహెచ్‌వో అధ్యక్షతన జిల్లాస్థాయి మాతృ మరణ నివారణ కమిటీ సమీక్ష జరిగింది. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ సంరక్షణలో జాప్యాలు, అత్యవసర సేవల లభ్యతలో నిర్లక్ష్యం, రిఫెరల్ సేవలు, ప్రసవానంతర, ప్రసవ సంరక్షణ నాణ్యతను మెరుగుపరిచినప్పుడే ప్రసూతి మరణాలు అరికట్టడం సాధ్యపడుతుందని తెలిపారు. డాక్టర్లు సనజవేరియా, ఉమాశ్రీ, చందు, సుహాసిని, సంగీత, రాజగోపాల్ పాల్గొన్నారు.
రోడ్డుపైనే బోరు
కరీంనగర్ కార్పొరేషన్: అధికారులు అండగా ఉంటే రోడ్డు మాత్రం మనది కాదా అనుకున్నాడేమో ఏకంగా రోడ్డుపైనే బోర్ వేశాడు ఓ వ్యక్తి. నగరంలోని 36వ డివిజన్ పరిధిలోని మంకమ్మతోటలో రోడ్డుపైనే బోర్ వేయడం వివా దాస్పదమైంది. అతని ఇంటి ఎదుట ఉన్న రోడ్డు మీద బోర్ వేయడాన్ని కాలనీవాసులు ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. పైగా వాటర్ పైప్‌లైన్ పక్కనే వేయడాన్ని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపైన బోర్ వేయడంపై నగరపాలక సంస్థ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

తల్లిదండ్రుల ఆకాంక్ష నెరవేర్చాలి