ధర్మపురి: ప్రమాదవశా త్తు లారీ బోల్తాపడి డ్రైవర్, క్లీనర్‌కు తీవ్రగాయాలైన ఘటన మండలంలోని ఆకసాయిపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. నిజామాబాద్ నుంచి మంచిర్యాల వైపు ఉల్లిగడ్డల లోడుతో వెళ్తున్న లారీ ఆకసాయిపల్లె గుట్టమలుపు వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ శివనాగరాజు, క్లీనర్ దుర్గారావు క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. వారిని బయటకు తీసి 108 అంబులెన్సులో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు.
దుబాయి నుంచి వచ్చిన వారానికే..
● బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
ధర్మపురి: దుబాయి నుంచి వచ్చి వారం రోజులకే బైక్ అదుపుతప్పి కిందపడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని దోనూర్‌లో వెలుగుచూసింది. ఎస్సై ఉదయ్‌కుమార్ కథనం ప్రకారం.. రాజారం గ్రామానికి చెందిన నారకట్ల చంద్రయ్య (43) కూతురుకు పెళ్లి చేద్దామని వారంక్రితం దుబాయి నుంచి వచ్చాడు. మంగళవారం దోనూర్‌లో ఉంటున్న తన బంధువుల ఇంటికి వెళ్లాడు. ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. చంద్రయ్య తల రాయికి తగలడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. చంద్రయ్యకు భార్య ధనలక్ష్మి, కూతురు శ్రీజ, కుమారుడు తేజ ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య
కోరుట్ల: పట్టణంలోని అల్లమయ్యగుట్ట చింతలవాడకు చెందిన టేకి సాయిలు (35) మంగళవా రం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ని జామాబాద్ జిల్లా నవీపేట్ మండలం లింగా పూర్‌కు చెందిన సాయిలు కొంతకాలంగా ఇక్క డ హమాలీగా పనిచేస్తున్నాడు. రెండునెలల క్రితం సాయిలు తల్లి అనారోగ్యంతో మృతిచెందింది. అప్పటి నుంచి మనస్తాపంతో ఉంటున్నాడు. నాలుగురోజుల క్రితం భార్య పిల్లలతో కలిసి నిజామాబాద్‌లోని తల్లిగారింటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సాయిలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కలవారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
5 లోగా దరఖాస్తు చేసుకోవాలి
పెద్దపల్లిరూరల్: ఒడిశా రాష్ట్రంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో ఫస్టియర్ డిప్లొమా కోర్సులో చేరేందుకు ఆసక్తి, అర్హత గలవారు జూన్ 5లోగా దరఖాస్తు చేసుకోవాలని చేనేత, జౌళిశాఖ డెప్యూటీ డైరెక్టర్ విద్యాసాగర్ కోరారు. తెలంగాణ రాష్ట్రానికి 9 సీట్లు కేటాయించారని పేర్కొన్నారు. మూడేళ్ల డిప్లొమా కోర్సులో చేరేందుకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి 17 నుంచి 25 ఏళ్లలోపు వయసు గలవారు అర్హులన్నారు. ఆసక్తి, అర్హత గలవారు కరీంనగర్‌లోని చేనేత, జౌళిశాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమ ర్పించాలని కోరారు.

లారీ బోల్తా పడి డ్రైవర్, క్లీనర్‌కు గాయాలు